బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ స్టంప్స్ వెనుక అద్భుతం చేశాడు. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ లాంటి ఫాస్ట్ బౌలర్లకు సైతం కారీ స్టంప్స్‌కు దగ్గరలో ఉండి అందరిని ఆశ్చర్యపరిచాడు.
స్టంప్స్‌కు దగ్గరలో నిలబడే బౌన్సర్లను సైతం అతడు అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్రమంలో క్యారీ అందుకున్న ఓ క్యాచ్ తొలి రోజు ఆట మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.
కారీ సంచలన క్యాచ్..
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 67 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. నాలుగో బంతిని గాస్ అట్కిన్సన్స్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అట్కిన్సన్ ఆ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. బంతి కీపర్ వెనుకకు వెళ్లగా క్యాచ్ అందుకోవడానికి కారీ, మార్నస్ లబుషేన్ ఇద్దరూ పరిగెత్తారు. అందుకోసం ఇద్దరు కూడా డైవ్ చేశారు.
అయితే కారీ మాత్రం అద్భుతంగా డైవ్ చేస్తూ బంతిని అందుకోగలిగాడు. లబుషేన్ అతడిని ఢీకొన్నప్పటికీ కారీ మాత్రం బంతిని విడిచిపెట్టలేదు. అతడి క్యాచ్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. పక్కన ఉన్న లబుషేన్ సైతం కారీ హత్తుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒకటి నెటిజన్లు కొనియాడుతున్నారు.
రూట్ సెంచరీ..
ఈ యాషెస్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పై చేయి సాధించింది. వెటరన్ బ్యాటర్ జో రూట్ విరోచిత సెంచరీతో చెలరేగాడు. ఆసీస్ గడ్డపై రూట్‌కు ఇదే తొలి టెస్టు సెంచరీ. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్(135), ఆర్చర్(32 నాటౌట్) ఉన్నాడు. మరోవైపు ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తాచాటాడు.
చదవండి: వైభవ్ మెరుపులు.. సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్


