యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుది జట్టుని ప్రకటించింది. తొలి టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ డే-నైట్ పింక్ బాల్ టెస్ట్ కోసం ఒకే ఒక్క మార్పు చేసింది. గాయపడిన పేసర్ మార్క్ వుడ్ స్థానంలో ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.
జాక్స్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇంగ్లడ్ తరపున టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జాక్స్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇంగ్లండ్ జట్టుకు అతడు రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు.
అతడిని జట్టులోకి తీసుకురావడం వెనుక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మాస్టర్ మైండ్ ఉంది. జాక్స్‌ను కేవలం స్పిన్ ఎంపికగా కాకుండా, అతని బ్యాటింగ్ సామర్థ్యం కారణంగానే తుది జట్టులో చోటు ఇచ్చారు. బ్యాటింగ్ డెప్త్‌ను పెంచుకోవడం కోసమే రెగ్యూలర్ స్పిన్నర్ బషీర్ కాకుండా జాక్స్ వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపింది. గురువారం(డిసెంబర్ 4) నుంచి బ్రిస్బేన్ వేదికగా ఈ యాషెస్ రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్
చదవండి: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్ స్మిత్ హఠాన్మరణం


