breaking news
US Open
-
నాలుగేళ్లకే షుగరొచ్చినా ఇప్పుడాయన ఛాంపియన్..!
మూడు నెలల కిందట ఇదే ఏడాది 2026 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్లావియో కొబొల్లీని ఓడించి తన మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు అలెగ్జాండర్ జ్వెరెవ్. కానీ అతడు తేల్చుకోవాల్సిన పాత లెక్క ఒకటుంది. అదీ... ఆరేళ్ల కింద 2020 నాటి ఓ పాత కథ ఇది...అది 2020 నాటి యూఎస్ ఓపెన్. ఆరోజు 23 ఏళ్ల జ్వెరెవ్‌కి ప్రత్యర్థిగా ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ ఆడుతున్నాడు. జ్వెరెవ్ మొదటి రెండు సెట్లూ గెలిచాడు. దాదాపుగా చేతికి అందేంత దగ్గర్లో ఒక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ!! ఇక కావాల్సింది కేవలం రెండంటే రెండు పాయింట్లే!! కానీ... జ్వెరెవ్ ఆ తర్వాత మూడు సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. మళ్లీ ఆరేళ్ల తర్వాత... తేదీ 2026 సెప్టెంబర్ 13... న్యూయార్క్‌లోని ఆర్థర్ యాష్ స్టేడియం... పాతికవేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపాయిన స్టేడియం. ఒకవైపు అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్. ఆట జరుగుతున్నది న్యూయార్క్‌లోనే కావడంతో తమ దేశపు ఆటగాడే గెలవాలన్న కోరిక చాలామందిలో ఉండటం మామూలే. అందుకే... ‘దాదాపు 99.9% మంది ప్రేక్షకులు బెన్ షెల్టన్ గెలవాలని కోరుకుంటున్నారేమో’ అంటూ జ్వెరెవ్ సరదాగా ఓ కామెంట్ కూడా చేశాడు. చివరికి... తన ప్రత్యర్థి బెన్ షెల్టన్‌ను జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. ఇప్పుడు జ్వెరెవ్ చేతిలో ట్రోఫీ! ఆరేళ్ల కిందట అతడు రన్నరప్. కానీ ఇప్పుడు చాంపియన్!! చుట్టూ ఎందరో ఫ్యాన్స్ ఉండవచ్చు. కానీ జ్వెరెవ్ మనసులో ఒకరున్నారు. ఒకరే ఉన్నారు. ఆ ఒకే ఒక వ్యక్తి ఆమె తల్లి ఇరీనా! అతడి మనసులో ఆ తల్లి అన్న మాటలూ ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలనుకుంటే జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసప్పటి కాలానికి వెళ్లాలి. జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసున్నప్పటి కథ ఇది... డాక్టర్ చెప్పాడు... ‘‘ఈ నాలుగేళ్ల చిన్నారికి టైప్–1 డయాబెటిస్’’ అని! అప్పుడు అతడి కుటుంబ సభ్యులు అడిగారు ‘‘ఇక ఈ పిల్లవాడి జీవితం ఎలా ఉంటుంది?’’ అని. ‘‘స్పోర్ట్స్ పర్సన్ కావాలనుకుంటే అది కష్టం కావచ్చు’’ అన్నాడు డాక్టర్. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడంటే... జ్వెరెవ్ తల్లి ఇరీనా కూడా మాజీ టెన్నిస్ ప్లేయరే. ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది పేరెంట్స్ సాధారణంగా ఏమంటారు? ‘‘సరే.... ముందు హెల్త్. ఆ తర్వాతే స్పోర్ట్స్...’’ అని. కానీ జ్వెరెవ్ తల్లి... ఇరీనా అలా అనుకోలేదు. ఆమె తన నాలుగేళ్ల కొడుకును చూసి...‘‘నా కొడుకు భవిష్యత్తులో ఏమవ్వాలి అనేది టైప్–1 డయాబెటిస్ నిర్ణయించదు. అతడు టెన్నిస్ ప్లేయర్ కావాలంటే టెన్నిస్ ప్లేయర్. లేదా ఇంకేదైనా... మరేదైనా కావాలంటే అదీ’’.టైప్–1 డయాబెటిస్ కొనసాగింది... ప్రతిరోజూ గుచ్చే సూదులూ... రోజూ తాను కళ్లజూసే రక్తపుబొట్లు... రోజు వాడాల్సిన మందులతో! కానీ జీవితమూ కొనసాగింది. అదీ అతడి ఇష్టప్రకారమే... ప్రాక్టీస్... ఫిట్నెస్... మ్యాచులు. ప్రయాణాలూ... విజయాలతో! తన చిన్నప్పటి నుంచీ టైప్–1 డయాబెటిస్ కండిషన్‌తోనే.. ఎన్నో కండిషన్ల మధ్యన అతడు జీవిస్తున్నాడు. టెప్–1 డయాబెటిస్ అంటే ఏమిటో, దానితో జీవితమెలా ఉంటుందో చూద్దాం...టైప్–1 డయాబెటిస్ అంటే...?పిల్లల్లో వచ్చే డయాబెటిస్‌ను టైప్–1 డయాబెటిస్ అంటారు. చిన్నారుల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘జువెనైల్ డయాబెటిస్’ అని కూడా అంటారు. ఎందుకు వస్తుందంటే...టైప్–1 డయాబెటిస్ ఎందుకొస్తుందనే కారణం నిర్దిష్టంగా తెలియదుగానీ... సాధారణంగా పిల్లలకు సోకే వైరస్లు, రకరకాల పర్యావరణ అంశాల వంటి చాలా కారణాలతో ఇది రావచ్చన్నది వైద్య నిపుణుల అభిప్రాయం.గుర్తించడమెలా? టైప్–1 డయాబెటిస్ లక్షణాలు పిల్లలందరిలోనూ ఒకేలా ఉండకపావచ్చు. ఈ కింది లక్షణాల్లో ఏవైనా కనిపించినప్పుడు పేరెంట్స్ వాటిని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. అవి... → నీళ్లు ఎక్కువగా తాగుతుండటం; పదేపదే మూత్ర విసర్జనకు వెళ్తుండటం ∙రాత్రిళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేసిన పిల్లలూ మళ్లీ్ల పక్క తడపటం మొదలుపెట్టడం ఆహారం బాగానే తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం → వెంటవెంటనే అలసిపాతుండటం, నీరసంగా ఉండటం → వారి జననేంద్రియాల దగ్గర మాటిమాటికీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపాతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు. అదేపనిగా పేరుకుపాయిన అధిక గ్లూకోజ్ వల్ల కీటోన్స్ అనే విష పదార్థాలు రక్తంలో పేరుకుపాతాయి. దాంతో ఈ కింది లక్షణాలు కనిపించవచ్చు. → తీవ్రమైన కడుపునొప్పి ∙వాంతులు ∙మత్తుగా ఉండటం (చురుకుదనం లోపించడం) ∙శ్వాసతీసుకోవడం కష్టం కావడం ∙స్పృహతప్పిపడిపావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా స్పృహతప్పిపడిపాయే కండిషన్‌ను ‘కీటో అసిడోసిస్’ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. పిల్లలను తప్పనిసరిగా హాస్పిటల్‌కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించాల్సిన ‘మెడికల్ ఎమర్జెన్సీ’ ఇది. టైప్–1 డయాబెటిస్ (మేనేజ్మెంట్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్‌ను నాలుగు అంశాల నిర్వహణ ద్వారా సమర్థంగా మేనేజ్ చేయవచ్చు. అవి.. 1. ఇన్సులిన్ : ఈ పిల్లల విషయంలో ఇన్సులిన్ ఇవ్వడం రక్తంలో పెరిగే చక్కెరను అదుపు చేస్తుంది. ఇప్పటికైతే ఇది మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియ. ఇలా ఇన్సులిన్ ఇవ్వడం అన్నది ఇంజెక్షన్ ద్వారానే జరగాలి. అందునా ఈ ఇంజెక్షన్‌ను కండలోకి కాకుండా చర్మం కింది ‘సబ్‌క్యుటేనియస్ పొర’లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇన్సులిన్‌ను ఒంట్లోకి పంపేందుకు సిరంజీలు, పెన్ వంటి ఉపకరణాలు, ఇన్సులిన్ పంప్స్ వంటి ఉపకరణాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 2. గ్లూకోజ్ మానిటరింగ్ : పిల్లలకు కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపాదు. వారు తిన్న మోతాదును బట్టి ఎంత ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్నీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. పిల్లల రక్తంలోని చక్కెర పాళ్లను ప్రతిరోజూ ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ‘గ్లూకోమీటర్’ ఉపయోగపడుతుంది. పిల్లల రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గితే గ్లూకోజ్గానీ లేదా చక్కెరగానీ తినిపించాలి. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే... ఇన్సులిన్ ఇవ్వాలి. 3. ఆహారం : చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా వారి ఆహారం ఉండటం అవసరం. ఈ క్రమంలో ఎక్కువ చక్కెరలూ లేదా తీపి పదార్థాలు లేని మంచి సమతులాహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆహారంలో తగిన పాళ్లలో కార్బోహైడ్రేట్స్ సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపాటీన్లు... ఇవి పప్పు, కోడి మాసం, చేపలు, చీజ్, పనీర్, చిక్కుళ్లు...మొ.) ఇవ్వాలి. ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాల కోసం పొద్దుతిరుగుడుపువ్వునూనె, బాదం, వాల్నట్ ఇవ్వవచ్చు. వీటితో పాటు అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. 4. శారీరక శ్రమ : పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర స్వాభావికంగానే నియంత్రితమయ్యే అవకాశం ఎక్కువ. పిల్లలందరూ బాగా ఆడుకోవడం అవసరమే అయినా ఇలాంటి పిల్లలు ఆరుబయట ఒళ్లు అలిసేలా ఆడుకోవడం మరింత ఎక్కువగా అవసరం. చివరిగా... మరోసారి జ్వెరెవ్ విషయానికి వస్తే... ఈ సమస్య ఉన్న పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రుల జీవితాల్లో ఆర్థిక పరిమితులు ఎక్కువగా ఉంటాయనే అంశాన్ని గమనించినందుకో ఏమోగానీ... ‘జ్వెరెవ్ ఫౌండేషన్’ డయాబెటిస్తో జీవిస్తున్న పిల్లలకు... ముఖ్యంగా ఇన్సులిన్ అందని ప్రాంతాల్లో ఉన్నవారికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తోంది. బహుశా... తన నాలుగేళ్ల వయసులో ఎదురైన సమస్యను గుర్తించి ఇప్పుడతడు చాలామంది జీవితాలకు ఉపయోగపడేలా తన ఫౌండేషన్‌ను ఉపయోగిస్తున్నాడని భావించవచ్చు. అతడి ఆర్థికస్థితి అందుకు అనుమతిస్తోంది. కానీ... మన దేశంలోనూ ఇలాంటి చిన్నారుల పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరమూ మనందరికీ ఉంది. రక్తంలోని చక్కెరను ఇంత జాగ్రత్తగా నియంత్రించాల్సిన అవసరమేమిటంటే? పిల్లల రక్తంలో చక్కెర మోతాదులు చాలాకాలం పాటు నియంత్రణలో లేకపాతే భవిష్యత్తులో వాళ్లలో చాలా రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నియంత్రణలోని లేని చక్కెర వల్ల పిల్లల కిడ్నీలు, గుండె, రక్తనాళాలు, కళ్లు వంటి కీలకమైన అవయవాలకు హాని జరగవచ్చు. నాడీవ్యవస్థపై దుష్ప్రభావాలు పడవచ్చు. ఇవన్నీ బాల్యంలో కనిపించకపావచ్చు. వారు పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆ దుష్ప్రభావాలు కనిపించవచ్చు. దాంతో భవిష్యత్తులో అది వారి జీవన నాణ్యతను దెబ్బతీయవచ్చు. అందుకే రక్తంలో చక్కెర పాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.ఇటీవలి పురోగతి... టైప్–1 డయాబెటిస్ ఉన్న పిల్లల్లో ఆ వ్యాధిని నయం చేసేలా ఇప్పటికిప్పుడు చికిత్స ఏదీ అందుబాటులో లేదు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో వారి రక్తంలోని చక్కెరపాళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది. అలాగే సెన్సర్ ఆగ్యుమెంటెడ్ పంపులు, క్లోజ్డ్ లూప్ సిస్టమ్ వంటి కొన్ని ఆధునిక పద్ధతులతో కొన్ని దేశాల్లో పిల్లల్లో చక్కెరపాళ్లను ఎప్పడూ ఒకేలా ఉండేలా నియంత్రణలో ఉంచడమూ సాధ్యమవుతోంది. అయితే ఈ పురోగతి ప్రస్తుతం ఈ బాధిత కుటుంబాలపై చాలా ఆర్థికభారాన్నే మోపుతోంది. భవిష్యత్తులో ఈ వ్యయం తగ్గేందుకు అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఇన్సులిన్ అందేలా చూసేందుకు – ఇన్సులిన్ జీన్ థెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ కంప్లీట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.డాక్టర్ బి. శిరీష కుసుమసీనియర్ పీడియాట్రిక్ఎండోక్రైనాలజిస్ట్ యాసీన్ -
రూ. 52 కోట్ల 76 లక్షల ప్రైజ్‌మనీ!
న్యూయార్క్: టాప్ సీడ్ హోదాకు తగ్గ ప్రదర్శన కనబరిచిన జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జ్వెరెవ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. తొమ్మిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జ్వెరెవ్ 6–3, 7–6 (7/2), 5–7, 6–2తో విజయం సాధించాడు. జ్వెరెవ్‌కు 55 లక్షల డాలర్లు (రూ. 52 కోట్ల 76 లక్షలు), షెల్టన్‌కు 28 లక్షల డాలర్లు (రూ. 26 కోట్ల 86 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌కు గట్టిపోటీనే ఎదురైనా కీలకదశలో పాయింట్లు నెగ్గి పైచేయి సాధించాడు. 2020లో యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన 29 ఏళ్ల జ్వెరెవ్ ఈసారి మాత్రం టైటిల్‌ను వదల్లేదు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి జ్వెరెవ్ తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. బోరిస్ బెకర్ (1989లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్) తర్వాత ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రెండో జర్మన్ ప్లేయర్‌గా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు. -
యూఎస్ ఓపెన్ విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్
ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ టైటిల్‌ను జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సొంతం చేసుకున్నాడు. అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్‌పై నాలుగు సెట్లలో విజయం సాధించి తొలిసారి ఫ్లషింగ్ మెడోస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో జ్వెరెవ్ 6-3, 7-6(2), 5-7, 6-2తో షెల్టన్‌ను ఓడించాడు. దీంతో 2026లో అతడి ఖాతాలో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది.ఫైనల్‌ను జ్వెరెవ్ దూకుడుగా ప్రారంభించాడు. బేస్‌లైన్ నుంచి పదునైన షాట్లతో షెల్టన్‌పై ఒత్తిడి పెంచాడు. అమెరికా ఆటగాడి డబుల్ ఫాల్ట్‌లు కూడా జ్వెరెవ్‌కు కలిసొచ్చాయి. ఆరంభంలోనే సర్వీస్ బ్రేక్ సాధించిన అతడు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. 6-3తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో షెల్టన్ పోరాటం పెంచాడు. సర్వీస్‌తో పాటు ర్యాలీల్లోనూ జ్వెరెవ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లింది. అయితే కీలక సమయంలో జ్వెరెవ్ తన స్థాయిని చూపించాడు. 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి టైబ్రేక్‌ను 7-2తో గెలుచుకున్నాడు. దీంతో మ్యాచ్‌లో 2-0తో ముందంజ వేశాడు.మూడో సెట్ అతడిదేరెండు సెట్లు కోల్పోయినా షెల్టన్ వెనక్కి తగ్గలేదు. మూడో సెట్లో మరింత దూకుడుగా ఆడుతూ జ్వెరెవ్ రిథమ్‌ను దెబ్బతీశాడు. 3-3 వద్ద జ్వెరెవ్ సర్వీస్‌పై తొలి బ్రేక్‌పాయింట్ అవకాశాన్ని సృష్టించాడు. దానిని జర్మన్ ఆటగాడు కాపాడుకున్నప్పటికీ.. షెల్టన్‌కు నమ్మకం పెరిగింది. 5-5 తర్వాత షెల్టన్ కీలక సమయంలో పుంజుకున్నాడు. జ్వెరెవ్ సర్వీస్‌పై వరుసగా మూడు సెట్ పాయింట్లు సాధించాడు. ఒకదాన్ని కోల్పోయినా రెండో అవకాశంలో జ్వెరెవ్ ఫోర్‌హ్యాండ్ వాలీ బయటకు వెళ్లడంతో బ్రేక్ సాధించాడు. చివరకు 7-5తో మూడో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచాడు.నాలుగో సెట్లో ఛాంపియన్ గేమ్ఇక్కడే జ్వెరెవ్ తన కాన్ఫిడెన్స్‌ను ప్రదర్శించాడు. గతంలో యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆధిక్యాన్ని కోల్పోయిన అనుభవం ఉన్నా ఈసారి ఆ తప్పును పునరావృతం చేయలేదు. నాలుగో సెట్ ఆరంభంలోనే షెల్టన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. షెల్టన్ పోరాడుతున్నా జ్వెరెవ్ కంట్రోల్ తప్పలేదు. 4-2 వద్ద మరోసారి సర్వీస్ బ్రేక్ సాధించి టైటిల్‌కు మరింత చేరువయ్యాడు. 5-2 వద్ద ఛాంపియన్షిప్ కోసం సర్వ్ చేస్తూ ఒక డబుల్ ఫాల్ట్ చేసినా వెంటనే ఏస్, ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో పుంజుకున్నాడు. చివరకు షెల్టన్ ఫోర్‌హ్యాండ్ బయటకు కొట్టడంతో మ్యాచ్ ముగిసింది.టైటిల్ గెలిచిన అనంతరం జ్వెరెవ్ తన తల్లికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఆమె ప్రొత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని భావోద్వేగానికి గురయ్యాడు.ఆరేళ్ల తర్వాత నెరవేరిన కల2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో రెండు సెట్ల ఆధిక్యంలో ఉన్న జ్వెరెవ్ డొమినిక్ థీమ్ చేతిలో ఓడిపోయాడు. ఆ చేదు జ్ఞాపకాన్ని అధిగమిస్తూ ఆరేళ్ల తర్వాత అదే వేదికపై టైటిల్ అందుకున్నాడు. మరోవైపు షెల్టన్ 2003లో ఆండీ రాడిక్ తర్వాత గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి అమెరికా మెన్స్ విన్నర్‌గా నిలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగినా ఆ కల నెరవేరలేదు.ఇప్పుడు.. ఈ విజయంతో జ్వెరెవ్ 2026లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. అంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్నాడు. యూఎస్ ఓపెన్ విజయం అతడి కెరీర్లో 26వ టైటిల్‌గా నిలిచింది. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్ ఆటగాడిగా కూడా జ్వెరెవ్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. యూఎస్ ఓపెన్ టైటిల్‌తో జ్వెరెవ్ తన గ్రాండ్‌స్లామ్ ప్రయాణంలో మరో పెద్ద అడ్డంకిని అధిగమించాడు. ఇక 2026 సీజన్‌ను రెండు మేజర్ టైటిళ్లతో ముగించే దిశగా దూసుకెళ్తున్నాడు.ఇదీ చదవండి: యూఎస్ విమెన్ సింగిల్స్ విజేతగా రిబాకినా -
హారిసన్–స్కప్‌స్కీ జోడీకి పురుషుల డబుల్స్ టైటిల్
యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఐదో సీడ్ క్రిస్టియాన్ హారిసన్ (అమెరికా) – నీల్ స్కప్‌స్కీ (యూకే) జంట సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఫైనల్లో హారిసన్–స్కప్‌స్కీ 6–4, 7–6 (8/6) స్కోరుతో ఆరో సీడ్ కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ) – టిమ్ పుయెట్జ్ (జర్మనీ) ద్వయాన్ని ఓడించారు. 1 గంటా 39 నిమిషాల పాటు సాగిన పోరులో హారిసన్–స్కప్‌స్కీ జోడి 9 ఏస్‌లు సంధించి 38 విన్నర్లు కొట్టింది. 2026 ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని కూడా వీరిద్దరే గెలుచుకున్నారు. -
జ్వెరెవ్ X షెల్టన్
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో కొత్త విజేత ఎవరో నేడు తేలనుంది. తొలి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్న టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 8వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) నేడు జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నారు. జ్వెరెవ్ ఫైనల్ చేరడం ఇది రెండో సారి. 2020లో ఆఖరి మెట్టుపై అతని డొమినిక్ థీమ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలవగా, షెల్టన్ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి, వింబుల్డన్ ఫైనల్లో ఓడిన జ్వెరెవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్ 6–3, 7–6 (9/7), 7–6 (8/6) స్కోరుతో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన రెండో సెమీస్‌లో షెల్టన్ 4–6, 6–3, 6–3, 7–5తో అమెరికాకే చెందిన ఫ్రాన్సిస్ టియాఫోను ఓడించాడు. సెమీస్ మ్యాచ్‌కు ముందు ఖచనోవ్‌తో ఆడిన 9 మ్యాచ్‌లలో 6–3తో ఆధిక్యంలో ఉన్న జ్వెరెన్ ఈ సారి కూడా తన పైచేయిని ప్రదర్శించాడు. తొలి సెట్లో 3–3 తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మరో గేమ్ కూడా అలవోకగా జ్వెరెవ్ ఖాతాలో చేరింది. తర్వాతి రెండు సెట్లలో మాత్రం టాప్ సీడ్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడటంతో స్కోరు టైబ్రేక్‌కు చేరింది. ఈ దశలో ఖచనోవ్ పైచేయి సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయాడు. మూడో సెట్ కూడా దాదాపు ఇదే తరహాలో సాగింది. టైబ్రేక్‌లో 2–5తో వెనుకబడినా జ్వెరెవ్ పట్టుదలగా తన స్థాయికి తగ్గ ఆటతీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. జ్వెరెవ్ 15 ఏస్‌లతో విరుచుకుపడటం విశేషం. టియాఫోతో జరిగిన రెండో సెమీస్‌లో షెల్టన్ తొలి సెట్ చేజార్చుకున్నా... కోలుకొని ఆ తర్వాత ప్రత్యర్థిపై చెలరేగుతూ దూసుకుపోయాడు. ఈ సెట్లో ఏకంగా 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన షెల్టన్ సహచర అమెరికన్‌కు అవకాశం కల్పించాడు. రెండో సెట్లో ఎనిమిదో గేమ్‌ను బ్రేక్ చేసి ముందంజ వేసిన షెల్టన్ సునాయాసంగా సెట్‌ను ముగించాడు. మూడో సెట్ కూడా అతని నియంత్రణలోనే సాగింది. ఈ సెట్లోనే అతను 12 విన్నర్స్ కొట్టడం షెల్టన్ ఆధిపత్యాన్ని చూపించింది. 1972 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి నల్లజాతి అమెరికన్‌గా షెల్టన్ గుర్తింపు పొందాడు. అతను గెలిస్తే ఆండీ రాడిక్ (2003) తర్వాత గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మొదటి అమెరికా ఆటగాడిగా నిలుస్తాడు. -
సినియకోవా–టౌన్సెండ్ జోడీకి డబుల్స్ టైటిల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)–టేలర్ టౌన్సెండ్ (అమెరికా) జోడీ టైటిల్ గెల్చుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సినియకోవా–టేలర్ టౌన్సెండ్ ద్వయం 5–7, 6–0, 6–2తో రోబిన్ మోంట్గోమేరీ–యాష్లిన్ క్రుయెజెర్ (అమెరికా) జంటను ఓడించింది. సినియకోవా–టౌన్సెండ్ జోడీకి 10 లక్షల డాలర్లు (రూ. 9 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సినియకోవా కెరీర్లో ఇది 12వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌కాగా... టౌన్సెండ్ కెరీర్లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్. తాజా విజయంతో టౌన్సెండ్ మహిళల డబుల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌నూ సాధించి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకుంది. మరోవైపు సినియకోవా డబుల్స్ డబుల్ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ (ఒక్కో గ్రాండ్‌స్లామ్‌ను రెండుసార్లు చొప్పున సాధించడం) ఘనతను సాధించింది. సినియకోవా భాగ స్వామిగా టౌన్సెండ్ 2024లో వింబుల్డన్, 2025లో ఆ్రస్టేలియన్ ఓపెన్, 2026లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది. -
ఓటమి అంచుల నుంచి...
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికా యువ తార, 2023 చాంపియన్ కోకో గాఫ్ రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా)తో 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ చివరి క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ కోకో గాఫ్ 2–6, 7–6 (9/7), 6–2తో గెలిచింది. రెండో సెట్ టైబ్రేక్‌లో కోకో గాఫ్ 5–6తో, 6–7తో ఓటమి ప్రమాదాన్ని ఎదుర్కొంది. అయితే ఈ రెండుసార్లు కోకో పాయింట్లు గెలిచి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో మాత్రం కోకో గాఫ్ పూర్తి ఆధిపత్యం చలాయించి ఆండ్రీవా ఆట కట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో పెగూలా (అమెరికా)తో సబలెంకా (బెలారూస్); రిబాకినా (కజకిస్తాన్)తో కోకో గాఫ్ తలపడతారు. సెమీస్‌లో జ్వెరెవ్, ఖచనోవ్ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), అన్‌సీడెడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 6–2, 7–5, 6–1తో గెలుపొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 6–2, 7–5, 3–2తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం) గాయం కారణంగా వైదొలిగాడు. -
‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’
యూఎస్ ఓపెన్‌లో చెక్ రిపబ్లిక్ స్టార్ ప్లేయర్, ఆరో సీడ్ లిండా నొస్కోవా పోరాటం క్వార్టర్ ఫైనల్స్‌తోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో సబలెంకా చేతిలో 7–6 (7/1), 4–6, 7–6 (10/7)తో ‘సూపర్ టైబ్రేక్’లో నొస్కోవా ఓటమి చవిచూసింది. ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన నొస్కోవా యూఎస్ ఓపెన్ కూడా గెలిచి రెండో గ్రాండ్‌స్లామ్‌ను అందుకోవాలని చూసింది. కానీ ఆమె కల నెరవేరలేదు. మ్యాచ్ ఓటమి అనంతరం నొస్కోవా మాట్లాడుతూ.. ‘ఒక మూడు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉంటాను. ఈ మూడు రోజులు పీకలదాకా మందు తాగి జరిగింది ఒక పీడకలలా మరిచిపోవాలనుకుంటున్నా. 21 ఏళ్లు కావడంతో నాకు మందు తాగేందుకు అనుమతి ఉందని నేను అనుకుంటున్నా’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.Photo Credit: Twitter‘న్యూయార్క్ అంటే చాలా ఇష్టం. ఎలాగూ యూఎస్ ఓపెన్‌లో నా ప్రయాణం ముగిసింది కాబట్టి ఇక్కడి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నా. నాకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లు చూపించే ప్రేమ, ఆప్యాయతతో రాబోయే కొన్ని గంటల్లోనే ఓటమి బాధను మరిచిపోతాననుకుంటా’ అని వెల్లడించింది.ఇక వరుసగా ఆరో ఏడాది యూఎస్ ఓపెన్‌లో సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2024, 2025లలో యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సబలెంకా 2023లో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2022, 2021లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించింది. కానీ నొస్కోవాతో పోరులో సబలెంకాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరకు సబలెంకా 2 గంటల 22 నిమిషాల పోరాటం తర్వాత విజయాన్ని అందుకుంది. Photo Credit: Twitterనిర్ణయాత్మక మూడో సెట్లో సబలెంకా 2–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది. అయితే కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన అనుభవం సబలెంకాకు ఉపయోగపడింది. వెనుకంజలో ఉన్నా ఆందోళన చెందకుండా ఆడిన సబలెంకా ఏడో గేమ్‌లో నొస్కావా సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ టైబ్రేక్’ అనివార్యమైంది. ‘సూపర్ టైబ్రేక్’లో తొలుత పది పాయింట్లు సాధించిన ప్లేయర్ విజేత అవుతారు. సూపర్ టైబ్రేక్ ఆరంభంలో ఇద్దరు 3–3తో సమంగా నిలిచాక... సబలెంకా వరుసగా మూడు పాయింట్లు గెలిచి 6–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు 10–7తో ‘సూపర్ టైబ్రేక్‌ను సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. 11 straight wins at Grand Slam level.Linda Noskova had a summer to remember 👏 pic.twitter.com/OLjo0spg6f— US Open Tennis (@usopen) September 8, 2026Linda Noskova after her loss with Sabalenka:"I will do something. I'm going to stay for, like, three more days. I'm going to get drunk and forget about this, I guess (laughter). I'm old enough to do that, thankfully."BTW, great personality!#tennis #usopen26…— Carlo Galati (@CarloGalati) September 8, 2026చదవండి: ఆఫ్గన్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్! -
క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్!
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గాయం నుంచి కోలుకున్న అల్కరాజ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్‌లో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్ 6-4, 6-3, 6-4తో అమెరికాకు చెందిన 20వ సీడ్ టామీ పాల్‌ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. రెండు గంటల 20 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 33 విన్నర్లు సంధించి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 8వ ర్యాంకర్ బెంజమిన్ షెల్టన్‌ను ఎదుర్కోనున్నాడు. ఇక షెల్టన్ మూడో రౌండ్లో 6-2, 6-3, 6-4తో స్టిఫానోస్ సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఖంగుతినిపించి అల్కరాజ్తో పోరుకు సిద్ధమయ్యాడు.Photo Credit: Twitterఅయితే క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తాను తలపడబోయే ప్రత్యర్థిని తప్పుగా ఊహించడం ఆసక్తి రేపింది. టామీ పాల్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అల్కరాజ్ సెట్ (యూఎస్ ఓపెన్‌లో మ్యాచ్‌లు జరిగే ప్రదేశం)కు వెళ్లాడు. 2003 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆండీ రాడిక్ క్వార్టర్స్‌లో అల్కరాజ్ ఎదుర్కోబోయే చాలెంజర్ గురించి ప్రశ్న అడిగాడు. "మీరు షెల్టన్ లేదా సిట్సిపాస్లో ఒకరితో క్వార్టర్స్ ఆడనున్నారు. మరి ఇద్దరిలో ఎవరితో ఆడడం మీకు ఇష్టం" అని ప్రశ్నించాడు. అయితే ఆండీ రాడిక్ ప్రశ్న పూర్తి కాకముందే.. అతడి ముందు ఉన్న పేపర్‌ను పరిశీలించిన అల్కరాజ్.. "ఓరి దేవుడా, ఇది నేను ఊహించలేదు. మెద్వెదెవ్ లేదా టియాఫోల్లో ఒకరితో తలపడతానని భావించాను. కానీ ఇక్కడ వేరే పేర్లున్నాయి.’’ అని పేర్కొన్నాడు. Photo Credit: Twitterతాను ఒకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా తన పరిస్థితి తయారైందని అల్కరాజ్ చెప్పడంతో స్టూడియోలో ఉన్నవారంతా గొల్లుమని నవ్వారు. అల్కరాజ్, ఆండీ రాడిక్ వీడియో సంభాషణ వైరల్‌గా మారింది. ఇక ఫ్రాన్స్‌కు చెందిన టియాఫో డానిల్ మెద్వదెవ్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అలెక్స్ మిచెల్సెన్తో పోటీకి సిద్ధమయ్యాడు.టామీ పాల్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన కార్లోస్ అల్కరాజ్ కొన్ని రికార్డులు సాధించాడు. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరడం అల్కరాజ్కు ఇది ఐదో సారి. హార్డ్ కోర్టుపై అల్కరాజ్కు ఇది వరుసగా 18వ విజయం కాగా, యూఎస్ ఓపెన్‌లో ఇది వరుసగా 11వ విజయం. ఓవరాల్‌గా అల్కరాజ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ఇది 15వ సారి.Undeniable.Carlos Alcaraz dispatches Paul 6-4, 6-3, 6-4 to reach the quarterfinals! pic.twitter.com/9BycpgCDQZ— US Open Tennis (@usopen) September 6, 2026 Alcaraz didn't know he was playing Shelton or Tsitsipas next at the US Open:Carlos: "I thought.. I thought.. Oh my God I thought I was playing Medvedev or Tiafoe. Oh my God." 😭😭😭“You gonna watch the match?"Carlos: "For sure I'm gonna watch it." 😭 pic.twitter.com/P4eRQBzOkp— The Tennis Letter (@TheTennisLetter) September 6, 2026Read: సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు -
సబలెంకా జోరు
న్యూయార్క్: తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా జోరు కొనసాగిస్తోంది. వరుసగా ఆరో ఏడాది ఈ బెలారూస్ స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 6–3, 6–4తో ప్రపంచ 96వ ర్యాంకర్ టేలర్ టౌన్సెండ్ (అమెరికా)ను ఓడించింది. 75 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. 2021, 2022లలో సెమీఫైనల్ చేరిన సబలెంకా 2023లో రన్నరప్‌గా నిలిచింది. 2024, 2025లలో విజేతగా నిలిచి ఈసారి ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టింది. మరోవైపు రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.ఫ్రిట్జ్, కొబోలి అవుట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్–10లోని మరో ఇద్దరు సీడెడ్ క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. ఐదో సీడ్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ఫ్లావియో కొబోలి (ఇటలీ), తొమ్మిదో సీడ్, 2024 రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) మూడో రౌండ్లోనే నిష్క్రమించారు. ఫ్రాన్సిస్కో సెరెన్డోలో (అర్జెంటీనా) 3 గంటల 40 నిమిషాల్లో 3–6, 4–6, 6–3, 6–4, 6–4తో టేలర్ ఫ్రిట్జ్‌ను... అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం) 6–7 (4/7), 6–3, 6–0, 6–3తో కొబోలిను ఓడించి తమ కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 17వ సీడ్ జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) కూడా మూడో రౌండ్లోనే వెనుదిరిగాడు. గత నాలుగేళ్లు యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన 14వ సీడ్ లెర్నర్ టియెన్ (అమెరికా) 3 గంటల 24 నిమిషాల్లో 6–3, 1–6, 6–7 (2/7), 6–3, 6–4తో మెన్సిక్పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. జ్వెరెవ్ మూడు సెట్లలోనే... తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదు సెట్లలో గట్టెక్కిన టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లో మాత్రం వరుస సెట్లలో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. జ్వెరెవ్ 6–2, 7–6 (7/2), 6–2తో టబిలో (చిలీ)పై నెగ్గాడు. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫ్రాన్స్ ప్లేయర్, ప్రపంచ 87వ ర్యాంకర్ ఆర్థర్ గియా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ‘లక్కీ లూజర్’ హోదాలో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న 21 ఏళ్ల గియా మూడో రౌండ్లో 3 గంటల 55 నిమిషాల్లో 7–6 (9/7), 3–6, 4–6, 6–3, 6–2తో మైకేల్ జెంగ్ (అమెరికా)పై గెలిచాడు. వాస్తవానికి గియా క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవారెడ్డి చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయాడు. అయితే మెయిన్ ‘డ్రా’లోని 19వ సీడ్, 2022 రన్నరప్ కాస్పర్ రూడ్ గాయంతో చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓడిన ఉత్తమ ర్యాంక్ ప్లేయర్‌గా గియాకు ‘లక్కీ లూజర్’గా మెయిన్ ‘డ్రా’లో అవకాశం కల్పించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–ఇవాన్ లియుటారెవిచ్ (బెలారూస్) ద్వయం 4–6, 7–5, 4–6తో ఆర్థర్ ఫెరీ–జోషువా పారిస్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో అల్కరాజ్
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ దూసుకుపోతున్నాడు. మూడో రౌండ్లో అలవోక విజయంతో అతను ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఈ పోరులో అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–4, 6–1తో వు యిబింగ్ (చైనా)పై ఘన విజయం సాధించాడు. 2 గంటల 20 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 6 ఏస్‌లు, 21 విన్నర్లు కొట్టాడు. 2021 చాంపియన్, ఏడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) కూడా ముందంజ వేశాడు. మూడో రౌండ్లో అతను 6–4, 6–4, 6–4తో ఆర్థర్ రిండర్‌నెక్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. పురుషుల విభాగంలో 8వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా), 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫో (అమెరికా), సిట్సిపాస్ (గ్రీస్) కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరగా... 15వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్తాన్) మూడో రౌండ్లో ఓడి నిష్క్రమించాడు. షెల్టన్ 7–6 (7/3), 6–7 (5/7), 6–3, 6–4 స్కోరుతో డెనిస్ షపలోవ్ (కెనడా)పై, టియాఫో 6–4, 6–2, 6–4తో వలెంటైన్ వాకెరట్ (మొనాకో)పై, సిట్సిపాస్ 2–6, 6–1, 7–6 (7/3), 6–1తో జిరి లెహెకా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. బబ్లిక్‌ను 6–4, 3–6, 6–7 (4/7), 6–1, 6–3తో టామీ పాల్ (అమెరికా) ఓడించాడు. సెరెనా–వీనస్ జోడి ఓటమి మహిళల సింగిల్స్‌లో వింబుల్డన్ చాంపియన్, 6వ సీడ్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరగా, 9వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) మూడో రౌండ్లో ఓడి వెనుదిరిగింది. నొస్కోవా 6–2, 6–7 (6/8), 6–2తో యాన్ లీ (అమెరికా)ను, స్వితోలినా (ఉక్రెయిన్) 3–6, 6–2, 3–6తో అనా కలినస్కియా (రష్యా) చేతిలో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్ అమెరికా స్టార్ సిస్టర్స్ వీనస్ విలియమ్స్–సెరెనా విలియమ్స్ తొలి రౌండ్లోనే ‘సూపర్ టైబ్రేక్’లో ఓడి వెనుదిరిగారు. మాయా జాయింట్ (ఆ్రస్టేలియా)–హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడి 6–3, 6–7 (6/8), 7–6 (10/7)తో వీనస్–సెరెనాపై విజయం సాధించారు. బాంబ్రీ, నికీ జోడీల నిష్క్రమణ... పురుషుల డబుల్స్‌లో భారత ప్లేయర్ నికీ పునాచా –గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్) ద్వయం మొదటి రౌండ్లోనే ఓడింది. నికీ–ఎస్కోబర్ 6–7 (3/7), 7–6 (7/4), 2–6 స్కోరుతో నీల్ ఒబర్లీట్నర్ (ఆస్ట్రియా)–పెట్ర్ నౌజా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయంపాలైంది. మరో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. బాంబ్రీ–మైకేల్ వీనస్ (అమెరికా) ద్వయం 6–7 (4/7), 6–7 (3/7)తో ర్యాన్ సెగెర్మన్–పాట్రిక్ ట్రాక్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. -
వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రస్తుతం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ వేటలో దూసుకెళ్తున్నాడు. నాలుగు నెలల పాటు మణికట్టు గాయం కారణంగా ఆటకు దూరమైన అల్కరాజ్ యూఎస్ ఓపెన్ ద్వారా పునరాగమనం చేశాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌కు చేరిన అల్కరాజ్ టైటిల్ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. టోర్నమెంట్లో అల్కరాజ్ ధరించిన బనియన్ (Nike OutFit) వైరల్‌గా మారింది. అతడి బనియన్ కారణంగా సోషల్ మీడియాలో అల్కరాజ్ "నిపుల్గేట్" (Nipplegate) ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.విషయంలోకి వెళితే యూఎస్ ఓపెన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అల్కరాజ్ జులపాల జుట్టుతో పాటు వేషదారణను కూడా పూర్తిగా మార్చేశాడు. మొదటి రెండు రౌండ్ల మ్యాచ్‌లకు అల్కరాజ్ నైక్ (Nike) బ్రాండ్‌కు చెందిన లూజ్-ఫిట్టింగ్ బ్రౌన్ కలర్ ట్యాంక్ టాప్ ధరించాడు. Photo Credit: Twitterమ్యాచ్ సమయంలో అతను కోర్టులో వేగంగా కదులుతున్నప్పుడు ఆ లూజ్ జెర్సీ పక్కకు జరిగి, అతని కుడి వైపు రొమ్ము భాగం (Nipple) పదే పదే బయటకు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. "లవ్ యూ కార్లోస్, కానీ నీ రొమ్ము భాగాన్ని కప్పి ఉంచేలా టైట్ బనియన్ వేసుకొని బరిలోకి దిగు" అని మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, కామెంటేటర్ యూజినీ బౌచర్డ్ ఎక్స్ వేదికగా ఫన్నీ కామెంట్ చేసింది.తన ఔట్ఫిట్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, కామెంట్లను అల్కరాజ్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా అనిపించింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ బ్రౌన్ ట్యాంక్ టాప్ కింద వైట్‌కలర్ అండర్ షర్ట్ ధరించడం కనిపించింది. మ్యాచ్ సమయంలో వేగంగా కదిలినప్పటికీ అతడి రొమ్ము భాగం కనిపించలేదు. Photo Credit: Twitterఇక మ్యాచ్ అనంతరం ఫ్రెస్ కాన్ఫరెన్స్‌లో అల్కరాజ్ మాట్లాడుతూ తన ఔట్ఫిట్పై సరదాగా స్పందించాడు. “ఇటీవల నా రొమ్ము భాగం నాకే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా అనిపించింది. అందుకే కనీసం ఒక్క మ్యాచ్‌కైనా వాటిని దాచేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇన్నర్‌వేర్ రూపంలో రెండో షర్ట్ ధరించడం చాలా సౌకర్యంగా అనిపిస్తోంది. ఇకపై దీనినే కొనసాగిస్తాను” అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, నైక్ సంస్థ దీనికి కారణం కాదని అల్కరాజ్ మరోసారి స్పష్టం చేశాడు. No more wardrobe malfunctions for Carlos Alcaraz 😂 pic.twitter.com/BDEfGRs4Pf— TNT Sports (@tntsports) September 5, 2026 Cue the Carlos Alcaraz break of serve! pic.twitter.com/SB8YyFHLCK— US Open Tennis (@usopen) August 31, 2026 Quem será que ganhou esse sorriso do Carlitos 😍.. pic.twitter.com/ytqhNRiY7F— Central Carlos Alcaraz (@AlcarazCentral) September 4, 2026చదవండి: బంతి వేయడానికి 100 కి.మీ. పరిగెత్తిన ఇంగ్లండ్ బౌలర్ -
నాలుగేళ్ల తర్వాత బరిలో విలియమ్స్ సిస్టర్స్.. ఫలితం ఏంటంటే?
