రన్నరప్‌ యూకీ జోడీ | Yuki Bhambri and Robert Galloway go down fighting in final | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ యూకీ జోడీ

Jun 30 2025 8:12 AM | Updated on Jun 30 2025 8:12 AM

Yuki Bhambri and Robert Galloway go down fighting in final

మలోర్కా (స్పెయిన్‌): కెరీర్‌లో ఐదో డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ యూకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. మలోర్కా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌)–రాబర్ట్‌ గాలోవే (అమెరికా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో యూకీ–గాలోవే జోడీ 1–6, 6–1, 13–15తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సాంటియాగో గొంజాలెజ్‌ (మెక్సికో)–ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా) జోడీ జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 

79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–గాలోవే జోడీ ఏడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయిన ఈ ఇండో–అమెరికన్‌ ద్వయం ప్రత్యర్థుల సరీ్వస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. రన్నరప్‌ యూకీ–గాలోవో జంటకు 16,940 యూరోల (రూ. 16 లక్షల 95 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 2023లో లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా)తో కలిసి ఇదే టోరీ్నలో యూకీ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. ఓవరాల్‌గా యూకీ తన కెరీర్‌లో నాలుగు ఏటీపీ డబుల్స్‌ టైటిల్స్‌ను సాధించి, మరో నాలుగింటిలో రన్నరప్‌గా నిలిచాడు. 

Advertisement
 
Advertisement
Advertisement