 
													న్యూఢిల్లీ: పారిస్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో భారత డబుల్స్ టెన్నిస్ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ కథ ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం 4–6, 7–6 (7/5), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది.
1 గంట 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–పావ్లాసెక్ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తొలి సర్వీస్‌లో 49 పాయింట్లకుగాను 36 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 27 పాయింట్లకుగాను 14 పాయింట్లు సాధించారు.
తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–పావ్లాసెక్‌లకు 26,275 యూరోల (రూ. 26 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
