ఇంగ్లండ్‌ 211/3  | Joe Root and Harry Brook has been unbreakable for Australia | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ 211/3 

Jan 5 2026 6:01 AM | Updated on Jan 5 2026 6:01 AM

Joe Root and Harry Brook has been unbreakable for Australia

‘యాషెస్‌’ చివరి టెస్టు 

సిడ్నీ: ‘యాషెస్‌’ సిరీస్‌లో భాగంగా ఆ్రస్టేలియాతో మొదలైన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి రోజు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. వెలుతురులేమి, వర్షం కారణంగా 45 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆదివారం మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ (92 బంతుల్లో 78 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్‌ (103 బంతుల్లో 72 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకొని క్రీజ్‌లో ఉన్నారు.

 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను ఆరంభంలో ఆసీస్‌ బౌలర్లు దెబ్బ తీశారు. డకెట్‌ (27), క్రాలీ (16), బెతెల్‌ (10) తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో 57 పరుగులకే ఇంగ్లండ్‌ 3 వికెట్లు కోల్పోయింది. స్టార్క్, నెసర్, బోలండ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అయితే రూట్, బ్రూక్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అభేద్యంగా 154 పరుగులు జోడించారు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై ఆ్రస్టేలియా ఒక్క స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోకపోవడం చర్చనీయాంశం. 1888 తర్వాత ఆసీస్‌ ఇలా ఆడటం ఇదే మొదటిసారి కావడం విశేషం!   
 

Advertisement
 
Advertisement
Advertisement