సొంతగడ్డపై ఫెవరెట్‌గా బరిలోకి దిగిన విలియమ్స్ సిస్టర్స్ (సెరెనా, వీనస్) యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడి నిరాశపరిచారు. టోర్నీలో భాగంగా ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా-వీనస్ జోడి 3-6, 7-6 (8-6), 6-7 (7-10)పై మాయా జాయింట్ (ఆస్ట్రేలియా)-చాన్ హావో-చింగ్ (తైవాన్) జంట విజయం సాధించింది. అయితే తొలి సెట్‌ను ఓడినప్పటికీ, రెండో సెట్‌ను టై బ్రేక్‌లో సొంతం చేసుకున్న వీనస్ జోడీ కీలకమైన మూడో సెట్లోనూ పోరాడింది. దీంతో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. అయితే ఒత్తిడికి లోనైన వీనస్-సెరెనా ద్వయానికి ఓటమి తప్పలేదు. ఇక విలియమ్స్ సిస్టర్స్ ఇద్దరు కలిసి డబుల్స్‌లో 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తే అందులో రెండు యూఎస్ ఓపెన్ ఉన్నాయి. ఇక చివరగా వీనస్-సెరెనా జోడీ 2018లో డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తర్వాత వీనస్, సెరెనాలు డబుల్స్‌లో ఆడడం మళ్లీ ఇదే. ఇక మహిళల సింగిల్స్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన సెరెనా విలియమ్స్ 23 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచింది. విలియమ్స్ సిస్టర్స్ మ్యాచ్ ఓడినప్పటికీ స్టేడియంలోని ప్రేక్షకులు మాత్రం వారిద్దరికి కరతాళధ్వనులతో వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాజ్, మెద్వెదెవ్, అలెగ్జాండర జ్వెరెవ్ సహా బెంజమిన్ షెల్టన్, టియాఫో, టేలర్ ప్రిట్జ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్‌లో స్వితోలినాకు కలిన్‌స్కాయా షాక్ ఇవ్వగా, నొస్కోవా, నవ్వారోలు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు.Serena and Venus Williams wave goodbye to the US Open crowd. Leaving with smiles on their faces. The sisters who changed the sport as we know it…What a gift that we got to watch them side by side again in 2026. 🥹 pic.twitter.com/OvykarYi15— The Tennis Letter (@TheTennisLetter) September 5, 2026చదవండి: రోహిత్ కొత్త అవతారం.. ‘రిటైర్మెంట్ తర్వాత చేసే పని ఇదేనా’ -
సబలెంకా జోరు
న్యూయార్క్: ‘హ్యాట్రిక్’ టైటిల్ లక్ష్యంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా ఆ దిశగా మరో అడుగు వేసింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆడుతున్న ఈ బెలారూస్ స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్ సీడ్ సబలెంకా 6–3, 6–4తో రఖిమోవా (ఉజ్బెకిస్తాన్)పై కష్టపడి గెలిచింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో కేవలం 54 నిమిషాల్లో నెగ్గిన సబలెంకా మూడో రౌండ్ మ్యాచ్‌లో మాత్రం 89 నిమిషాలు తీసుకుంది. 10 ఏస్‌లు సంధించిన సబలెంకా ఒక్కటే డబుల్ ఫాల్ట్ చేసింది. రెండుసార్లు రఖిమోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఆమె తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ ఇవ్వలేదు. 29 విన్నర్స్ కొట్టిన 2024, 2025 చాంపియన్ 19 అనవసర తప్పిదాలు చేసింది. 11వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్), మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), 16వ సీడ్ సొరానా కిర్‌స్టియా (రొమేనియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కొస్టుక్ 6–3, 6–2తో 18వ సీడ్ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, పెగూలా 1–6, 6–4, 6–3తో 2021 రన్నరప్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై, సొరానా 6–3, 6–3తో 19వ సీడ్ పావోలిని (ఇటలీ)పై విజయం సాధించారు. రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా), పదో సీడ్ అనిసిమోవా (అమెరికా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రిబాకినా 6–2, 6–4తో బుజాస్ మనెరో (స్పెయిన్)పై, కోకో గాఫ్ 6–4, 7–6 (7/5)తో పౌలా బదోసా (స్పెయిన్)పై, ఆండ్రీవా 6–0, 6–2తో ఇవా లిస్ (జర్మనీ)పై, అనిసిమోవా 6–3, 3–6, 6–1తో లిలీ టాగెర్ (ఆస్ట్రియా)పై నెగ్గారు. -
చివరి గ్రాండ్‌స్లామ్ ఆడిన ఫ్రెంచ్ ఐకాన్.. భార్య ఎవరో తెలిస్తే షాక్!
ఫ్రెంచ్ టెన్నిస్ ఐకాన్, సీనియర్ ఆటగాడు గేల్ మోన్ఫిల్స్ తన చివరి కెరీర్ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడేశాడు. 2026 సీజన్ అనంతరం మోన్ఫిల్స్ ఆటకు వీడ్కోలు పలుకుతానని ముందే వెల్లడించాడు. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్ రూపంలో కెరీర్ చివరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన మోన్ఫిల్స్ ఓటమి అనంతరం అభిమానులకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి గురయ్యాడు. యూఎస్ ఓపెన్‌లో భాగంగా పురుషులు సింగిల్స్ రెండో రౌండ్లో అమెరికాకు చెందిన 20 ఏళ్ల లార్నర్ టైన్ చేతిలో 6-3, 6-4, 6-3తో గేల్ మోన్ఫిల్స్ పరాజయం చవిచూశాడు.Photo Credit: Twitterది ఎంటర్టైనర్మైదానంలో అద్భుతమైన విన్యాసాలు, చురుకైన ఆటతీరు, ప్రేక్షకులను అలరించే శైలి మోన్ఫిల్స్ సొంతం. అందుకే ఆయన్ను టెన్నిస్‌లో అందూరు "ది ఎంటర్టైనర్" (The Entertainer) అని పిలుస్తారు. 40 ఏండ్ల మోన్ఫిల్స్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతానని ముందే వెల్లడించాడు. దీంతో మోన్ఫిల్స్ ఆడే మ్యాచ్‌లకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తాజాగా రెండో రౌండ్ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లోని ప్రేక్షకులు ఫ్రెంచ్ స్టార్‌కు మద్దతుగా ‘మోన్ ఫిల్స్.. మోన్ఫిల్స్’ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.రెండుసార్లు సెమీస్‌కు..2004లో ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ప్రారంభించిన గేల్ మోన్ఫిల్స్ 2016 నవంబర్‌లో తన సింగిల్స్ కెరీర్లోనే అత్యుత్తమంగా ఆరో ర్యాంకును సాధించడం విశేషం. ఇక మోన్ఫిల్స్ 35 ఏటీపీ టూర్ సింగిల్స్ ఫైనల్స్‌లో ఆడి 13సార్లు టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో అతడి అత్యుత్తమ ప్రదర్శన 2008, 2016లో నమోదు చేశాడు. 2008 ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన మోన్ఫిల్స్ ఆ తర్వాత 2016 యూఎస్ ఓపెన్‌లోనూ మరోసారి సెమీస్ చేరుకున్నాడు.Photo Credit: Twitterస్వితోలినాతో ప్రేమ వివాహం1986లో జన్మించిన మోన్ఫిల్స్ మహిళా టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినాతో ప్రేమాయణం నడిపాడు. 2019లో తమ రిలేషన్‌ను బయటపెట్టిన వీరిద్దరు 2021 ఏప్రిల్‌లో నిశ్చితార్థం, అదే ఏడాది జూలై 16న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. కాగా ఎలీనా స్వితోలినా కూడా ప్రస్తుతం మహిళల టెన్నిస్‌లో స్టార్ ప్లేయర్‌గా వెలుగొందుతుంది. తన సింగిల్స్ కెరీర్లో స్వితోలినా నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) పలుమార్లు సెమీస్, క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. తన కెరీర్లో 2017లో అత్యుత్తమంగా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్ అందుకుంది.Photo Credit: Twitterతరచూ గాయాలు..తరచూ గాయాల బారిన పడిన మోన్ఫిల్స్ కెరీర్లో చాలా గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు దూరమయ్యాడు. సింగిల్స్‌లో 588-359గా కెరీర్ రికార్డు ఉంది. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఫైనాన్స్ (వెల్త్ మేనేజ్మెంట్) రంగంలో స్థిరపడనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.Gael Monfils says one last goodbye to the U.S. Open crowd.He just played the last Grand Slam match of his career.One of the most gifted athletes to ever play this sport. 🥹🇫🇷❤️ pic.twitter.com/uJfT20Ocdf— The Tennis Letter (@TheTennisLetter) September 4, 2026Read: నొప్పిని భరిస్తూనే మూడో రౌండ్‌కు మాజీ చాంపియన్ -
నొప్పిని భరిస్తూనే మూడో రౌండ్‌కు మాజీ చాంపియన్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్, మాజీ చాంపియన్ ఎలీనా రిబాకినా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రెండో రౌండ్లో కజకిస్తాన్ బామ రిబాకినా 6-2, 6-4తో స్పెయిన్‌కు చెందిన జెస్సికా బౌజస్ను మట్టికరిపించింది. ఎడమ కాలి మడమ నొప్పిని భరిస్తూనే రిబాకినా అద్భుత ప్రదర్శన చేసింది. జెస్సికా 5-3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో తొలిసారి ఆమె సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా ఆ తర్వాత వరుస పాయింట్లు సాధించింది. గంట వ్యవధిలోనే రెండు సెట్లలో మ్యాచ్‌ను ముగించింది. మూడో రౌండ్లో రిబాకినా ఉక్రెయిన్‌కు చెందిన యులియా స్టార్డుబెత్సోవాతో తలపడనుంది. Photo Credit: Twitter2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేత అయిన రిబాకినా మరోసారి టైటిల్ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. 2022లో వింబుల్డన్ చాంపియన్ అయిన రిబాకినా బెలారస్ స్టార్ అరీనా సబలెంకను సెమీస్‌లో ఎదుర్కొనే అవకాశముంది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ కోకో గాఫ్ కూడా మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్లో గాఫ్ 6-4, 7-6(7-5)తో స్పెయిన్‌కు చెందిన పౌలా బడోసాపై సునాయాస విజయాన్ని అందుకుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో మిర్రా ఆండ్రీవా జర్మనీకి చెందిన లిస్పై, జోవిక్ (అమెరికా) ఇంగ్లండ్‌కు చెందిన జోన్స్‌పై విజయాలు సాధించి తర్వాతి రౌండ్లో అడుగుపెట్టారు.Rybakina races out to take the first set 6-2! pic.twitter.com/nfMmbXv1We— US Open Tennis (@usopen) September 4, 2026 Coco put on a show in R2! pic.twitter.com/Pd4Xim14fM— US Open Tennis (@usopen) September 4, 2026Read: భారత బౌలర్ దెబ్బకు స్టోక్స్ ఫ్యూజులు ఔట్! -
54 నిమిషాల్లోనే...
న్యూయార్క్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయే పరిస్థితుల నడుమ... యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన బెలారూస్ స్టార్ సబలెంకా తన జోరు ప్రదర్శిస్తోంది. కేవలం 54 నిమిషాల్లోనే రెండో రౌండ్ మ్యాచ్‌ను ముగించిన డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. పొలీనా లాట్సెంకో (రష్యా)తో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సబలెంకా 6–1, 6–1తో గెలుపొందింది. ఏకపక్షంగా ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా 24 విన్నర్స్ కొట్టడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఆరో సీడ్ నొస్కోవా (చెక్ రిపబ్లిక్), తొమ్మిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), రెండుసార్లు చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నొస్కోవా 6–4, 6–2తో తరారూడి (థాయ్‌లాండ్)పై, స్వితోలినా 6–2, 6–7 (6/8), 6–4తో మాయా జాయింట్ (ఆస్ట్రేలియా)పై, స్వియాటెక్ 6–3, 6–2తో పొడొరోస్కా (అర్జెంటీనా)పై, 13వ సీడ్ ఒసాకా 6–2, 5–7, 6–1తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అల్కరాజ్ 2 గంటల 40 నిమిషాల్లో 4–6, 6–0, 6–3, 6–2తో జైమీ ఫారియా (పోర్చుగల్)ను ఓడించాడు. ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా), 11వ సీడ్ టియాఫో (అమెరికా) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. -
గట్టెక్కిన జ్వెరెవ్
న్యూయార్క్: కాస్త అటు ఇటు అయి ఉంటే... యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మరో సంచలనం నమోదయ్యేది. ఇప్పటికే సెర్బియా దిగ్గజం, 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా జొకోవిచ్ సరసన చేరేవాడు. కానీ ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జ్వెరెవ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి ఓటమి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 4 గంటల 53 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జ్వెరెవ్ 6–4, 3–6, 6–7 (7/9), 7–5, 6–4తో ప్రపంచ 89వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)పై కష్టపడి గెలుపొందాడు. నాలుగో సెట్ పదో గేమ్‌లో జ్వెరెవ్ ఓటమికి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు. పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత లొరెంజో సర్వీస్‌ను బ్రేక్ చేసి 6–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. పన్నెండో గేమ్‌లో మళ్లీ తన సర్వీస్‌ను కాపాడుకొని జ్వెరెవ్ సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లోని ఐదో గేమ్‌లో సొనెగో సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో తన 100వ విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో 12 ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్ 8 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 54 సార్లు దూసుకొచ్చి 38 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 61 విన్నర్స్ కొట్టిన ఈ జర్మనీ స్టార్ 39 అనవసర తప్పిదాలు చేశాడు. ఈ ఏడాది జ్వెరెవ్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకొని, ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ఫ్లావియో కొబోలి (ఇటలీ) 4 గంటల 13 నిమిషాల్లో 3–6, 2–6, 6–3, 6–4, 6–4తో ఫ్రాన్సిస్కో కమ్సానా (అర్జెంటీనా)పై శ్రమించి గెలిచాడు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవారెడ్డి తొలి రౌండ్లో 6–7 (4/7), 6–3, 4–6, 4–6తో ట్రిస్టన్ స్కూల్‌కేట్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ఓడిన నిశేష్ కు 1,40,000 డాలర్లు (రూ. 1 కోటీ 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. మెద్వెదెవ్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో 2021 చాంపియన్, 2019, 2023 రన్నరప్ మెద్వెదెవ్ (రష్యా) మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ మెద్వెదెవ్ 6–1, 6–3, 7–5తో గోర్జ్నీ (అమెరికా)పై గెలుపొందాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో అలెక్స్ మిచెల్సన్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో 16వ సీడ్ బ్రాండన్ నకíÙమా (అమెరికా)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), 19వ సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పెగూలా 6–3, 6–1తో 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)పై, పావోలిని 6–4, 6–1తో తన దేశానికే చెందిన లుక్రెజియా స్టెఫానినిపై గెలుపొందారు. బెన్చిచ్కు షాక్ మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బెన్‌చిచ్ 2 గంటల 51 నిమిషాల్లో 6–4, 5–7, 3–6తో యూలియా పుతింత్సెవా (కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) అలవోక విజయాలతో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో రిబాకినా 6–3, 6–2తో థియా ఫ్రోడిన్ (అమెరికా)పై, కోకో గాఫ్ 6–3, 6–4తో జెనెప్ సోన్మెజ్ (టర్కీ)పై, ఆండ్రీవా 6–2, 6–2తో జెనిస్ జెన్ (ఇండోనేసియా)పై నెగ్గారు. -
జొకోవిచ్ అలసిపోయాడు
కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ వేటలో మరోసారి బరిలోకి... అటువైపు ప్రత్యర్థిగా 25 ఏళ్ల కుర్రాడు... తొలి సెట్లో ఓడినా తన స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి రెండు సెట్లు సొంతం... అయితే మ్యాచ్ మధ్యలో అనారోగ్యం, కోర్టులోనే వాంతి... అయినా పట్టువదలకుండా పోరాటం... కానీ చివరకు తప్పని నిష్క్రమణ... ఏకంగా 4 గంటల 36 నిమిషాల సమరం తర్వాత సెర్బియా దిగ్గజ ఆటగాడు జొకోవిచ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నుంచి వెనుదిరిగాడు. ఎలాగైనా గెలవాలనే కసి, అతని పట్టుదలను 39 ఏళ్ల వయసు నిరోధిస్తున్నట్లుగా ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. 20 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నిలో తొలి రౌండ్లోనే ఓడి అతను తన భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తించాడు.న్యూయార్క్: సెర్బియా స్టార్, 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. తొలి రౌండ్లో ప్రపంచ 49వ ర్యాంకర్ మరియానో నవోనే (అర్జెంటీనా) 7–6 (7/5), 5–7, 4–6, 6–2, 6–1తో నాలుగో సీడ్ జొకోవిచ్పై సంచలన విజయం సాధించాడు. జొకోవిచ్ తన సుదీర్ఘ ప్రస్థానంలో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో ఓడిపోవడం ఇది మూడోసారి మాత్రమే. కెరీర్లో తొలిసారి 2005లో, ఆ తర్వాత 2006లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే అతను మొదటి రౌండ్లో పరాజయం పాలయ్యాడు. ఇటీవలే జరిగిన సిన్సినాటి ఓపెన్‌లో కూడా మొదటి రౌండ్లో అర్జెంటీనాకే చెందిన అగస్టీన్ చేతిలో జొకోవిచ్ ఓడాడు. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడిన అతను కొంత విరామం తీసుకొని న్యూయార్క్‌కు వచ్చాడు. తాను పూర్తిగా కోలుకొని ఫిట్‌గా మారానని అతను ప్రకటించినా... సోమ వారం జరిగిన పోరులో అతని సమస్య మళ్లీ కనిపించింది. వరుస తప్పిదాలతో... కెరీర్లో ఒకే ఒక ఏటీపీ టైటిల్ గెలిచిన ‘క్లే కోర్ట్ స్పెషలిస్ట్’ నవోనే ఈసారి హార్డ్కోర్టుపై సత్తా చాటాడు. జొకోవిచ్‌తో పోరు తొలి సెట్లో ఒకదశలో 1–4తో వెనుకబడినా నవోనే తగ్గలేదు. జొకోవిచ్ 17 అనవసర తప్పిదాలు చేయడంతో వాటిని సమర్థంగా వాడుకొని సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత జొకోవిచ్ కోలుకొని తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించాడు. రెండో సెట్లో కాస్త తడబడినా, మూడో సెట్లో మాత్రం తన స్థాయిని ప్రదర్శించాడు. 27 షాట్ల ర్యాలీని గెలుచుకొని ముందంజ వేసిన అతడిని అర్జెంటీనా యువ ఆటగాడు నిలువరించలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. తొలి మూడు గేమ్‌లలో జొకోవిచ్ సరీ్వస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసిన నవోనే మరో అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లి సెట్‌ను గెలుచుకున్నాడు. నిర్ణయాత్మక చివరి సెట్‌కు ముందు తీవ్రంగా ఇబ్బంది పడ్డ జొకోవిచ్ మెడికల్ బ్రేక్ కూడా తీసుకున్నాడు. ఫిట్నెస్ సమస్యతో చివరి సెట్లో అతను కోలుకోలేకపోయాడు.మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారూస్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సబలెంకా 6–2, 6–4తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై విజయం సాధించింది.నా శరీరం మొత్తం కుప్పకూలిపోతున్నట్లుగా అనిపించింది. మైదానంలో ఉన్నంత సేపూ ఇబ్బంది పడుతూనే ఆడాను. అయితే ప్రేక్షకులు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. ఎంతో ఉత్సాహపరుస్తూ బాగా ఆడమంటూ ప్రోత్సహించారు. మ్యాచ్ తొలి సెట్లోనే సమస్య మొదలైంది. మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవాలని అనుకున్నా... రెండు, మూడో సెట్లు గెలవడంతో మళ్లీ కొనసాగించేందుకు పట్టుదల కనబర్చాను. ఈ శారీరక సమస్యలను నేను ఎప్పుడు పరిష్కరించుకోగలుగుతానో ఇప్పుడే చెప్పలేను. ప్రయత్నం మాత్రం చేస్తున్నాను.– జొకోవిచ్ -
జకోవిచ్.. ప్లీజ్ రిటైరవ్వు; ఇలా చూడలేకపోతున్నాం!
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసిందా? అతడిని చూస్తుంటే ఆ సిగ్నల్స్ వచ్చేసినట్లుగా అనిపిస్తున్నాయి. తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో జకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. అర్జెంటీనాకు చెందిన మరియానో నవోనె చేతిలో 7-6 (7-5), 5-7, 4-6, 6-2, 6-1తో జకోవిచ్ ఓటమిపాలయ్యాడు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన పోరులో అలసిపోయినట్లు కనిపించిన జకోవిచ్ మరోసారి అధిక ఉష్ణోగ్రతకు తాళలేక మైదానంలోనే వాంతి చేసుకోవడం అభిమానులను కలవరపరుస్తోంది. ఒకప్పుడు ఫిట్‌నెస్‌కు మారుపేరైన జకోవిచ్ ఇప్పుడు వయసు మీద పడుతుండడంతో శరీరం సహకరించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.Photo Credit: Twitterఅభిమానుల కన్నీటిపర్యంతం20 ఏళ్లలో జకోవిచ్ ఒక మేజర్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్లో ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి. 2006లో జకోవిచ్ 18 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్లో వెనుదిరిగాడు. మళ్లీ ఇన్నాళ్లకు జకోవిచ్ ఒక మేజర్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్లో ఇంటిబాట పట్టడం గమనార్హం. తొలి రౌండ్లో ఓటమి అనంతరం గ్రౌండ్‌లోనే కన్నీటి పర్యంతమయిన జకోవిచ్ భావోద్వేగంతో మైదానం వీడడం అందరినీ కలచివేసింది. కమ్‌బ్యాక్ ఇవ్వాలని అభిమానులంతా బయటికి అరుస్తూ చెప్పినప్పటికీ, లోపల మాత్రం ఆ సెర్బియా యోధుడు రిటైర్ అయితేనే బాగుంటుందని భావిస్తున్నారు.Photo Credit: Twitterమూడేళ్లుగా 25వ టైటిల్ కోసంటెన్నిస్ ఓపెన్ శకంలో పురుషుల సింగిల్స్ విభాగంలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు జకోవిచ్. తన సమకాలీకులు రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ రిటైరనప్పటికీ, తాను మాత్రం ఒక యోధుడిలా ఆడుతూనే ఉన్నాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం మూడేళ్లుగా చకోర పక్షిలా ఎదురుచూస్తూనే వస్తున్నాడు. ఆడడం లేదా అంటే అతడి ఆటకు వంక పెట్టాల్సిన పని లేదు. 2026 ఏడాది సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన జకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లో వెనుదిరిగాడు. అయితే వింబుల్డన్‌లో సెమీస్‌లో ఇంటిబాట పట్టాడు. ఆటకు వంక పెట్టలేకపోయినా, వయసు అతడి అనారోగ్యాన్ని సూచిస్తుంది. 39 ఏళ్ల జకోవిచ్ ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఏడాది కాలం నుంచి చూసుకుంటే జకోవిచ్ శరీరం ఆటకు సహకరించట్లేదనిపిస్తోంది. గతేడాది షాంఘై మాస్టర్స్ టోర్నీ సమయంలోనూ జకోవిచ్ మైదానంలో వాంతి చేసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ వేడికి తట్టుకోలేక అలసటకు గురవుతున్న జకోవిచ్ మైదానంలోనే వాంతులు చేసుకోవడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇదంతా చూడడం కంటే జకోవిచ్ తన కెరీర్‌కు గౌరవప్రదంగా వీడ్కోలు పలకడం నయమనే అభిప్రాయానికి వచ్చేశారు.Photo Credit: Twitter2023లో పూర్వవైభవం2023 ఏడాది జకోవిచ్ కెరీర్లో పీక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఒక్క ఏడాదిలోనే మూడు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) నెగ్గిన వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అది కూడా సాధించి ఉంటే ఆ ఏడాది జకోవిచ్ మరోసారి కెరీర్ గ్రాండ్‌స్లామ్ (నాలుగు టైటిల్స్) ఫీట్ సాధించేవాడే.డౌన్‌ఫాల్.. అనారోగ్యం2023 తర్వాత జకోవిచ్ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయ్యింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒకటి రెండు మేజర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీస్ లేదా ఫైనల్‌కు చేరుకున్నాడు తప్పిస్తే మునుపటి ఆటతీరును ప్రదర్శించడం లేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మినహా జకోవిచ్ మిగతా గ్రాండ్‌స్లామ్స్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.Photo Credit: Twitter2022లో ఫెదరర్.. 2024లో నాదల్తన కెరీర్లో 25 గ్రాండ్‌స్లామ్స్‌తో టెన్నిస్‌లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాలని భావిస్తున్న జకోవిచ్ పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ జకోవిచ్ ప్రస్తుతం తన వయసును కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముంది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన తర్వాత స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 2022లో తన సేవలు చాలు అనుకొని టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2024లో స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ (22 టైటిల్స్) కూడా ఆడాలనే పట్టుదల ఉన్నప్పటికీ, శరీరం సహకరించడం లేదన్న కారణంతో అతడు కూడా తప్పుకున్నాడు. ఇప్పుడు 24 టైటిల్స్‌తో వీరిద్దరి కంటే ముందున్న జకోవిచ్ కూడా తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు.Photo Credit: Twitter13 ఏళ్ల పాటు నంబవర్‌వన్‌గా..ఇక 23 ఏళ్ల టెన్నిస్ కెరీర్లో జకోవిచ్ సింగిల్స్ రికార్డు 1177–240 (83.1శాతం)గా ఉంది. అతడి కెరీర్లో 101 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్‌తో పాటు రికార్డు స్థాయిలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో రికార్డు స్థాయిలో 10 ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడు ఫ్రెంచ్ ఓపెన్, ఏడు వింబుల్డన్, నాలుగు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో ఉన్నాయి. ఇక వరుసగా 13 ఏళ్లు వివిధ సమయాల్లో నెంబర్‌వన్‌గా కొనసాగిన జకోవిచ్, అత్యధికంగా 428 వారాల పాటు నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగడం విశేషం.Novak Djokovic with a heartfelt moment to the crowd after his 1st round loss at the U.S. OpenHe struggled with his body tonight, but kept fighting for 4 hours & 36 minutes at 39 years oldLeaving with grace and & nothing but loveWhat a legend. 🥹 pic.twitter.com/wDO16xpKsa— The Tennis Letter (@TheTennisLetter) August 31, 2026 Novak Djokovic looks very emotional down 1-3 in the 5th set against Navone at the US Open. Definitely in pain physically, but these also look like emotional tears. 4+ hours at 39 years old.The New York crowd is trying to give him a push for another heroic comeback. 🥹 pic.twitter.com/QsZqF0Z04o— The Tennis Letter (@TheTennisLetter) August 31, 2026చదవండి: గాయం పేరుతో నాటకమా? నిజమని తేలితే నిషేధమే! -
US Open 2026: జకోవిచ్‌కు ఊహించని షాక్
యూఎస్ ఓపెన్-2026లో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు తొలి రౌండ్లోనే ఊహించని షాక్ తగిలింది. అర్జెంటీనాకు చెందిన యువ ఆటగాడు మరియానో నవోనె చేతిలో 7-6 (7/5), 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జకోవిచ్ ఓటమి చవిచూశాడు. సుదీర్ఘంగా సాగిన ఈ ఐదు సెట్ల పోరులో ఓడిపోవడంతో, జకోవిచ్ తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టాడు. దీంతో 25వ మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలన్న జకోవిచ్ కలలు ఆదిలోనే కరిగిపోయాయి. ఆది నుంచే ఇబ్బందిపడ్డ జొకోవిచ్వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆర్థర్ ఆషే స్టేడియం కప్పును పూర్తిగా మూసివేయగా.. 39 జకోవిచ్ వేడిమి తట్టుకోలేక ఇబ్బంది పడ్డాడు. పదే పదే తలపై ఐస్‌బ్యాగ్ పెట్టుకుని ఉపశమనం పొందే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. కాసేపు ఏసీ వేయాలంటూ సూపర్వైజర్ను కోరాడు.ఇక చివరి సెట్‌కు ముందు మెడికల్ టైమ్ అవుట్ కూడా తీసుకున్నాడు. వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్య బృందాన్ని పిలిపించుకున్నాడు. కానీ మునుపటిలా మైదానంలో కదల్లేకపోయాడు. ఈ క్రమంలో జకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచిన నవోనె సులువుగానే మ్యాచ్ గెలిచాడు.భావోద్వేగంతొలి రౌండ్లోనే ఓటమి నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురైన జకోవిచ్.. మైదానం వీడే సమయంలో అభిమానులకు అభివాదం చేశాడు. ప్రేక్షకులు లేచి నిలబడి అతడికి భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.Novak Djokovic with a heartfelt moment to the crowd after his 1st round loss at the U.S. OpenHe struggled with his body tonight, but kept fighting for 4 hours & 36 minutes at 39 years oldLeaving with grace and & nothing but loveWhat a legend. 🥹 pic.twitter.com/wDO16xpKsa— The Tennis Letter (@TheTennisLetter) August 31, 2026 -
పెగూలా శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళలసింగిల్స్ విభాగంలో 2024 రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా) శుభారంభం చేసింది. ఎలీనా గాబ్రియేలా రూసె (రొమేనియా)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్లో పెగూలా 6–3, 6–2తో గెలిచింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెగూలా నాలుగు ఏస్‌లు సంధించింది. 26 విన్నర్స్ కొట్టిన పెగూలా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ప్రపంచ 29వ ర్యాంకర్, రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. క్రెజికోవా 6–7 (4/7), 2–6తో కమీలా రఖిమోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. -
'యూఎస్' కిరీటం ఎవరిదో!
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘యూఎస్ ఓపెన్’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టోర్నీ సెప్టెంబర్ 13న ముగుస్తుంది. పురుషుల విభాగంలో కార్లోస్ అల్కరాజ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, గత రెండేళ్లు టైటిల్ సాధించిన అరైనా సబలెంకా వరుసగా మూడో ట్రోఫీపై కన్నేసింది. గాయం కారణంగా వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఈ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో అల్కరాజ్కు అవకాశాలు మరిన్ని పెరిగాయి. మరో వైపు దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ తన 25వ గ్రాండ్‌స్లామ్ గెలిచే ప్రయత్నంలో మరోసారి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. గాయంతో గత ఏప్రిల్ నుంచి ఆటకు దూరంగా ఉన్న అల్కరాజ్ కోలుకొని పునరాగమనం చేయడంతో అభిమానుల అంచనాలు పెరిగాయి. తాను గెలిచిన 7 గ్రాండ్‌స్లామ్‌లలో అతను ఇక్కడే రెండు టైటిల్స్ సాధించాడు. ఈ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సాధించిన అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఈ టోర్నీలో టాప్ సీడ్ కాగా, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) కూడా పోరాడేందుకు సై అంటున్నాడు. 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ నెగ్గిన తర్వాత పురుషుల విభాగంలో ఏ అమెరికన్ ఆటగాడు కూడా టైటిల్ గెలవలేకపోయాడు. ఇప్పుడు బెన్ షెల్టన్, టేలర్ ఫిట్జ్, ఫ్రాన్సిస్ టియాఫో తమ వైపునుంచి ప్రయత్నం కొనసాగించనున్నారు. మహిళల విభాగంలో 2024, 2025 విజేత, వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా మళ్లీ యూఎస్ ఓపెన్ ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సారి గెలిస్తే సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా మూడు సార్లు యూఎస్ ఓపెన్ నెగ్గిన ప్లేయర్‌గా ఆమె నిలుస్తుంది. అయితే ఆమె తాజా ఫామ్ అంత గొప్పగా లేదు. గత కొన్ని టోర్నీలో ఆమె కనీసం నాలుగో రౌండ్ కూడా దాటలేకపోయింది. యూఎస్ ఓపెన్‌కు ముందు ఆడిన హార్డ్ కోర్ట్ టోర్నీలు టొరంటో, సిన్సినాటిలలో ఆమె ఓటమిపాలైంది. 2026 వింబుల్డన్ చాంపియన్ లిండా నొస్కొవా, ఇగా స్వియాటెక్ల నుంచి సబలెంకాకు గట్టి పోటీ ఎదురవుతుండగా... రిబాకినా, పెగులా, పౌలా బడోసా, కోకో గాఫ్, స్వితోలినా వంటి ప్లేయర్లు కూడా టైటిల్ వేటలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో 46 ఏళ్ల వీనస్ విలియమ్స కూడా పోటీ పడుతుండగా...డబుల్స్‌లో వీనస్ – సెరెనా విలియమ్స్ జోడీకి నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ద్వారా అవకాశం కల్పించారు. -
యూఎస్ ఓపెన్ బరిలో అల్కరాజ్.. టైటిల్ నిలబెట్టుకునేనా?
