యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ సెంచరీతో సత్తాచాటాడు. దీంతో రూట్ ఆసీస్ గడ్డపై తన 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించాడు. రూట్‌కు ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి సెంచరీ. అతడు ప్రస్తుతం 135 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. అయితే రూట్ తన సెంచరీతో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ ను న్యూడ్ రన్ నుంచి కాపాడాడు.
హేడెన్ సవాల్..
ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు రూట్‌పై ఒత్తిడి పెంచేలా హేడెన్ ఓ సవాల్ విసిరాడు. ఈ టూర్‌లో రూట్ సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నగ్నంగా నడుస్తానని ఛాలెంజ్ చేశాడు. అందుకు స్పందిచిన హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ .. ప్లీజ్ రూట్ సెంచరీ చేసి మా నాన్నను కాపాడు అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు రూట్ నిజంగానే సెంచరీ చేసి హేడెన్ ను సేవ్ చేశాడు.
గత 12 ఏళ్లగా ఆస్ట్రేలియా గడ్డపై రూట్ సెంచరీ కోసం పోరాడతున్నాడు. ఇంతకుముందు వరకు ఆసీస్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 89గా ఉంది. ఎట్టకేలకు మూడెంకల స్కోర్‌ను అందుకుని తన సుదీర్ఘ స్వప్నాన్ని అతడు నేరవేర్చుకున్నాడు. రూట్ సెంచరీ చేయగానే హేడెన్ కామెంటరీ బాక్స్ నుంచి బయటకు సెలబ్రేషన్ చేసుకుంది. అనంతరం ఇంగ్లండ్ లెజెండ్‌ను అతడు అభినందించాడు.
"ఆస్ట్రేలియాలో ఎట్టకేలకు సెంచరీ చేసిన జో రూట్‌కు నా అభినందనలు. మిత్రమా కొంచెం ఆలస్యమైంది. కానీ ఈ సెంచరీ కోసం నేను ఎంతగానో ఎదురు చూశాను. పది ఏభైలు తర్వాత నీవు అనుకున్న లక్ష్యానికి చేరుకున్నావు. చాలా సంతోషంగా ఉంది" అని హేడెన్ ఇంగ్లండ్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.


