ఆక్లాండ్: కొత్త ఏడాదిలో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ తొలి విజయాన్ని అందుకున్నాడు. న్యూజిలాండ్‌లో సోమవారం మొదలైన ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్‌సన్ (స్వీడన్) జోడీ శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ యూకీ–గొరాన్‌సన్ ద్వయం 6–3, 6–2తో అజీత్ రాయ్ (న్యూజిలాండ్)–జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–స్వీడిష్ జోడీ మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తొలి సరీ్వస్‌లో 32 పాయింట్లకుగాను 27 పాయింట్లు... రెండో సరీ్వస్‌లో 16 పాయింట్లకుగాను 8 పాయింట్లు స్కోరు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. యూకీ–గొరాన్‌సన్ ద్వయం బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నతో కొత్త సీజన్‌ను ప్రారంభించింది. ఆ టోరీ్నలో తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన ఈ జంట 5–7, 4–6తో ఒర్లాండో లుజ్–మటోస్ (బ్రెజిల్) ద్వయం చేతిలో ఓడిపోయింది.