స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నాడు. కుడిచేతి మణికట్టు గాయంతో నాలుగు నెలల పాటు టెన్నిస్‌కు దూరమైన అల్కరాజ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు డిపెండింగ్ చాంపియన్ హోదాలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా యూఎస్ ఓపెన్ ఆడనుండడంపై అల్కరాజ్ స్పందించాడు. "మీరు మళ్లీ పాత అల్కరాజ్ స్టైల్ ఆటను చూడబోతున్నారు. నాకు మంచి పోటీ కావాలి. ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అయితే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నాకు సవాలుతో కూడుకున్నది. గతంలో ఫెదరర్, నాదల్ గాయాల నుంచి కోలుకొని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన విషయాన్ని ప్రేరణగా తీసుకుంటున్నా. టోర్నీలో మ్యాచ్‌లు గెలవడం అంత సులభం కాకపోవచ్చు. నా శక్తి మేరకు కష్టపడుతా" అని చెప్పుకొచ్చాడు.ఇక ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్, ఇటలీ స్టార్ జానిక్ సినర్ మోకాలి గాయంతో వైదొలిగాడు. దీంతో రష్యా స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు టాప్‌సీడ్ దక్కింది. సినర్ లేనప్పటికీ జ్వెరెవ్‌తో పాటు జకోవిచ్ రూపంలో అల్కరాజ్కు గట్టిపోటీ ఎదురుకానుంది. ఇక అల్కరాజ్ సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌ను రోమన్ సఫిఉల్లిన్తో ఆడనున్నాడు. ఇక మిక్స్డ్ డబుల్స్‌లో సెరెనా విలియమ్స్‌తో కలిసి అల్కరాజ్ వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు.గాయంతో ఈ ఏడాది ప్రెంచ్ ఓపెన్‌తో పాటు వింబుల్డన్‌కు దూరమైన అల్కరాజ్.. సీజన్ మొదటి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ను మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఏడో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇక 2025 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. నాటి ఫైనల్లో సినర్‌ను ఓడించిన అల్కరాజ్ రెండోసారి టైటిల్ గెలుచుకున్నాడు.SERENA WILLIAMS AND CARLOS ALCARAZ WIN ON THEIR TEAM DEBUT! 💜 pic.twitter.com/SgNgh7xd2e— US Open Tennis (@usopen) August 25, 2026Read: ‘బాయ్‌కాట్ విషయమే తెలీదు.. అప్పుడు భోజనం చేస్తున్నాం’ -
మెన్సిక్–ముకోవా జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కొత్త జోడీకి తొలిసారి టైటిల్ లభించింది. గురువారం జరిగిన ఫైనల్లో జాకుబ్ మెన్సిక్–కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా అవతరించింది. బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)–ఫ్లావియో కొబోలి (ఇటలీ) ద్వయంతో జరిగిన తుది పోరులో మెన్సిక్–ముకోవా జంట 6–3, 1–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో విజయం సాధించింది.అంతకుముందు సెమీఫైనల్లో మెన్సిక్–ముకోవా 5–4 (8/6), 3–5, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో మిరా ఆండ్రీవా–ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)లపై గెలుపొందారు. సెమీఫైనల్లో మెన్సిక్–ముకోవా రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. విజేత మెన్సిక్–ముకోవా జోడీకి 10 లక్షల డాలర్లు (రూ. 9 కోట్ల 55 లక్షలు), రన్నరప్ బెన్‌చిచ్–కొబోలి జంటకు 5 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లకు కూడా ప్రేక్షకుల భారీ సంఖ్యలో రావాలనే ఉద్దేశంతో యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ అధికారులు గత ఏడాది మిక్స్డ్ డబుల్స్ ఫార్మాట్‌ను మార్చారు. సింగిల్స్ టాప్ స్టార్ ఆటగాళ్లకు కూడా మిక్స్డ్ డబుల్స్ ఆడేందుకు అవకాశం ఇచ్చారు. రెండు రోజుల్లోనే మిక్స్డ్ డబుల్స్ విభాగం మ్యాచ్‌లను ముగించేలా ప్రణాళిక చేశారు. ఈసారి కూడా అదే ఫార్మాట్‌ను కొనసాగించారు. ఈ ఏడాది సింగిల్స్ స్టార్స్ జొకోవిచ్ (సెర్బియా), అల్కరాజ్ (స్పెయిన్), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), కాస్పర్ రూడ్ (నార్వే), రుబ్లెవ్ (రష్యా), ఫెలిక్స్ అగుర్ అలియాసిమ్ (కెనడా)... సబలెంకా (బెలారస్), సెరెనా విలియమ్స్ (అమెరికా), మిరా ఆండ్రీవా, బెన్‌చిచ్, ముకోవాలకు అవకాశం ఇచ్చారు. సింగిల్స్ స్టార్స్‌తోపాటు డబుల్స్‌లో టాప్–10లోపు జోడీలను ఆడించారు. గత ఏడాది మిక్స్డ్ డబుల్స్ విజేత సారా ఎరాని–వావసోరి (ఇటలీ) జోడీ ఈసారి తొలి రౌండ్లోనే ఓడిపోయింది. పురుషుల సింగిల్స్, డబుల్స్... మహిళల సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌లు ఈ ఆదివారం మొదలవుతాయి. -
నగాల్‌కు నిరాశ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత నంబర్‌వన్ ర్యాంకర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 86వ ర్యాంకర్, క్వాలిఫయింగ్ ‘డ్రా’లో టాప్ సీడ్ ప్లేయర్ ఆర్థర్ గియా (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ నగాల్ 3–6, 6–7 (4/7)తో ఓడిపోయాడు. 1 గంట 49 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నగాల్ 12 విన్నర్స్ కొట్టి, 27 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. తాజా ఓటమితో 29 ఏళ్ల నగాల్ ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. గత ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్లో ఓడిన నగాల్ కెరీర్ మొత్తంలో ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగాడు. -
తొలి రౌండ్లోనే ఓడిన జొకోవిచ్–సబలెంకా జోడీ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)–సబలెంకా (బెలారస్) జోడీ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సింగిల్స్‌లో మేటి క్రీడాకారులైన ఈ ఇద్దరు డబుల్స్‌లో సమన్వయంతో ఆడటంలో విఫలమయ్యారు. మహిళల డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ సినియకోవా (చెక్ రిపబ్లిక్)... పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జతగా మిక్స్డ్ డబుల్స్‌లో బరిలోకి దిగారు. తొలి రౌండ్లో సినియకోవా–ప్యాటెన్ ద్వయం 1–4, 4–2, 10–2తో జొకోవిచ్–సబలెంకా జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (అమెరికా) జోడీ ఇరిన్ రూట్లిఫ్ (న్యూజిలాండ్)–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జంటతో ఆడనుంది. -
అల్కరాజ్ పునరాగమనం
న్యూయార్క్: గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరమైన స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ద్వారా అల్కరాజ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘ఇక మొదలు పెడదాం’ అంటూ యూఎస్ ఓపెన్ లోగో ముందు నిల్చున్న ఫొటోను అల్కరాజ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కుడి చేతి గాయం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆటకు దూరమైన అల్కరాజ్... ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకొని యూఎస్ ఓపెన్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. కెరీర్లో ఏడు (ఆ్రస్టేలియా ఓపెన్ 2026; ఫ్రెంచ్ ఓపెన్ 2024, 2025; వింబుల్డన్ 2023, 2024; యూఎస్ ఓపెన్ 2022, 2025) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన అతడు... మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ న్యూయార్క్‌లోనే సాధించాడు. 19 ఏళ్ల వయసులో 2022లో యూఎస్ ఓపెన్ టైటిల్ అందుకున్న అల్కరాజ్ ఆ సమయంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న అతిపిన్న వయసు్కడిగా రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ కాలంగా ఆటకు దూరమైనప్పటికీ అల్కరాజ్ ఇప్పటికీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన ఈ స్పెయిన్ యంగ్‌స్టర్... ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలకు దూరమయ్యాడు. గతేడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో యానిక్ సినెర్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచిన అల్కరాజ్ డిఫెండింగ్ చాంపియన్‌గా సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 13 వరకు యూఎస్ ఓపెన్ జరగనుంది. వైదొలిగిన సినెర్ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ప్రపంచ నంబర్‌వన్, గత ఏడాది రన్నరప్ యానిక్ సినెర్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. గత నెలలో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించిన సినెర్ వింబుల్డన్ టోర్నీ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత గాయపడటంతో యూఎస్ ఓపెన్ సన్నాహక టోర్నీలైన మాంట్రియల్, సిన్సినాటి ఓపెన్ నుంచి సినెర్ తప్పుకున్నాడు. సినెర్ ఈ ఏడాది 44 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడి ఓవరాల్‌గా ఆరు సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
భారీగా యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ.. సింగిల్స్ విజేతకు 52 కోట్లు
టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ మరోసారి భారీగా పెరిగింది. ఓవరాల్ టోర్నీ ప్రైజ్‌మనీ భారత కరెన్సీలో సుమారు రూ. 1,034 కోట్లు (108 మిలియన్ డాలర్లు) కావడం విశేషం. ఇక పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని గతంతో పోలిస్తే 20 శాతం ఎక్కువకు పెంచారు. 2024 నుంచి చూసుకుంటే యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ 44 శాతం అధికం కావడం విశేషం. నిరుడు యూఎస్ ఓపెన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన ప్లేయర్లకు రూ. 43. 86 కోట్లు తీసుకోగా.. ఇక నుంచి విజేతకు రికార్డుస్థాయిలో రూ. 52.66 కోట్లు (5.5 మిలియన్ డాలర్లు) దక్కనుంది. రన్నరప్‌నకు రూ. 26.33 కోట్లు ( లభించనుంది. సెమీఫైనలిస్టులు రూ. 13.82 కోట్లు చొప్పున అందుకోనున్నారు. ఇక క్వార్టర్స్‌లో వెనుదిరిగిన ఆటగాళ్లు రూ. 7.46 కోట్ల చొప్పున అందుకోనున్నారు. సింగిల్స్ మెయిన్ డ్రాకు ఎంపికైన 128 ఆటగాళ్లు రూ. కోటి చొప్పున అందుకోనున్నారు. ఇక పురుషుల, మహిళల, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో చాంపియన్లుగా నిలిచిన జోడీ రూ.9.57 కోట్లు (1 మిలియన్ డాలర్లు), రన్నరప్ జోడీ రూ. 4.78 కోట్లు (5,00,000 డాలర్లు), వీల్‌చైర్ చాంపియన్లు రూ. 99 లక్షల 48 వేలు అందుకోనున్నారు.నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్స్‌లో యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీనే అధికం. సింగిల్స్ విజేతలకిచ్చే ప్రైజ్‌మనీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రూ. 20 కోట్లు, ఫ్రెంచ్ ఓపెన్‌లో రూ. 25 కోట్లు, వింబుల్డన్‌లో రూ. 35 కోట్లుగా ఉంది. ఇక 2026 ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్ ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగనుంది.చదవండి: టీమిండియా, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్ వాయిదా! -
టెన్నిస్‌లో అద్భుతం.. సబలెంకాతో జత కట్టనున్న జకోవిచ్
టెన్నిస్ ఆటలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సెర్బియా దిగ్గజం, 24 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్.. మహిళల ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకాతో కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో జత కట్టనున్నాడు. వీరితో పాటు టోర్నీలో బరిలోకి దిగనున్న 16 జట్ల జాబితాను ప్రకటించారు. గతేడాది యూఎస్ ఓపెన్‌కు ముందే టోర్నీని సమూలంగా మార్చారు. పురుషుల, మహిళల విభాగంలో అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు మిక్స్డ్ డబుల్స్‌లో జతకట్టి ఆడితే ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ అదనంగా ఇస్తామని యూఎస్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ) గతేడాదే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి జకోవిచ్, సబలెంకా కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరితో పాటు 2025లో రన్నరప్‌గా నిలిచిన ఇగా స్వియాటెక్, కాస్పర్ రూడ్ జంటతో పాటు ఎలెనా రైబాకినా-టేలర్ ఫ్రిట్జ్ , నవోమి ఒసాకా-కీ నిషికోరి, జెస్సికా పెగులా-జాక్ డ్రేపర్ మరోసారి బరిలోకి దిగుతున్నారు . ప్రధాన డ్రా ఆగస్టు 25-26 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతుంది. ఆర్థర్ ఆషే స్టేడియం, లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆగస్టు 17 వరకు జట్లు నమోదు చేసుకోవచ్చు. ఆరోజు వరకు అత్యుత్తమ సంయుక్త సింగిల్స్ ర్యాంకింగ్‌లు కలిగిన ఆరు జంటలు ఆటోమేటిక్‌గా మెయిన్ డ్రాలోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన టాప్-10లో ఉన్న జకోవిచ్, సబలెంకా జోడి నేరుగా మెయిన్ డ్రాలో ప్రవేశించనుంది. దీంతో పాటు ఎనిమిది జట్లకు యూఎస్‌టీఏ వైల్డ్ కార్డ్‌లను ఇస్తుంది. మరో రెండు జట్లు ఆగస్టు 24న జరిగే క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ద్వారా ఫైనల్స్‌కు చేరుకుంటాయి. అయితే గతేడాది మిక్సడ్ డబుల్స్ చాంపియన్లుగా నిలిచిన సారా ఎర్రాని, ఆండ్రీ వవస్సోరిలు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లో లేకపోవడంతో ఈ జంట మరోసారి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఎనిమిది జట్లతో కూడిన క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌ను కూడా చేర్చారు, ఇందులో ఆరు జట్లకు నేరుగా ప్రవేశం, రెండు జట్లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. సెమీఫైనల్స్ వరకు, మ్యాచ్‌ల ఫార్మాట్ బెస్ట్-ఆఫ్-త్రీ-సెట్స్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో సెట్లు నాలుగు గేమ్‌లకు, 4-ఆల్ వద్ద టైబ్రేకర్లు, మూడవ సెట్‌కు బదులుగా 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేక్ ఉంటాయి. ఫైనల్ స్టాండర్డ్ స్కోరింగ్ పద్ధతిలో ఉంటుంది, ఇందులో సెట్లు ఆరు గేమ్‌లకు, 6-ఆల్ వద్ద టైబ్రేకర్, అవసరమైతే 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేకర్ ఉంటాయి. Novak Djokovic and Aryna Sabalenka are set to play together in the upcoming US Open mixed doubles 🎾🤝 pic.twitter.com/NVnakqmwGT— BBC Sport (@BBCSport) July 27, 2026Read: సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్? -
రన్నరప్ శ్రీకాంత్
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ 46వ ర్యాంకర్ సు లి యాంగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–16, 9–21తో ఓడిపోయాడు. శ్రీకాంత్‌కు 9,500 డాలర్ల (రూ. 8 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శ్రీకాంత్ చివరిసారి 2017 అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–14, 21–12తో భారత్‌కే చెందిన సనీత్ దయానంద్‌పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో రౌనక్ చౌహాన్ (భారత్) 23–21, 21–16తో శంకర్ ముత్తుస్వామి (భారత్)పై గెలుపొంది ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ తన్వీ శర్మ, ఆరో సీడ్ దేవిక సిహాగ్ కూడా శుభారంభం చేశారు. తన్వీ 23–21, 21–16తో వొన్నె లీ (జర్మనీ)పై... దేవిక 21–14, 21–14తో లూసియా కాస్టిల్లో (పెరూ)పై విజయాలు సాధించారు. మరో మ్యాచ్‌లో రక్షిత శ్రీ 21–15, 21–8తో టెరెజా స్వాబికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి ముందంజ వేసింది. హైదరాబాద్ అమ్మాయి శ్రియాంశి వలిశెట్టి, అన్మోల్, తాన్యా హేమంత్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. -
ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత!
ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మాల్ అండర్సన్ (91) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో సోమవారం తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియా తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా మాల్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. వ్యవసాయక్షేత్రంలోని మట్టికోర్టుపై ప్రాక్టీస్‌ను ఆరంభించిన అండర్సన్ ఆ తర్వాత టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 1957లో యూఎస్ క్రౌన్ టైటిల్ నెగ్గిన అండర్సన్, మూడు డబుల్స్ టైటిల్స్ కూడా సాదించాడు. యునైటెడ్ స్టేట్స్ చాంపియన్‌షిప్ సాధించిన అన్‌సీడెడ్ క్రీడాకారుడిగా అండర్సన్ నిలిచాడు. ఇక ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్‌ను కూడా అండర్సన్ రెండుసార్లు సాధించి చరిత్ర సృష్టించాడు.ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అండర్సన్, ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగిన పాట్ రాఫ్టర్ సహా ఎంతోమంది యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. మాల్ అండర్సన్ మరణంపై పాట్ రాఫ్టర్ స్పందించాడు. మాల్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. నా కెరీర్ ప్రారంభంలో టెన్నిస్‌లో మెళుకువలు తీర్చిదిద్దడంలో మాల్ అండర్సన్ ఎంతగానో సహాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని పాట్ రాఫ్టర్ పేర్కొన్నాడు. -
అల్కరాజ్ ‘సిక్సర్’
న్యూయార్క్: మూడు నెలల వ్యవధిలో మూడోసారి చిరకాల ప్రత్యర్థులు కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సినెర్ (ఇటలీ) మధ్య ‘గ్రాండ్‌స్లామ్ ఫైనల్’ సమరం... ప్రతి పాయింట్‌కూ హోరాహోరీ తప్పదని... ఐదు సెట్ల పోరు ఖాయమని అభిమానులు భావించారు. కానీ అల్కరాజ్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. 2 గంటల 42 నిమిషాల్లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్‌ను 6–2, 3–6, 6–1, 6–4తో ఓడించి రెండోసారి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేత అల్కరాజ్కు 50 లక్షల డాలర్లు (రూ. 44 కోట్ల 11 లక్షలు), రన్నరప్ సినెర్‌కు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 5 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా విజయంతో అల్కరాజ్ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ అందుకున్నాడు. ఇప్పటికే అల్కరాజ్ రెండుసార్లు చొప్పున ఫ్రెంచ్ ఓపెన్ (2024, 2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025) టైటిల్స్ నెగ్గాడు. రెండు బ్రేక్ పాయింట్లతో... ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్లలో సినెర్‌ను ఓడించిన అల్కరాజ్... వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో నాలుగు సెట్లలో సినెర్ చేతిలో ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్ తుదిపోరుపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. అయితే ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన అల్కరాజ్ తొలి గేమ్ నుంచే తన జోరు కనబరిచాడు. రెండో గేమ్‌లో, ఏడో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో సినెర్ పుంజుకున్నాడు. నాలుగో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను గెల్చుకున్నాడు. ఇక మూడో సెట్లో అల్కరాజ్ అసాధారణ ప్రదర్శన ముందు సినెర్ తేలిపోయాడు. 5–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అల్కరాజ్ ఆ తర్వాత ఒక గేమ్ కోల్పోయి సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్ పోటాపోటీగా సాగినా ఐదో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.2 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్ మొదలయ్యాక (1973లో) ఒకే సీజన్లో రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌ను ఓడించిన రెండో ప్లేయర్‌గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు రాఫెల్ నాదల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2008లో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ ఫైనల్స్‌లో నాటి నంబర్‌వన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై గెలిచి విజేతగా నిలిచాడు.2 జాన్ బోర్గ్ (స్వీడన్ –7 టైటిల్స్) తర్వాత 23 ఏళ్ల లోపే ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా అల్కరాజ్ (22 ఏళ్ల 111 రోజులు) నిలిచాడు.1 మూడు వేర్వేరు కోర్టులపై (హార్డ్, క్లే, గ్రాస్) రెండుసార్లు చొప్పున గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతిపిన్న వయస్కుడిగా అల్కరాజ్ గుర్తింపు పొందాడు.6 అల్కరాజ్ కెరీర్లో నెగ్గిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్. ఓపెన్ శకంలో (1968 నుంచి) కనీసం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడా కారుల జాబితాలో స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), బోరిస్ బెకర్ (జర్మనీ) సరసన అల్కరాజ్ చేరాడు. ఈ జాబితాలో జొకోవిచ్ (24), నాదల్ (22), ఫెడరర్ (20), సంప్రాస్ (14), జాన్ బోర్గ్ (11), జిమ్మీ కానర్స్, ఇవాన్ లెండిల్, అగస్సీ (8 చొప్పున), విలాండర్, జాన్ మెకన్రో (7 చొప్పున) ముందున్నారు. -
యూఎస్ ఓపెన్ విజేత అల్కరాజ్.. అరుదైన ఘనత
స్పానిష్ యువ సంచలనం కార్లోస్ ఆల్కరాజ్ 2025 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన జానిక్ సినర్‌ను 6–2, 3–6, 6–1, 6–4 తేడాతో ఓడించి, రెండో యూఎస్ ఓపెన్‌ను (2022, 2025), ఓవరాల్‌గా ఆరో గ్రాండ్‌స్లామ్‌ను (2022 యూఎస్ ఓపెన్, 2023 వింబుల్డన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, 2025 ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) సొంతం చేసుకున్నాడు.ఈ గెలుపుతో అల్కరాజ్ నంబర్ వన్ స్థానాన్ని కూడా తిరిగి దక్కించకున్నాడు. అల్కరాజ్ 23 ఏళ్ల వయసులోనే మూడు వేర్వేరు సర్ఫేస్‌లపై (క్లే, గ్రాస్, హార్డ్కోర్ట్) బహుళ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. అల్కరాజ్, సినర్ ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో తలపడ్డాడు. ఇందులో సినర్ వింబుల్డన్ విజేతగా నిలువగా.. అల్కరాజ్ మిగతా రెండు (ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) గెలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్థర్ ఆష్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అల్కరాజ్ తన అద్భుతమైన ఫుట్‌వర్క్, శక్తివంతమైన ఫోర్హ్యాండ్స్తో సినర్‌ను కట్టడి చేశాడు. ఆట ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన అల్కరాజ్ తొలి సెట్ గెలిచి, రెండో సెట్ కోల్పోయినప్పటికీ.. తిరిగి పుంజుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఫస్ట్-సర్వ్ అద్భుతంగా ఉండింది. ఇందులో అతను 83 శాతం విజయవంతమయ్యాడు. ఇదే అతని ఆటకు స్థిరతనిచ్చింది. మ్యాచ్ ఆధ్యాంతం అల్కరాజ్ ఫోర్‌హ్యాండ్ వేగం 100mph పైబడి ఉండింది. ఈ శక్తివంతమైన షాట్లే సినర్‌ను వెనక్కి నెట్టాయి. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ అసమాన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు. కీలక పాయింట్లలో ఒత్తిడిని ఎదుర్కొని, క్లచ్ షాట్లతో మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు.సినర్ విషయానికొస్తే.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, రెండో సెట్లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సినర్ బేస్‌లైన్ కంట్రోల్ బాగా ఉండింది. ర్యాలీల్లో స్థిరత్వాన్ని ప్రదర్శించాడు. అన్ ఫోర్స్డ్ ఎర్రర్లు తక్కువగా ఉన్నాయి. ఫుట్‌వర్క్, బ్యాక్ హ్యాండ్ ఎగ్జిక్యూషన్ బాగానే ఉన్నాయి.అయితే సర్వీస్‌లో లోపాలు అతని కొంపముంచాయి. సినర్ ఫస్ట్-సర్వ్ విజయశాతం కేవలం 48 శాతంగా ఉంది. అలాగే సినర్ అల్కరాజ్కు బ్రేక్ అవకాశాలు చాలా ఇచ్చాడు. అతని ఆటకు తగిన విధంగా స్పందించలేకపోయాడు. మూడో సెట్ కోల్పోవడం సినర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఓవరాల్‌గా చూస్తే ఈ మ్యాచ్‌లో సినర్ అల్కరాజ్తో పోటీలో వెనుకపడ్డాడు. -
యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సబలెంకా
బెలారస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ అరినా సబలెంకా వరుసగా రెండో ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఆమె అమెరికాకు చెందిన అమండ అనిసిమోవాను వరుస సెట్లలో (6–3, 7–6(3)) ఓడించింది. 94 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సబలెంక 13 విన్నర్లు కొట్టి, 15 అన్ఫోర్స్డ్ ఎర్రర్లు మాత్రమే చేసింది. అనిసిమోవా 29 అన్ఫోర్స్డ్ ఎర్రర్లు, 7 డబుల్ ఫాల్ట్స్ చేసి తడబడింది.ఈ మ్యాచ్‌లో సబలెంక తన శక్తివంతమైన సర్వ్‌లు, ఖచ్చితమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో అనిసిమోవాను కట్టడి చేసింది. రెండో సెట్ టైబ్రేక్‌కి వెళ్లినా, ఆమె మానసిక స్థైర్యాన్ని చూపించి విజయం సాధించింది.సబలెంకకు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. అన్ని టైటిళ్లను ఆమె హార్డ్కోర్ట్లపైనే సాధించింది. దీంతో ఆమెకు హార్డ్కోర్డ్ల రాణిగా గుర్తింపు వచ్చింది. సబలెంక 2023, 2024లో వరుసగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు సాధించి.. 2024, 2025లో వరుసగా యూఎస్ ఓపెన్‌ను గెలిచింది. వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు సాధించడంతో సబలెంక సెరీనా విలియమ్స్ సరసన చేరింది. సెరీనా కూడా గతంలో వరుసగా రెండు ఎడిషన్లలో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది.టైటిల్ గెలిచిన అనంతరం సబలెంక మాట్లాడుతూ.. ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం. నా దేశానికి, అభిమానులకు ఈ విజయం అంకితమని తెలిపింది. తాజా విజయంతో సబలెంక 100 గ్రాండ్ స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన రెండో మహిళగానూ గుర్తింపు పొందింది. సబలెంక ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరి కోకో గాఫ్ చేతిలో పరాజయంపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. -
సినెర్ X అల్కరాజ్
పురుషుల టెన్నిస్‌లో అసాధారణంగా సాగుతున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్ల వైరం మరో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరింది. వరల్డ్ నంబర్ 1 యానిక్ సినెర్, నంబర్ 2 కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌లో తుది పోరుకు అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన తొలి సెమీస్‌లో దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను అల్కరాజ్ అలవోకగాఓడించగా... మరో సెమీస్‌లో ఆగర్ అలియసిమ్పై సినెర్ విజయం సాధించాడు. ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ సినెర్, అల్కరాజ్‌ల మధ్యనే జరుగుతుండటం విశేషం. న్యూయార్క్: క్లే కోర్టు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ గెలుపు... గ్రాస్ కోర్టు వింబుల్డన్ ఫైనల్లో విజేత సినెర్... ఇప్పుడు హార్డ్ కోర్ట్‌లో చాంపియన్ ఎవరో నేడు తేలనుంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ (ఇటలీ), అల్కరాజ్ (స్పెయిన్) ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్లో అల్కరాజ్ 6–4, 7–6 (7/4), 6–2తో జొకోవిచ్ (సెర్బియా)పై ఘన విజయం సాధించాడు. 2 గంట 23 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో అల్కరాజ్ ముందు 38 ఏళ్ల జొకోవిచ్ నిలవలేకపోయాడు. 31 విన్నర్లు కొట్టిన అల్కరాజ్ 7 ఏస్‌లు సంధించాడు. రెండో సెమీ ఫైనల్లో సినెర్ 6–1, 3–6, 6–3, 6–4తో 25వ సీడ్ అలియసిమ్ (కెనడా)ను ఓడించాడు. 3 గంటల 21 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అలియసిమ్ గట్టి పోటీనిస్తూ ఒక సెట్ గెలవడంలో సఫలమైనా...చివరకు సినెర్దే పైచేయి అయింది. సినెర్ 11 ఏస్‌లు కొట్టగా, ఆగర్ 9 ఏస్‌లు బాదాడు. నువ్వా, నేనా... పురుషుల టెన్నిస్‌ను 24 ఏళ్ల సినెర్, 22 ఏళ్ల అల్కరాజ్ శాసిస్తున్నారు. ఓపెన్ ఎరా చరిత్రలో ఒకే సీజన్లో మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఫైనల్‌కు చేరిన తొలి జోడీగా వీరిద్దరు గుర్తింపు పొందారు. గత తొమ్మిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో ఎనిమిదింటిని వీరిద్దరే పంచుకున్నారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల మధ్య 14 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో అల్కరాజ్ 9–5తో ముందంజలో ఉన్నాడు. యూఎస్ ఓపెన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే 2022 క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరు తలపడ్డారు. ఏకంగా రికార్డు స్థాయిలో 5 గంటల 15 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ గెలిచాడు. నాటినుంచే గ్రాండ్‌స్లామ్‌లో ఇద్దరి వైరం మొదలైంది. తాజా ఫామ్‌ను చూసుకుంటే 2025లో రెండు గ్రాండ్‌స్లామ్‌లు (ఆ్రస్టేలియన్ ఓపెన్, వింబుల్డన్) సినెర్ ఖాతాలో చేరగా, ఫ్రెంచ్ ఓపెన్‌ను అల్కరాజ్ గెలుచుకున్నాడఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. సినెర్ వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌లోనూ ఫైనల్ చేరిన ఘనతను నమోదు చేశాడు. రాడ్ లేవర్, ఫెడరర్ (3 సార్లు), జొకోవిచ్ (3 సార్లు) తర్వాత ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా సినెర్ నిలిచాడు. ప్రస్తుత టోర్నీలో అల్కరాజ్ పూర్తి స్థాయిలో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించగా...సినెర్ సెమీస్‌లో గాయంతో కాస్త తడబడ్డాడు. అతను పూర్తి ఫిట్‌గా ఉంటే మరో అద్భుత పోరును చూడొచ్చు.మళ్లీ వస్తా: జొకోవిచ్25వ గ్రాండ్‌స్లామ్ సాధించేందుకు పట్టు వదలకుండా పోరాడుతున్న దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సెమీస్‌లో అల్కరాజ్ ముందు 38 ఏళ్ల జొకోవిచ్ నిలవలేకపోయాడు. 2025 సీజన్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలోనూ సెమీ ఫైనల్ వరకు వచ్చిన సెర్బియా స్టార్ ఆట అక్కడే ముగిసింది. సెమీస్‌లలో వరుసగా జ్వెరెవ్, సినెర్ (2 సార్లు), అల్కరాజ్ చేతుల్లో అతను ఓడాడు. అయితే తాను ఇంకా ఆశలు కోల్పోలేదని, పోరాటం ఆపనని అతను స్పష్టం చేశాడు. ‘గ్రాండ్‌స్లామ్‌ల వేటలో నేను ఆగిపోవడం లేదు. కనీసం మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసమైనా నా పోరాటం కొనసాగిస్తాను. ఇది కష్టమైన పని అని అందరికీ తెలుసు. సెమీస్‌లో తొలి రెండు సెట్ల వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నాలో సత్తువ తగ్గిపోయింది. తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్న ఒక కుర్రాడితో తలపడుతున్నప్పుడు ఈ వయసులో అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా సరైంది కాదు. సినెర్, అల్కరాజ్ లాంటి ప్లేయర్లతో 5 సెట్లు ఆడటం కష్టంగా మారిపోయింది. అయితే ఈ పోటీని నేను ఇష్టపడుతున్నా. మైదానంలో అభిమానుల మద్దతు, ఆ ఉత్సాహం వల్లే నేను ఇంకా ఆడగలుగుతున్నా’ అని జొకోవిచ్ చెప్పాడు. -
సబలెంకా X అనిసిమోవా
న్యూయార్క్: కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించేందుకు సబలెంకా (బెలారస్)... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకునేందుకు అమండ అనిసిమోవా (అమెరికా) ఒక్క విజయం దూరంలో ఉన్నారు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సబలెంకా, అనిసిమోవా ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా 4–6, 6–3, 6–4తో నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై నెగ్గగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అనిసిమోవా 6–7 (4/7), 7–6 (7/3), 6–3తో నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత, ప్రపంచ 24వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్)లపై విజయం సాధించారు. సబలెంకా, అనిసిమోవా మధ్య ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి గం. 1:30 నుంచి జరుగుతుంది. ముఖాముఖి రికార్డులో అనిసిమోవా 6–3తో సబలెంకాపై ఆధిక్యంలో ఉంది. 27 ఏళ్ల సబలెంకా తన కెరీర్లో ఇప్పటి వరకు మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్), యూఎస్ ఓపెన్ (2024) సాధించి... మూడుసార్లు రన్నరప్‌గా (2025 ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్; 2023 యూఎస్ ఓపెన్) నిలిచింది. మరోవైపు అనిసిమోవా తన కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే ఫైనల్ (ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ) చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గత ఏడాది జెస్సికాను ఓడించి యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా ఈసారి సెమీఫైనల్లోనే అమెరికా ప్లేయర్ ఆట కట్టించింది. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్‌ను కోల్పోయినా కంగారు పడలేదు. పట్టుదలతో ఆడి ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఎనిమిది ఏస్‌లు సంధించిన ఈ బెలారస్ స్టార్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు నెగ్గిన సబలెంకా 43 విన్నర్స్ కొట్టింది. మరోవైపు జెస్సికా మూడు ఏస్‌లు కొట్టి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 15 అనవసర తప్పిదాలు చేసింది. నయోమి ఒసాకాతో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అనిసిమోవా ఏడు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 50 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా 45 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ఒసాకా 15 ఏస్‌లు సంధించినా, కేవలం 32 విన్నర్స్‌తో సరిపెట్టుకుంది. 2 యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండు సెమీఫైనల్స్ విజేతలు తొలి సెట్‌ను కోల్పోయి నెగ్గడం ఇది రెండోసారి మాత్రమే. 1993లో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) 4–6, 6–1, 6–0తో మలీవా (స్విట్జర్లాండ్)పై; హెలెనా సుకోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (7/9), 7–5, 6–2తో అరంటా శాంచెజ్ వికారియో (స్పెయిన్)పై గెలిచారు. -
ఇక ట్రోఫీ కూడా సరితూగేలా...
న్యూయార్క్: కొన్నాళ్ల కిందట గ్రాండ్‌స్లామ్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని సమం చేసిన నిర్వాహకులు ట్రోఫీల్లో మాత్రం అంతరాలు చూపుతున్నారు. కానీ ఇకమీదట సమానత్వం పాటించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కొన్ని మార్పులతో జరుగుతున్న సంగతి తెలిసిందే. సింగిల్స్ స్పెషలిస్టులు, టాప్‌స్టార్లతో మిక్స్డ్ డబుల్స్ నిర్వహించారు. ఇప్పుడు మహిళల సింగిల్స్ విజేతకు ఇచ్చే ట్రోఫీని కూడా పురుషుల సింగిల్స్ విజేతకు దీటుగా ప్రదానం చేయనున్నారు. దీంతో మహిళలకు ‘మినియేచర్’ (చిన్న పరిమాణంలో) ట్రోఫీలనే విమర్శలకు ఈ యూఎస్ ఓపెన్‌తో తెరపడనుంది. రోలాండ్ గారోస్‌లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అమెరికన్ స్టార్ కోకో గాఫ్ తాను అందుకున్న ట్రోఫీపై ఓ టిక్‌టాక్ రీల్ కూడా చేసింది. వివక్షాపూరితమైన ట్రోఫీ సైజ్ వీడియోను ఏకంగా 20 లక్షలకు పైగా వీక్షించారు. వ్యంగ్యంగా ఆమె పెట్టిన వీడియోకు అప్పట్లో లక్షల్లో లైక్‌లు వచ్చాయి. ఒకే టోర్నీ... ఒకే వేదిక... ఒకే ఈవెంట్ (సింగిల్స్)... అయినప్పుడు ట్రోఫీల్లో వ్యత్యాసమేంటనే చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విజేతకు ఇచ్చే ట్రోఫీతో ఆ లింగ వివక్ష ట్రోఫీకి కాలం చెల్లనుంది. వైరల్ వీడియోతో వార్తల్లో నిలిచిన కోకో గాఫ్ ఇప్పుడు ట్రోఫీ పరిమాణం సమానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సాధారణంగా పురుషుల ట్రోఫీతో పోల్చితే ఏడున్నర అంగుళాలు చిన్నగా ఉండే మహిళల ట్రోఫీ ఇకపై సరితూడే సమానం అయ్యింది. దీనిపై యూఎస్ ఓపెన్ నిర్వాహకులు గర్వంగా ప్రకటించుకున్నారు. లింగ సమానత్వం మా డీఎన్ఏలోనే ఉందని టోర్నీ డైరెక్టర్ స్టేసీ అలెస్టెర్ చెప్పుకొచ్చారు. -
అనిసిమోవా అదరహో
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో అమెరికా స్టార్, ఎనిమిదో సీడ్ అమండ అనిసిమోవా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–4, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను ఓడించిది. ఈ గెలుపుతో... గత జూలై 12న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో ఒక్క గేమ్ కూడా నెగ్గకుండా 0–6, 0–6తో స్వియాటెక్ చేతిలో ఎదురైన దారుణ ఓటమికి అనిసిమోవా బదులు తీర్చుకుంది. ‘వింబుల్డన్ ఫైనల్లో ఘోర పరాజయం తర్వాత పుంజుకొని స్వియాటెక్‌పై నెగ్గడం నాకెంతో ప్రత్యేకం. ఆ ఓటమి నుంచి తేరుకోవడానికి నేను చాలా శ్రమించాను. నా కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు లభించినందుకు ఆనందంగా ఉంది’ అని తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన అనిసిమోవా వ్యాఖ్యానించింది. స్వియాటెక్‌తో 96 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, స్వియాటెక్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 23 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా 12 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ మూడు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 15 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఫైనల్లో చోటు కోసం నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నయోమి ఒసాకా (జపాన్)తో అనిసిమోవా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 23వ సీడ్ ఒసాకా 6–4, 7–6 (7/3)తో 11వ ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. సినెర్ దూకుడు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఇటలీకే చెందిన 10వ సీడ్ ముసెట్టితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–1, 6–4, 6–2తో నెగ్గాడు. సినెర్ పది ఏస్‌లు సంధించడంతోపాటు ముసెట్టి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో 25వ సీడ్ ఫెలిక్స్ (కెనడా) 4–6, 7–6 (9/7), 7–5, 7–6 (7/4)తో ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
జొకోవిచ్ జైత్రయాత్ర
న్యూయార్క్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్... యూఎస్ ఓపెన్‌లో తన విజయపరంపరను కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 6–3, 7–5, 3–6, 6–4తో గత ఏడాది రన్నరప్, ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. టేలర్ ఫ్రిట్జ్‌తో ఇప్పటి వరకు ఆడిన 11 సార్లూ జొకోవిచే నెగ్గడం విశేషం. ఫ్రిట్జ్‌తో 3 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ పది ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 22 సార్లు పాయింట్లు గెలిచాడు. 33 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 40 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకున్న జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ 12 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 42 అనవసర తప్పిదాలు చేశాడు. ఫ్రిట్జ్‌పై గెలుపుతో జొకోవిచ్ కెరీర్లో 53వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకున్నాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు సెమీఫైనల్‌కు చేరిన ప్లేయర్‌గానూ జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. 19వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ 14వ సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టి జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. యూఎస్ ఓపెన్‌లో నాలుగుసార్లు చాంపియన్‌గా, ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్ ఈ టోర్నీలో 11వ వసారి ఫైనల్ చేరుకోవాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. సెమీఫైనల్ పోరులో రెండో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 5–3తో అల్కరాజ్పై ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఈ టోర్నీలో అల్కరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా అల్కరాజ్ సెమీఫైనల్ చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 6–2, 6–4తో 20వ ర్యాంకర్ జిరీ లెహెస్కా(చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. సబలెంకాకు ‘వాకోవర్’ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) వరుసగా ఐదో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా ప్రత్యర్థి, 2023 వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ‘వాకోవర్’తో సబలెంకా సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో 45 ఏళ్ల వీనస్ విలియమ్స్ (అమెరికా)–లేలా ఫెర్నాండెజ్ (కెనడా) ద్వయం 1–6, 2–6తో టాప్ సీడ్ టేలర్ టౌన్సెండ్ (అమెరికా)–సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. 1997 తర్వాత యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో టాప్–4 సీడింగ్ జోడీలు సెమీఫైనల్ చేరుకోవడం విశేషం.1 అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్న ప్లేయర్‌గా జొకోవిచ్ (53 సార్లు) రికార్డు సృష్టించాడు. అమెరికా మహిళా స్టార్ క్రిస్ ఎవర్ట్ (52 సార్లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సవరించాడు.14 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకోవడం జొకోవిచ్‌కిది 14వ సారి. ఈ టోర్నీలో అత్యధికసార్లు సెమీఫైనల్ చేరుకున్న జిమ్మీ కానర్స్ (అమెరికా; 14 సార్లు) రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. 7 ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ సెమీఫైనల్ చేరుకోవడం జొకోవిచ్‌కిది ఏడోసారి కావడం విశేషం. అంతేకాకుండా ఒకే సీజన్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగానూ జొకోవిచ్ (38 ఏళ్ల 94 రోజులు) గుర్తింపు పొందాడు. -
సెమీస్‌లో జెస్సికా
న్యూయార్క్: సొంతగడ్డపై తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా ఆ దిశగా మరో అడుగు వేసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జెస్సికా 6–3, 6–3తో ప్రపంచ 62వ ర్యాంకర్, 2021 ఫ్రెంచ్ ఓపెన్, 2024 వింబుల్డన్ టోర్నీ విజేత బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్ జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి పదిసార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు క్రెజికోవా ఏకంగా ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 24 అనవసర తప్పిదాలు చేసింది. కోకో గాఫ్ అవుట్ మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన కోకో గాఫ్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నయోమి ఒసాకా (జపాన్) 6–3, 6–2తో 2023 చాంపియన్ కోకో గాఫ్‌ను ఓడించింది. తద్వారా 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఒసాకా మరోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–3, 6–1తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–7 (0/7), 6–2తో మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)పై, ఎనిమిదో సీడ్ అమండ అనిసిమోవా (అమెరికా) 6–0, 6–3తో బీట్రిజ్ హదద్ మాయ (బ్రెజిల్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సూపర్ సినెర్... పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సినెర్ కేవలం మూడు గేమ్‌లు కోల్పోయాడు. 81 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సినెర్ 6–1, 6–1, 6–1తో బుబ్లిక్‌ను ఓడించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫెలిక్స్ అలియాసిమ్ (కెనడా) 7–5, 6–3, 6–4తో 15వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–0, 6–1తో మునార్ (స్పెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
చరిత్ర సృష్టించిన జొకోవిచ్
టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా అవతరించేందుకు ప్రయత్నిస్తున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు ముందుకు వేశాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఈ మాజీ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గత ఏడాది మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన ఏడో సీడ్ ఈసారి మాత్రం సాధికారిక ఆటతో టైటిల్‌పై గురి పెట్టాడు.గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో ఓవరాల్‌గా 64వ సారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించిన జొకోవిచ్... యూఎస్ ఓపెన్‌లో 14వ సారి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో 38 ఏళ్ల జొకోవిచ్ ఒకే ఏడాది అన్ని గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కనీసం క్వార్టర్ ఫైనల్ చేరిన అతి పెద్ద వయస్కుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. న్యూయార్క్: కెరీర్లో 19వ సారి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ దూసుకెళ్తున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 1 గంట 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 12 ఏస్‌లతో అదరగొట్టిన జొకోవిచ్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం.నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చిన అతను 15 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకున్న మాజీ చాంపియన్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 33 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ కేవలం 20 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు జాన్ లెనార్డ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలతో డీలా పడ్డాడు. ‘ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. ఇదే జోరును మున్ముందు కొనసాగిస్తానని నమ్మకంతో ఉన్నా’ అని నాలుగుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించి, ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్ వ్యాఖ్యానించాడు.ఇక క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్, గత ఏడాది రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో జొకోవిచ్ తలపడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ 6–4, 6–3, 6–3తో టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అల్కరాజ్ 7–6 (7/3), 6–3, 6–4తో ఆర్థర్ రిండర్నీచ్ (ఫ్రాన్స్)పై, డిమినార్ 6–3, 6–2, 6–1తో లియాండ్రో రీడి (స్విట్జర్లాండ్)పై నెగ్గారు. రిబాకినాకు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ప్రపంచ 60వ ర్యాంకర్, 2023 వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 5–7, 6–2తో 2022 వింబుల్డన్ విజేత, ప్రపంచ 10వ ర్యాంకర్ రిబాకినాను ఓడించి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 1 గంట 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొండ్రుసోవా 13 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్), బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సబలెంకా 6–1, 6–4తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై, క్రెజికోవా 1–6, 7–6 (15/13), 6–3తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)పై గెలుపొందారు. టౌన్సెండ్తో జరిగిన మ్యాచ్‌లో క్రెజికోవా రెండో సెట్లో ఏకంగా 8 మ్యాచ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కడం విశేషం. క్వార్టర్ ఫైనల్స్‌లో వొండ్రుసోవాతో సబలెంకా; క్రెజికోవాతో జెస్సికా పెగూలా (అమెరికా) తలపడతారు. -
కుబేరుడి ‘చిల్లర’ చేష్టలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చిల్లర చేష్టలకు దిగాడు. ఓ చిన్నారి అపురూపంగా భావించిన కానుకను హఠాత్తుగా లాగేసుకున్నాడు. పాపం.. దాని కోసం ఆ చిన్నారి ఆయన్ని బతిమిలాడుకోవడమూ వీడియో రూపేణా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో ఆ కుబేరుడిని నెటిజన్లు తెగ తిట్టిపోస్తున్నారు. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో జరిగిన ఓ ఘటన.. నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలాండ్ టెన్నిస్ ప్లేయర్ కామిల్ మజ్చ్‌శాక్ (Kamil Majchrzak) తన గెలుపు అనంతరం అక్కడున్న అభిమానులతో సందడి చేశాడు. ఆ సమయంలో ఓ చిన్నపిల్లాడికి క్యాప్ ఇవ్వబోయాడు. అయితే.. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ క్యాప్‌ను లాగేసుకుని తన పక్కనే ఉన్న మహిళ బ్యాగులో దాచేశాడు. ఆ పిల్లాడు ఆ క్యాప్ కోసం బతిమాలినా పట్టించుకోలేదు. పైగా తన చేతిలో ఉన్న పెన్నును మాత్రం ఆ పిల్లాడికి అప్పజెప్పాడు. దీంతో ఆ చిన్నారి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. I wonder if this douche canoe grown man at the U.S. Open is worried that he will be recognized after he snatched a hat away from the boy on his left? pic.twitter.com/Q48ATFDoT7— Brick Suit (@Brick_Suit) August 29, 2025దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ చిన్నారి చేతుల్లోంచి క్యాప్‌ను లాగేసుకున్న వ్యక్తిని.. పోలాండ్‌కు చెందిన డ్రాగ్బ్రుక్ కంపెనీ CEO పియోటర్ షెరెక్ (Piotr Szczerek)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మజ్చ్‌శాక్ స్పందనఈ వివాదంపై కామిల్ మజ్చ్‌శాక్ స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా ఆ చిన్నపిల్లాడిని వెతికి.. అతనికి కొత్తగా సంతకం చేసిన క్యాప్‌తో పాటు ఇతర టెన్నిస్ గిఫ్ట్స్ కూడా అందించారు. ‘‘ఈ క్యాప్ గుర్తుందా?’’ అని మజ్చ్‌శాక్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.విమర్శల తరుణంలో.. షెరెక్ సోషల్ మీడియా ఖాతాలు డీయాక్టివేట్ అయినప్పటికీ.. ఆయన పేరుతో గోవర్క్ఫోరం(Gowork) నుంచి ఒక ప్రకటన వైరల్ అవుతోంది. లైఫ్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్.. అనే తత్వాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది కేవలం ఒక టోపీ మాత్రమే. అంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అలాగే, తనపై దూషణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే అది ఆయన నుంచి వెలువడిన ప్రకటనేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అయితే.. టోపీ వివాదం(Cap Controversy) దెబ్బకు షెరెస్ సీఈవోగా పని చేస్తున్న డ్రాగ్బ్రుక్ కంపెనీకి పెద్ద దెబ్బే పడింది. ఓ ఉద్యోగ రివ్యూ ఫోరంలో వేలాది మంది కంపెనీకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. కంపెనీ సేవలను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చారు. దీంతో షేర్ వాల్యూ గణనీయంగా పడిపోయి.. కంపెనీకి భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికా ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బైరోన్ అదే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగిణితో క్రిస్ మార్టిన్ కోల్డ్‌ప్లే షోలో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కంపెనీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనకు భారీ ప్యాకేజీ ఇచ్చి వదిలించుకుంది కంపెనీ. అయితే ఆ మహిళా ఉద్యోగిణిని మాత్రం లాంగ్ లీవ్‌లో పంపించేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఎఫైర్ ఆయన వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. -
క్వార్టర్స్‌లో జెస్సికా
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ జెస్సికా పెగూలా (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జెస్సికా 6–1, 6–2తో అమెరికాకే చెందిన ప్రపంచ 58వ ర్యాంకర్ ఆన్ లీపై గెలుపొందింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జెస్సికా రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. నెట్ వద్దకు 15 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టిన ఆమె 12 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్లో స్వియాటెక్ 7–6 (7/2), 6–4తో కలిన్స్కాయ (రష్యా)పై నెగ్గింది. జ్వెరెవ్‌కు చుక్కెదురు పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో జ్వెరెవ్ 6–4, 6–7 (7/9), 4–6, 4–6తో ఫెలిక్స్ అలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆ్రస్టేలియా), పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్లో సినెర్ 5–7, 6–4, 6–3, 6–3తో షపోవలోవ్ (కెనడా)పై గెలిచాడు. యూకీ జోడీ బోణీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో యూకీ–వీనస్ 6–0, 6–3తో గిరోన్–లెర్నర్ టియెన్ (అమెరికా)లపై గెలిచారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్, సబలెంకా
న్యూయార్క్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆశిస్తున్న సెర్బియా దిగ్గజ క్రీడాకారులు నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ జొకోవిచ్ 6–4, 6–7 (4/7), 6–2, 6–3తో కామెరాన్ నోరీ (యూకే)పై విజయం సాధించాడు. ప్రపంచ 35వ ర్యాంకర్ నోరీనుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా...చివరకు జొకోవిచ్ పైచేయి సాధించాడు. మ్యాచ్ మధ్యలో వెన్నునొప్పితో కొంత ఇబ్బంది పడిన జొకోవిచ్ 1991 (జిమ్మీ కానర్స్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన అతి పెద్ద (38) వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 2 గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకో 18 ఏస్‌లు సంధించడం విశేషం. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ కూడా ప్రిక్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్లో ఫ్రిట్జ్ 7–6 (7/3), 6–7 (9/11), 6–4, 6–4తో జెరోమ్ కిమ్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో లోరెంజో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–2, 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఫ్లావియో కొబొలి (ఇటలీ) గాయంతో తప్పుకోవడంతో ముసెట్టి నాలుగో రౌండ్లోకి అడుగు పెట్టాడు. పావొలిని పరాజయం... మహిళల విభాగంలో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్లో 6–3, 7–6 (7/2)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)ను ఓడించి సబలెంకా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. నాలుగో సీడ్ పెగులా (యూఎస్) కూడా 6–1, 7–5తో అజరెంకా (రష్యా)ను చిత్తు చేసి ముందంజ వేసింది. వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/4), 6–1తో ఏడో సీడ్ పావొలిని (ఇటలీ)పై సంచలన విజయం సాధించి నాలుగో రౌండ్లోకి అడుగు పెట్టింది. మూడో సీడ్, అమెరికాకు చెందిన కోకో గాఫ్ కూడా ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. మూడో రౌండ్లో గాఫ్ 6–3, 6–1 స్కోరుతో మాగ్దలీనా ఫ్రెంచ్ను చిత్తు చేసింది.పురుషుల డబుల్స్‌లో భారత జోడి అనిరుధ్ చంద్రశేఖర్ – విజయ్ ప్రశాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌లో చంద్రశేఖర్ – ప్రశాంత్ 3–6, 6–3, 6–4 స్కోరుతో అమెరికా ద్వయం, ఎనిమిదో సీడ్ హారిసన్ – కింగ్‌పై విజయం సాధించారు. అయితే మరో భారత జోడీ ఎన్.బాలాజీ – రిత్విక్ బొల్లిపల్లికి మొదటి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. వాసిల్ కిర్కోవ్ (అమెరికా) – బార్త్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) ద్వయం 3–6, 7–6 (10/8), 6–4 తేడాతో బాలాజీ – రిత్విక్‌ను ఓడించింది. -
సబలెంకా ముందుకు...
