వియన్నా (ఆ్రస్టియా): ఎర్‌స్టీ బ్యాంక్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) జోడీకి సెమీఫైనల్లో పరాజయం ఎదురైంది. ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–లుకాస్ మిడ్లెర్ (ఆ్రస్టియా)తో జరిగిన సెమీఫైనల్లో యూకీ–గొరాన్సన్ ద్వయం 4–6, 6–7 (5/7)తో పోరాడి ఓడిపోయింది. 91 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–గొరాన్సన్ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు.
తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారీ బ్రేక్ చేయలేకపోయారు. సెమీస్‌లో ఓడిన యూకీ–గొరాన్సన్‌లకు 45,360 యూరోల (రూ. 46 లక్షల 27 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. డబుల్స్ విభాగంలో జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జోడీ టైటిల్ సాధించింది. ఫైనల్లో క్యాష్–గ్లాస్‌పూల్ ద్వయం 6–1, 7–6 (8/6)తో కబ్రాల్–మిడ్లెర్ జంటపై గెలిచింది. క్యాష్–గ్లాస్‌పూల్ జంట ఖాతాలో 1,68,120 యూరోలు (రూ. 1 కోటీ 71 లక్షలు) ప్రైజ్‌మనీగా చేరాయి.


