యాషెస్ సిరీస్ 2025-26లో ఆఖరి టెస్టును ఇంగ్లండ్ ఘనంగా ఆరంభించింది. సిడ్నీ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియాపై ఇంగ్లీష్ జట్టు పైచేయి సాధించింది. అయితే వర్షం కారణంగా మొదటి రోజు కేవలం 45 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యపడింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో జోరూట్(72), హ్యారీ బ్రూక్(78) ఉన్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. 57 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో రూట్, బ్రూక్ అద్భుతమైన పోరాటం కనబరిచారు. మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మైఖల్ నీసర్, స్కాట్ బోలాండ్ తలా వికెట్ సాధించారు. కాగా ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్.. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
తుది జట్లు
ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కారీ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్