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/4), 6–2తో పొలీనా కుదెర్మెటోవా (రష్యా)పై విజయం సాధించింది. 96 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు నాలుగుసార్లు దూసుకొచ్చి రెండుసార్లు పాయింట్లు గెలిచింది. 18 విన్నర్స్ కొట్టిన ఆమె 22 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన ఈ బెలారస్ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సుజాన్ లామెన్స్ (నెదర్లాండ్స్)తో 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ 6–1, 4–6, 6–4తో కష్టపడి గెలిచింది. పెగూలా 6–1, 6–3తో బ్లింకోవా (రష్యా)పై, రాడుకాను 6–2, 6–1తో జానైస్ జెన్ (ఇండోనేసియా)పై, పావోలిని 6–3, 6–3తో ఇవా జోవిక్ (అమెరికా)పై విజయం సాధించారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–1, 6–3తో పొటపోవా (రష్యా)పై, పదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) 6–2, 6–1తో మెక్నాలీ (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 7–6 (9/7)తో తెరెజా వాలెన్టోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొంది మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 16వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) 3–6, 3–6తో ఆన్ లీ (అమెరికా) చేతిలో, 17వ సీడ్ సమ్సోనోవా (రష్యా) 6–4, 3–6, 2–6తో ప్రిసిల్లా హాన్ (ఆ్రస్టేలియా) చేతిలో, 25వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాతి్వయా) 5–7, 1–6తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. 11వ సీడ్ రూనె ఓటమి పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), మాజీ విజేత జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లోకి ప్రవేశించగా... 11వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అల్కరాజ్ 6–1, 6–0, 6–3తో మటియా బెలూచి (ఇటలీ)పై, జొకోవిచ్ 6–7 (5/7), 6–3, 6–3, 6–1తో జచారీ వజ్దా (అమెరికా)పై గెలుపొందారు. రూనె 6–7 (5/7), 6–2, 3–6, 6–4, 5–7తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 4–6, 7–6 (7/3), 6–2, 6–4తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై, ఆరో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 6–4, 6–2, 6–4తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–4, 6–0, 6–2తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించారు. -
US Open 2025: అమెరికా స్టార్‌పై జాత్యహంకర వ్యాఖ్యలు..!? వీడియో వైరల్
యూఎస్ ఓపెన్-2025లో జాత్యహంకార వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అమెరికా క్రీడాకారిణి టేలర్ టౌన్సెండ్, లాట్వియన్ టెన్నిస్ స్టార్ జెలెనా ఒస్టాపెంకో మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఆగస్టు 27(బుధవారం) టౌన్సెండ్, ఒస్టాపెంకో తలపడ్డారు. ఈ రెండో రౌండ్ మ్యాచ్‌లో 25వ సీడ్ ఒస్టాపెంకోను 7-5, 6-1 తేడాతో టౌన్సెండ్ ఓడించింది.అయితే 2017 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ అయిన ఒస్టాపెంకో.. టౌన్సెండ్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. దీంతో మ్యాచ్ ముగిసినంతరం హ్యాండ్ షేక్ చేసే సమయంలో టౌన్‌సెండ్‌పై వేలు చూపిస్తూ ఒస్టాపెంకో జాత్యహంకర వ్యాఖ్యలు చేసింది. నీకు ఒక స్దాయి లేదు, సరైన చదువు లేదని తనను దూషించినట్లు టౌన్సెండ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హద్దులు మీరిన జెలెనా.."ఒక పోటీలో ఓడిపోయినప్పుడు సహజంగా ఎవరైనా నిరాశ చెందుతారు. కానీ ఆ సమయంలో కొంత మంది తమ హద్దలు మీరి ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఒస్టాపెంకో నాతో అలానే ప్రవర్తించింది. నాకు ఒక క్లాస్ లేదు, చదువు లేదని నన్ను విమర్శించింది.యూఎస్ వెలుపుల ఏమి జరుగుతుందో వెళ్లి చూడమని నన్ను హెచ్చరించింది" అని మ్యాచ్ అనంతరం ఆన్-కోర్ట్ ఇంటర్వ్యూలో టౌన్సెండ్ పేర్కొంది. దీంతో జెలెనాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఒస్టాపెంకో కౌంటరిచ్చింది.అందరిని గౌరవిస్తా.."నా జీవితంలో నేను ఎప్పుడూ జాత్యహంకార వ్యాఖ్యలు చేయలేదు. అన్ని దేశాల ప్రజలను నేను గౌరవిస్తాను. నాకు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. పోటీలో గెలవడమే నా లక్ష్యం అని ఒస్టాపెంకో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చింది. అయితే ఒస్టాపెంకో కోపం వెనక ఓ కారణముందంట. టెన్నిస్ మ్యాచ్ నియమాలకు విరుద్దంగా టౌన్సెండ్ ప్రవర్తించినట్లు ఒస్టాపెంకో ఆరోపించింది."మ్యాచ్ ప్రారంభంలో అందరు ఆటగాళ్లు బేస్లైన్లోనే వార్మప్ ప్రారంభించాలి. కానీ టౌన్సెండ్ మాత్రం బెస్లైన్లో కాకుండా బయటకు వచ్చి వెంటనే వార్మప్ ప్రారంభించింది. టౌన్సెండ్ అలా చేయడం సరి కాదు. ఆమె టెన్నిస్ మ్యాచ్ నియమాలకు విరుద్ధంగా వెళ్లింది. కనీసం నెట్కార్డ్ విన్నర్‌కు సారీ కూడా చెప్పలేదని ఒస్టాపెంకో తన పోస్ట్‌లో పేర్కొంది.😭👏 Townsend to Ostapenko:“You can learn how to take a loss better” pic.twitter.com/L0m5GGAVC6— Olly Tennis 🎾🇬🇧 (@Olly_Tennis_) August 27, 2025చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్ -
అల్కరాజ్ అలవోకగా...
న్యూయార్క్: కెరీర్లో ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ శుభారంభం చేశాడు. అమెరికా ఆజానుబాహుడు, ప్రపంచ 67వ ర్యాంకర్ రీలి ఒపెల్కాతో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అల్కరాజ్ 6–4, 7–5, 6–4తో గెలుపొందాడు. 2 గంటల 5 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 13 సార్లు దూసుకొచ్చి పదిసార్లు పాయింట్లు గెలిచాడు. 19వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న అల్కరాజ్ ఏనాడూ తొలి రౌండ్లో ఓడిపోలేదు. మరోవైపు 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 102 కేజీల బరువున్న ఒపెల్కా 14 ఏస్‌లతో విరుచుకుపడ్డా... తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఐదో సీడ్ డ్రేపర్ (బ్రిటన్), పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ), 11వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్), 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో డ్రేపర్ 6–4, 7–5, 6–7 (7/9), 6–2తో ఫెడెరికో గోమెజ్ (అర్జెంటీనా)పై, ముసెట్టి 6–7 (3/7), 6–3, 6–4, 6–4తో పెరికార్డ్ (ఫ్రాన్స్)పై, రూడ్ 6–1, 6–2, 7–6 (7/5)తో ఆఫ్నెర్ (ఆ్రస్టియా)పై, రూనె 6–3, 7–6 (7/4), 7–6 (7/2)తో జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవరెడ్డి తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. ‘వైల్డ్ కార్డు’తో పోటీపడ్డ 20 ఏళ్ల నిశేష్ 7–6 (7/5), 3–6, 5–7, 1–6తో తొమ్మిదో సీడ్ ఖచనోవ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడాడు. తొలి రౌండ్లో ఓడిన నిశే‹Ùకు 1,10,000 డాలర్లు (రూ. 96 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. వీనస్ తొలి రౌండ్లోనే... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. 2000, 2001లలో విజేతగా నిలిచిన 45 ఏళ్ల వీనస్‌కు నిర్వాహకులు ఈసారి ‘వైల్డ్ కార్డు’ కేటాయించడంతో 25వ సారి ఆమె యూఎస్ ఓపెన్ టోర్నిలో బరిలోకి దిగింది. ప్రపంచ 13వ ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తొలి రౌండ్లో వీనస్ 3–6, 6–2, 1–6తో ఓటమి పాలైంది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్ పది డబుల్ ఫాల్ట్‌లు, 24 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), ఐదో సీడ్ మీరా ఆండ్రీవా (రష్యా), తొమ్మిదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎమిలియానా అరాంగో (కొలంబియా)పై, ఆండ్రీవా 6–0, 6–1తో అలీసియా పార్క్స్ (అమెరికా)పై, రిబాకినా 6–3, 6–0తో జూలియెటా పరీజా (అమెరికా)పై నెగ్గగా... 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) తొలి రౌండ్లో 2–6, 4–6తో అనా బొండార్ (హంగేరి) చేతిలో ఓడిపోయింది. -
రాడుకాను శుభారంభం
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) శుభారంభం చేసింది. ఆదివారం మొదలైన ఈ మెగా టోర్నీలో తొలి రౌండ్లో రాడుకాను 6–1, 6–2తో ఇనా షిబహారా (జపాన్)పై గెలుపొందింది. 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 2021 చాంపియన్ రాడుకాను రెండు ఏస్‌లు సంధించింది. నెట్ వద్దకు ఏడుసార్లు దూసుకొచి్చన ఆమె ఐదుసార్లు పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని రాడుకాను ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు షిబహారా ఐదు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. షెల్టన్ బోణీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గెలుపు బోణీ కొట్టాడు. ఇగ్నాసియో బుసె (పెరూ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో షెల్టన్ 6–3, 6–2, 6–4తో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 7 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో షెల్టన్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. 35 విన్నర్స్ కొట్టిన ఈ అమెరికా స్టార్ 32 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని షెల్టన్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 16వ సీడ్ జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 6–3, 6–4తో నికోలస్ జారీ (చిలీ)పై, 18వ సీడ్ డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్) 6–1, 6–1, 6–2తో అలెగ్జాండర్ షెవ్చెంకో (కజకిస్తాన్)పై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
సారా ఎరాని–వవసోరి జోడీదే ‘మిక్స్డ్’ టైటిల్
సింగిల్స్‌లో ఎంతటి మేటి క్రీడాకారులైనా... డబుల్స్ విభాగంలో రాణించాలంటే మాత్రం విశేష ప్రతిభ, చక్కటి సమన్వయం ఉండాలని సారా ఎరాని–ఆండ్రియా వవసోరి (ఇటలీ) నిరూపించారు. మ్యాచ్‌లను, టోర్నీని కొత్త ఫార్మాట్లో నిర్వహించినా... సింగిల్స్ స్టార్స్‌ను బరిలోకి దించినా... డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడారు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ‘మిక్స్డ్ డబుల్స్’ విభాగంలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ‘సూపర్ టైబ్రేక్’లో పైచేయి సాధించిన సారా ఎరాని–వవసోరి ద్వయం ‘మిక్స్డ్ డబుల్స్’ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. న్యూయార్క్: కొత్త ఫార్మాట్‌కు ఆహ్వానం పలికి... డబుల్స్ స్పెషలిస్ట్ అవకాశాలను దెబ్బ తీశారని నిర్వాహకులను విమర్శించినా... మరోవైపు తమ సహజ నైపుణ్య ప్రదర్శనతో సారా ఎరాని–ఆండ్రియా వవసోరి జోడీ అదరగొట్టింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఈ ఇటలీ జంట వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచింది. గురువారం ఉదయం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి 6–3, 5–7, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే)లపై గెలుపొందారు. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఎరాని–వవసోరి నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన ఎరాని–వవసోరిలకు 10 లక్షల డాలర్లు (రూ. 8 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ స్వియాటెక్–రూడ్‌లకు 4 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 50 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రెండు రోజుల్లోనే ముగిసిన మిక్స్డ్ ఈవెంట్లో ఎరాని–వవసోరి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. గురువారమే జరిగిన సెమీఫైనల్స్‌లో ఎరాని–వవసోరి 4–2, 4–2తో డానియెలా కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్ (అమెరికా)లను ఓడించింది. మరో సెమీఫైనల్లో స్వియాటెక్–రూడ్ 3–5, 5–3, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)–జాక్ డ్రేపర్ (బ్రిటన్)లపై గెలిచారు. 2018, 2019లలో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్) జోడీ వరుసగా రెండేళ్లు ‘మిక్స్డ్ డబుల్స్’ టైటిల్ నెగ్గగా... ఇప్పుడు ఎరాని–వవసోరి ఈ ఘనత సాధించారు. -
స్టార్ జోడీలు తొలి రౌండ్లోనే అవుట్
న్యూయార్క్: సింగిల్స్‌లో మేటి క్రీడాకారులుగా ఉన్న వారిని జోడీలుగా మార్చి... మిక్స్డ్ డబుల్స్ ఆడించాలని యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అంతగా సక్సెస్ కాలేదు. స్టార్ ఆటగాళ్లతో నిర్వహించిన మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. సెర్బియా దిగ్గజం, ప్రపంచ ఏడో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్... ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)... ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మిక్స్డ్ డబుల్స్‌లో తమ తొలి మ్యాచ్‌లలోనే పరాజయం పాందగా... ప్రపంచ ఆరో ర్యాంకర్ బెన్ షెల్టన్ (అమెరికా) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. జొకోవిచ్–డానిలోవిచ్ (సెర్బియా) జంట 2–4, 3–5తో మెద్వెదెవ్–మిరా ఆండ్రీవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. అల్కరాజ్ (స్పెయిన్)–ఎమ్మా రాడుకాను (బ్రిటన్) జంట 2–4, 2–4తో జెస్సికా పెగూలా (అమెరికా)–జేక్ డ్రేపర్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. జ్వెరెవ్–బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) ద్వయం 0–4, 3–5తో డానియెలా కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. క్వార్టర్ ఫైనల్లో పెగూలా–డ్రేపర్ ద్వయం 4–1, 4–1తో మెద్వెదెవ్–ఆండ్రీవా జంటపై నెగ్గి సెమీఫైనల్ చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో కొలిన్స్–హారిసన్ జోడీ 4–1, 5–4 (7/2)తో టేలర్ టౌన్సెండ్–బెన్ షెల్టన్ (అమెరికా) ద్వయంపై నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. -
స్వియాటెక్ సాధించె... విజేతగా అల్కరాజ్.. యూఎస్‌కు పయనం
సిన్సినాటి (ఒహాయో): ఎట్టకేలకు ఏడో ప్రయత్నంలో పోలాండ్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో తన లక్ష్యాన్ని చేరుకుంది. గతంలో ఆరుసార్లు ఈ టోర్నీలో ఆడిన స్వియాటెక్ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. అయితే ఏడో ప్రయత్నంలో మాత్రం స్వియాటెక్ చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్ 7–5, 6–4తో ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలిచింది.1 గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ తుదిపోరులో స్వియాటెక్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్వియాటెక్ కెరీర్లో ఇది 24వ సింగిల్స్ టైటిల్‌కాగా... ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్ తర్వాత రెండోది.విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 7,52,275 డాలర్ల (రూ. 6 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ పావోలినికి 3,91,600 డాలర్ల (రూ. 3 కోట్ల 40 లక్షలు ) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.విజేత అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్ ఏటీపీ–1000 టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 5–0తో గెలిచాడు. తొలి సెట్లో 0–5తో వెనుకబడిన దశలో అనారోగ్యం కారణంగా సినెర్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు.ఇక టైటిల్ నెగ్గిన అల్కరాజ్కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సినెర్‌కు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది అల్కరాజ్కిది ఆరో టైటిల్‌కాగా, కెరీర్లో 22వది కావడం విశేషం.ఒకే విమానంలో..ఇదిలా ఉంటే.. సిన్సినాటి ఓపెనర్ టైటిల్స్ గెలిచిన తర్వాత స్వియాటెక్, అల్కరాజ్ కలిసి ఒకే విమానంలో న్యూయార్క్‌కు బయలుదేరారు. యూఎస్ ఓపెన్‌లో విజేతలుగా నిలవడమే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టారు. వీరిద్దరు ఒకే విమానంలో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Iga Swiatek and Carlos Alcaraz sharing a plane to New York. 🗽Cincinnati champions ready for the US Open.Love this. ❤pic.twitter.com/nLD6KMnHJd— The Tennis Letter (@TheTennisLetter) August 19, 2025 -
సెమీస్‌లో సారా ఎరాని–వావసోరి జోడీ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మంగళవారం మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ జోడీ సారా ఎరాని–ఆండ్రియా వావసోరి (ఇటలీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ముందుగా తొలి రౌండ్లో ఎరాని–వావసోరి ద్వయం 4–2, 4–2తో రెండో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)–టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) జంటపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆ వెంటనే జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎరాని–వావసోరి జోడీ 4–1, 5–4 (7/5)తో ముకోవా (చెక్ రిపబ్లిక్)–రుబ్లెవ్ (రష్యా) జంటను ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 4–1తో నెగ్గిన ఇటలీ జోడీ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో దక్కించుకుంది. రెండో సెట్లో స్కోరు 4–4తో సమం కావడంతో టైబ్రేక్‌ను నిర్వహించారు. టైబ్రేక్‌లో ముందుగా ఏడు పాయింట్లు గెలిచిన ఎరాని–వావసోరి జంట విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్–రూడ్ జంట 4–1, 4–2తో కేటీ మెక్నాలీ (అమెరికా) –ముసెట్టి (ఇటలీ) జోడీపై గెలిచింది. అంతకుముందు తొలి రౌండ్లో స్వియాటెక్–రూడ్ 4–1, 4–2తోనే మాడిసన్ కీస్–ఫ్రాన్సిస్కో టియాఫో (అమెరికా)లపై... కేటీ మెక్లానీ–ముసెట్టి 5–3, 4–2తో ఒసాకా (జపాన్)–Vమోన్ఫిల్స్ (ఫ్రాన్స్) లపై గెలిచారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ముకోవా–రుబ్లెవ్ 4–2, 5–4 (7/4)తో వీనస్ విలియమ్స్–రీలీ ఒపెల్కా (అమెరికా)లపై నెగ్గారు. -
రూ. 7 కోట్లు పెరిగిన ప్రైజ్‌మనీ.. ‘సోలో’ స్టార్స్ జోడీగా.. వాళ్లకు అన్యాయం?
న్యూయార్క్: టెన్నిస్‌లో ‘సోలో’ స్టార్స్ కాస్త ఇకపై ‘మిక్స్డ్’ చాంపియన్స్ కాబోతున్నారు. సింగిల్స్ టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డే పురుషుల, మహిళల సింగిల్స్ సీడెడ్లు ఇకపై జోడీగా స్ట్రాంగ్... డబుల్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్కు ‘సై’ అంటున్నారు. ఈ మేరకు యూఎస్ ఓపెన్ ఆర్గనైజర్లు గ్రాండ్‌స్లామ్‌లో సరికొత్త శోభను తీసుకొస్తున్నారు.‘మిక్స్డ్ డబుల్స్’కు సింగిల్స్ స్టార్లతో మరో దశకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 24న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మొదలుకానుండగా... మిక్స్డ్ డబుల్స్ పోటీలు మాత్రం మంగళవారం ప్రారంభంకానున్నాయి. రెండు రోజుల్లోనే మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్‌ను నిర్వాహకులు ముగించనున్నారు.ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ప్రపంచ సింగిల్స్ స్టార్లంతా ఇప్పుడు మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కోసం కూడా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు యూఎస్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు జోడీలను ఎంపిక చేశారు. అల్కరాజ్, సినెర్, స్వియాటెక్, మాడిసన్ కీస్‌లు ‘మిక్స్డ్ డబుల్స్’ దశను మార్చే ఆట ఆడతారా లేదో కొన్ని రోజుల్లోనే తేలనుంది. ‘మిలియన్’ మార్పు గతేడాది యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌ను సారా ఎరాని–వావసొరి (ఇటలీ) జోడీ గెలుచుకుంది. వీరిద్దరు ట్రోఫీతో పాటు 2 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 75 లక్షలు)ను పంచుకున్నారు. కానీ ఇప్పుడు మిక్స్డ్ ప్రైజ్‌మనీ ఏకంగా 10 లక్షల డాలర్లకు (రూ. 8 కోట్ల 73 లక్షలు) చేరింది. ఐదు రెట్లకు పెరిగిన మొత్తం సింగిల్స్ స్టార్లకు వరమైతే... స్పెషలిస్టు డబుల్స్ ప్లేయర్లకు గుండెకోతను మిగిల్చనుంది.ఒక్క ప్రైజ్మనే కాదు... ఆట కూడా మారింది. 6 గేమ్‌ల స్థానంలో 4 గేమ్‌లతో ఆడిస్తారు. అంటే 6–0, 6–1 స్కోర్లు కాస్తా 4–0, 4–1గా ఉంటాయి. 32 జోడీలకు బదులుగా 16 జోడీలనే బరిలో దించుతారు. అంటే ప్రిక్వార్టర్స్ నుంచే మిక్స్డ్ పోరు మొదలవుతుంది. ఒక్క మ్యాచ్ గెలవగానే ఆ జోడీ క్వార్టర్స్ చేరుతుంది. మ్యాచ్‌లు కూడా ప్రధాన వేదికల్లో నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. జోడీ కట్టించారిలా... స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ సరికొత్త సమరాన్ని ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో కలిసి ప్రారంభిస్తాడు. ఇటలీ సంచలనం యానిక్ సినెర్ (ఇటలీ)... కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో జోడీ కట్టాడు. షెడ్యూల్ ప్రకారం ఎమ్మా నవారో (అమెరికా)తో సినెర్ ఆడాల్సి ఉండగా... ఆమె తప్పుకోవడంతో చెక్ స్టార్‌ను జతచేశారు.సెర్బియా దిగ్గజం జొకోవిచ్ తన దేశానికే చెందిన డానిలోవిక్తో మిక్స్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే), మాడీసన్ కీస్–టియాఫె (అమెరికా), నయోమి ఒసాకా (జపాన్)–మోన్ఫిల్స్ (ఫ్రాన్స్), జ్వెరెవ్ (జర్మనీ)–బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్), రుబ్లెవ్ (రష్యా)– కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్), రీలి ఒపెల్కా–వీనస్ విలియమ్స్ (అమెరికా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)– రిబాకినా (కజకిస్తాన్) తదితర హేమాహేమీ జోడీలు ఈసారి కొత్తగా మిక్స్డ్ డబుల్స్ బరిలో ఉన్నారు.మరి మా సంగతేం కాను? పాత ఒక రోత... కొత్త ఒక వింత.. తాజాగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కొత్త మిక్సింగ్‌పై అసలు సిసలైన డబుల్స్ ఆటగాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటీపీ, డబ్ల్యూటీఏలతో పాటు వందకు పైగా టోర్నీలు జరుగుతున్నాయి. మిక్స్డ్ డబుల్స్ మాత్రం కేవలం నాలుగే నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నిర్వహిస్తారు. ఇందులోనే పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ ఆడే ప్లేయర్లు అదనంగా మిక్స్డ్ జోడీ కడతారు.సాధారణంగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రైజ్‌మనీ కూడా ఎక్కువ. తొలిరౌండ్లో ఓడినా పెద్ద మొత్తంలోనే వస్తాయి. అలాంటి సువర్ణావకాశాన్ని ఇప్పుడు యూఎస్ ఓపెన్ నిర్వాహకులు సరికొత్త మిక్స్‌తో మార్చేయడంతో స్పెషలిస్టు డబుల్స్ ఆటగాళ్ల ఆదాయానికి గండికొట్టారు. మిగతా మూడు గ్రాండ్‌స్లామ్‌ల నిర్వాహకులు సైతం ఇదే ధోరణిని అవలంభిస్తే డబుల్స్ ప్లేయర్లకు కోలుకోలేని దెబ్బ పడుతుంది. గత యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ విజేతగా నిలిచిన ఇటలీ జంట సారా ఎరాని–వావసొరి నిర్వాహకుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. -
ఆయుశ్ అదరహో
అయోవా (అమెరికా): నిరీక్షణ ముగిసింది. ఈ ఏడాది భారత ప్లేయర్ ఖాతాలో తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ చేరింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత ప్లేయర్ ఆయుశ్ శెట్టి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–18, 21–13తో ప్రపంచ 33వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు. ఈ ఏడాది యాంగ్‌పై ఆయుశ్కిది మూడో విజయం కావడం విశేషం. మలేసియా ఓపెన్, తైపీ ఓపెన్ టోర్నీల్లోనూ యాంగ్‌పై ఆయుశ్ నెగ్గాడు. చాంపియన్‌గా నిలిచిన ఆయుశ్‌కు 18 వేల డాలర్ల (రూ. 15 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యాంగ్తో 47 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ఆయుశ్‌కు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. మూడుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 19–18 వద్ద ఆయుశ్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్ దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం ఆయుశ్ దూకుడు కనబరిచాడు. ఆరంభంలోనే 6–1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆయుశ్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని 11–6కు పెంచుకున్నాడు. యాంగ్ కోలుకునే ప్రయత్నం చేసినా జోరు మీదున్న ఆయుశ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 2023లో లక్ష్య సేన్ కెనడా ఓపెన్‌లో టైటిల్ సాధించిన తర్వాత ఆయుశ్ శెట్టి రూపంలో మరో భారత ప్లేయర్ అంతర్జాతీయ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. ‘సీనియర్ సర్క్యూట్లో నాకిదే తొలి టైటిల్. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. చాలా సంతోషంగా ఉన్నా. గత వారం రోజులుగా అద్భుతంగా ఆడాను. ఇదే జోరును కెనడా ఓపెన్‌లోనూ కొనసాగిస్తాను’ అని కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుశ్ వ్యాఖ్యానించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న ఆయుశ్ 2023లో ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో కాంస్య పతకాన్ని సాధించి వెలుగులోకి వచ్చాడు. రన్నరప్ తన్వీ శర్మ యూఎస్ ఓపెన్ టోరీ్నలో భారత్‌కు ‘డబుల్ ధమాకా’ సృష్టించే అవకాశం చేజారింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ తన్వీ శర్మ రన్నరప్‌గా నిలిచింది. టాప్ సీడ్, ప్రపంచ 21వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన ఫైనల్లో 16 ఏళ్ల తన్వీ శర్మ 11–21, 21–16, 10–21తో పోరాడి ఓడిపోయింది. కెరీర్లో తొలి వరల్డ్ టూర్ ఫైనల్ ఆడిన పంజాబ్‌కు చెందిన తన్వీ ప్రత్యరి్థకి గట్టిపోటీనిచి్చనా చివరకు అనుభవజు్ఞరాలైన బీవెన్ జాంగ్‌దే పైచేయి అయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 66వ స్థానంలో ఉన్న తన్వీ శర్మకు 9,120 డాలర్ల (రూ. 7 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
టైటిల్‌కు చేరువలో...
అయోవా (అమెరికా): ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్లో ఈ ఏడాది భారత క్రీడాకారులెవరూ ‘సూపర్’ స్థాయి టోరీ్నల్లో టైటిల్ సాధించలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే ... ఒకేసారి రెండు టైటిల్స్‌తో భారత షట్లర్లు ‘డబుల్’ ధమాకా సృష్టించే అవకాశముంది. ఏమాత్రం అంచనాలు లేకుండా యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో బరిలోకి దిగిన భారత యువ షట్లర్లు ఆయుశ్ శెట్టి, తన్వీ శర్మ టైటిల్‌కు కేవలం విజయం దూరంలో నిలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 34వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి... మహిళల సింగిల్స్‌లో విభాగంలో ప్రపంచ 66వ ర్యాంకర్ తన్వీ శర్మ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుశ్ శెట్టి 21–23, 21–15, 21–14తో టాప్ సీడ్, ప్రపంచ ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించగా... 16 ఏళ్ల తన్వీ శర్మ 21–14, 21–16తో ఏడో సీడ్, ప్రపంచ 40వ ర్యాంకర్ పొలీనా (ఉక్రెయిన్)ను బోల్తా కొట్టించింది. ఫైనల్స్‌లో బ్రియాన్ యాంగ్ (కెనడా)తో ఆయుశ్; బీవెన్ జాంగ్ (అమెరికా)తో తన్వీ తలపడతారు. గత నెలలో శ్రీకాంత్ మలేసియా ఓపెన్ టోరీ్నలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలవడమే ఈ ఏడాది భారత షట్లర్ల అత్యుత్తమ ప్రదర్శన. ఫైనల్లో ఆయుశ్, తన్వీ విజయం సాధిస్తే భారత్‌కు ‘టైటిల్’ లోటు తీరుతుంది. -
తరుణ్ శుభారంభం
అయోవా (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్లేయర్, ప్రపంచ 54వ ర్యాంకర్ తరుణ్ మన్నేపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 37వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్, ప్రపంచ 57వ ర్యాంకర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, ప్రపంచ 61వ ర్యాంకర్ రిత్విక్ సంజీవి సతీశ్ కుమార్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. తొలి రౌండ్లో తరుణ్ 19–21, 21–18, 21–18తో ప్రపంచ 53వ ర్యాంకర్ అర్నాడ్ మెర్క్లే (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 70 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో కీలకదశలో తరుణ్ పాయింట్లు గెలిచి విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన తరుణ్... రెండో గేమ్‌లో స్కోరు 18–18 వద్ద వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో 14–16తో వెనుకబడిన దశలో తరుణ్ విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు చేజార్చుకున్న తరుణ్ వెంటనే తేరుకొని మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన ఆయుశ్ శెట్టితో తరుణ్ తలపడతాడు. ఈ సీజన్లో తరుణ్ ఏడు టోర్నీల్లో ఆడి రెండింటిలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచ 50వ ర్యాంకర్ శ్రీకాంత్ 19–21, 21–12, 14–21తో ప్రపంచ 77వ ర్యాంకర్ హ్యారీ హువాంగ్ (ఇంగ్లండ్) చేతిలో, ప్రియాన్షు 10–21, 21–12, 7–21తో 106వ ర్యాంకర్ టింగ్ యెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, శంకర్ 13–21, 19–21తో లియావో జు ఫు (చైనీస్ తైపీ) చేతిలో, రిత్విక్ 18–21, 12–21తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. శ్రియాన్షికి నిరాశ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రియాన్షి వలిశెట్టి, తాన్యా హేమంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... భారత్‌కే చెందిన అన్మోల్ ఖరబ్, ఆకర్షి కశ్యప్, తన్వీ శర్మ, ఐరా శర్మ తొలి రౌండ్లో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. శ్రియాన్షి 16–21, 21–23తో ఏడో సీడ్ పొలీనా బురోవా (ఉక్రెయిన్) చేతిలో, తాన్యా 21–10, 22–24, 16–21తో అమేలీ షుల్జ్ (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలయ్యారు. అన్మోల్ 16–21, 21–13, 21–19తో తెరెజా స్విబికోవా (చెక్ రిపబ్లిక్)పై, ఆకర్షి 21–19, 21–10తో లియాంగ్ టింగ్ యు (చైనీస్ తైపీ)పై, తన్వీ శర్మ 21–19, 21–9తో రెండో సీడ్ ఎన్గుయెన్ థుయ్ లిన్ (వియత్నాం)పై గెలిచారు. హుంగ్ యిటింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ఐరా శర్మ తొలి గేమ్‌ను 12–21తో కోల్పోయి, రెండో గేమ్‌ను 21–16తో సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 6–6తో సమంగా ఉన్నపుడు హుంగ్ యిటింగ్ గాయం కారణంగా మాŠయ్చ్ నుంచి వైదొలిగింది. మిక్స్డ్ డబుల్స్‌లో టాప్ సీడ్ తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–17, 16–21, 17–21తో లిన్ యు చియె–హుంగ్ యుఎన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
అన్నింటికంటే ‘మిక్స్డ్’ ముందు!
న్యూయార్క్: కేవలం నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలకే పరిమితమైన ‘మిక్స్డ్ డబుల్స్’ ఈవెంట్ నానాటికీ తీసికట్టుగా జరుగకుండా... మరింత రసవత్తరంగా జరిగేలా... అందర్నీ ఆకర్షించేలా.. ఆదరణ పొందేలా... యూఎస్ ఓపెన్ నిర్వాహకులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘మిక్స్డ్’లో సరైన భాగస్వాముల ఎంపిక, తదనంతరం పురుషుల, మహిళ డబుల్స్, సింగిల్స్‌లలో తాజాగా ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రధాన టోర్నీకి ముందుగానే మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గేమ్ ఫార్మాట్‌ను మార్చింది. దీంతో పాటు ప్రత్యేకంగా మిక్స్డ్ డబుల్స్ విభాగం కోసం 10 లక్షల డాలర్లు (రూ.8.67 కోట్లు) ప్రైజ్‌మనీని కూడా పెంచింది. ఈ సీజన్ యూఎస్ ఓపెన్‌లో ఇబ్బడిముబ్బడిగా జోడీలను దించట్లేదు. 16 జోడీలే ‘మిక్స్డ్’ బరిలోకి దిగుతాయి. ఇందులో మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా ఎనిమిది జోడీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ఎనిమిది జోడీలు మిక్స్డ్ టైటిల్ కోసం పోటీ పడతాయి. మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలుకావడానికి ఐదు రోజుల ముందే అంటే క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్న సమయంలో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లు వరుసగా జరుగుతాయి. ఆ మరుసటి రోజే సెమీస్, ఫైనల్స్‌తో విజేత కూడా ఖాయమమవుతుంది. 6 గేములతో కూడా బెస్టాఫ్ త్రీ కాకుండా 4 గేములతో బెస్టాఫ్ త్రీ ఫార్మాట్లో మిక్స్డ్ పోటీలు నిర్వహిస్తారు. గతంలో 6–6 స్కోరుదాకా సాగితేనే టైబ్రేక్ చేసేవారు. కానీ ఇప్పుడు 4–4 వద్దే టైబ్రేక్ మొదలుపెడతారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగడంతో పాటు రెండే రోజుల్లో (ఈ ఏడాది అయితే ఆగస్టు 19, 20 తేదీల్లోనే) మిక్స్డ్ డబుల్స్ విజేత ఎవరో తేలుతుంది. 2024లో యూఎస్ ఓపెన్‌లో సారా ఎరాని–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీ విజేతగా నిలిచింది. -
దిగ్గజాలకు గడ్డుకాలం: భవిష్యత్తు అతడిదేనా!
సుదీర్ఘకాలంగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఇటలీకి ఈ ఏడాది రెండు టైటిల్స్ దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో విజేతగా నిలిచాడు. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టి కాంస్య పతకం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో జాస్మిన్ పావోలిని జోరు సాగిస్తుంటే... డబుల్స్‌లోనూ లెక్కకు మిక్కిలి జోడీలు టైటిల్స్‌తో సత్తా చాటుతున్నాయి. టెన్నిస్ కోర్టులో అడుగు పెడితే విజేతగా నిలవడమే లక్ష్యంగా ఇటలీ ప్లేయర్లు ముందుకు సాగుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం లొరెంజోఈ ఏడాది అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీల్లో ఇటలీ ఆటగాళ్ల జోరు సాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ యానిక్ సినెర్ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకోవడంతోపాటు మరో నాలుగు ఏటీపీ టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఇక మహిళల సింగిల్స్‌లో జాస్మిన్ పావోలిని వింబుల్డన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో సిమోన్ బొలెలీ–ఆండ్రియా వవసోరి... మహిళల డబుల్స్‌లో సారా ఎరాని–జాస్మిన్ పావోలిని రన్నరప్‌గా నిలిచారు. అదే విధంగా.. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో సిమోన్ బొలెలీ–ఆండె వవసోరి రన్నరప్‌గా నిలిచారు. ఇక సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సారా ఎరాని–వవసోరకి జోడీ చాంపియన్‌గా అవతరించింది. ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్‌లో సారా ఎరాని–జాస్మిన్ పావోలిని జంట స్వర్ణ పతకం గెలుచుకోగా... పురుషుల సింగిల్స్‌లో లొరెంజో ముసెట్టి కాంస్య పతకంతో మెరిశాడు. విశ్వక్రీడల పురుషుల సింగిల్స్‌లో వందేళ్ల తర్వాత ఇటలీకి ఇదే తొలి పతకం కావడం విశేషం. భవిష్యత్తు అతడిదేనా! సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవడంతో దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఇటలీ ప్లేయర్‌గా సినెర్ రికార్డుల్లోకి ఎక్కాడు. చివరిసారిగా 1976 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇటలీ నుంచి ఆండ్రియానో పనట్టా టైటిల్ గెలిచాడు. ఇక సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గత కొంతకాలంగా నిలకడ సాగిస్తున్న 23 ఏళ్ల సినెర్ భవిష్యత్తు తనదే అని చెప్పకనే చెబుతున్నాడు. ఈ ఏడాది అతడు ఆడిన 60 మ్యాచ్‌ల్లో 55 విజయాలు సాధించాడంటే సినెర్ జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు... రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్‌లోనూ చాంపియన్‌గా నిలిచిన సినెర్ ఈ ఏడాది ఓవరాల్‌గా ఆరు టైటిల్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకగా... స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ గాయాలతో సతమతమవుతున్నాడు. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ కూడా కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో సినెర్ ఇదే నిలకడ కొనసాగిస్తే... భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక మహిళల విభాగంలో జాస్మిన్ అనూహ్య ఆటతీరుతో దూసుకొస్తోంది. మంచి రోజులు ముందున్నాయి... దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెనుదిరిగుతున్న తరుణంలో భవిష్యత్తు తమ ప్లేయర్లదే అని ఇటలీ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు ఏంజెలో బినాఘి అంటున్నారు. ‘కొత్త తరంలోకి అడుగు పెడుతున్నాం. అందుకు ఇటలీ సిద్ధంగా ఉంది. దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో అవకాశాలను వినియోగించుకుంటూ సత్తాచాటుతున్నాం. మహిళల విభాగంలోనూ మా పురోభివృద్ధి బాగుంది’ అని బినాఘి అన్నారు.ప్రస్తుతం పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ టాప్–50లో ఏడుగురు ఇటలీ ప్లేయర్లు ఉన్నారు. కేవలం సింగిల్స్‌లోనే కాకుండా... డబుల్స్‌లోనూ ఇటలీ ప్లేయర్లు నిలకడ సాగిస్తున్నారు. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ‘దాదాపు యాభై ఏళ్లుగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తుంటే... ఈ సంవత్సరం సినెర్ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు. ఇతర టోర్నీల్లోనూ ఇటలీ ప్లేయర్ల ప్రదర్శన బాగుంది. డేవిస్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాం. ఇదే జోరు సాగిస్తూ సొంతగడ్డపై పెద్ద టోరీ్నలో విజయం సాధించడమే తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నాం. విజయవంతంగా సాగుతున్న ఈ ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని బినాఘి పేర్కొన్నారు. ఏటీపీ ఫైనల్స్‌పై దృష్టి విదేశాల్లో వరస విజయాలు సాధిస్తున్న ఇటలీ ప్లేయర్లు... స్వదేశంలో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్న సినెర్ గాయం కారణంగా ఇటాలియన్ ఓపెన్ బరిలోకి దిగలేదు. 1976 ఇటాలియన్ ఓపెన్‌లో చివరిసారిగా స్థానిక ఆటగాడు పనట్టా పురుషుల సింగిల్స్ విజేతగా నిలవగా.. 1985లో మహిళల సింగిల్స్‌లో రఫ్పెల్లా రెగ్గీ టైటిల్ సాధించింది. అప్పటి నుంచి స్థానిక ఆటగాళ్లెవరూ ఇటాలియన్ ఓపెన్ గెలుచుకోలేదు. ఇకపై స్వదేశంలోనూ సత్తా చాటడంపై దృష్టి పెట్టనున్నట్లు బినాఘి తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో వరసగా నాలుగోసారి ఇటలీలో ఏటీపీ ఫైనల్స్ టోర్నీ జరగనుంది. గత ఏడాది జొకోవిచ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన సినెర్ ఈసారి టైటిల్ సాధించాలని కసితో ఉన్నాడు. యూఎస్ ఓపెన్ ప్రారంభానికి ముందు డోపింగ్ వివాదంతో వార్తల్లోకి ఎక్కిన సినెర్ తన ఆటతీరుపై ఆ ప్రభావం పడలేదని నిరూపించుకున్నాడు. ఇటీవల యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ఇటలీలో ప్రతి పది మందిలో ఒకరు వీక్షించారని బినాఘి తెలిపారు. మౌలిక వసతుల కల్పన వల్లే నైపుణ్యం గల ఆటగాళ్లను వెలికి తీయగలిగామని ఆయన పేర్కొన్నారు. సీనియర్ స్థాయిలోనే కాకుండా... జూనియర్ ఈవెంట్స్‌లోనూ ఇటలీ ప్లేయర్లు హవా సాగిస్తున్నారు. ఈ ఏడాది జూనియర్ సర్క్యూట్లో ఇటలీ ప్లేయర్లు 10 టైటిట్స్ సాధించారు. చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా సిన్నర్..
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ప్రపంచ నంబర్ వన్, ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4 , 7-5 తేడాతో సిన్నర్ విజయం సాధించాడు.దాదాపు రెండు గంటల పాటు సాగిన తుది పోరులో ప్రత్యర్ధిని సిన్నర్ చిత్తు చేశాడు. మూడు సెట్లలోనూ పూర్తి ఆధిపత్యం సాధించిన ఈ ఇటాలియన్ స్టార్.. తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 23 ఏళ్ల సిన్నర్‌కు ఈ ఏడాదిలో ఇది రెండవ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోగా.. తాజాగా ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌ను కూడా సిన్నర్ సొంతం చేసుకున్నాడు.తొలి ఇటాలియాన్గా..అదే విధంగా యూఎస్ ఓపెన్ ట్రోఫీని సొంతం చేసుకున్న మొట్టమొదటి ఇటాలియన్గా సిన్నర్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ ఇటలీ టెన్నిస్ క్రీడాకారుడు కూడా యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలవలేదు. ఇక ఈ ట్రోఫీని టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ చేతుల మీదుగా సిన్నర్ అందుకున్నాడు.చదవండి: ENG VS SL 3rd Test: రూట్ ఖాతాలో భారీ రికార్డు -
US Open 2024: సభలెంకా... విజయ ఢంకా
న్యూయార్క్: గత మూడేళ్లుగా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ స్టార్ అరీనా సబలెంకా నాలుగో ప్రయత్నంలో సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా 7–5, 7–5తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. విజేతగా నిలిచిన సబలెంకాకు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ జెస్సికా పెగూలాకు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సబలెంకా 2021, 2022లలో సెమీఫైనల్లో ని్రష్కమించింది. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన పెగూలా అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ రెండో సెట్లో కోలుకున్న పెగూలా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో గేమ్ గెలిచిఉంటే పెగూలా రెండో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచేది. కానీ కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సబలెంకా తన ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా విజృంభించిన ఈ బెలారస్ స్టార్ వరుసగా నాలుగు గేమ్‌లు గెల్చుకొని 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సబలెంకా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. 2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంకా తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. 2019లో నాన్న చనిపోయాక మా ఇంటìæపేరును టెన్నిస్ చరిత్రలో భాగంగా చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగాను. నా టెన్నిస్ ప్రయాణం నిరాటంకంగా, ఎల్లవేళలా కొనసాగేందుకు నా కుటుంబ సభ్యులు ఎంతో కృషి చేశారు. గత మూడేళ్లుగా ఈ టోరీ్నలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. టోర్నీలలో విన్నర్స్ ట్రోఫీపై నా పేరు చూసుకుంటున్నపుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. –సబలెంకా -
యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా సబలెంక (ఫోటోలు)
-
US Open 2024: యూఎస్ ఓపెన్ మహిళల విజేతగా సబలెంక..
యూఎస్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ స్టార్ అరీనా సబలెంక నిలిచింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన పెగులాపై 7-5, 7-5 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంక గెలుపొందింది.దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ తుది పోరులో తీవ్రంగా శ్రమించిన సబలెంక.. తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. పెగులా నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి సబెలంక మాత్రం తన పట్టును కోల్పోలేదు. కాగా సబలెంక గత యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ తుది మెట్టుపై బోల్తా పడింది. కోకో గాఫ్ చేతిలో ఓటమిపాలైంది. కానీ ఈసారి మాత్రం ఈ బెలారస్ స్టార్ తన కలను నేరవేర్చుకుంది. 26 ఏళ్ల అరీనా ట్రోఫీని అందుకున్న వెంటనే కోర్టుంతా తిరుగుతూ సంబరాలు చేసుకుంది. అదే విధంగా సబెలెంక ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. -
ఫైనల్లో జెస్సికా, సబలెంకా
న్యూయార్క్: అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. గ్రాండ్‌స్లామ్ కెరీర్లో తొలిసారి సెమీస్ చేరిన ఆమె తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ ఈ సారి సొంతగడ్డపై యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ జెస్సికా 1–6, 6–4, 6–2తో కరోలినా ముచొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. అయితే మరో అమెరికన్ ఎమ్మా నవారో ఆట సెమీస్‌తోనే ముగిసింది.రష్యన్ స్టార్, గత యూఎస్ ఓపెన్ రన్నరప్ అరినా సబలెంక 6–3, 7–6 (7/2)తో 13వ సీడ్ ఎమ్మా నవారోను వరుస సెట్లలో ఇంటిదారి పట్టించింది. నేడు జరిగే ఫైనల్లో పెగూలా తన తొలి గ్రాండ్‌స్లామ్ కోసం, సబలెంక తన మూడో గ్రాండ్‌స్లామ్ కోసం తలపడతారు. సబలెంకా 2023, 2024లలో వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది. తొలి సెట్ కోల్పోయినా... క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌ను ఓడించిన జెస్సికాకు సెమీస్ పోరు అంత సులువుగా సాగలేదు. మ్యాచ్ ఆరంభంలో ఫ్రెంచ్ ఓపెన్ 2023 రన్నరప్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ముచొవా చెలరేగి ఆడింది. తొలి 12 విన్నర్లలో పది విన్నర్లను ఆమె కొట్టింది. తొలి సెట్లో పెగూలా అదేపనిగా చేసిన తప్పిదాలు, పేలవమైన సర్విస్తో వెనుకబడింది. ఇదే అదనుగా పట్టు బిగించిన ముచొవా 28 నిమిషాల్లోనే తొలి సెట్‌ను వశం చేసుకుంది. రెండో సెట్లోనూ తొలి 9 గేముల్లో ఎనిమిదింట గెలిచి ఒక దశలో 3–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఇక్కడి నుంచి సీన్ మారిపోయింది. జెస్సికా జోరు మొదలైంది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆటలో వేగం పెంచింది. మూడు బ్రేక్ పాయింట్లతో రెండో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో చెక్ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశమివ్వకుండా జెస్సికా మెరుపుషాట్లతో విరుచుకుపడింది. సబలెంక జోరు మరో సెమీఫైనల్లో రష్యన్ స్టార్ సబలెంక జోరుకు ఎమ్మా నవారో ఎదురు నిలువలేకపోయింది. ప్రత్యేకించి యూఎస్ ఓపెన్‌లో తొలిరౌండే దాటని అమెరికన్ ప్లేయర్ ఎమ్మా నిరుటి రన్నరప్ సబలెంక ధాటికి తొలిసెట్లో చతికిలబడింది. తొలిసెట్‌ను 6–3తో గెలుచుకున్న రెండో సీడ్ సబలెంకకు రెండో సెట్లో కాస్తా పోటీ ఇవ్వడంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. అయితే టై బ్రేక్‌లో అనుభవజ్ఞురాలైన రష్యన్ అలవోకగా పాయింట్లు సాధించడంతో కేవలం గంటన్నరలోనే మ్యాచ్ ముగిసింది. సబలెంక 8 ఏస్‌లతో చెలరేగింది. 34 విన్నర్లు కొట్టింది. ఒకే ఒక ఏస్ సంధించిన నవారో 13 విన్నర్లే కొట్టగలిగింది. -
జెస్సికా జోరు
న్యూయార్క్: ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ‘ఫోబియా’ను అమెరికా టెన్నిస్ ప్లేయర్ జెస్సికా పెగూలా అధిగమించింది. సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన జెస్సికా ఏకంగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఈసారి అమెరికా క్రీడాకారులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి అడుగు పెట్టగా... మహిళల సింగిల్స్‌లోనూ ఇద్దరు అమెరికా క్రీడాకారిణులు జెస్సికా పెగూలా, ఎమ్మా నవారో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం.సినెర్, డ్రేపర్ తొలిసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), 25వ ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సినెర్ 6–2, 1–6, 6–1, 6–4తో 2021 చాంపియన్, గత ఏడాది రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందగా... డ్రేపర్ 6–3, 7–5, 6–2తో పదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)ను ఓడించాడు. కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన డ్రేపర్ యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకున్న నాలుగో బ్రిటన్ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో గ్రెగ్ రుసెద్‌స్కీ (1997), టిమ్ హెన్మన్ (2004), ఆండీ ముర్రే (2008, 2011, 2012) ఈ ఘనత సాధించారు. ఏడో ప్రయత్నంలో...కెరీర్లో 23వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న 30 ఏళ్ల జెస్సికా గతంలో ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈ ఆరుసార్లూ ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. కానీ ఏడో ప్రయత్నంలో జెస్సికా సఫలమైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో క్వార్టర్ ఫైనల్లో జెస్సికా 6–2, 6–4తో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను కంగుతినిపించింది. 88 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టిన జెస్సికా 22 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘గతంలో పలుమార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఓడిపోయాను. సెమీఫైనల్ ఎప్పుడు చేరుకుంటావు అని నా శ్రేయోభిలాషులు అడుగుతుండేవారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. ఎట్టకేలకు క్వార్టర్ ఫైనల్‌ను దాటి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని జెస్సికా వ్యాఖ్యానించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)తో జెస్సికా; ఎమ్మా నవారో (అమెరికా)తో సబలెంకా (బెలారస్) తలపడతారు. -
US Open 2024: సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీ
యూఎస్ ఓపెన్ 2024లో భారత్ పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో 8వ సీడ్ బోపన్న-అల్దిలా సుత్జియాది(ఇండోనేషియా) జోడీ 3-6, 4-6 తేడాతో అమెరికా జంట డొనాల్డ్ యంగ్-టేలర్ టౌన్సెండ్ చేతిలో ఓటమిపాలైంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న- సుత్జియాది జోడీ నాలుగో సీడ్ మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)-క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై 7-6(7-4), 2-6, 10-7 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది.అంతకుముందు పురుషుల డబుల్స్‌లోనూ బోపన్న- ఎబ్డెన్ జోడీ మూడో రౌండ్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న – ఎబ్డెన్ జోడీ.. మాగ్జిమో గొంజాలెజ్, అండ్రెస్ మొల్తెనీ జోడీ చేతిలో 1-6, 5-7 తేడాతో ఖంగుతింది.పురుషులు సింగిల్స్ విషయానికొస్తే.. వరల్డ్ నెంబర్‌వన్ జనెక్ సినర్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. సెమీస్ బెర్త్ కోసం సినర్ మాజీ ఛాంపియన్ డానిల్ మెద్వెదెవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. -
U S Open 2024: కోకో గాఫ్ అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా) ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 3–6తో ఓడిపోయింది. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో గాఫ్ ఏకంగా 19 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. కేవలం 14 విన్నర్స్ కొట్టిన కోకో 60 అనవసర తప్పిదాలు చేసింది. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/2), 4–6, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, సబలెంకా 6–2, 6–4తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలి యా) ద్వయం 1–6, 5–7తొ మాక్సిమో–మొల్తాని (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సినెర్ సులువుగా...
న్యూయార్క్: ఈ ఏడాది దూకుడు మీదున్న ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ యానిక్ సినెర్ (ఇటలీ) సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సినెర్ ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలవడంతోపాటు మరో నాలుగు టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు, వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సినెర్... యూఎస్ ఓపెన్‌లో తనకు క్లిష్టతరమైన ప్రత్యర్థులు మూడో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)లు ఇంటిముఖం పట్టడంతో టైటిల్ ఫేవరెట్‌గా అవతరించాడు. సినెర్తోపాటు మాజీ చాంపియన్, ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) వరుసగా ఆరో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... పదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. వరుస సెట్లలో... పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సినెర్ 6–1, 6–4, 6–2తో గంటా 53 నిమిషాల్లో క్రిస్టోఫర్ ఒ కానెల్ (ఆ్రస్టేలియా)పై అలవోక విజయం సాధించాడు. ఏకంగా 15 ఏస్‌లు సంధించిన సినెర్, 46 విన్నర్లు కొట్టాడు. మిగతా మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–4, 6–3తో ఫ్లావియో కొబొలి (ఇటలీ)పై, పదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 6–3, 6–7 (4/7), 6–0, 6–0తో ఇవాన్స్ (బ్రిటన్)పై, తాజా వింబుల్డన్ క్వార్టర్ ఫైనలిస్ట్, 14వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–7 (5/7), 6–3, 6–1, 7–6 (7/3)తో గాబ్రియెల్ డియాలో (కెనడా)పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్లో పౌలా బదోసా మహిళల సింగిల్స్‌లో 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బదోసా 6–1, 6–2తో యాఫన్ వాంగ్ (చైనా)పై గెలిచి ఐదో ప్రయత్నంలో ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు మాజీ చాంపియన్ (2022), టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఐదోసీడ్ జాస్మిన్ పావ్లీని (ఇటలీ), ఆరో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–2తో 25వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై సునాయాసంగా గెలిచింది. ఐదో సీడ్ పావ్లీని (ఇటలీ) 6–3, 6–4తో 30వ సీడ్ పుతిన్త్సెవ (కజకిస్తాన్)పై గెలుపొందగా, ఆరో సీడ్ పెగూలా (అమెరికా) 6–3, 6–3తో బోజెస్ మనెరియో (స్పెయిన్)ను ఓడించింది. మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–3, 6–2తో జెస్సికా పొంచెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించగా, 16వ సీడ్ లుడ్మిలా సామ్సోనొవా (రష్యా) 6–1, 6–1తో ఆష్లిన్ క్రుయెగెర్ (అమెరికా)పై నెగ్గింది. ‘మిక్స్డ్’ క్వార్టర్స్‌లో బోపన్న జోడీ భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇండోనేసియన్ భాగస్వామి అల్దిలా సుత్జియదితో కలిసి ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న జంట రెండో రౌండ్లో 0–6, 7–6 (7/5), 10–7తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–సుత్జియది జోడీ నాలుగో సీడ్ మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా)–క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జంటతో తలపడుతుంది. ఎబ్డెన్ పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న భాగస్వామి! ఇదివరకే పురుషుల డబుల్స్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మరోవైపు పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం 2–6, 2–6తో టాప్ సీడ్ మార్సెల్ గ్రెనోలర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడింది. -
జొకోవిచ్‌కు షాక్
న్యూయార్క్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ గెలిచి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసే లక్ష్యంతో యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆ కల నెరవేరేందుకు మరికొంత ఆగాల్సిందే. పారిస్ ఒలింపిక్స్ స్వర్ణం తర్వాత అమిత విశ్వాసంతో ఈ టోర్నీ బరిలోకి దిగి గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన జొకోవిచ్ అనూహ్యంగా మూడో రౌండ్లోనే వెనుదిరిగాడు.పురుషుల సింగిల్స్‌లో క్రితం రోజు 2022 చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ నిష్క్ర మించగా... జొకో ఆట మూడో రౌండ్లో ముగిసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో అతను 4–6, 4–6, 6–2, 4–6తో 28వ సీడ్ అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో కంగుతిన్నాడు. 37 ఏళ్ల వెటరన్ స్టార్ 16 ఏస్‌లు సంధించినప్పటికీ అదేపనిగా 14 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. దిగ్గజానికి దీటుగా 15 ఏస్‌లు కొట్టిన పాపిరిన్ కేవలం 6 డబుల్ ఫాల్ట్‌లే చేశాడు. జొకో 40 విన్నర్లకే పరిమితమైతే... 25 ఏళ్ల ఆ్రస్టేలియన్ 50 విన్నర్లు కొట్టి మ్యాచ్‌ను తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో పదిసార్లు ఫైనల్ చేరిన రెండో సీడ్ జొకోవిచ్ ఇందులో నాలుగు టైటిళ్లు (2011, 2015, 2018, 2023) సాధించాడు. 2007, 2010, 2012, 2013, 2016, 2021లలో రన్నరప్‌గా నిలిచాడు. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న సెర్బియన్ సూపర్‌స్టార్ 17 ఏళ్ల తర్వాత మూడో రౌండ్లో ఇంటిదారి పట్టాడు. యూఎస్ ఓపెన్ ఆడిన తొలినాళ్లలో రెండుసార్లు (2005, 2006) మాత్రమే అతను మూడో రౌండ్లో ని్రష్కమించాడు. ఈ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో రెండుసార్లు నాలుగో రౌండ్ మినహా ప్రతీసారి సెమీస్ లేదంటే ఫైనల్ చేరిన ఘనత జొకోవిచ్ సొంతం. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 5–7, 7–5, 6–1, 6–3తో థామస్ ఎచెవెరి (అర్జెంటీనా)పై, ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 7–5, 6–4తో జిరి లెహెక (చెక్‌రిపబ్లిక్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–7 (1/7), 3–6, 6–0, 6–3, 6–1తో జన్చెంగ్ షాంగ్ (చైనా)పై, 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–3, 6–4, 6–2తో ఫ్రాన్సిస్కొ కొమెసన (అర్జెంటీనా)పై విజయం సాధించారు. తొమ్మిదో సీడ్ గ్రిగొర్ డిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–3, 6–1తో టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. మూడో రౌండ్లోకి యూకీ బాంబ్రి జోడీ భారత టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, యూకీ బాంబ్రి పురుషుల డబుల్స్‌లో వారి భాగస్వాములతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో 2వ సీడ్ బోపన్న–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 6–2, 6–4తో కార్బలెస్ బేనా (స్పెయిన్)–ఫెడెరికొ కారియా (అర్జెంటీనా) జంటపై గెలిచింది. అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)తో జోడీకట్టిన యూకీ బాంబ్రి రెండో రౌండ్లో 4–6, 6–3, 7–5తో 15వ సీడ్ క్రాజిసెక్ (అమెరికా)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటపై విజయం సాధించింది. అయితే మరో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీకి రెండో రౌండ్లో చుక్కెదురైంది. బాలాజీ–గైడో అండ్రియోజ్జి (అర్జెంటీనా) ద్వయం 6–7 (4/7), 4–6తో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడింది.2002తర్వాత ‘బిగ్–3’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్ ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవని సీజన్‌గా 2024 నిలువనుంది. వరుసగా 21 ఏళ్ల పాటు (2003–2023) ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కనీసం ఒక గ్రాండ్‌స్లామ్ అయినా నెగ్గారు. 2017తర్వాత జొకోవిచ్ కనీసం ఒక్క గ్రాండ్‌స్లామ్ అయినా గెలవని సీజన్‌గా 2024 నిలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్లలో ఓడిన జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్‌కు ముందు తప్పుకున్నాడు. -
అత్యంత చెత్తగా ఆడాను.. అందుకే ఇలా: జొకోవిచ్
యూఎస్ ఓపెన్-2024 పురుషుల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లోనే ఇంటిబాటపట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన 28వ ర్యాంకర్ అలెక్సీ పాప్రిన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అలెక్సీ 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో జొకోవిచ్పై నెగ్గి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సెర్బియా స్టార్ జొకోవిచ్.. 18 ఏళ్ల చరిత్రలో ఇలా ఆరంభ దశలోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. తద్వారా.. రికార్డు స్థాయిలో ఇరవై ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకునే సువర్ణావకాశాన్ని ప్రస్తుతానికి కోల్పోయాడు.అత్యంత చెత్తగా ఆడాను.. అందుకే ఇలాఈ నేపథ్యంలో జొకోవిచ్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లోనే అత్యంత చెత్తగా ఆడిన సందర్భం ఇది. ఆరంభం నుంచి మూడో రౌండ్ దాకా బాగానే ఆడినా.. ఇక్కడ మాత్రం తడబడ్డాను. ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఇక్కడకు రావడం ప్రభావం చూపింది. శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. యూఎస్ ఓపెన్‌లో కచ్చితంగా పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను. ప్రస్తుతానికైతే ఎటువంటి ఫిట్నెస్ సమస్యలు లేవు’’ అని పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల వ్యక్తిగత విభాగం ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ను ఓడించి జొకోవిచ్ పసిడి పతకం గెలిచిన విషయం తెలిసిందే.25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అప్పుడు అలా చేజారిందిఆస్ట్రేలియా ఓపెన్-2024లో జెనిక్ సినర్‌తో సెమీస్‌లో జొకోవిచ్ ఓడిపోగా.. సినర్ ఫైనల్లో గెలిచి చాంపియన్ అయ్యాడు. అంతకుముందు.. కార్లోజ్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, వింబుల్డన్ ట్రోఫీ ఎగరేసుకుపోయాడు.అల్కరాజ్ కూడా ఇంటికే!ఇక ఈ ఏడాది యూఎస్ పురుషుల సింగిల్స్ విభాగంలో 2022 చాంపియన్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. మూడో సీడ్ అల్కరాజ్ను నెదర్లాండ్స్ టెన్నిస్ ప్లేయర్, 74వ ర్యాంకర్ బోటిక్ వాన్ డె జాండ్‌షుల్ప్ వరుస సెట్లలో ఓడించి తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. -
US Open: ప్రిక్టార్టర్స్లో కోకో గాఫ్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ 3–6, 6–3, 6–3తో 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఏడో సీడ్ పౌలా కిన్వెన్ జెంగ్ (చైనా), 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కిన్వెన్ జాంగ్ 6–2, 6–1తో జూలీ నెమియర్ (జర్మనీ)పై, పౌలా బదోసా 4–6, 6–1, 7–6 (10/8)తో ఎలెనా రూస్ (రొమేనియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–3, 7–5తో సాండెర్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీపై విజయం సాధించింది. చెన్నైపై యు ముంబా పైచేయి చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో భాగంగా సీనియర్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మానవ్ ఠక్కర్ విజయం సాధించాడు. దీంతో మానవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యు ముంబా టీటీ జట్టు 8–7తో చెన్నై లయన్స్‌పై గెలిచింది. ఈ ఫలితంతో యు ముంబా టీటీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.‘టై’లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో మానవ్ 6–11, 11–8, 11–9తో శరత్ కమల్‌పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మానవ్–మారియా జంట 11–7, 11–10, 11–4తో శరత్–సకురా మోరీ ద్వయంపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో అరునా ఖాద్రి 10–11, 11–9, 11–7తో రోలాండ్పై విజయం సాధించగా.. సుతీర్థ ముఖర్జీ 8–11, 10–11, 7–11 సాకురా మోరీ చేతిలో మారియా 10–11, 8–11, 11–10తో మౌమా దాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
అల్కరాజ్ అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుక్రవారం పెను సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో 2022 చాంపియన్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అల్కరాజ్ను నెదర్లాండ్స్‌కు చెందిన ప్రపంచ 74వ ర్యాంకర్ బోటిక్ వాన్ డె జాండ్‌షుల్ప్ వరుస సెట్లలో ఓడించి తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయం సాధించాడు. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోటిక్ 6–1, 7–5, 6–4తో మూడో సీడ్ అల్కరాజ్ను ఓడించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. యూఎస్ ఓపెన్‌లో అల్కరాజ్ రెండో రౌండ్లోనే ఓడిపోవడం ఇదే ప్రథమం. 2021లో క్వార్టర్ ఫైనల్ చేరిన అతను, 2022లో ఏకంగా విజేతగా అవతరించాడు. 2023లో అల్కరాజ్ సెమీఫైనల్లో ని్రష్కమించాడు. అల్కరాజ్తో మ్యాచ్‌లో బోటిక్ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 22 విన్నర్స్ కొట్టిన బోటిక్ 21 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు అల్కరాజ్ 27 అనవసర తప్పిదాలు చేశాడు. ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), పదో సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్లోకి ప్రవేశించగా... 16వ సీడ్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా) రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. -
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం
యూఎస్ ఓపెన్ 2024 పెను సంచలనం నమోదైంది. ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లోనే ఓటమిపాలయ్యాడు. నెదర్లాండ్స్‌కు చెందిన 74వ ర్యాంక్ ప్లేయర్ బొటిక్ వాన్ డి జాండ్స్కల్ప్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.బొటిక్ 6-1, 6-5, 6-4 తేడాతో వరుస సెట్లలో అల్కరాజ్పై విజయం సాధించాడు. 2021 వింబుల్డన్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించడం అల్కరాజ్కు ఇది తొలిసారి.ఈ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు సాధించిన అల్కరాజ్ ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌తో పాటు యూఎస్ ఓపెన్ కూడా గెలిచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా నిలవాలనుకున్న అల్కరాజ్ ఆశలపై బొటిక్ నీళ్లు చల్లాడు.ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ జన్నిక్ సిన్నెర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కొకోగాఫ్, సబలెంకా కూడా రెండో రౌండ్‌ను దాటారు. అయితే నయోమి ఒసాకా రెండో రౌండ్లో పరాజయాన్ని చవిచూసింది. చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా ముచోవా ఒసాకాపై 6-3, 7-6 తేడాతో విజయం సాధించింది. -
కోకో జోరు
న్యూయార్క్: స్వదేశంలో తన జోరు కొనసాగిస్తూ... అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో అడుగుపెట్టిన మూడో సీడ్ కోకో గాఫ్ రెండో రౌండ్లో 6–4, 6–0తో ప్రపంచ 99వ ర్యాంకర్ తాత్యానా మరియా (జర్మనీ)పై గెలిచింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కోకో గాఫ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 28 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు నెగ్గిన కోకో 25 విన్నర్స్ కొట్టింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో లూసియా బ్రోన్జెట్టి (ఇటలీ)పై, మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–1, 6–4తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) వరుసగా మూడో ఏడాది మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్లో కిన్వెన్ జెంగ్ 6–7 (3/7), 6–1, 6–2తో ఎరికా ఆంద్రీవా (రష్యా)ను ఓడించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో 12వ సీడ్ దరియా కసత్కినా (రష్యా) 1–6, 6–7 (3/7)తో పేటన్ స్టెర్న్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. జొకోవిచ్ ముందుకు... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జొకోవిచ్ 6–4, 6–4, 2–0తో లాస్లో జెరె (సెర్బియా)పై, జ్వెరెవ్ 6–4, 7–6 (7/5), 6–1తో ముల్లర్ (ఫ్రాన్స్)పై, రూడ్ 6–4, 6–2, 2–6, 7–6 (7/3)తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. జెరెతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్లు గెలిచి, మూడో సెట్లో 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా జెరె వైదొలిగాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 5–7, 6–1, 6–2, 6–2తో రిండర్నీచ్ (ఫ్రాన్స్)పై, 13వ సీడ్ షెల్టన్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో అగుట్ (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–1, 6–1, 7–6 (7/4)తో హిజికాటా (ఆ్రస్టేలియా)పై గెలిచారు. -
తగ్గేదేలే..! టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుదీర్ఘ మ్యాచ్‌లు ఇవే
టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన ఏ ఆటగాడైనా గెలవాలనే కసితోనే పోరాడతాడు. కొందరు ప్లేయర్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చూస్తుండగానే మ్యాచ్‌ను లాగేసుకుంటే... మరికొందరు తుదికంటా పోరాడుతూ శక్తి మేరకు ప్రయత్నిస్తారు! టెన్నిస్ కోర్టులో అప్పుడప్పుడు సమఉజ్జీల సమరాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. శరీరంలో శక్తి క్షీణిస్తున్నా... చెమట ధారగా కారుతున్నా లెక్కచేయకుండా మైదానంలో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడినపుడు ఆ మ్యాచ్‌లు గంటలకొద్దీ సాగుతూ ఉంటాయి. ఇరువురు ప్లేయర్లు ‘తగ్గేదేలే’ అన్నట్లు చెలరేగిన మ్యాచ్‌లు సుదీర్ఘ పోరాటాలుగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంటున్నాయి. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అలా రికార్డుల్లోకెక్కిన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే... శారీరక శ్రమ అధికంగా ఉండే టెన్నిస్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగడం పరిపాటే. తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) మధ్య పోరు 5 గంటల 35 నిమిషాల పాటు సాగి అభిమానులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇదే సుదీర్ఘమైన మ్యాచ్ కాగా.. గతంలో వింబుల్డన్ టోరీ్నలో ఇంతకుమించిన మ్యాచ్‌లు చాలా జరిగాయి. 2010 వింబుల్డన్ టోర్నీలో జాన్ ఇస్నెర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన పోరు ఇందులో ముందు వరుసలో నిలుస్తుంది.వర్షం అంతరాయం కలిగించడంతో... వరుసగా మూడు రోజులు సాగిన ఈ మారథాన్ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన పోరుగా రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే 7 గంటలకు పైగా సాగగా... మరో 14 మ్యాచ్‌లు ఆరు గంటలకు పైగా జరిగాయి. ప్లేయర్ల అలసట, అభిమానుల అసౌకర్యం, నిర్వాహకులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన టోర్నీల్లోని చివరి సెట్లోనూ ‘టైబ్రేకర్’ నిబంధనలు తీసుకొచ్చారు. 1970 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ‘టైబ్రేకర్’ అమలు చేస్తున్నారు. దీంతో సుదీర్ఘ పోరాటాలకు ఒకింత బ్రేక్ పడింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో... 6 గంటల 33 నిమిషాలుసీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ మారథాన్ మ్యాచ్‌లకు కొదువలేదు. 2004 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుదీర్ఘ మ్యాచ్ జరిగింది. రెండు రోజుల పాటు సాగిన పోరులో ఫ్రాన్స్‌కే చెందిన ఫాబ్రిస్ సాంతోరో, ఆర్నాడ్ క్లెమెంట్ తుదికంటా పోరాడారు. 6 గంటల 33 నిమిషాల తర్వాత ఫాబ్రిస్ సాంతోరో 6–4, 6–3, 6–7 (5/7), 3–6, 16–14తో ఆర్నాడ్ క్లెమెంట్పై గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇదే సుదీర్ఘ మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. వింబుల్డన్‌లో ఇస్నెర్ డబుల్ ధమాకాటెన్నిస్ చరిత్రలో అత్యంత పురాతన గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన వింబుల్డన్‌లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నెర్ ఒకటికి రెండుసార్లు ఇలాంటి సుదీర్ఘ మ్యాచ్‌ల్లో భాగస్వామి అయ్యాడు. 2010 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఇస్నెర్, నికోలస్ మహుత్ మధ్య పోరు వరుసగా మూడు రోజుల పాటు నడిచింది. వర్షం కారణంగా అంతరాయాల నడుము జరిగిన పోరులో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై విజయం సాధించాడు. 11 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ పోరాటం... ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యంత సుదీర్ఘ పోరుగా చరిత్రకెక్కింది. ఇరువురు ఆటగాళ్లు గంటలకొద్దీ పట్టు వదలకుండా పోరాడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. మరో ఎనిమిదేళ్ల తర్వాత 2018 వింబుల్డన్ సెమీఫైనల్లో మరోసారి ఇలాంటి సుదీర్ఘ పోరాటమే జరిగింది. 6 గంటల 36 నిమిషాల పాటు సాగిన పోరులో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో ఇస్నెర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో... 5 గంటల 53 నిమిషాలుటెన్నిస్ చరిత్రలో దిగ్గజ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా సుదీర్ఘ పోరాటాల్లో భాగస్వాములయ్యారు. గిరిగీసి బరిలోకి దిగితే అంతుచూసేవరకు వదలని స్వభావం గల ఈ ఇద్దరూ ఎన్నో సార్లు హోరాహోరీగా తలబడ్డారు. అందులో 2012 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఒకటి. 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్ 5–7, 6–4, 6–2, 6–7 (5/7), 7–5తో నాదల్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి)అత్యంత సుదీర్ఘంగా సాగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్గానూ ఈ పోరు చరిత్రకెక్కింది. 1975కంటే ముందు టైబ్రేక్ నిబంధన లేదు.ఫలితంగా డేవిస్‌కప్‌లోనూ ఎన్నో సుదీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. 1975 తర్వాత నిర్ణాయక ఐదో సెట్ మినహా ఇతర సెట్లలో టైబ్రేక్లను అమలు చేయడం మొదలుపెట్టారు. 12 పాయింట్ల టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన ప్లేయర్‌కు సెట్ లభించేది. ఒకవేళ మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే స్కోరు 5–5 తర్వాత రెండు గేమ్‌ల ఆధిక్యం సంపాదించిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటించేవారు. 2016 నుంచి డేవిస్ కప్‌లోనూ నిబంధనలు మార్చారు. మ్యాచ్‌లను ‘బెస్ట్ ఆఫ్ 5 సెట్స్’ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్ ఆఫ్ 3 సెట్స్’గా నిర్వహించడం ప్రారంభించారు. సెట్లో స్కోరు 6–6తో సమంగా నిలిస్తే టైబ్రేక్‌ను అమలు చేస్తున్నారు.డేవిస్ కప్‌లో సుదీర్ఘ పురుషుల సింగిల్స్ మ్యాచ్లుసమయం- విజేత -పరాజిత- ఏడాది- స్కోరు 👉6గం:43ని- లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)- జొవా సౌజా (బ్రెజిల్)- 2015- 7–6 (7/4), 7–6 (7/5), 5–7, 5–7, 15–13 👉6గం:22ని-జాన్ మెకన్రో (అమెరికా)-విలాండర్ (స్వీడన్) -1982- 9–7, 6–2, 15–17, 3–6, 8–6 👉6గం:21ని-బోరిస్ బెకర్ (జర్మనీ)-జాన్ మెకన్రో (అమెరికా)-1987-6–3, 6–2, 4–6, 14–12 👉6గం:15ని-జోస్ లూయిస్ క్లెర్క్ (అర్జెంటీనా)-జాన్ మెకన్రో (అమెరికా)-1980-6–3, 6–2, 4–6, 14–12 👉6గం: 04ని-హార్స్ స్కాఫ్ (ఆ్రస్టియా)- విలాండర్ (స్వీడన్)-1989-6–7 (5/7), 7–6 (9/7), 1–6, 6–4, 9–7 – సాక్షి క్రీడావిభాగం -
5 గంటల 35 నిమిషాలు
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో బుధవారం అద్భుతం చోటు చేసుకుంది. ఈ టోర్నీ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ నమోదైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 184వ ర్యాంకర్ డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్) 5 గంటల 35 నిమిషాల్లో 6–7 (6/8), 7–6 (7/2), 7–6 (7/4), 4–6, 6–4తో ప్రపంచ 22వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. తొలి సెట్ 68 నిమిషాలు, రెండో సెట్ 67 నిమిషాలు, మూడో సెట్ 72 నిమిషాలు, నాలుగో సెట్ 67 నిమిషాలు, ఐదో సెటస్ 61 నిమిషాలు జరిగాయి. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్‌లో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌గా ఇవాన్స్, ఖచనోవ్ మ్యాచ్ గుర్తింపు పొందింది. 1992లో స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), మైకేల్ చాంగ్ (అమెరికా) మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ 5 గంటల 26 నిమిషాలు సాగింది. ఆనాటి మ్యాచ్‌లో చాంగ్‌పై గెలిచిన ఎడ్బర్గ్ ఫైనల్లో పీట్ సంప్రాస్ (అమెరికా)ను కూడా ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఖచనోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో ఇవాన్స్ ఒకదశలో 0–4తో వెనుకబడి ఓటమికి చేరువయ్యాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన ఇవాన్స్ అనూహ్యంగా వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు విజయాన్ని కూడా అందుకున్నాడు. సిట్సిపాస్‌కు షాక్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) శ్రమించి గెలుపొందగా... 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.సినెర్ 2–6, 6–2, 6–1, 6–2తో మెకంజీ మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, అల్కరాజ్ 6–2, 4–6, 6–3, 6–1తో లీ టు (ఆ్రస్టేలియా)పై, మెద్వెదెవ్ 6–3, 3–6, 6–3, 6–1తో దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)పై నెగ్గారు. సిట్సిపాస్ 6–7 (5/7), 6–4, 3–6, 5–7తో కొకినాకిస్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు. రాడుకానూ ఓటమి మహిళల సింగిల్స్‌లో 2021 చాంపియన్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్), రన్నరప్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా)... 2019 విజేత బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. సోఫియా (అమెరికా) 6–1, 3–6, 6–4తో రాడుకానూపై, పొటపోవా (రష్యా) 2–6, 6–4, 7–5తో లేలా ఫెర్నాండెజ్‌పై, ఐదో సీడ్ పావ్లీని (ఇటలీ) 6–7 (5/7), 6–2, 6–4తో బియాంకాపై గెలుపొందారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 5–7తో రూస్ (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)... శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) జోడీలు రెండో రౌండ్లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–4తో రియాన్ సెగర్మన్–ప్యాట్రిక్ ట్రహక్ (అమెరికా) జంటపై... బాలాజీ–ఆండ్రెజి జోడీ 5–7, 6–1, 7–6 (12/10)తో డానిల్ (న్యూజిలాండ్)–వరేలా (మెక్సికో) జంటపై గెలుపొందాయి. -
US Open 2024: తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సుమిత్ నగాల్
భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. ప్రపంచ 40వ ర్యాంకర్ టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 73వ ర్యాంకర్ సుమిత్ 1-6, 3-6, 6-7 (6/8)తో ఓడిపోయాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ రెండు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లో ఓడిన సుమిత్‌కు 1,00,000 డాలర్లు (రూ. 83 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. యూఎస్ ఓపెన్‌లో ఆడటం ద్వారా సుమిత్ తన కెరీర్లో తొలిసారి ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడిపోయిన సుమిత్ ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లో నిష్క్రమించాడు. -
US Open 2024: జొకోవిచ్ అలవోకగా..!
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ టైటిల్ వేటను సెర్బియా దిగ్గజం జొకోవిచ్ అలవోక విజయంతో ప్రారంభించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-2, 6-2, 6-4తో క్వాలిఫయర్ రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 2 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఎనిమిది ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి, 23 విన్నర్స్ కొట్టాడు. ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు.మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా), ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ 6-2, 6-0తో వర్వరా గ్రచెవా (ఫ్రాన్స్)ను ఓడించగా... సబలెంకా 6-3, 6-3తో ప్రిసిల్లా హాన్ (ఆస్ట్రేలియా)పై, టాప్ సీడ్ స్వియాటెక్ 6-4, 7-6 (8/6)తో కామిలా రఖిమోవా (రష్యా)పై గెలిచారు. -
US Open 2024: జ్వెరెవ్ శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో మాక్సిమిలన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2020 చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 13వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గంటా 50 నిమిషాల్లో 6–4, 6–2, 6–2తో థీమ్‌ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో కిన్వెన్ జెంగ్ 4–6, 6–4, 6–2తో అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. 12వ సీడ్ దరియా కసత్కినా (రష్యా), 24వ సీడ్ డొనా వెకిచ్ (క్రొయేíÙయా), 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు తొమ్మిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) గాయం కారణంగా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యఫాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సాకరి తొలి సెట్‌ను 2–6తో కోల్పోయింది. ఈ దశల గాయం కారణంగా సాకరి మ్యాచ్ నుంచి తప్పుకుంది. -
25వ గ్రాండ్‌స్లామ్ వేటలో...
2008లో నొవాక్ జొకోవిచ్ తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను గెలిచాడు. ఈ క్రమంలో వరుసగా గత 11 గ్రాండ్‌స్లామ్‌లను పంచుకున్న ఫెడరర్, నాదల్ జోరును నిలువరించాడు. 2011లో జొకోవిచ్ తొలి సారి వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన కొత్త అధ్యాయానికి తెర తీశాడు. ఇప్పుడు 2024లో తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి ఆల్‌టైమ్ రికార్డును సృష్టించేందుకు అతను సిద్ధమయ్యాడు. యూఎస్ ఓపెన్‌లో సమరానికి జొకోవిచ్ సై అంటున్నాడు. ట్రోఫీని అందుకొని జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టిస్తాడా అనేది ఆసక్తికరం. న్యూయార్క్: సీజన్లో చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియా స్టార్, వరల్డ్ నంబర్ 2 నొవాక్ జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో అతను విజేతగా నిలిస్తే మార్గరెట్ కోర్ట్ (24)ను దాటి అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. 2023లో ఇక్కడ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తే ఫెడరర్ (2004–08) తర్వాత టైటిల్ నెలబెట్టుకున్న మొదటి ఆటగాడిగా కూడా నిలుస్తాడు. తన తొలి రౌండ్లో 37 ఏళ్ల జొకోవిచ్ 138వ ర్యాంకర్ రాడు అల్బాట్ (మాల్డోవా)తో తలపడతాడు. 18వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడనున్న జొకోవిచ్ ఈ టోర్నీలో 2005లో తొలిసారి బరిలోకి దిగి మూడో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. అయితే 2011, 2015, 2018, 2023లలో నాలుగు సార్లు టైటిల్ నెగ్గిన అతను మరో ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ‘ఎప్పుడైనా గెలుపు ఒక్కటే లక్ష్యం. బాగా ఆడి ముందుగా ఫైనల్ వరకు చేరడం, ఆ తర్వాత టైటిల్ కోసం పోరాడటమే నాకు తెలుసు. ఈ తరహా దృక్పథంలో ఇప్పుడు కూడా ఎలాంటి మార్పూ లేదు’ అని జొకొవిచ్ అన్నాడు. ఇటీవలే పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకున్న జొకోవిచ్ మరింత ఉత్సాహంతో యూఎస్ ఓపెన్‌కు సన్నద్ధమయ్యాడు. ‘నా జీవితంలో ఒలింపిక్ స్వర్ణం అతి పెద్ద ఘనత. నా కల నెరవేరింది. టెన్నిస్ కోర్టులో అలాంటి భావోద్వేగాలు నేను ఎప్పుడూ ప్రదర్శించలేదు. అంతకుముందు సెర్బియా ఫ్లాగ్‌బేరర్‌గా నిలబడిన ఘట్టం అన్ని గ్రాండ్‌స్లామ్ విజయాలకంటే మిన్న. అన్నీ గెలిచేశావు కదా ఇంకా ఏం కావాలి అని కొందరు అడుగుతున్నారు. అయితే నాలో ఇంకా గెలవాలనే తపన ఉంది. మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటా. టెన్నిస్ ఆడేందుకు, చూసేందుకు ఇంకా చాలా మందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా’ అని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలు టెన్నిస్‌కు మూలస్తంభాల్లాంటివని... ఇలాంటి చోట బాగా ఆడేందుకు ప్రేరణ లేకపోతే ఇంకెక్కడా ఆడలేరని అభిప్రాయపడ్డాడు. -
యూఎస్ ఓపెన్‌కు జబర్ దూరం
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ నుంచి 2022 రన్నరప్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) వైదొలిగింది. భుజం గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో ఉన్న జబర్ వివరించింది. 2022లో కెరీర్ బెస్ట్ ప్రపంచ రెండో ర్యాంకర్‌గా నిలిచిన జబర్ ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. వరుసగా రెండేళ్లు (2022, 2023) వింబుల్డన్ టోరీ్నలో ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్‌గా నిలిచిన జబర్ ఈ సీజన్లో మొత్తం 15 టోరీ్నలు ఆడింది. అయితే ఆమె ఒక్క టోర్నీలోనూ సెమీఫైనల్ చేరలేకపోయింది.ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడిన జబర్... ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో, వింబుల్డన్ టోరీ్నలో మూడో రౌండ్లో ని్రష్కమించింది. ఈనెల 26న న్యూయార్క్‌లో మొదలయ్యే యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్ (అమెరికా) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. -
డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ
టెక్సాస్: యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–11, 21–19తో సెయి పె షాన్–హంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రియాన్షు 21–18, 21–16తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ)పై, మాళవిక 15–21, 21–19, 21–14తో తెరెజా స్వబికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
నా ఆప్త మిత్రుడు కోబీకి అంకితమిస్తున్నా.. జొకోవిచ్ భావోద్వేగం! వీడియో వైరల్
Novak Djokovic Pays Glorious Tribute To Kobe Bryant: ‘‘మీ అందరి ముందు నిలబడి నేను 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గురించి మాట్లాడతానని ఏనాడూ ఊహించలేదు. ఇది నిజమవుతుందని కూడా అనుకోలేదు. కానీ గత రెండేళ్లలో కొత్త చరిత్ర సృష్టించే అవకాశం నా ముందు ఉందనిపించింది. అందివచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అనుకున్నాను. నా శరీరం సహకరించినంత వరకు, నా శిక్షణ సిబ్బంది, కుటుంబసభ్యుల సహకారం ఉన్నంతవరకు ఈ జైత్రయాత్రను కొనసాగిస్తాను. అత్యున్నతస్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఆటకు ఇప్పుడే వీడ్కోలు పలికే ఆలోచన లేదు. ఈ విజయాన్ని నా ఆప్త మిత్రుడు, మూడేళ్ల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్‌కు అంకితం ఇస్తున్నాను. 24వ గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ గెలిస్తే కోబీ బ్రయాంట్ ఫొటో ఉన్న టీ షర్ట్‌ను ట్రోఫీ ప్రదానోత్సవంలో ధరించాలని అనుకున్నాను’’ అని సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. యూఎస్ ఓపెన్-2023లో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన జొకోవిచ్.. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ గెలిచి చరిత్రకెక్కాడు. ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించాడు. వరల్డ్‌నంబర్ 1 తద్వారా యూఎస్ ఓపెన్ విజేతగా నిలవడంతో పాటు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన జొకోవిచ్.. తన స్నేహితుడు కోబీ బ్రియాంట్‌ను గుర్తు చేసుకున్నాడు. అతడి ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించి నివాళి అర్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. రికార్డుల జొకోవిచ్ కాగా ఈ విజయంతో ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్‌ను నాలుగుసార్లు చొప్పున (2011, 2015, 2021, 2023) సాధించిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. అదే విధంగా.. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో కానర్స్ (109; అమెరికా), ఫెడరర్ (103; స్విట్జర్లాండ్) తర్వాత జొకోవిచ్(96) మూడో స్థానంలో ఉన్నాడు. తీరని విషాదం ‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం విదితమే. దీంతో కోబీ కుటుంబం సహా అతడి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఈ ఘటన జరిగి మూడేళ్లకు పైనే అయింది. చదవండి: వాళ్లను ఉతికి ఆరేశారు! పాక్ మరీ చెత్తగా.. శ్రీలంక తక్కువేం కాదు! Novak hits 24 and pays tribute to the late Kobe Bryant 💙 pic.twitter.com/rDXVUvYe1Z — US Open Tennis (@usopen) September 10, 2023 -
US Open 2023: 24: తగ్గేదేలే...
న్యూయార్క్: 36 ఏళ్ల వయసు వచ్చినా తన ఆటను మరింత పదునెక్కిస్తూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన జొకోవిచ్ సీజన్లో చివరిదైన యూఎస్ ఓపెన్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఐదు గంటలకు ముగిసిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. 3 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. విజేత జొకోవిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 24 కోట్ల 90 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. కెరీర్లో 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్‌కు తుది పోరులో మెద్వెదెవ్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. 30 లేదా 40 షాట్లతో కూడిన ర్యాలీలను చాలాసార్లు జొకోవిచ్ పాయింట్‌తో ఫినిష్ చేయగా... కొన్నిసార్లు మెద్వెదెవ్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని రెండో గేమ్‌లోనే మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
యూఎస్ ఓపెన్ విజేతగా జొకోవిచ్.. మార్గరెట్ కోర్టు రికార్డు సమం
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్-2023 మెన్స్ సింగిల్ విజేతగా జొకోవిచ్ నిలిచాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌ను చిత్తు చేసిన జొకోవిచ్.. నాలుగో సారి యూఎస్ ఓపెనర్ ఛాంపియన్‌గా అవతరించాడు. అంతకుముందు 2021లో ఇదే టోర్నీ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి మెద్వెదేవ్ చరిత్రపుటలకెక్కాడు. దీంతో ఈసారి ఫైనల్ పోరు రసవత్తరంగా సాగుతుందని అంతా భావించారు. కానీ జకోవిచ్ మాత్రం ప్రత్యర్ధికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ తుది పోరులో వరుస సెట్లలో 6-3, 7-6 (7-5), 6-3 తేడాతో మూడో సీడ్ మెద్వెదెవ్‌ను జకో ఓడించాడు. ఈ విజయంతో కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జకో తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన క్రీడాకారిణిగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్టు (24) రికార్డును ఈ సెర్భియా యోదుడు సమం చేశాడు. ఏడాది చాంపియన్‌గా నిలిచిన జకోవిచ్‌కు రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. చదవండి: Asia Cup 2023: షాహీన్ అఫ్రిది మంచి మనసు.. బుమ్రాకు సర్ప్రైజ్ గిప్ట్! వీడియో వైరల్ Novak Djokovic continues to write history.@AustralianOpen | @rolandgarros | @Wimbledon pic.twitter.com/RrBFOQdiN6 — US Open Tennis (@usopen) September 11, 2023 -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. టైటిల్ విజేతగా 19 ఏళ్ల కోకో గాఫ్
యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన సెకెండ్ సీడ్ అరీనా సబలెంకాను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గాఫ్ కైవసం చేసుకుంది. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 2-6, 6-3, 6-2 తేడాతో 19 ఏళ్ల కోకో గాఫ్ ఓడించింది. తొలి సెట్లో కోకో గాఫ్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ తర్వాతి రెండు సెట్లలో తిరిగి పుంజుకుని ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక చాంపియన్‌గా నిలిచిన గాఫ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. సెరెనా విలిమమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ ట్రోఫీని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గౌఫ్ నిలిచింది. చదవండి: దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా! -
ఫైనల్లో జొకోవిచ్, మెద్వెదెవ్
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరో అడుగు దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పదో సారి ఫైనల్‌కు చేరిన ఈ సెర్బియా దిగ్గజం తుది పోరుకు సన్నద్ధమయ్యాడు. అయితే అతని టైటిల్ వేటలో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ అడ్డుగా ఉన్నాడు. ఇదే వేదికపై తన ఏకైక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మెద్వెదెవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. రెండేళ్ల క్రితం 2021లో యూఎస్ ఓపెన్ ఫైనల్ వీరిద్దరి మధ్య జరిగింది. అనూహ్య ప్రదర్శనతో చెలరేగిన మెద్వెదెవ్ వరుస సెట్లలో జొకోను ఓడించి విజేతగా నిలిచాడు. ఈ సారి గత పోరుకు ప్రతీకారం తీర్చుకోవాలని నొవాక్ పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 7–6 (7/4) స్కోరుతో అమెరికన్ కుర్రాడు బెన్ షెల్టన్‌పై విజయం సాధించగా... మెద్వెదెవ్ వరల్డ్ నంబర్‌వన్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)కు షాక్ ఇచ్చాడు. సెమీస్ పోరులో మెద్వెదెవ్ 7–6 (7/3), 6–1, 3–6, 6–3తో అల్కరాజ్ను ఓడించాడు. ఏకపక్షంగా... గ్రాండ్‌స్లామ్‌లో హార్డ్కోర్ట్ వేదికపై తన 100వ మ్యాచ్ బరిలోకి దిగిన జొకోవిచ్ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు. 149 కిలోమీటర్ల వేగంతో మెరుపు సరీ్వస్లే బలంగా షెల్టన్ పోటీ ఇచ్చినా చివరకు దిగ్గజం ముందు తలవంచక తప్పలేదు. మూడో సెట్లో ఒక దశలో 5–4తో సెట్ కోసం సర్వీస్ చేసినా...జొకో ప్రశాంతంగా ప్రత్య ర్థిని నిలువరించగలిగాడు. 2 గంటల 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరూ చెరో 5 ఏస్‌లు సంధించారు. అయితే జొకోవిచ్ 25 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్‌తో పోలిస్తే 43 తప్పులు చేసిన షెల్టన్ మూల్యం చెల్లించుకున్నాడు. 36 ఏళ్ల జొకోవిచ్‌కు ఇది 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం కాగా...టైటిల్ గెలిస్తే ఓపెన్ ఎరాలో అతి పెద్ద వయసులో యూఎస్ ఓపెన్ నెగ్గిన ఆటగాడిగా నిలుస్తాడు. యూఎస్ ఓపెన్‌లో గతంలో 9 సార్లు ఫైనల్ చేరిన జొకోవిచ్ 3 టైటిల్స్ సాధించి 6 సార్లు ఓడాడు. మరో టైటిల్ వేటలో... రెండో సెమీస్‌లో సగటు అభిమాని ఊహించని ఫలితం వచ్చింది. ఈ సీజన్లో రెండు సార్లు అల్కరాజ్ చేతిలో ఓడిన రష్యా ఆటగాడు అసలు సమరంలో సత్తా చాటాడు. జొకోవిచ్–అల్కరాజ్ మధ్య టైటిల్ పోరు అంటూ సాగిన అంచనాలను అతను బద్దలుకొట్టాడు. తొలి సెట్ హోరాహోరీగా సాగినా ఒక దశలో 19 పాయింట్లలో 16 నెగ్గి మెద్వెదెవ్ టైబ్రేక్‌లో సెట్ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో అల్కరాజ్ అవకాశం అందిపుచ్చుకున్నా, ఆ తర్వాత అతని జోరు సాగలేదు. మెద్వెదెవ్ 9 ఏస్‌లు కొట్టగా, అల్కరాజ్ ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోవడం ఈ మ్యాచ్‌లో అతని బలహీనతను చూపించింది. మెద్వెదెవ్ 10 డబుల్‌ఫాల్ట్‌లు చేసినా తుది ఫలితంపై అది ప్రభావం చూపించలేదు. -
బోపన్న జోడీ రన్నరప్‌తో సరి
న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాలని ఆశించిన భారత స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. శుక్రవారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్లో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ పరాజయం చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్స్, మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) ద్వయం 2 గంటల్లో 2–6, 6–3, 6–4తో బోపన్న–ఎబ్డెన్ జంటను ఓడించి వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా 1930 తర్వాత ఈ టోర్నీలో వరుసగా మూడేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. జాన్ డోగ్–జార్జి లాట్ (అమెరికా) జోడీ 1928, 1929, 1930లలో వరుసగా మూడేళ్లు ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది. విజేత రాజీవ్–సాలిస్బరీ జోడీకి 7 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 80 లక్షలు)... రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జంటకు 3 లక్షల 50 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా ఫలితంతో 43 ఏళ్ల 6 నెలల వయసున్న బోపన్న తన కెరీర్లో రెండోసారి పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 2010 యూఎస్ ఓపెన్‌లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో కలిసి ఆడిన బోపన్న డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం రోహన్ బోపన్న ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. 2017లో దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి బోపన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచాడు. బ్రేక్ పాయింట్ అవకాశాలు వృథా... రాజీవ్, సాలిస్బరీలతో జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం తొలి సెట్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అయితే రాజీవ్–సాలిస్బరీ ఆందోళన చెందకుండా రెండో సెట్లో పుంజుకున్నారు. ఆరో గేమ్‌లో బోపన్న–ఎబ్డెన్ సర్విస్‌ను బ్రేక్ చేసి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. అదే జోరులో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో సెట్లో బోపన్న జోడీ కీలకదశలో తడబడింది. 2–1తో ఆధిక్యంలో ఉన్నదశలో మూడో గేమ్‌లో మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సర్విస్‌ను నిలబెట్టుకున్న రాజీవ్–సాలిస్బరీ ద్వయం స్కోరును 2–2తో సమం చేయడంతోపాటు ఐదో గేమ్‌లో బోపన్న జంట సర్విస్‌ను బ్రేక్ చేసి, ఆరో గేమ్‌లో తమ సర్విస్‌ను కాపాడుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 6–4తో రాజీవ్–సాలిస్బరీ జోడీ సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. -
సబలెంకా vs కోకో గాఫ్
కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అందుకోవాలనే లక్ష్యంతో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆరో సీడ్ కోకో గాఫ్ 6–4, 7–5తో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై... సబలెంకా 0–6, 7–6 (7/1), 7–6 (10/5)తో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలుపొందారు. భారత కాలమానం ప్రకారం నేడు అర్ధరాత్రి దాటాక గం. 1:30 నుంచి ఫైనల్ జరుగుతుంది. ముకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల కోకో గాఫ్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ కీస్‌తో 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్లో ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయింది. రెండో గేమ్‌లో ఒకదశలో ఆమె 4–5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. తొమ్మిదో గేమ్‌లో కీస్ తన సర్విస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయం అందుకునేది. కానీ కీస్ సర్విస్‌ను సబలెంకా బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లో సబలెంకా 2–4తో వెనుకబడింది. ఈసారీ తేరుకొని స్కోరును 4–4తో సమం చేసింది. చివరకు టైబ్రేక్‌లోనూ ఆధిపత్యం కనబరిచి విజయాన్ని అందుకుంది. -
యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఎంట్రీ.. రోహన్ బొపన్న సరికొత్త రికార్డు
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న ఓపెన్ శకంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్-2023 పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ బొపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా ఈ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/3), 6–2తో పియరీ హ్యూజ్ హెర్బర్ట్–నికోలస్ మహుట్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బొపన్న జోడీ తన ప్రత్యర్థి జంట సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రాజీవ్ రామ్ (అమెరికా)–సాలిస్బరీ (బ్రిటన్); ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బొపన్న జంట తలపడుతుంది. తాజా ఫలితంతో 43 ఏళ్ల బొపన్న ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్లో పురుషుల డబుల్స్ విభాగంలో బొపన్న గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2010లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో జతకట్టి యూఎస్ ఓపెన్లోనే ఫైనల్ చేరిన బోపన్న తుది పోరులో బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. NO OTHER male player (Singles or Doubles) at his age (43 yrs 6 months) has reached Grand Slam FINAL in the Open era before! You are special Rohan Bopanna | @rohanbopanna ❤️ https://t.co/JCcq55SDwd pic.twitter.com/AmZwxVfhhi — India_AllSports (@India_AllSports) September 7, 2023 Bopanna/Ebden make an amazing comeback from 2-4 down to take the 1st set 7-6 (3). #USOpen https://t.co/E6Y5XA12ae — India_AllSports (@India_AllSports) September 7, 2023 -
ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ధోని.. వీడియో వైరల్
యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్‌నెం1 కార్లోస్ అల్కరాజ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 2 గంటల 30 నిమిషాల్లో 6–3, 6–2, 6–4తో గెలుపొందాడు. ఎంఎస్ ధోని ప్రత్యక్షం.. కాగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హాజరయ్యాడు. ధోని స్నేహితులతో నవ్వుతూ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించాడు. కూల్బ్రేక్ సమయంలో కెమెరా కంటికి ధోని చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ ఓపెన్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ధోనికి క్రికెట్‌తో పాటు టెన్నిస్ అంటే ఇంతో ఇష్టం. గతేడాది యూఎస్ ఓపెన్‌లో కూడా క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్‌తో కలిసి ధోని వెళ్లాడు. డొనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్.. యూఎస్ ఓపెన్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చిన ధోనికి.. ఆ దేశ మాజీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రత్యేక అహ్హనం అందింది. తనతో కలిసి గోల్ఫ్ ఆడాలని మిస్టర్ కూల్‌ను ట్రంప్ కోరారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ బెడ్మినస్టర్‌లో గోల్ఫ్ ఆడారు. Former US President Donald Trump is enjoying a round of golf with the cricket legend Giga Chad MS Dhoni, a true icon and a legendary figure in the world of sports.#MSDhoni𓃵 #DonaldTrump #Dhoni pic.twitter.com/ML886aURf0 — ICC World Cup 2023 (@WoKyaHotaHai) September 8, 2023 ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో చెన్నైసూపర్ కింగ్స్‌ను ఐదో సారి ఛాంపియన్‌గా నిలిపిన ధోని.. ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చదవండి: World Cup 2023: సంజూ కంటే అతడు చాలా బెటర్.. విధ్వంసానికి 30 బంతులు చాలు! -
'ఒక ఆటగాడు చనిపోతాడు.. అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు'
యూఎస్ ఓపెన్‌లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆధిక వేడివల్ల ప్లేయర్స్ అనారోగ్యం బారిన పడుతున్నారు. బుధవారం జరిగిన యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో రష్యా టెన్నిస్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. యుఎస్ ఓపెన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత (35 డిగ్రీల సెల్సియస్) మధ్య మ్యాచ్ ఆడిన మెద్వెదెవ్ వేడి కారణంగా శ్వాస తీసుకుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆట రెండో సెట్‌కు మరో సమయంలో అతడిని ఫిజియో పరీక్షించాడు. ఫిజియో సలహా మెరకు ఇన్హేలర్ సాయంతో మిగిలిన ఆటను మెద్వెదేవ్ పూర్తిచేశాడు. అయితే మ్యాచ్ గేమ్ అనంతరం మెద్వెదేవ్ కీలక వాఖ్యలు చేశాడు. ఈ పరిస్థితుల కారణంగా ఒక ఆటగాడు చనిపోయినా వీళ్లు అలానే చూస్తూ ఉంటారని మెద్వెదేవ్ అసహనం వ్యక్తం చేశాడు. యూఏస్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఆడటం చాలా కష్టంగా అన్పించింది. ఈ వేడిని తట్టుకో లేక ఒక ఆటగాడు చనిపోతాడు. అప్పుడు వీళ్లు చూస్తూనే ఉంటారు. ఇంతకు ముందు టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఇదే పరిస్థితి. ఈ మ్యాచ్‌లో నేను ఒక్కడినే కాకుండా ఆండ్రీ రుబ్లెవ్ కూడా వేడిని తట్టుకోలేకపోయాడు తొలి సెట్ ఆరంభంలో ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు కన్పించాయి. కానీ మూడో సమయానికి నేను బంతిని కూడా చూడలేకపోయాను. అవతలి ఎండ్‌లో నా ప్రత్యర్ధి అలిపోయనట్లు కన్పించి వెంటనే పుంజుకుంటున్నాడు. గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అని మెద్వెదేవ్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను 6–4, 6–3, 6–4తో మెద్వెదెవ్ ఓడించాడు. ఈ విజయంతో యూఎస్ ఓపెన్ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్తో మెద్వెదెవ్ తలపడతాడు. చదవండి: సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. భారత అత్యుత్తమ బ్యాటర్ అతడే: గంభీర్ -
అల్కరాజ్ అలవోకగా...
న్యూయార్క్: గత పదిహేనేళ్లుగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా రెండేళ్లు ఒకే ప్లేయర్‌కు టైటిల్ దక్కలేదు. ఈ ఘనత సాధించేందుకు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ చేరువయ్యాడు. సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ అలవోక విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 2 గంటల 30 నిమిషాల్లో 6–3, 6–2, 6–4తో గెలుపొందాడు. మూడు ఏస్‌లు సంధించిన అల్కరాజ్ మూడు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు. నెట్‌వద్దకు 35 సార్లు దూసుకొచ్చిన అతను 28 సార్లు పాయింట్లు గెలిచాడు. నాలుగుసార్లు జ్వెరెవ్ సర్విస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్విస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. 2020లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 35 అనవసర తప్పిదాలు చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–3, 6–4తో ఎనిమిదో సీడ్, తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్తో మెద్వెదెవ్ తలపడతాడు. 2021లో చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్ ... 2020లో సెమీఫైనల్లో, 2019లో ఫైనల్లో ఓడిపోయాడు. వొండ్రుసోవాకు కీస్ షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) పోరాటం ముగిసింది. 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–4తో వొండ్రుసోవాను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో 2018 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీస్ మూడుసార్లు వొండ్రుసోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)తో కీస్; ముకోవా (చెక్ రిపబ్లిక్)తో కోకో గాఫ్ (అమెరికా) తలపడతారు. -
‘రికార్డు’తో సెమీస్‌లోకి జొకోవిచ్
న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరడానికి సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో విజయం దూరంలో నిలిచాడు. టెన్నిస్ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 13వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 2 గంటల 35 నిమిషాల్లో 6–1, 6–4, 6–4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. ఫ్రిట్జ్‌తో గతంలో ఆడిన ఏడుసార్లూ గెలుపొందిన జొకోవిచ్ ఎనిమిదోసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఏడు ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచాడు. 2016 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో సామ్ క్వెరీ (అమెరికా) చేతిలో ఓడిన జొకోవిచ్ ఆ తర్వాత అమెరికా ఆటగాళ్లతో 30 సార్లు తలపడినా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఫ్రిట్జ్‌పై విజయంతో జొకోవిచ్ రికార్డు పుస్తకాల్లోకి కూడా ఎక్కాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ చేరిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా కెరీర్లో 47వ సారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్న జొకోవిచ్ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (46 సార్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 2011 తర్వాత సెమీస్‌లోకి బోపన్న పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 43 ఏళ్ల బోపన్న 2011 తర్వా త యూఎస్ ఓపెన్ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 7–6 (12/10), 6–1తో లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) ద్వయంపై గెలిచింది. వరుసగా మూడో ఏడాది... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–1, 6–4తో కిన్వెన్ జెంగ్ (చైనా)పై గెలిచింది. తొమ్మిదో సీడ్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో సబలెంకా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. ఐదో అన్‌సీడెడ్ ప్లేయర్‌గా... మరో క్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల అన్‌సీడెడ్ అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ 3 గంటల 7 నిమిషాల్లో 6–2, 3–6, 7–6 (9/7), 6–2తో అమెరికాకే చెందిన పదో సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోను ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గత 23 ఏళ్లలో ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఐదో అన్‌సీడెడ్ ప్లేయర్‌గా షెల్టన్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో టాడ్ మార్టిన్ (అమెరికా; 2000లో), రాబీ జినెప్రి (అమెరికా; 2005లో), మిఖాయిల్ యూజ్నీ (రష్యా; 2006లో), దిమిత్రోవ్ (బల్గేరియా; 2019లో) ఉన్నారు. సెమీఫైనల్లో జొకోవిచ్పై షెల్టన్ గెలిస్తే 1996లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఆ్రస్టేలియా) తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా ఘనత సాధిస్తాడు. -
US Open 2023: తొలిసారి సెమీస్‌లో కోకో గాఫ్.. ముకోవాతో అమీతుమీ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 67 నిమిషాల్లో 6–0, 6–2తో 20వ సీడ్ ఒస్టాపెంకో(లాతి్వయా)పై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, స్వియాటెక్‌ను బోల్తా కొట్టించినా.. ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించిన 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో క్వార్టర్ ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. గాఫ్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఒస్టాపెంకో 36 అనవసర తప్పిదాలు చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో కరోలినా ముకోవా.. సిరెస్టియాను మట్టికరిపించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), 12వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. Karolina Muchova, are you kidding!? What a get! pic.twitter.com/MOUmzt3YMn — US Open Tennis (@usopen) September 6, 2023 Novak Djokovic refuses to be defeated in #USOpen quarterfinals. pic.twitter.com/MKdhLmUCMU — US Open Tennis (@usopen) September 5, 2023 What a match point from @CocoGauff❗️ How it sounded on #USOpen radio 🎙️⤵️ pic.twitter.com/m4DGbBkk1A — US Open Tennis (@usopen) September 5, 2023 -
US Open: వరల్డ్ నంబర్ 1కు ఊహించని షాక్.. టోర్నీ నుంచి అవుట్
న్యూయార్క్: పోలండ్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ 1 ఇగా స్వియాటెక్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్-2023 టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. టాప్-20 సీడ్ జెలెనా ఒస్తాపెంకో చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ రౌండ్ 16లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్‌ను 6-3, 3-6, 1-6తో ఓడించిన జెలెనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ముందడుగు వేసింది. పూర్తిగా తనదే ఆధిపత్యం కాగా నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో స్వియాటెక్ 6-3తో తొలి సెట్ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత జెలెనా పూర్తిగా ఆధిపత్యం కొనసాగించింది. తగ్గేదేలే అన్నట్లు టాప్ సీడ్‌కు షాకుల మీద షాకులిచ్చి 3-6, 1-6తో ఏ దశలోనూ కోలుకోకుండా చేసింది. తద్వారా స్వియాటెక్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఆమెతో పోటీ ఇక జెలెనా చేతిలో పరాజయం పాలైన స్వియాటెక్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. పోలండ్ స్టార్ తాజా ఓటమి నేపథ్యంలో రెండో సీడ్‌గా ఉన్న బెలారస్ టెన్నిస్ తార అరియానా సబలెంక నంబర్ 1గా అవతరించింది. ఇదిలా ఉంటే.. యూఎస్‌కు చెందిన కోకో గాఫ్.. మాజీ వరల్డ్ నంబర్ 1 కరోలిన్ వోజ్నియాకిపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో జెలెనా క్వార్టర్స్‌లో కోకో గాఫ్‌ను ఎదుర్కోనుంది. క్వార్టర్స్‌లో ముకోవా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ ముకోవా 2 గంటల 34 నిమిషాల్లో 6–3, 5–7, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచింది. ఈ క్రమంలో తదుపరి గేమ్‌లో ముకోవా సొరానాతో తలపడనుంది. చదవండి: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..? Make your prediction. What's the semifinal here? pic.twitter.com/xxrXmYXkIv — US Open Tennis (@usopen) September 4, 2023 Jelena Ostapenko reaches the #USOpen quartefinals for the first time in her career! pic.twitter.com/QzSWObVJYE — US Open Tennis (@usopen) September 4, 2023 Well, well, well 💅 There will be a deciding set between Jelena Ostapenko and Iga Swiatek. pic.twitter.com/3iIYIG0MLs — US Open Tennis (@usopen) September 4, 2023 -
గట్టెక్కిన జొకోవిచ్
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. తొలి రెండు రౌండ్లలో అలవోకగా నెగ్గిన జొకోవిచ్‌కు మూడో రౌండ్లో తన దేశానికే చెందిన లాస్లో జెరె నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి రెండు సెట్లను చేజార్చుకున్న జొకోవిచ్ 2006 తర్వాత యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లోనే ఇంటిదారి పడతాడా అనే సందేహం కలిగింది. అయితే అపార అనుభవం కలిగిన ఈ మాజీ చాంపియన్ పట్టుదలతో పోరాడి తేరుకున్నాడు. వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకొని ఈ టోర్నీలో వరుసగా 16వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 4–6, 4–6, 6–1, 6–1, 6–3తో ప్రపంచ 38వ ర్యాంకర్ లాస్లో జెరెపై గెలుపొందాడు. ఈ పోరులో 12 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 32 సార్లు దూసుకొచ్చి 21 సార్లు పాయింట్లు గెలిచాడు. 34 విన్నర్స్ కొట్టిన అతను 36 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. మరోవైపు తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), పదో సీడ్ టియాఫో (అమెరికా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫ్రిట్జ్ 6–1, 6–2, 6–0తో మెన్సిక్ (చెక్ రిపబ్లిక్)పై, టియాఫో 4–6, 6–2, 6–3, 7–6 (8/6)తో 22వ సీడ్ మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గారు. నాలుగో సీడ్ రిబాకినాకు షాక్ మహిళల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. గత ఏడాది వింబుల్డన్ చాంపియన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ రిబాకినా (కజకిస్తాన్) మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. 30వ సీడ్ సొరానా క్రిస్టియా (రొమేనియా) 2 గంటల 48 నిమిషాల్లో 6–3, 6–7 (6/8), 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినాను బోల్తా కొట్టించి 15వ ప్రయత్నంలో యూఎస్ ఓపెన్‌లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ స్టార్ వొజ్నియాకి తన జోరు కొనసాగిస్తోంది. మూడో రౌండ్లో వొజ్నియాకి గంటా 58 నిమిషాల్లో 4–6, 6–3, 6–1తో జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)ను ఓడించి 2016 తర్వాత ఈ టోర్నీలో మరోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ రెండోసారి ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో గాఫ్ 3–6, 6–3, 6–0తో 32వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలిచింది. రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 13వ సీడ్ దరియా కసత్కినా (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. మూడో రౌండ్లో సబలెంకా 6–1, 6–1తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై, దరియా 6–3, 6–4తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై గెలిచారు. 8 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మ్యాచ్‌ల్లో తొలి రెండు సెట్లను కోల్పోయాక ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను దక్కించుకొని విజయం అందుకోవడం జొకోవిచ్‌కిది ఎనిమిదోసారి కావడం విశేషం. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్‌పై కూడా జొకోవిచ్ ఈ తరహాలోనే గెలిచాడు. -
అల్కరాజ్, మెద్వెదెవ్ ముందంజ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరల్డ్ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)కు రెండో రౌండ్లో సునాయాస విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–3, 6–1, 7–6 (7/4)తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)ను ఓడించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) రెండో రౌండ్లో 6–2, 6–2, 6–7 (6/8), 6–2తో క్రిస్టోఫర్ కానెల్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించాడు. మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఆండీ ముర్రే (బ్రిటన్) ఆట మాత్రం రెండో రౌండ్లోనే ముగిసింది. గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 6–1తో ముర్రేను ఇంటి ముఖం పట్టించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (రష్యా) 6–3, 6–2తో జోడీ బురెజ్ (యూకే)ను...9వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో ట్రెవిజాన్ (ఇటలీ)ను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. టెన్నిస్ సర్క్యూట్లో సుదీర్ఘ మ్యాచ్‌లకు చిరునామాగా నిలిచిన జాన్ ఇస్నర్ (అమెరికా) రెండో రౌండ్లో మరో సుదీర్ఘ సమరంలో ఓడి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 3 గంటల 57 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికాకే చెందిన మైకేల్ మో 3–6, 4–6, 7–6 (7/3), 6–4, 7–6 (10/7) స్కోరుతో ఇస్నర్‌ను ఓడించాడు. టెన్నిస్ చరిత్రలో సుదీర్ఘ మ్యాచ్ (11 గంటల 5 నిమిషాల పాటు – నికోలస్ మహుత్తో) ఆడిన రికార్డులో ఇస్నర్ భాగం కాగా...అత్యధిక ఏస్‌లు (14,470) కొట్టిన ఘనత కూడా అతని సొంతం. పురుషుల డబుల్స్‌లో ఇద్దరు భారత ఆటగాళ్ల పోరు తొలి రౌండ్లోనే ముగిసింది. యూకీ బాంబ్రీ (భారత్) – డెమోలినర్ (బ్రెజిల్) జోడి 3–6, 5–7తో హ్యూగో నిస్ (మొనాకో) – జిలిన్స్కీ (పోలాండ్) చేతిలో... సాకేత్ మైనేని (భారత్) – కరట్సెవ్ (రష్యా) ద్వయం 7–6 (7/4), 3–6, 2–6తో లాస్లో జెరె (సెర్బియా) – హ్యూస్టర్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడారు. -
కోకో గాఫ్ అలవోకగా...
న్యూయార్క్: సొంతగడ్డపై అమెరికా టీనేజ్ స్టార్ కోకో గాఫ్ మెరిసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 19 ఏళ్ల గాఫ్ 6–3, 6–2తో మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలిచింది. 76 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాఫ్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు ఏడో సీడ్ గార్సియా (ఫ్రాన్స్), 2000, 2001 చాంపియన్ వీనస్ విలియమ్స్ (అమెరికా), 12వ సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గార్సియా 4–6, 1–6తో యఫాన్ వాంగ్ (చైనా) చేతిలో, వీనస్ 1–6, 1–6తో గ్రీట్ మినెన్ (బెల్జియం) చేతిలో, క్రిచికోవా 4–6, 6–7 (3/7)తో లూసియా బ్రోన్జెట్టి (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లోకి చేరారు. -
యూఎస్ ఓపెన్ డబుల్స్ బరిలో సాకేత్
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని ఈ ఏడాది నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ లోనూ పోటీపడనున్నాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీతో కలిసి 77వ ర్యాంకర్ సాకేత్ ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలలో బరిలోకి దిగాడు. యూఎస్ ఓపెన్‌లో మాత్రం యూకీతో కాకుండా కరత్సెవ్ (రష్యా)తో సాకేత్ జత కట్టాడు. బ్రెజిల్ ప్లేయర్ డెమోలైనర్తో కలిసి యూకీ ఆడనున్నాడు. 35 ఏళ్ల సాకేత్ 2016 యూఎస్ ఓపెన్ సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్లో నిష్క్రమించాడు. -
పోటీ ఆ ఇద్దరి మధ్యే!
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోరీ్నలో అందరి దృష్టి పురుషుల సింగిల్స్ విభాగంపైనే ఉంది. టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)... 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర పుటల్లో స్థానం సంపాదించేందుకు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పట్టుదలతో ఉన్నారు. జొకోవిచ్ విజేతగా నిలిస్తే... టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోరీ్నల్లో టైటిల్ నెగ్గి, వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిపోయిన జొకోవిచ్‌కు ఈసారి ఈ స్పెయిన్ స్టార్ నుంచే గట్టిపోటీ ఎదురుకానుంది. కోవిడ్ టీకా వేసుకోని కారణంగా గత ఏడాది జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలు సడలించడంతో జొకోవిచ్ ఈసారి బరిలోకి దిగుతున్నాడు. -
అంకిత పరాజయం
న్యూయార్క్: భారత టాప్ టెన్నిస్ క్రీడాకారిణి అంకితా రైనా ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమైంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో తొలి రెండు నెగ్గిన అంకిత మూడో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో అంకిత వరుస సెట్లలో 2–6, 2–6 స్కోరుతో మిర్జమ్ జొర్క్లండ్ (స్వీడన్) చేతిలో పరాజయంపాలైంది. 1 గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 154వ ర్యాంకర్ అంకిత తన ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. జొర్క్లండ్ 3 ఏస్‌లు సంధించగా, అంకిత ఒకే ఒక ఏస్ కొట్టింది. -
మూడో రౌండ్లో అంకిత రైనా
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా మూడో రౌండ్లోకి ప్రవేశించింది. న్యూయార్క్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ 182వ ర్యాంకర్ అంకిత 6–4, 6–3తో ప్రపంచ 114వ ర్యాంకర్ అలియోనా బొల్సోవా (స్పెయిన్)పై గెలిచింది. -
నాపై మానసికంగా ప్రభావం పడింది: సింధు
న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది కలిసి రావడంలేదు. 2023లో సింధు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోగా, మాడ్రిడ్ మాస్టర్స్ టోరీ్నలో రన్నరప్‌గా నిలవడం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. తాజాగా యూఎస్ ఓపెన్‌లో సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. దాంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది. ఈ ఓటమి అనంతరం సోషల్ మీడియాలో స్పందించింది. ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూలేని రీతిలో తన భావోద్వేగాలను ప్రదర్శించింది. ‘ఈ ఓటమి మానసికంగా నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా అన్ని ప్రతికూలతలు ఎదురవుతున్న ఈ ఏడాదిలో ఇలాంటి ఫలితం రావడం బాగా నిరాశపర్చింది. తాజా పరాజయంతో నేను చాలా బాధపడ్డాను. నా ఈ భావోద్వేగాలను సరైన రీతిలో మలచుకొని నా ఆట ను మరింత మెరుగుపర్చుకొనేందుకు, ఎక్కువగా సాధన చేసేందుకు వాడుకుంటా. రాబోయే కొరియా, జపాన్ టోరీ్నల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీ అభిమానమే నాకు సర్వస్వం. దానికి కృతజ్ఞురాలిని’ అని సింధు పోస్ట్ చేసింది. -
పీవీ సింధు ఓటమి.. సెమీస్‌కు చేరిన లక్ష్యసేన్
భారత స్టార్ షెట్లర్ లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇటీవలే కెనడా ఓపెన్‌ను గెలిచి దూకుడు మీదున్న లక్ష్యసేన్ మరో టైటిల్ గెలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన దేశానికే చెందిన శంకర్ ముత్తుస్వామిపై 21-10, 21-17తో వరుస గేముల్లో గెలిచిన లక్ష్యసేన్ సెమీస్‌కు చేరుకున్నాడు. మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు మాత్రం క్వార్టర్స్‌లోనే తన పోరాటాన్ని ముగించింది. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ చేతిలో 22-20, 21-13తో సింధు ఓటమి పాలయ్యింది. ప్రపంచ 36వ ర్యాంకర్ అయిన గావో ఫాంగ్ జీ తొలి గేమ్‌ను గెలవడానికి కష్టపడినప్పటికి.. రెండో గేమ్‌ను మాత్రం సులువుగానే నెగ్గింది. చదవండి: #BAN Vs AFG: ఈజీగా గెలవాల్సిన మ్యాచ్.. చచ్చీ చెడీ చివరకు #ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి -
క్వార్టర్ ఫైనల్లో సింధు, లక్ష్యసేన్
కౌన్సిల్ బ్లఫ్స్ (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. శుక్రవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సింధు చైనీస్ తైపీకి చెందిన సంగ్ షువో యన్ను 21-14, 21-12తో ఓడించింది. ఇక లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్కు చెందిన జాన్ లౌడాను 21-8, 23-21తో మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అంతకముందు తొలి రౌండ్లో సింధు 21–15, 21–12తో దిశా గుప్తా (అమెరికా)పై నెగ్గింది. హైదరాబాద్ అమ్మాయి గద్దె రుతి్వక శివాని 14–21, 11–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. లక్ష్య సేన్ 21–8, 21–16తో కాలి కొల్జోనెన్ (ఫిన్లాండ్)పై, శంకర్ ముత్తుస్వామి 21–11, 21–16తో ఎన్‌హట్ నుగుయెన్ (ఐర్లాండ్)పై నెగ్గారు. హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ 15–21, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లి షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. చదవండి: #JyothiYarraji: జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు #YashasviJaiswal: 'ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సింది చాలా ఉంది' -
లోపల ఏముందా అని ప్రతీసారి చూసేది.. అందుకే సర్ప్రైజ్
టెన్నిస్ మహిళల సింగిల్స్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేతగా వరల్డ్ నెంబర్‌వన్..ఇగా స్వియాటెక్ నిలిచిన సంగతి తెలిసిందే. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్‌కు ఓవరాల్‌గా ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇంతకముందు 2020, 2022లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్.. తాజాగా యూఎస్ ఓపెన్ నెగ్గింది. అయితే స్వియాటెక్ ఏ ట్రోఫీ గెలిచినా దానిని ఓపెన్ చేసి చూడడం అలవాటు. ఈ విషయం పక్కనబెడితే.. స్వియాటెక్‌కు ఇటాలియన్ డిష్ తిరామిసూ(బెండకాయలతో చేసే ప్రత్యేక డిష్) అంటే చాలా ఇష్టం. దీంతో తనకిష్టమైన తిరామిసును ఆ ట్రోఫీలో పెట్టి ఇస్తారేమోనని ఆశగా చూసేదంటూ అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న యూఎస్ ఓపెన్ నిర్వాహకులు.. ట్రోఫీ అందుకున్న ఇగా స్వియాటెక్‌ను సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ప్రెస్ మీట్‌కు హాజరైన స్వియాటెక్‌ను ట్రోఫీ చూపించాలని రిపోర్టర్స్ అడిగారు. దీంతో స్వియాటెక్ ట్రోఫీని దగ్గరికి తీసుకొని చూడగా కాస్త బరువుగా అనిపించింది. దీంతో లోపల ఏం ఉందా అని ఓపెన్ చేసి చూడగా.. తనకిష్టమైన ఇటాలియన్ డిష్.. తిరామిసు కనిపించడంతో ఆమె ఆశ్చర్యానికి లోనైంది. ఆ తర్వాత నిర్వహకుల వైపు తిరిగిన స్వియాటెక్ చిరునవ్వుతో.. ఇది మీ పనేనా అని సైగలు చేసింది.. అందుకు వాళ్లు అవును అని సమాధానం ఇవ్వడంతో కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక శనివారం అర్థరాత్రి జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఓన్స్ జబీర్ను ఓడించిన స్వియాటెక్ తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 52 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6-2, 7-6, (7-5) తేడాతో ఓన్స్ జబీర్‌పై విజయం సాధించింది. 2016లో అంజెలికా కెర్బర్ రెండు గ్రాండ్‌స్లామ్స్ నెగ్గగా.. తాజాగా ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారిణిగా ఇగా స్వియాటెక్ నిలిచింది. From Paris to New York...still looking for the tiramisu 😄 pic.twitter.com/6cOBINQgoO — Roland-Garros (@rolandgarros) September 10, 2022 !!!!! pic.twitter.com/87PMt0TfDe — Out of Context Iga Świątek (@SwiatekOOC) September 11, 2022 చదవండి: US Open 2022: మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్ Steve Smith: స్మిత్.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు! -
మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఓన్స్ జబీర్ను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 52 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6-2, 7-6, (7-5) తేడాతో ఓన్స్ జబీర్‌పై స్వియాటెక్ విజయం సాధించింది. ఈ విజయంతో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను పోలాండ్ భామ తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా 2016 తర్వాత ఒకే సీజన్లో రెండు గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న మొదటి మహిళగా స్వియాటెక్ నిలిచింది. చదవండి: IND-W vs ENG-W: భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం! -
US Open 2022: ‘నంబర్‌వన్’ సమరం
న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో ఇద్దరు క్రీడాకారులు ఏకకాలంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫైనల్లో గెలిచిన ప్లేయర్‌కు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి ఒంటి గంట 30 నిమిషాలకు ఈ ఫైనల్ మొదలవుతుంది. సెమీఫైనల్స్‌లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ 7–6 (7/5), 6–2, 5–7, 7–2తో 27వ సీడ్ ఖచనోవ్ (రష్యా)పై... మూడో సీడ్ అల్కరాజ్ 6–7 (6/8), 6–3, 6–1, 6–7 (5/7), 6–3తో 22వ సీడ్ టియాఫో (అమెరికా)పై గెలిచారు. 23 ఏళ్ల కాస్పర్ రూడ్ తన కెరీర్లో రెండో సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది కాస్పర్ రూడ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచాడు. పక్కా ప్రణాళికతో... నాన్న క్రిస్టియాన్ శిక్షణలో రాటుదేలిన కాస్పర్ పక్కా ప్రణాళికతో ఆడి రష్యా ఆజానుబాహుడు ఖచనోవ్ ఆట కట్టించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ శక్తివంతమైన సర్వీస్‌లను రిటర్న్ చేయడానికి కాస్పర్ బేస్‌లైన్ వెనుక నిల్చోని రిటర్న్ చేశాక సుదీర్ఘ ర్యాలీలు ఆడాడు. తొలి సెట్ టైబ్రేక్‌లో కాస్పర్, ఖచనోవ్ మధ్య 12వ పాయింట్ కోసం ఏకంగా 55 షాట్ల ర్యాలీ జరగడం విశేషం. మూడు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కాస్పర్ పది ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. 53 విన్నర్స్ కొట్టిన కాస్పర్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఖచనోవ్ 41 అనవసర తప్పిదాలు చేశాడు. వరుసగా మూడో మ్యాచ్‌లో... ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అల్కరాజ్ ఈ టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఐదు సెట్ల పోరాటంలో విజయాన్ని దక్కించుకున్నాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 59 విన్నర్స్ కొట్టిన అల్కరాజ్ నెట్ వద్దకు 42 సార్లు దూసుకొచ్చి 32 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు టియాఫో 15 ఏస్‌లు సంధించి ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు. 7: ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా మూడు ఐదు సెట్ల మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. గతంలో అగస్సీ (అమెరికా; 2005 యూఎస్ ఓపెన్), ఎడ్బర్గ్ (స్వీడన్; 1992 యూఎస్ ఓపెన్), బన్గెర్ట్ (జర్మనీ; 1967 వింబుల్డన్), టోనీ రోచ్ (ఆస్ట్రేలియా; 1967 ఫ్రెంచ్ ఓపెన్), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా; 1962 ఫ్రెంచ్ ఓపెన్), అలెక్స్ ఒల్మెడో (పెరూ/అమెరికా; 1959 ఆస్ట్రేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. రాజీవ్–సాలిస్బరీ జోడీకి డబుల్స్ టైటిల్ పురుషుల డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం 7–6 (7/4), 7–5తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. వరుసగా 22వ ఏడాది యూఎస్ ఓపెన్‌లో ఆడిన రాజీవ్ 11 వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగాడు. వుడ్ఫర్డ్–వుడ్‌బ్రిడ్జ్ (ఆస్ట్రేలియా; 1995, 1996) ద్వయం తర్వాత యూఎస్ ఓపెన్‌లో వరుసగా రెండేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. -
మరో హోరాహోరీ పోరు.. ఫైనల్స్‌కు దూసుకొచ్చిన అల్కారాజ్
Carlos Alcaraz: స్పెయిన్ యువ కెరటం, మూడో సీడ్ కార్లోస్ అల్కారాజ్ యూఎస్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌కు దూసుకొచ్చాడు. ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన సెమీస్‌లో అల్కారాజ్.. అమెరికా ఆశాకిరణం, 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోపై 6-7(6-8), 6-3, 6-1, 6-7(5-7), 6-3 తేడాతో విజయం సాధించి, ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు క్యాస్పర్ రూడ్‌తో ఢీకి రెడీ అయ్యాడు. అల్కారాజ్.. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో కూడా ఇదే తరహాలో పోరాడి గెలుపొందిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన క్లార్టర్స్లో 19 ఏళ్ల అల్కారాజ్.. 11వ సీడ్, ఇటలీ ఆటగాడు సిన్నర్‌పై 6-7, (7/9), 6-7 (0/7), 7-5, 6-3 తేడాతో గెలుపొందాడు. 315 నిమిషాల పాటు సాగిన ఈ సమరంలో అల్కారాజ్, సిన్నర్లు ఇద్దరు కొదమ సింహాల్లా పోరాడారు. యూఎస్ ఓపెన్ చరిత్రలో ఈ మ్యాచ్ రెండో సుదీర్ఘ సమరంగా రికార్డుల్లోకెక్కడం విశేషం. Never give up! 💪🏻 See you on Sunday, NYC! 🗽😍 @usopen 📸 Getty Images pic.twitter.com/u5ftKBn0Pp — Carlos Alcaraz (@carlosalcaraz) September 10, 2022 కాగా, ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అల్కారాజ్ అదిరిపోయే రీతిలో విజృంభిస్తున్నాడు. క్వార్టర్స్, సెమీస్‌లో సుదీర్ఘ పోరాటాలు చేసి ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరాడు. అల్కారాజ్..రఫెల్ నదాల్ తర్వాత (2019 నుంచి) యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన రెండో స్పెయిన్ ఆటగాడు కావడం మరో విశేషం. -
US Open 2022: అటు అన్స్...ఇటు ఇగా
న్యూయార్క్: ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కొత్త విజేతను చూడొచ్చు. ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఐదో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా) తొలిసారిగా యూఎస్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ స్వియాటెక్ 3–6, 6–1, 6–4తో ఆరోసీడ్ అరియానా సబలెంక (బెలారస్)పై గెలుపొందగా, జబర్ 6–1, 6–3తో 17వ సీడ్ కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. శనివారం రాత్రి జరిగే ఫైనల్లో స్వియాటెక్‌తో జబర్ తలపడుతుంది. స్వియాటెక్‌కు యూఎస్ ఓపెన్ ఫైనల్ కొత్త కానీ... ఆమె ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. 2020, 2022లలో ఈ పోలండ్ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. మరో వైపు జబర్ ఈ సీజన్లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరింది. వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ట్యునీషియా అమ్మాయి ఈ సారి ‘గ్రాండ్’ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. శ్రమించిన టాప్‌సీడ్... తొలి సెమీ ఫైనల్లో టాప్‌సీడ్ స్వియాటెక్‌కు ప్రత్యర్థి సబలెంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొదటి సెట్లో రెండుసార్లు సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంక అదే ఉత్సాహంతో సుదీర్ఘంగా జరిగిన ఐదో గేమ్‌ను గెలుచుకుంది. 8, 9 గేమ్‌లను చకచకా ముగించి తొలిసెట్‌ను వశం చేసుకుంది. తర్వాత రెండో సెట్లో స్వియాటెక్ పుంజుకోవడంతో సబలెంక చేతులెత్తేసింది. వరుస రెండు గేముల్ని అవలీలగా గెలుచుకున్న స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో పోటీ ఎదురైంది. ఆ గేమ్ సబలెంక గెలిచినా... తదుపరి మూడు గేముల్లో తన రాకెట్ పదునేంటో చూపించిన స్వియాటెక్ 6–1తో సెట్ నెగ్గింది. నిర్ణాయక మూడో సెట్లో ఆరంభంలో దూకుడుగా ఆడిన సబలెంక 2–0తో ముందంజలో నిలిచింది. ఈ దశలో మూడు, నాలుగు గేముల్లో ఏస్‌లు, విన్నర్లు కొట్టిన ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ 2–2తో సమం చేసింది. ఆ తర్వాత రెండు గేముల్ని పట్టుదలగా ఆడిన బెలారస్ స్టార్ 4–2తో ఒత్తిడి పెంచింది. ఈ దశలో నంబర్‌వన్ తన అసలైన ప్రదర్శనతో వరుసగా నాలుగు గేములు గెలిచింది. 2 ఏస్‌లు సంధించిన స్వియాటెక్ 3 డబుల్‌ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేయగా, సబలెంక 4 ఏస్‌లు కొట్టి ఏడుసార్లు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. 44 అనవసర తప్పిదాలు చేసింది. రెండో సెమీఫైనల్లో ఐదో సీడ్ జబర్ అలవోకగా ప్రత్యర్థి ఆటకట్టించింది. 8 ఏస్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని జబర్ వరుస సెట్లలో కేవలం 66 నిమిషాల్లోనే సెమీస్ మ్యాచ్‌ను ఏకపక్షంగా 21 విన్నర్లు కొట్టిన జబర్ 15 అనవసర తప్పిదాలు చేయగా, రెండు ఏస్‌లు సంధించిన గార్సియా, 23 అనవసర తప్పిదాలు చేసింది. -
US Open 2022: అల్కరాజ్ అద్భుతం
న్యూయార్క్: 315 నిమిషాలు... 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్, 21 ఏళ్ల జన్నిక్ సిన్నర్ మధ్య జరిగిన యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ సమరమిది. యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండో సుదీర్ఘ పోరుగా రికార్డులకెక్కిన ఈ మ్యాచ్‌లో ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా తలపడగా చివరకు అల్కరాజ్దే పైచేయి అయింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ముగిసిన ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (7/9), 6–7 (0/7), 7–5, 6–3 స్కోరుతో 11వ సీడ్ సిన్నర్ (ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా 1990 (పీట్ సంప్రాస్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సెమీ ఫైనల్లో అల్కరాజ్ 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)తో తలపడతాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో టియాఫో 7–6 (7/3), 7–6 (7/0), 6–4 తేడాతో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి సెమీస్ చేరాడు. 2006 (ఆండీ రాడిక్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి అమెరికా ఆటగాడు టియాఫో కావడం విశేషం. ప్రతీ షాట్లో పోరాటం... ఈ ఏడాది వింబుల్డన్‌లో సిన్నర్ చేతిలో ఓడిన అల్కరాజ్ ప్రతీకారం తీర్చుకునే దిశగా తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేసి ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్లో కోలుకున్న సిన్నర్ గట్టి పోటీనిచ్చాడు. నాలుగు సెట్ పాయింట్లు కాపాడుకున్న అతను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. ఇక్కడా మరో సెట్ పాయింట్‌ను కాచుకొని స్కోరు సమం చేశాడు. మూడో సెట్లో కూడా ఇదే ఫలితం పునరావృతమైంది. అయితే ఈ సారి అల్కరాజ్ ముందుగా 4–2తో, ఆపై 6–5తో ఆధిక్యంలోకి వెళ్లి కూడా సెట్‌ను కోల్పోయాడు. సిన్నర్ పదునైన డిఫెన్స్‌తో స్పెయిన్ ఆటగాడిని అడ్డుకోగలిగాడు. నాలుగో సెట్ మళ్లీ హోరాహోరీగా సాగింది. ఇప్పుడు దురదృష్టం సిన్నర్‌ను పలకరించింది. 5–4తో ఆధిక్యంలో ఉండి సెమీస్ చేరేందుకు సర్వీస్ చేసిన అతను అనూహ్యంగా పట్టు కోల్పోయాడు. పుంజుకున్న అల్కరాజ్ పదో గేమ్‌తో పాటు మరో రెండు గేమ్‌లు వరుసగా నెగ్గి ఫలితాన్ని చివరి సెట్‌కు తీసుకెళ్లాడు. అ ప్పటికే ఇద్దరూ తీవ్రంగా అలసిపోగా...అల్కరాజ్ మాత్రం పట్టుదల కనబర్చి ఏకపక్షంగా సెట్‌ను సాధించి మ్యాచ్ గెలుచుకున్నాడు. సిన్నర్ 8, అల్కరాజ్ 5 ఏస్‌ల చొప్పున కొట్టగా... అల్కరాజ్ అనవసర తప్పిదాలు(38)తో పోలిస్తే సిన్నర్ (61) ఎక్కువ తప్పులతో మూల్యం చెల్లించుకున్నాడు. నంబర్‌వన్ జోరు... మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అరైనా సబలెంకా (బెలారస్) సెమీస్‌లోకి అడుగు పెట్టారు. స్వియాటెక్ 6–3, 7–6 (7/4) స్కోరుతో ఎనిమిదో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించగా...ఆరో సీడ్ సబలెంకా 6–1, 7–6 (7/4)తో కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. -
తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్
మహిళల సింగిల్స్ నంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్ ఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్.. అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 6-3, 7-6 (7/4) తేడాతో విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు చేరింది. ఈ గేమ్ తొలి సెట్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్న స్వియాటెక్.. రెండో గేమ్‌లో మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో సెట్లో జెస్సికాను నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో స్వియాటెక్ పోరాడాల్సి వచ్చింది. చివరకు స్వియాటెక్.. జెస్సికాపై పైచేయి సాధించి గెలుపొందింది. సెమీస్‌లో స్వియాటెక్.. అరిన సబలెంకతో పోటీ పడనుంది. మరో సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా).. ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)- ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో తొలి సెమీస్‌లో తలపడనున్నాడు. మరో సెమీస్ సమరంలో నంబర్ 3 ర్యాంకర్ కార్లోస్ అల్కరజ్.. ఫ్రాన్సిస్ టియోఫోతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. చదవండి: US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ -
US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ గార్సియా తన జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గార్సియా 6–3, 6–4తో అమెరికా టీనేజర్, 12వ సీడ్ కోకో గాఫ్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది మూడు టైటిల్స్ నెగ్గి సూపర్ ఫామ్‌లో ఉన్న 28 ఏళ్ల గార్సియా యూఎస్ ఓపెన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీఫైనల్‌కు చేరింది. కోకో గాఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో గార్సియా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 24 విన్సర్స్ కొట్టిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచింది. 2011లో ప్రొఫెషనల్‌గా మారిన గార్సియా ఇప్పటివరకు 41 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2017లో ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆమె అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. పదోసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న గార్సియా సెమీఫైనల్ చేరడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన మూడోఫ్రాన్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో ఫ్రాన్స్ నుంచి అమెలీ మౌరెస్మో (2002, 2006), మేరీ పియర్స్ (2005) సెమీఫైనల్ చేరారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)తో గార్సియా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో జబర్ 2–0తో గార్సియాపై ఆధిక్యంలో ఉంది. జబర్ జోరు... ఈ ఏడాది 42 విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్యూనిషియా ప్లేయర్ ఆన్స్ జబర్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జబర్ 6–4, 7–6 (7/4)తో తొమ్లాయనోవిచ్పై గెలిచింది. ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా జబర్ నిలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఆరో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) 6–1, 7–6 (7/4)తో 22వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 82 నిమిషాలపాటు జరి గిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. కిరియోస్ జోరుకు ఖచనోవ్ బ్రేక్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా) తొలిసారి తన కెరీర్లో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో... ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్, 23వ సీడ్ నిక్ కిరియోస్తో 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 7–5, 4–6, 7–5, 6–7 (3/7), 6–4తో గెలుపొందాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 30 ఏస్‌లు సంధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించిన కిరియోస్ 31 ఏస్‌లు సంధించినా 58 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కిరియోస్ కోపంతో తన రెండు రాకెట్లను నేలకేసి కొట్టి విరగొట్టడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో కాస్పర్ రూడ్ 6–1, 6–4, 7–6 (7/4)తో 13వ సీడ్ మారియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ సెమీఫైనల్లో ఖచనోవ్‌తో ఆడతాడు. -
వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు!
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఓడిపోయాననే బాధలో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టడం వైరల్‌గా మారింది. ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ పేరు సంపాదించిన కిర్గియోస్ ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో చాలాసార్లు తన కోపాన్ని ప్రదర్శించాడు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో కిర్గియోస్లో కోపం కట్టలు తెంచుకుంది. విషయంలోకి వెళితే.. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్థరాత్రి జరిగిన క్వార్టర్స్‌లో రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్ చేతిలో 7-5, 4-6,7-5, 6-7(3-7)తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. దీంతో గ్రాండ్‌స్లామ్ కొట్టాలన్న అతని కల క్వార్టర్స్‌కే పరిమితం కావడంతో కోపం నషాళానికి అంటింది. ప్లేయర్‌కు, అంపైర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన అనంతరం తన బ్యాగు వద్దకు వెళ్లిన కిర్గియోస్.. చేతిలోని రాకెట్‌ను కోపంతో నేలకేసి బాదాడు. అయినా కోపం తగ్గలేదనుకుంటా.. మరో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. అనంతరం బ్యాగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాప్ స్వాప్ అనే సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ''కోపం నషాళానికి అంటింది.. కిర్గియోస్ తన రెండు రాకెట్లను ముక్కలు చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన నిక్ కిర్గియోస్ ఓటమిపై స్పందించాడు. ''నేను ఓడిపోవడం బాధ కలిగించింది. నేను గెలవాలని చాలా మంది మద్దతు ఇచ్చారు. కానీ వారి ఆశలను వమ్ము చేశాను. అందుకే కోపంతో టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టాల్సి వచ్చింది. అయితే కచనోవ్ పోరాటం మెచ్చుకోదగినది. ఈరోజు అతనిలో ఒక ఫైటర్, వారియర్ కనిపించాడు. ఇక ముందు కూడా ఇదే పోరాట పటిమను కనబరిచి గ్రాండ్‌స్లామ్ నెగ్గాలని ఆశిస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక సెమీస్‌కు చేరుకున్న కచనోవ్ నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో తలపడనున్నాడు. ఇప్పటికే నాదల్, మెద్వదేవ్‌లు వెనుదిరగ్గా.. తాజాగా కిర్గియోస్ కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టడంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. Nick Kyrgios restringing his racket after the match pic.twitter.com/Q2TDri1mxa — PropSwap (@PropSwap) September 7, 2022 చదవండి: FIH Awards: ‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్ సింగ్ -
నాదల్కు షాక్
న్యూయార్క్: ఈ ఏడాది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు నిరాశ ఎదురైంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా ప్లేయర్ ఫ్రాన్సిస్కో టియాఫో తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శనతో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్‌ను ఓడించి యూఎస్ ఓపెన్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ టియాఫో 6–4, 4–6, 6–4, 6–3తో రెండో సీడ్ నాదల్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)తో టియాఫో ఆడతాడు. నాదల్‌తో 3 గంటల 34 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో టియాఫో 18 ఏస్‌లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నాదల్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన టియాఫో 49 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు నాదల్ తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో నాదల్‌ను ఓడించిన మూడో అమెరికా ప్లేయర్‌గా టియాఫో ఘనత వహించాడు. గతంలో అమెరికా ప్లేయర్లు ఆండీ రాడిక్ (2004లో), జేమ్స్ బ్లేక్ (2005లో) నాదల్‌ను ఓడించారు. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో టైటిల్స్ సాధించి, వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నాడు. గాయం కారణంగా అతను సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడకుండా తన ప్రత్యర్థి కిరియోస్ (ఆస్ట్రేలియా)కు వాకోవర్ ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), 11వ సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరారు. 2014 చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 3–6, 6–4, 4–6, 6–3తో గెలుపొంది వరుసగా రెండో ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరాడు. సినెర్ 6–1, 5–7, 6–2, 4–6, 6–3తో ఇవాష్క (రష్యా)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఆరో సీడ్ సబలెంకా (బెలారస్), ఎనిమిదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్వియాటెక్ 2–6, 6–4, 6–0తో నీమియెర్ (జర్మనీ)పై, సబలెంకా 3–6, 6–3, 6–2తో డానియెలా కొలిన్స్ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–2తో క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, ప్లిస్కోవా 7–5, 6–7 (5/7), 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచారు. -
అందంతో కట్టిపడేసింది.. ఎత్తిన గ్లాస్ దించకుండా తాగింది
ఆట ఏదైనా సరే.. కొందరు అభిమానులు తమ చర్యతో, అందంతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. అమెరికాకు చెందిన మేఘన్ లక్కీ అనే యువతి టెన్నిస్‌కు వీరాభిమాని. గతేడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా ఒక మ్యాచ్‌కు హాజరైన మేఘన్ లక్కీ.. అందరూ చూస్తున్న సమయంలో గ్లాసు బీరును దించకుండా తాగి అందరి దృష్టిలో పడింది. అప్పటినుంచి ఆమెను ''బీర్ చీర్ గర్ల్'' అని ముద్దుగా పిలుస్తున్నారు. కాగా సదరు యువతి ఈ ఏడాది కూడా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆదివారం(సెప్టెంబర్ 4న) యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మ్యాచ్‌లు చూడడానికి వచ్చింది. కాగా ఈసారి కూడా తన బాయ్‌ఫ్రెండ్ అందించిన బీర్ గ్లాసును అందుకున్న మేఘన్ పూర్తిగా తాగేసింది. అలా వరుసగా రెండో ఏడాది కూడా బీర్ చాలెంజ్‌ను పూర్తి చేసి తనకున్న పేరును నిలబెట్టుకోవడంతో మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు మేఘన్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం గమనార్హం. ఈ వీడియోనూ స్వయంగా యూఎస్ ఓపెన్ నిర్వాహకులే ట్విటర్లో షేర్ చేస్తూ.. మేఘన్ లక్కీకి మా అభినందనలు.. బహుశా ఇది ట్రెండింగ్ పాయింట్‌గా నిలిచే అవకాశముంది. అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా ఈ వీడియోకు దాదాపు 2 లక్షల వ్యూస్ రావడం విశేషం. It seems this is becoming tradition at this point 🍻 pic.twitter.com/vTO1hUJVNS — US Open Tennis (@usopen) September 4, 2022 View this post on Instagram A post shared by US Open (@usopen) చదవండి: యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. నాదల్ కథ ముగిసింది -
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. నాదల్ కథ ముగిసింది
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్.. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ కథ ముగిసింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన 22వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో చేతిలో నాదల్.. 6-4, 4-6, 6-4, 6-3తో దారుణ పరాజయం చవిచూశాడు. ఇక కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న నాదల్కు ఈ ఏడాది మేజర్ టోర్నీల్లో నాదల్కు ఎదురైన తొలి ఓటమి ఇదే. కిక్కిరిసిన ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో నాదల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిచి జోరు మీదున్న ప్రపంచ రెండో ర్యాంకర్ రఫెల్ నాదల్ కు షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్ గా భావించిన నాదల్ పోరాటం ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అమెరికా ఆటగాడు, 22వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో 6-4,4-6,6-4,6-3 స్కోరుతో నాదల్ ను ఓడించి సంచలనం సృష్టించాడు.పేలవ సర్వీసులు, రిటర్న్ లతో నిరాశ పరిచాడు. తొలి సెట్ నే కోల్పోయిన రఫెల్ రెండో సెట్ గెలిచి స్కోరు సమం చేశాడు. కానీ, తర్వాతి రెండు సెట్లలో తేలిపోయాడు. దాంతో, ఐదోసారి నాదల్ సర్వీస్ బ్రేక్ చేస్తూ విజయం సాధించిన టియఫో తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ డానిల్ మెద్వెదెవ్ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో క్వార్టర్స్ కు ముందే ఇద్దరు టాప్ సీడ్ ఆటగాళ్లు ఇంటిదారి పట్టినట్టయింది. ఫ్రాన్సిస్ రికార్డ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్‌ను ఓడించిన అమెరికా క్రీడాకారుల్లో ఫ్రాన్సిస్ టోయాఫే మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. గతంలో ఆండీ రాడిక్, జేమ్స్ బ్లేక్‌లు మాత్రమే నాదల్‌ను ఓడించారు. ఇక ఈ విజయంతో రొడ్డిక్ తర్వాత యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా ఫ్రాన్సీస్ (24) గుర్తింపు సాధించాడు. నాదల్ ను ఓడించడం సంతోషంగా ఉందని ఫ్రాన్సిస్ టోయాఫే తెలిపాడు. నాదల్ ను ఓడించానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. నాదల్ టెన్నిస్ లెజెండ్ అని..అతన్ని ఓడించానంటే నమ్మశక్యంగా లేదన్నాడు. Have a moment Frances Tiafoe!#USOpen pic.twitter.com/egoIVDoRWh — US Open Tennis (@usopen) September 5, 2022 చదవండి: FIH Nations Cup: నేషన్స్ కప్ బరిలో భారత హాకీ జట్టు US Open 2022: మెద్వెదెవ్కు చుక్కెదురు -
సెరెనా అంటే కేవలం గెలుపు మాత్రమేనా?(ఫొటోలు)
-
మెద్వెదెవ్కు చుక్కెదురు
న్యూయార్క్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా వివాదాస్పద టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్ యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం సృష్టించాడు. తన దూకుడైన ఆటతో కిరియోస్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఇంటిదారి పట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ కిరియోస్ 7–6 (13/11), 3–6, 6–3, 6–2తో మెద్వెదెవ్పై విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిరియోస్, మెద్వెదెవ్ ఏస్‌లతో హడలెత్తించారు. కిరియోస్ 21, మెద్వెదెవ్ 22 ఏస్‌లు సంధించారు. అయితే అందివచ్చిన బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్న కిరియోస్ విజయం రుచి చూశాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన కిరియోస్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో మరో రష్యా ప్లేయర్ ఖచనోవ్‌తో కిరియోస్ ఆడతాడు. తాజా ఓటమితో మెద్వెదెవ్ వచ్చే సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. మెద్వెదెవ్ స్థానంలో నాదల్ (స్పెయిన్), అల్కరాజ్ (స్పెయిన్), కాస్పర్ రూడ్ (నార్వే)లలో ఒకరు ప్రపంచ నంబర్‌వన్ అవుతారు. మరోవైపు ఐదో ర్యాంకర్ కాస్పర్ రూడ్, ఖచనోవ్ కూడా తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రూడ్ 6–1, 6–2, 6–7 (4/7), 6–2తో ముటెట్ (ఫ్రాన్స్)పై, ఖచనోవ్ 4–6, 6–3, 6–1, 4–6, 6–3తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, బెరెటిని (ఇటలీ) 3–6, 7–6 (7/2), 6–3, 4–6, 6–2తో ఫోకినా (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 6–4తో ఏడో సీడ్ కామెరూన్ నోరి (బ్రిటన్)పై గెలిచారు. కోకో గాఫ్, జబర్ తొలిసారి... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), 46వ ర్యాంకర్ ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 7–5, 7–5తో షుయె జాంగ్ (చైనా)పై గెలుపొందగా... జబర్ 7–6 (7/1), 6–4తో కుదెర్మెటోవా (రష్యా)ను ఓడించింది. మూడో రౌండ్లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించిన తొమ్లాయనోవిచ్ అదే జోరు కొనసాగించి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–1తో సమ్సోనోవా (రష్యా)పై గెలిచింది. కెరీర్లో 42వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న గార్సియా 6–4, 6–1తో అలీసన్ రిస్కే అమృత్‌రాజ్ (అమెరికా)ను ఓడించింది. -
US Open 2022: ఎదురులేని నాదల్
న్యూయార్క్: తొలి రెండు రౌండ్లలో విజయం సాధించేందుకు చెమటోడ్చిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మూడో రౌండ్లో మాత్రం రఫ్ఫాడించాడు. తన చిరకాల ప్రత్యర్థి రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై మరోసారి సంపూర్ణ ఆధిపత్యం చలాయించి అతనిపై వరుసగా 18వ విజయం సాధించాడు. తద్వారా టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో నాదల్ 11వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 91వ ర్యాంకర్ రిచర్డ్ గాస్కేతో జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ 6–0, 6–1, 7–5తో అలవోకగా గెలుపొందాడు. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన నాదల్ 24 సార్లు నెట్ వద్దకు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ ఫ్రాన్సిస్కో టియాఫోతో ఆడతాడు. మూడో రౌండ్లో టియాఫో 7–6 (9/7), 6–4, 6–4తో 14వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–3, 6–3తో జెన్సన్ బ్రూక్స్‌బై (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 2–6, 6–7 (3/7), 6–4, 7–6 (10/7)తో షపోవలోవ్ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. స్వియాటెక్ ముందంజ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మూడో రౌండ్లో స్వియాటెక్ 6–3, 6–4తో లౌరెన్ డేవిస్ (అమెరికా)పై నెగ్గింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–2, 6–7 (6/8), 6–0తో యు యువాన్ (చైనా)పై, డానియెలా కొలిన్స్ (అమెరికా) 6–4, 7–6 (11/9)తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై, పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 5–7, 6–3, 7–6 (12/10)తో తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్)పై, అజరెంకా (బెలారస్) 6–3, 6–0తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై, కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 5–7, 6–4, 6–3తో 13వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. -
బెస్ట్ ఫ్రెండ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు నాదల్..
యూఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ దూసుకుపోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు ప్రవేశించిన నాదల్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకునేందుకు మరింత దగ్గరయ్యాడు. భారత కాలామన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో నాదల్.. తన స్నేహితుడైన రిచర్డ్ గాస్కెట్‌ను 6-0, 6-1, 7-5తో మట్టికరిపించాడు. కాగా యూఎస్ ఓపెన్‌లో నాదల్ క్వార్టర్స్ చేరడం ఇది 18వ సారి కాగా.. తన మిత్రుడిపై ఆధిక్యం కూడా 18-0నే కావడం విశేషం. 47వ విజయం.. షూ విరగొట్టిన అల్కరాజ్ ఇక 19 ఏళ్ల టెన్నిస్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ ఈ సీజన్లో 47వ విజయాన్ని అందుకున్నాడు. మూడో రౌండ్లో అమెరికాకు చెందిన జెన్సన్ బ్రూక్స్‌ను 6-3, 6-3, 6-3తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఈ సీజన్లో 47 విజయాలతో రికార్డు బ్రేక్ చేసిన ఆనందలో అల్కరాజ్ తన షూస్‌ను విరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్వార్టర్స్‌లో 2014 చాంపియన్ మారిన్ సిలిచ్‌ను ఎదుర్కోనున్నాడు. ముగురుజాకు షాక్.. క్వార్టర్స్ చేరిన స్వియాటెక్ ఇక మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ వరుసగా రెండో ఏడాది క్వార్టర్స్‌కు చేరుకుంది. మూడో రౌండ్లో అన్ సీడెడ్ అయిన లారెన్ డేవిస్‌ను 6-3, 6-4తో మట్టికరిపించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. ఇక తొమ్మిదో సీడ్ గార్బిన్ ముగురుజాకు మూడో రౌండ్లో చుక్కెదురైంది. మూడో రౌండ్లో పెట్రో క్విటోవా చేతిలో 5-7, 6-3, 7-6(12-10)తో ఓడిపోయిన ముగురజా ఇంటిబాట పట్టింది. కాగా క్వార్టర్స్‌లో క్విటోవా.. అమెరికాకు చెందిన జెస్సీకా పెగులాతో తలపడనుంది. 🎾🇪🇸 نُقطة المُباراة والفوز رقم 1066 لرافاييل نادال بمسيرته الإحترافية والرقم 38 لهُ بهذا الموسم 👏🏻 #RafaelNadal𓃵 pic.twitter.com/jpxVTtmDOM — عشاق التنس Arab Tennis (@ArabTennis20) September 4, 2022 -
US Open 2022: సరిలేరు సెరెనాకెవ్వరు
2007 ఆస్ట్రేలియన్ ఓపెన్... ఆ సమయంలో 81వ ర్యాంక్‌లో ఉన్న సెరెనా విలియమ్స్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగింది. అప్పటికి ఆమె గ్రాండ్‌స్లామ్ మాత్రమే కాదు, ఏదైనా డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి సరిగ్గా రెండేళ్లయింది. ఆట, శరీరం రెండూ గతి తప్పాయంటూ వరుసగా విమర్శలు వస్తున్నాయి... విపరీతంగా బరువు పెరిగిపోయి మైదానంలో చురుకైన కదలికలు లోపించాయి... టోర్నీలో తొలి మ్యాచ్‌కు ముందు ‘నైకీ’ ప్రతినిధి ఒకరు ప్లేయర్స్ లాంజ్‌లోకి వచ్చి సెరెనాను కలిశాడు. ఆశించిన స్థాయిలో సెరెనా ఆట లేదని, ఇలాగే సాగితే ఒప్పందం రద్దు చేసుకుంటాం అని హెచ్చరిక జారీ చేశాడు. కనీసం క్వార్టర్ ఫైనల్ అయినా చేరాల్సిందేనని గట్టిగా చెప్పి వెళ్లాడు. అప్పటికే 7 గ్రాండ్‌స్లామ్స్ ఆమె ఖాతాలో ఉన్నా సరే, ఒక స్టార్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ఆటతో పాటు కోర్టు బయట కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి... ఇలాంటి తీవ్ర ఒత్తిడి మధ్య సెరెనా ఆడింది. తన కసినంతా ప్రదర్శిస్తూ వరుసగా ఒక్కో ప్రత్యర్థిని దాటుకుంటూ ఫైనల్ చేరింది. అక్కడ షరపోవాను ఓడించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. గెలుపు అనంతరం తన ఆగ్రహాన్ని దాచుకోకుండా ‘ఓడాలని ఎవరూ కోరుకోరు. ఇలాంటి విజయాలే నన్ను మానసికంగా బలంగా మారుస్తాయి. విమర్శకులందరికీ ఇదే నా సమాధానం’ అంటూ గట్టిగా ప్రకటించింది. కెరీర్ ఆసాంతం ఇదే పోరాటపటిమ సెరెనాను గొప్పగా నిలిపింది. అద్భుతమైన సర్వీస్, పదునైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, రిటర్న్స్‌లో ధాటి, చురుకైన అథ్లెట్ లక్షణాలు, అన్నింటికి మించి మానసిక దృఢత్వం... లోపాలు లేని ప్లేయర్‌గా సెరెనాను ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిపాయి. తనకంటే ముందు తరంలో అనేక మంది దిగ్గజాలతో పోలిస్తే ప్రత్యర్థిపై విరుచుకుపడే దూకుడు, పవర్ గేమ్ ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా ప్రారంభమైన ఆ ప్రస్థానం 18 ఏళ్ల పాటు ఘనంగా సాగి ఇప్పుడు ఆఖరి అంకానికి చేరింది. ఆటలోని అంకెలు మాత్రమే కాదు అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఆమెను అందరికీ స్ఫూర్తిగా మార్చాయి. బాల్యం నుంచి స్టార్‌గా మారిన తర్వాత కూడా పలు సందర్భాల్లో నల్ల జాతీయురాలిగా ఎదుర్కొన్న వివక్షను అధిగమించి శిఖరానికి చేరగలగడం ఆమెకే సాధ్యమైంది. తనపై కొందరు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సొంత దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో 14 ఏళ్లు ఆడకుండా స్వీయ వనవాసం పాటించిన ఆమె... లింగ వివక్షపై కూడా టెన్నిస్ కోర్టులోనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో వెనక్కి తగ్గలేదు. అమెరికాలో పేదరికానికి కేరాఫ్ అడ్రస్ లాంటి కాంప్టన్ పట్టణంలో పెరిగిన నాటి నుంచి ప్రపంచాన్ని జయించే వరకు కూడా సెరెనాను అదే పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం నడిపించాయి. తన విజయాలతోనే కాదు తన ప్రతీ అడుగుతో, ఆడిన ప్రతీ షాట్‌తో క్రీడా ప్రపంచంపై మరచిపోలేని ముద్ర వేసి సెరెనా తన శకాన్ని ముగిస్తోంది. విజయ ప్రస్థానం... ఓపెన్ శకంలో (1968 నుంచి) సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో దిగ్గజంగా ఎదిగినా సెరెనా మొదటి ట్రోఫీ మాత్రం మిక్స్డ్ డబుల్స్‌లో రావడం విశేషం. 1998లో మ్యాక్స్ మిర్నీతో కలిసి వింబుల్డన్ గెలుచుకున్న సెరెనా ఆ తర్వాత యూఎస్ ఓపెన్‌నూ సొంతం చేసుకుంది. తర్వాతి ఏడాది పారిస్ ఇండోర్ టోర్నీ గెలవడంతో ఆమె ఖాతాలో మొదటి సింగిల్స్ టైటిల్ చేరింది. ఆ తర్వాత టెన్నిస్ ప్రపంచాన్ని సెరెనా శాసించడం లాంఛనమే అయింది. కొత్త మిలీనియంలో పాత స్టార్లంతా మెల్లగా నిష్క్రమిస్తూ రిటైర్మెంట్ బాట పట్టిన సమయంలో సెరెనా శకం మొదలైంది. 2002లో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గి ఆ తర్వాత 2003లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో కెరీర్ స్లామ్ పూర్తి చేసుకోవడంతో ఆమె స్థాయి పెరిగింది. అద్భుత విజయాల ఫలితంగా సహజంగానే నడిచొచ్చిన వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో సెరెనా మరింత ఎత్తుకు ఎదిగింది. ఆ తర్వాత దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని ప్రదర్శనతో సెరెనా సత్తా చాటింది. ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే తత్వం ఆమెను అగ్రస్థానాన నిలబెట్టింది. తన సమకాలీన ప్రత్యర్థులపై ఆమె ఆడిన మ్యాచ్ రికార్డు చూస్తే సెరెనా ఆధిక్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. వీనస్ విలియమ్సపై 19–12, మార్టినా హింగిస్‌పై 7–6, కాప్రియాటిపై 10–7, హెనిన్పై 8–6, అజరెంకాపై 18–5తో సెరెనా పైచేయి సాధించింది. అయితే ఒకదశలో సమ ఉజ్జీలుగా నిలుస్తారని, హోరాహోరీ సమరాలు ఖాయమని టెన్నిస్ ప్రపంచం భావించిన మరో ప్రత్యర్థి మారియా షరపోవాపై సెరెనా ఆధిపత్యం తిరుగులేనిది. 2004 వింబుల్డన్ ఫైనల్లో సెరెనాపై 6–1, 6–4తో గెలవడంతో పాటు అదే ఏడాది డబ్ల్యూటీఏ ఫైనల్లో కూడా షరపోవాదే పైచేయి అయింది. కానీ ఆ తర్వాత వీరిద్దరు 17 సార్లు తలపడగా అన్ని సార్లూ సెరెనానే గెలిచి (ఓవరాల్‌గా 18–2) తానేంటో చూపించింది. 2014 యూఎస్ ఓపెన్ నుంచి వరుసగా మళ్లీ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి రెండోసారి ఈ ఫీట్‌ను సాధించడం సెరెనాకే సాధ్యమైంది. దీంతో పాటు ఆమె సాధించిన మూడు ఒలింపిక్ స్వర్ణాలు కెరీర్‌కు అదనపు హంగును జోడించాయి. గాయాలను అధిగమించి... టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. తొలి ప్రత్యర్థి: దిగ్గజ ఆటగాళ్లు కెరీర్లో ఎన్ని విజయాలు సాధించినా తొలి మ్యాచ్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. ప్రొఫెషనల్ డబ్ల్యూటీఏ కెరీర్లో సెరెనా తొలిసారి కెనడాలోని క్వాబెక్ సిటీలో జరిగిన ‘బెల్ చాలెంజ్’ టోర్నీలో వైల్డ్‌కార్డ్‌తో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అప్పుడు 149వ స్థానంలో ఉన్న యానీ మిల్లర్ (అమెరికా) చేతిలో 1–6, 1–6 తేడాతో తొలి రౌండ్లోనే ఓడింది. గాయాలను అధిగమించి... టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. భారత్‌తో బంధం 2008 మార్చి... అప్పటికే సెరెనా ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి స్టార్‌గా వెలుగొందుతోంది. అలాంటి సమయంలో కూడా ఆమె టెన్నిస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేని భారత్‌లో... అదీ ఒక టియర్–2 టోర్నీలో పాల్గొనడం విశేషం. అదే బెంగళూరు ఓపెన్. ఈ టోర్నీలో ఆమెనే విజేతగా నిలిచింది. సెరెనా కెరీర్లో అది 29వ టైటిల్. ఆట ముగిసె... సుమారు 24 వేల మంది ప్రేక్షకులు... గ్రాండ్‌స్లామ్ గెలుపు ప్రస్థానాన్ని ప్రారంభించిన సొంతగడ్డపై చివరి సారి బరిలోకి...ఆఖరి సారిగా ఆ రాకెట్ పదును వీక్షించేందుకు వచ్చిన ఫ్యాన్స్ సె–రె–నా... సె–రె–నా... అంటూ హోరెత్తిస్తున్నారు... భారీ స్క్రీన్‌పై గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే కెరీర్ అత్యుత్తమ క్షణాలతో ‘మాంటేజ్’ వీడియో ప్రదర్శన... అది ముగిశాక సెరెనా విలియమ్స్ కోర్టులోకి అడుగు పెట్టింది. అప్పటికే ఆమె ప్రత్యర్థి ఐలా తొమ్లాయనోవిచ్ సిద్ధంగా ఉంది...ప్రతీ షాట్, ప్రతీ పాయింట్, ప్రతీ గేమ్, ప్రతీ సెట్... సెరెనా ప్రతీ అడుగు అభిమానులను అలరించింది. 185 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సమరం చివరకు ఒక దిగ్గజం కెరీర్‌ను ముగించింది. కెరీర్లో తాను ఆడిన 1,014వ మ్యాచ్‌లో ఆస్రేలియా ప్రత్యర్థి చేతిలో ఓడి సెరెనా నిష్క్రమించింది. భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమవుతూ ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం కోర్టంతా కలియతిరుగుతూ తనదైన శైలిలో ‘ట్విర్ల్’ తర్వాత అభివాదం చేస్తూ ఆమె కోర్టును వీడిన క్షణంతో ఒక అత్యద్భుత కెరీర్‌కు తెర పడింది. న్యూయార్క్: మహిళల టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ సెరెనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు పలికింది. యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లో పరాజయంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 5–7, 7–6 (7/4), 1–6 తేడాతో ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. ఒకదశలో సెరెనా 5–3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే కోలుకున్న తొమ్లాయనోవిచ్ స్కోరు సమం చేయడంతో పాటు మరో రెండు గేమ్‌లు కూడా గెలిచి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ కూడా ఇదే తరహాలో సాగింది. ఇక్కడా సెరెనా 5–2తో ఆధిక్యంలో నిలిచినా ఆసీస్ ప్రత్యర్థి పోరాడటంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఈ దశలో తన అనుభవాన్నంతా వాడి సెరెనా సెట్‌ను గెలుచుకోవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. అయితే చివరి సెట్లో మాత్రం తొమ్లాయనోవిచ్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో గేమ్ తర్వాత స్కోరు 1–1తో సమంగా ఉన్నా ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి ఐలా 5–1తో విజయానికి చేరువైంది. ఏడో గేమ్‌లో ఆరు మ్యాచ్ సెరెనా ఆరు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని అభిమానులను అలరించినా...చివరకు ఫోర్ హ్యాండ్ అన్ఫోర్స్డ్ ఎర్రర్‌తో ఓటమి ఖాయమైంది. కొన్ని వివాదాలూ... ఆటలో ఎక్కడా దూకుడు తగ్గించని నైజంతో దూసుకుపోయిన సెరెనా సుదీర్ఘ కెరీర్లో అప్పుడప్పుడు వచ్చిన వివాదాలు కొంత చర్చ రేపినా, అవి ఆమె గొప్పతనాన్ని తగ్గించేవిగా మారలేదు. 2000 వింబుల్డన్‌లో వీనస్ చేతిలో సెరెనా చిత్తుగా ఓడినప్పుడు మ్యాచ్ ఫలితాన్ని తండ్రి రిచర్డ్ నిర్ణయించాడని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2001 ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్‌కు ముందు ఆమె ప్రత్యర్థి వీనస్ గాయం పేరు చెప్పి అనూహ్యంగా తప్పుకోవడంతో ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దాంతో తీవ్ర ఆవేదనకు లోనైన తర్వాతి 14 ఏళ్ల పాటు ఆ టోర్నీలో ఆడలేదు. చెయిర్ అంపైర్లతో వాదనలు, అందుకు జరిమానాలతో పాటు బాల్ బాయ్‌ను కూడా ‘గొంతు కోస్తా’ అన్నట్లు రాకెట్‌తో హెచ్చరించడం వరకు చాలా సందర్భాల్లో సెరెనా తనపై నియంత్రణ కోల్పోయింది. 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఒసాకాతో మ్యాచ్ సందర్భంగా ఆమె ప్రవర్తన, రాకెట్‌ను నేలకు కొట్టడంవంటి ఘటనలతో బాగా చెడ్డపేరు వచ్చింది. అయితే ఆమెలోని అద్భుతమైన ఆట అలాంటి తప్పులను కాచేలా చేయగలిగింది. ఇవి కన్నీళ్లు కాదు. ఆనంద భాష్పాలు. నా తల్లిదండ్రులే ఈ ఘనతకు కారణం. వారికి ఏం ఇచ్చినా తక్కువే. ఇక అక్క వీనస్ లేకపోతే చెల్లి సెరెనా లేదు. సెరెనా ప్రతీ విజయం వెనక వీనస్ ఉంది. ఇదో అత్యద్భుత ప్రయాణం. నా కెరీర్లో ఎప్పుడూ చివరి వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు. ఇప్పుడు కూడా అలాగే పోరాడాను. ఇన్నేళ్లుగా నాకు కోర్టులో మద్దతునిచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నా జీవితమంతా టెన్నిస్ ఆడాను. నేను కోరుకున్నదంతా సాధించాను. ఇకపై ఆటకు దూరంగా భిన్నంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నా. రెండోసారి అమ్మను కావాలని భావిస్తున్నా. –సెరెనా –సాక్షి క్రీడా విభాగం -
సలాం 'సెరెనా విలియమ్స్'.. నీ ఆటకు మేము గులాం
పద్నాలుగేళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌గా మారి అంతర్జాతీయ టెన్నిస్‌లో అరంగేట్రం చేసింది. 17 ఏళ్ల వయసులోనే తొలి గ్రాండ్‌స్లామ్ సాధించి అందరిని ఆకట్టుకుంది. అందరిలాగే ఒకటో.. రెండో గ్రాండ్‌స్లామ్‌లు కొట్టి వెళ్లిపోతుందిలే అని అంతా భావించారు. కానీ ఆరోజు తెలియదు.. ఆమె టెన్నిస్‌ను ఏలడానికి వచ్చిన మహరాణి అన్న విషయం. అనతికాలంలో ప్రపంచ టెన్నిస్ రారాణిగా అవతరించింది. ఆ కిరీటాన్ని అత్యంత సుదీర్ఘ కాలం ధరించింది. ఆమె పేరే సెరెనా విలియమ్స్. టెన్నిస్ అభిమానులంతా ముద్దుగా ''నల్లకలువ'' అని పిలుచుకుంటారు. 17 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్ అందుకొని.. ఆ తర్వాత 23 గ్రాండ్‌స్లామ్‌లతో ఈ తరంలో మహిళల టెన్నిస్‌లో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. సెరెనా వయసు ఇప్పుడు నలబై ఏళ్లు. ఇరవై ఏడేళ్లు టెన్నిస్ శ్వాసగా బతికిన ఆమె తాజాగా తన కెరీర్‌కు లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఒక రకంగా రిటైర్మెంట్ అనే చెప్పొచ్చు. ఇకపై ఈ నల్లకలువ టెన్నిస్ కోర్టులో కనిపించే అవకాశం లేదు. అందుకే సెరెనా ఆటకు సలాం చెబుతూ ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ సెరెనా విలియమ్స్ లేని టెన్నిస్‌ను ఊహించడం చాలా కష్టం. ఈ నెలలో 41వ పుట్టిన రోజు చేసుకోనున్న సెరెనా 27 ఏళ్ల సుదీర్ఘ టెన్నీస్ కెరీర్లో.. 23 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. 1981 సెప్టెంబర్ 26న అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో సాంగినావ్ నగరంలో జన్మించింది. ఆమె తల్లి ఒరాసీన్ ప్రైస్ నర్సుగా పని చేసేవారు. తండ్రి రిచర్డ్ విలియమ్స్ ఒక సెక్యూరిటీ సర్వీసు నడిపేవారు. సెరెనా అక్క వీనస్ విలియమ్స్. వీనస్, సెరెనాలకు వారి తండ్రి రిచర్డ్ టెన్నిస్ నేర్పించారు. వాళ్లని ఊర్లో ఉన్న టెన్నిస్ కోర్టులకు తీసుకెళ్లి ఈ ఆట ఆడాలని ప్రోత్సహించారు. కోచింగ్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడని చెప్పేవారు. సిస్టర్స్ ఇద్దరూ చాలా సేపు ప్రాక్టీస్ చేస్తుండేవారు. వీనస్, సెరెనాలు టెన్నిస్ అకాడమీలో చేరటానికి వీలుగా వీరి కుటుంబం 1991లో ఫ్లోరిడాకు నివాసం మారింది. 1994లో వీనస్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది. ఆ మరుసటి ఏడాదే అంటే 1995లో సెరునా కూడా అంతర్జాతీయ టెన్నిస్‌లో అడుగుపెట్టింది. అక్క వీనస్ విలియమ్స్ ఆటను చూసిన అప్పటి టెన్నిస్ అభిమానులు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను వీనస్ గెలుస్తుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెల్లి సెరెనా ముందుగా దానిని సాధించింది. 1999 యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది. అప్పుడు సెరెనా విలియమ్స్ వయసు కేవలం 17 ఏళ్లు. న్యూయార్క్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో నాటికి ప్రపంచ దిగ్గజాలైన మోనికా సెలెస్‌ను క్వార్టర్ ఫైనల్లో, లిండ్సే డావెన్పోర్ట్ను సెమీ ఫైనల్లో, వరల్డ్ నంబర్ వన్ మార్టినా హింగిస్‌ను ఫైనల్లో ఓడించి.. సెరెనా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం విశేషం. ఇక అదే టోర్నమెంట్లో అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఈ అక్కచెల్లెళ్లు తమ కెరీర్ ప్రస్థానంలో 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. 1999లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన సెరెనా.. ఆ తర్వాత కెరీర్లో వెనుదిరిగి చూసుకోలేదు. చాలా సందర్భాల్లో తన అక్క వీనస్ విలియమ్స్తోనే గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడి టైటిల్స్ గెలిచి అక్కపై పైచేయి సాధించింది. అలా 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్నెగ్గింది. ఇందులో ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఏడుసార్లు వింబుల్డన్.. మరో ఆరుసార్లు యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఈ తరంలో మహిళల టెన్నిస్ విభాగంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది. 2017లో సెరెనా విలియమ్స్.. రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌ను పెళ్లి చేసుకున్నారు.సెరెనా విలియమ్స్ ఎనిమిది వారాల గర్భంతో ఉన్న సమయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలిచి ఔరా అనిపించింది. ఇది ఆమెకు 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఇదే చివరిది. మహిళల టెన్నిస్ ఓపెన్ శకంలో ఆల్ టైమ్ విజేతల జాబితాలో సెరెనా విలియమ్స్ స్టెఫీ గ్రాఫ్‌ను అధిగమించింది. ఆమెకన్నా పైస్థానంలో మార్గరెట్ కోర్ట్ మాత్రమే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి స్థానంలో ఉంది. 2017లో సెరెనా తన కుమార్తె అలెక్సిస్ ఒంపియాకు జన్మనిచ్చింది. అయితే సిజేరియన్ ఆపరేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సెరెనా దాదాపు ఆరు వారాల పాటు మంచానికే పరిమితమయ్యింది. 2018లో మళ్లీ టెన్నిస్ మైదానంలోకి అడుగుపెట్టిన సెరెనా.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరినప్పటికి ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. తాజాగా తన చివరి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ అని చెప్పుకున్న సెరెనా.. ఈసారి కచ్చితంగా టైటిల్ సాధిస్తుందనుకున్న తరుణంలో మూడో రౌండ్‌తోనే ఆమె తన కెరీర్‌ను ముగించింది. తను ప్రొఫెషనల్ మ్యాచ్‌ను ఎక్కడైతే ఆరంభించిందో అదే టెన్నిస్ కోర్టులో ఇవాళ తుది మ్యాచ్ ఆడింది. చదవండి: ముగిసిన 'నల్లకలువ' పోరాటం.. 'అక్క లేకపోతే నేను లేను' అంటూ భావోద్వేగం -
ముగిసిన 'నల్లకలువ' పోరాటం.. 'అక్క లేకపోతే నేను లేను'
అమెరికన్ మహిళ టెన్నిస్ స్టార్.. నల్లకలువ సెరెనా విలియమ్స్ పోరాటం ముగిసింది. శనివారం ఉదయం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్లో సెరెనా 5-7, 7-6 (7/4), 1-6 తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టామ్లానోవిక్ చేతిలో పోరాడి ఓడిపోయింది. దీంతో 24వ గ్రాండ్‌స్లామ్ అందుకోవాలన్న ఆమె కల తీరకుండానే కెరీర్ ముగించింది. కాగా యూఎస్ ఓపెన్ తర్వాత ఆటకు దూరం కానున్నట్లు సెరెనా ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మ్యాచ్ అనంతరం ఇంటర్య్వూలో మాట్లాడిన సెరెనా విలియమ్స్ కన్నీటి పర్యంతమైంది. ''టెన్నిస్‌లో నా జీవిత ప్రయాణం అత్యంత అద్భుతంగా సాగింది. కెరీర్ చివరి వరకు తనను ప్రోత్సహించిన అభిమానులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అభిమానుల వల్లే ఇంత దూరం రాగలిగాను. ఇక చిన్నప్పుడే టెన్నిస్‌పై మక్కువ పెంచుకోవడంలో తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ఆటలోకి వచ్చిన తర్వాత అక్క వీనస్ విలియమ్స్ అండగా నిలిచింది. చెప్పాలంటే వీనస్ లేకపోతే.. సెరెనా అనే వ్యక్తి టెన్నిస్‌లో ఉండేది కాదు.. థాంక్యు అక్క.. నీ సపోర్ట్ ఎన్నటికి మరువలేనిది.. ఇకపై కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. నా కళ్ల నుంచి వచ్చి కన్నీళ్లు కావు ఆనందబాష్పాలు'' అంటూ భావోద్వేగంతో ముగించింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ‘రిటైర్మెంట్ పై పునరాలోచన చేస్తారా?’ అని కోర్టులో వ్యాఖ్యాత ప్రశ్నించినప్పుడు.. ‘నేను అలా అనుకోవడం లేదు.. కానీ మీకు ఎప్పటికీ తెలియదు’ అని సమాధానం ఇచ్చింది. కాగా తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గింది. ఇందులో ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఏడుసార్లు వింబుల్డన్.. మరో ఆరుసార్లు యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఈ తరంలో మహిళల టెన్నిస్ విభాగంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది.2017లో ప్రెగ్నెంట్ ఉన్న సమయంలోనే సెరెనా చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గింది.అయితే, వయసు మీద పడటం, గాయాల కారణంగా గత ఐదేళ్లలో ఆమె ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేకపోయింది. దాంతో 41 ఏళ్ల సెరెనా కెరీర్ ముగించాలని నిర్ణయానికి వచ్చింది. A speech worth of the 🐐@serenawilliams | #USOpen pic.twitter.com/0twItGF0jq — US Open Tennis (@usopen) September 3, 2022 చదవండి: అభిమానులకు ఊహించని షాకిచ్చిన గంగూలీ! -
US Open 2022: నాదల్ ముందంజ
న్యూయార్క్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కొంత ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్లాగే తొలి సెట్‌ను కోల్పోయిన అతను ఆ తర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో ముందంజ వేశాడు. ‘నా కెరీర్లో అతి చెత్త ఆరంభాల్లో ఇది ఒకటి’... యూఎస్ ఓపెన్ రెండో రౌండ్లో ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)పై విజయం తర్వాత స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ వ్యాఖ్య ఇది. తొలి సెట్లో, ఆ తర్వాత రెండో సెట్లో సగం వరకు కూడా నాదల్ ఆట చూస్తే అలాగే అనిపించింది. అయితే అసలు సమయంలో తేరుకున్న అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. 2 గంటల 43 నిమిషాల పాటు సాగిన పోరులో చివరకు విజేతగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నాదల్ 2–6, 6–4, 6–2, 6–1తో ఫాగ్నినిపై గెలుపొందాడు. తొలి సెట్‌ను కోల్పోవడంతో పాటు రెండో సెట్లో కూడా ఒక దశలో నాదల్ 2–4తో వెనుకబడ్డాడు. అయితే ఏడో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు ప్రత్యర్థి సర్వీస్‌ను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసి నాదల్ సెట్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత తిరుగులేని ఆటతో అతను ఫాగ్నినికి చెక్ పెట్టాడు. మూడో రౌండ్లో నాదల్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–2, 6–1, 7–5తో ఫెడెరికో (అర్జెంటీనా)ను ఓడించి ముందంజ వేశాడు. తన రాకెట్‌తో ముక్కుకు... ఫాగ్నినితో మ్యాచ్ సందర్భంగా నాదల్కు అనూహ్య రీతిలో స్వల్పంగా గాయమైంది. నాలుగో సెట్లో కుడి పక్కకు జరిగి వైడ్ బ్యాక్‌హ్యాండ్ ఆడే క్రమంలో రాకెట్‌పై నాదల్ పట్టు కోల్పోయాడు. వేగంగా కోర్టును తాకిన రాకెట్ అంతే వేగంగా వెనక్కి వచ్చి అతని ముక్కుకు బలంగా తాకింది. రక్తస్రావం కావడంతో ఆటను నిలిపేసి వెంటనే అతను వైద్య చికిత్స తీసుకున్నాడు. ముక్కుపై బ్యాండేజీతో ఆ తర్వాత ఆటను కొనసాగించి అతను విజేతగా నిలిచాడు. తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, ముక్కు పగిలినట్లు భావించానన్న నాదల్... అంత చెత్తగా ఆడుతున్నందుకు తనకు లభించిన చిన్నపాటి శిక్ష అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. విలియమ్స్ సిస్టర్స్‌కు నిరాశ... సొంత ప్రేక్షకుల ముందు చివరిసారిగా ఆడేందుకు నాలుగున్నరేళ్ల తర్వాత డబుల్స్‌లో జోడీ కట్టిన ‘విలియమ్స్ సిస్టర్స్’ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ‘వైల్డ్‌కార్డ్’తో ఈ టోర్నీలో అడుగు పెట్టిన సెరెనా–వీనస్ ద్వయం 6–7 (5/7), 4–6 స్కోరుతో లూసీ హర్డెకా–లిండా నొస్కొవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఆడినంత సేపు అభిమానులంతా ‘విలియమ్స్’ నినాదాలతో ఉత్సాహపరిచారు. తొలి సెట్ టైబ్రేకర్‌లో 19 స్ట్రోక్‌ల పాయింట్‌ను వీరిద్దరు గెలుచుకున్నప్పుడైతే దాదాపు 24 వేల సామర్థ్యం గల స్టేడియం మొత్తం హోరెత్తింది. సెరెనా–వీనస్ కలిసి మహిళల డబుల్స్‌లో 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచారు. కిరియోస్‌కు భారీ జరిమానా ప్రతీ టోర్నీలో క్రమశిక్షణను ఉల్లంఘించి భారీగా జరిమానాలు చెల్లించడంలో ‘డాక్టరేట్ పొందిన’ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) మళ్లీ అదే తప్పు చేశాడు. గ్యాలరీలో కూర్చున్న అభిమానులను ఉద్దేశిస్తూ అసభ్యకర భాష వాడిన అతను క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. దాంతో నిర్వాహకులు కిరియోస్‌కు 7,500 డాలర్లు (సుమారు రూ. 6 లక్షలు) జరిమానా విధించారు. బోపన్న ఇంటిదారి భారత ఆటగాడు రోహన్ బోపన్నకు పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో కూడా నిరాశే ఎదురైంది. డబుల్స్‌లో బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) 6–7 (2/7), 2–6 స్కోరుతో సొనెగో–వవసొరి (ఇటలీ) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్ లో బోపన్న–జువాన్ యాంగ్ (చైనా) జోడీ 5–7, 5–7తో దబ్రొస్కీ (కెనడా)–పర్సెల్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో మరో భారత ఆటగాడు రామ్‌కుమార్ –కాసిక్ (సెర్బి యా) 4–6, 4–6తో బొలెలి–ఫాగ్నిని (ఇటలీ) చేతిలో పరాజయం పొందారు. షేక్‌హ్యాండ్‌కు నిరాకరణ... మహిళల సింగిల్స్‌లో అజరెంకా (బెలారస్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్ లో ఆమె 6–2, 6–3తో మార్టా కొస్యుక్ (ఉక్రెయిన్)ను ఓడించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సహజంగా ఇద్దరు ప్లేయర్లు చేతులు కలిపే సంప్రదాయానికి భిన్నంగా కొస్యుక్ దూరం జరిగింది. తన దేశంపై రష్యా దాడికి నిరసనగా (రష్యాకు బెలారస్ సహకరిస్తోంది) ఆమె ఈ పని చేసింది. చివరకు ఒకరి రాకెట్‌ను మరొకరు తాకించి ఇద్దరూ నిష్క్రమించారు. ప్రిక్వార్టర్స్‌లో జబర్ ఐదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మూడో రౌండ్లో జబర్ 4–6, 6–4, 6–3తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై గెలిచింది. గతంలో ఆరుసార్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన జబర్ మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేదు. -
నాదల్ జోరు.. తొలి రౌండ్లోనే వెనుదిరిగిన విలియమ్స్ సిస్టర్స్
యూఎస్ ఓపెన్ 2022లో భాగంగా నాలుగో రోజు పెద్దగా ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిని 2-6, 6-4, 6-2, 6-1తేడాతో చిత్తు చేసి మూడోరౌండ్‌కు చేరుకున్నాడు. అయితే తొలి గేమ్ ఓడిన అనంతరం నాదల్ రాకెట్.. అతని ముక్కును చీల్చడంతో రక్తం కారింది. అయితే దీనిని లెక్కచేయని నాదల్ ఆ తర్వాత తన జోరును ప్రదర్శించాడు. పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడిన నాదల్.. ప్రత్యర్థి ఫోగ్నినిని వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఇక 23 వ గ్రాండ్‌స్లామ్ అందుకునేందుకు నాదల్ మరింత దగ్గరయ్యాడు. VAMOS pic.twitter.com/6xxFhV4pJC — US Open Tennis (@usopen) September 2, 2022 రికార్డు విజయాలతో అల్కరాజ్.. పరుషుల వరల్డ్ నెంబర్ 3 కార్లోస్ అల్కరాజ్ కూడా యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. గురువారం రాత్రి జరిగిన రెండో రౌండ్లో అర్జెంటీనాకు చెందిన కొరియాను 6-2, 6-2, 7-5తో ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక ఈ సీజన్లో అల్కరాజ్కు ఇది 46వ విజయం. ఈ క్రమంలోనే సిట్సిపాస్ రికార్డును అధిగమించిన అల్కరాజ్ తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు.. ఈ సీజన్లో సిట్సిపాస్ 17 పరాజయాలు పొందగా.. అల్కరాజ్ మాత్రం కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలయ్యాడు. We see you, @carlosalcaraz 👀 pic.twitter.com/lGEZZin5dS — US Open Tennis (@usopen) September 1, 2022 ఎదురులేని స్వియాటెక్.. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో మహిళల ప్రపంచ నెంబర్‌వన్ ఇగా స్వియాటెక్ తన జోరును ప్రదర్శిస్తోంది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన స్టీఫెన్స్‌ను స్వియాటెక్.. 6-3, 6-2తో ఓడించి మూడో రౌండ్లో అడుగుపెట్టింది. కాగా 2020, 2022లో స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. It's always crazy hearing yourself for the first time in the world's largest tennis stadium, @iga_swiatek 😆 pic.twitter.com/cWUjhiJSg9 — US Open Tennis (@usopen) September 1, 2022 విలియమ్స్ సిస్టర్స్‌కు షాకిచ్చిన చెక్ రిపబ్లిక్ ద్వయం.. ఇక మహిళల డబుల్స్ విభాగంలో విలియమ్స్ సిస్టర్స్(సెరెనా, వీనస్ విలియమ్స్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. గురువారం రాత్రి జరిగిన తొలి రౌండ్లో చెక్ రిపబ్లిక్ ద్వయం లూసీ హ్రడెకా- లిండా నోస్కోవా చేతిలో 7-6(7-5), 6-4తో విలియమ్స్ సిస్టర్స్ ఓటమి పాలయ్యారు. అయితే సింగిల్స్ మాత్రం సెరెనా దుమ్మురేపింది. బుధవారం రాత్రి జరిగిన రెండో రౌండ్లో వరల్డ్ నెంబర్-2 అనెట్ కొంటావిట్ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. చదవండి: బైచుంగ్ భుటియా ఘోర పరాజయం.. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే సాయ్(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్ -
వరల్డ్ నెంబర్-2కు షాక్.. మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన నల్లకలువ
అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో తన జోరు ప్రదర్శిస్తోంది. యూఎస్ ఓపెన్ అనంతరం లాంగ్‌బ్రేక్ తీసుకోనున్న నేపథ్యంలో సెరెనా 24వ టైటిల్ సాధించేందుకు మరో అడుగు ముందుకేసింది. యూఎస్ ఓపెన్‌లో భాగంగా బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సెరెనా.. వరల్డ్ నెంబర్-2 అనేట్ కొంటావెయిట్ను 7-6(7-4), 2-6, 6-2తో చిత్తుగా ఓడించి ప్రిక్వార్టర్స్(మూడో రౌండ్)కు చేరుకుంది. ఐదేళ్ల నుంచి ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా నెగ్గని సెరెనా... వయసు మీద పడి, గాయాల కారణంగా మునుపటి లయ కోల్పోయింది. పలు టోర్నీల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే వెనుదిరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ రెండో ర్యాంకర్ తో మ్యాచ్ కావడంతో యూఎస్ ఓపెన్ లోనూ సెరెనాకు రెండో రౌండ్ ఆఖరుదని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ 41 ఏళ్ల వయసులో సెరెనా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. మ్యాచ్‌లో తొలి సెట్‌ను టై బ్రేక్ లో గెలిచిన సెరెనా రెండో సెట్లో మాత్రం వెనుకంజ వేసింది. ఇక ఓటమి ఖాయమనుకున్న తరుణంలో నిర్ణాయాత్మక మూడో సెట్లో సెరెనా విజృంభించింది. పాత సెరెనాను గుర్తుచేస్తూ బ్యాక్, ఫోర్ హ్యాండ్, ఫార్వర్డ్ షాట్లతో దూకుడు ప్రదర్శించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం సెరెనా మాట్లాడుతూ.. ''నేను సెరెనా విలియమ్స్. బాగా ఆడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. కెరీర్లో ఎంతో సాధించా. నిజాయతీగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేదంతా బోనస్‌గా భావిస్తున్నా. కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.. అలాగని కోల్పోయేది కూడా ఏమీ లేదు. నా ఆట ఇంకా కొంచెం మిగిలి ఉందని అనుకుంటున్నా'' అంటూ పేర్కొంది. Serena, surprised at her level? 😏 pic.twitter.com/QP41An73FE — US Open Tennis (@usopen) September 1, 2022 చదవండి: Japan Open 2022: తొలి రౌండ్లో భారత్‌కు నిరాశజనక ఫలితాలు -
రఫ్పాడించిన స్పెయిన్ బుల్; ఒసాకాకు బిగ్‌షాక్
స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను దిగ్విజయంగా అధిగమించాడు. మంగళవారం అర్థరాత్రి జరిగిన తొలి రౌండ్లో నాదల్.. ఆస్ట్రేలియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రింకీ హిజికాటాను 4-6, 6-2, 6-3, 6-3తో ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో నాదల్ తొలి సెట్‌ను 4-6తో హిజికాటాకు కోల్పోయాడు. అయితే ఇక్కడి నుంచి నాదల్ తన గేర్ మార్చాడు. రెండో గేమ్ నుంచి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన వరుసగా మూడు సెట్లను గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. Photo Credit: US Open Twitter ఇక 22 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన నాదల్.. ఇటీవలే వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు ముందు గాయంతో దూరమయ్యాడు. అయితే ఈసారి మాత్రం నాదల్‌లో ఫిట్నెస్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడం.. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్ దూరం కాగా.. నాదల్ మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. ఇక రెండో రౌండ్లో నాదల్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినితో తలపడనున్నాడు. 2019లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన నాదల్ ఆ తర్వాత యూఎస్ ఓపెన్ ఆడడం ఇదే. ఇప్పటికవరకు నాదల్ ఖాతాలో నాలుగు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. #USOpen night sessions carry. Just ask @RafaelNadal pic.twitter.com/llcuqtIA7F — US Open Tennis (@usopen) August 31, 2022 HOLY MATCH POINT RAFA pic.twitter.com/sHsyYmPBAK — US Open Tennis (@usopen) August 31, 2022 తొలి రౌండ్లోనే వెనుదిరిగిన నవోమి ఒసాకా Photo Credit: US Open Twitter యూఎస్ ఓపెన్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఎమ్మా రాడుకాను తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టగా.. తాజాగా జపాన్ టెన్నిస్ స్టార్.. మాజీ చాంపియన్ 44వ సీడ్ నవోమి ఒసాకా అమెరికాకు చెందిన 19వ సీడ్ డేనియల్ కాలిన్స్ చేతిలో 7-6(7-5), 6-3 తేడాతో ఓడి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. గత కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న ఒసాకా 2018, 2020లో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. Danielle Collins is into Round 2 of the #USOpen pic.twitter.com/rUZa0hWKHx — US Open Tennis (@usopen) August 31, 2022 చదవండి: Emma Raducanu: యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్ Colin De Grandhome: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్
యూఎస్ ఓపెన్‌లో బుధవారం తెల్లవారుజామున పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో బ్రిటన్ స్టార్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఎమ్మా రాడుకానుకు బిగ్‌షాక్ తగిలింది. తొలి రౌండ్లో ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ చేతిలో 6-3, 6-3తో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన మరుసటి ఏడాదే తొలి రౌండ్లో వెనుదిరిగిన మూడో క్రీడాకారిణిగా ఎమ్మా రాడుకాను నిలిచింది. ఇంతకముందు 2004లో యూఎస్ ఓపెన్ నెగ్గిన స్వెత్లానా కుజ్నెత్సోవా.. మరుసటి ఏడాది తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఇక 2016లో విజేతగా నిలిచిన ఏంజెలిక్ కెర్బర్.. మరుసటి ఏడాది నవోమి ఒసాకా చేతిలో తొలి రౌండ్లోనే చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. ఇక 40వ ర్యాంకర్ అయిన అలిజా కార్నెట్ రికార్డు స్థాయిలో 63వ గ్రాండ్‌స్లామ్ ఆడుతుండడం విశేషం. అయితే ఇప్పటివరకు క్వార్టర్స్ వరకు మాత్రమే వెల్లగలిగింది. అయితే ఈ సీజన్లో టాప్ 20లో ఉన్న ఆరుగురు క్రీడాకారిణులను ఓడించడం విశేషం. .@alizecornet is victorious in Armstrong! She defeats Raducanu, 6-3, 6-3 to advance to Round 2. pic.twitter.com/RHAd0zCBxv — US Open Tennis (@usopen) August 31, 2022 చదవండి: US Open 2022: యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు -
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు
చైనాకు చెందిన టెన్నిస్ ఆటగాడు యూ వైబింగ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో చరిత్ర సృష్టించాడు. 63 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో చైనా నుంచి సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో విజయం సాధించిన రెండో ఆటగాడిగా యూ వైబింగ్ రికార్డులకెక్కాడు. విషయంలోకి వెళితే.. 174వ ర్యాంకర్ అయిన యూ వైబింగ్.. తొలి రౌండ్లో జార్జేరియాకు చెందిన 31వ సీడ్ నికోలోజ్ బాసిలాష్విలిని 6-3,6-4,6-0తో వరున సెట్లలో కంగుతినిపించాడు. కాగా 22 ఏళ్ల యూ వైబింగ్ మ్యాచ్‌లో తొమ్మిది ఏస్‌లు.. 31 విన్నర్లు సంధించాడు. టెన్నిస్‌లో మేజర్ గ్రాండ్‌స్లామ్‌లు చూసుకుంటే 1959 తర్వాత చైనా నుంచి ఒక ఆటగాడు సింగిల్స్ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1959లో వింబుల్డన్‌లో మెఫు-చి మాత్రమే మేజర్ విజయాలు సాధించాడు. ఇక 1935లో చైనాకు చెందిన చెంగ్ గయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్ మ్యాచ్ గెలిచాడు. అప్పటినుంచి చూసుకుంటే మళ్లీ ఒక్క చైనీస్ ఆటగాడు యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయారు. తాజాగా యూ వైబింగ్ మాత్రమే యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా అధిగమించాడు. కాగా 2017లో జూనియర్ చాంపియన్‌గా నిలిచిన యూ వైబింగ్ ఆ తర్వాత ప్రొఫెషనల్ కెరీర్లో రాణించలేకపోయాడు. వరుస గాయాలు అతన్ని ఇబ్బందిపెట్టాయి. మార్చి 2019 నుంచి జనవరి 2022 వరకు యూ వైబింగ్ టెన్నిస్‌కు మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని మార్చిలో బరిలోకి దిగిన యూ వైబింగ్ ర్యాంక్ 1869. అయితే వరుసగా 14 మ్యాచ్‌లు(తాజా దానితో కలిపి) విజయాలు సాధించి ఏకంగా 174వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక యూ వైబింగ్ తన తర్వాతి మ్యాచ్ పోర్చుగీస్‌కు చెందిన నునో బోర్జెస్‌తో ఆడనున్నాడు. Wu Yibing has become the first man from China to win a men's Grand Slam match in 63 years after he beat Nikoloz Basilashvili 6-3 6-4 6-0. Trailblazer 🔥 #USOpen pic.twitter.com/zlZm9Tnd2u — Eurosport (@eurosport) August 29, 2022 చదవండి: US Open 2022: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సెరెనా -
రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సెరెనా
న్యూయార్క్: కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నట్లు ప్రకటించిన అమెరికా నల్లకలువ, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్.. యూఎస్ ఓపెన్ 2022లో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా.. మాంటెనెగ్రోకు చెందిన డంకా కొవినిక్‌పై 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. That winning feeling. #Serena pic.twitter.com/xJ4YUdi1Fj— US Open Tennis (@usopen) August 30, 2022 కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన 40 ఏళ్ల సెరెనా.. తొలి రౌండ్లో ఏమాత్రం తడబాటుకు గురికాకుండా ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సెరెనా కెరీర్లో ఇదే చివరి మ్యాచ్ అవుతుందేమోనని ఆమె అభిమానులు స్టేడియం వద్ద బారులు తీరారు. ఆర్థర్ యాష్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను దాదాపు 23000 మంది వీక్షించినట్లు నిర్వహకులు తెలిపారు. #TwirlForSerena pic.twitter.com/RCoCSeGB0y — US Open Tennis (@usopen) August 30, 2022 మాజీ వరల్డ్ నంబర్ 1, ప్రస్తుత 605వ ర్యాంకర్ అయిన సెరెనా తొలి రౌండ్లో తన కంటే చాలా మెరుగైన ర్యాంకర్ డంకా కొవినిక్ (80వ ర్యాంక్)పై అలవోకగా విజయం సాధించడంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగితేలారు. తమ ఆరాధ్య క్రీడాకారిణి మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గి, అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) రికార్డును సమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఈ మ్యాచ్‌తో పాటు కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచిన సెరెనా.. రెండో రౌండ్లో వరల్డ్ నంబర్ 2 ఎస్టోనియాకు చెందిన అన్నెట్ కొంటావెట్ను ఢీకొట్టాల్సి ఉంది. చదవండి: US Open 2022: సెరెనాపైనే దృష్టి -
ముర్రే శుభారంభం
కొన్నేళ్ల క్రితం ‘బిగ్ ఫోర్’లో ఒకడిగా వెలుగొందిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కెరీర్ గాయాల కారణంగా గాడి తప్పింది. ‘గ్రాండ్‌స్లామ్’ విజయాల్లో జొకోవిచ్, నాదల్, ఫెడరర్ దూసుకుపోతుంటే ముర్రే మాత్రం వెనుకబడిపోయాడు. తాను పాల్గొన్న చివరి ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ముర్రే ఒక్కసారి మాత్రమే మూడో రౌండ్ వరకు వెళ్లగలిగాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ముర్రే వరుస సెట్లలో తొలి రౌండ్లో విజయం అందుకున్నాడు. న్యూయార్క్: ఈ ఏడాది ఆడుతున్న మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించాడు. సోమవారం మొదలైన టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో 2016 చాంపియన్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 51వ ర్యాంకర్ ముర్రే 7–5, 6–3, 6–3తో ప్రపంచ 27వ ర్యాంకర్, 24వ సీడ్ ఫ్రాన్సిస్కో సెరున్‌డొలో (అర్జెంటీనా)పై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండు గంటల 41 నిమిషాలపాటు జరిగిన పోరులో ముర్రే ఆరు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చిన ముర్రే 18 సార్లు పాయింట్లు గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసిన ఈ మాజీ నంబర్‌వన్ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. 32 అనవసర తప్పిదాలు చేసిన ముర్రే 25 విన్నర్స్ కొట్టాడు. కెరీర్లో 16వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న ముర్రే 2016లో టైటిల్ సాధించి, 2008లో రన్నరప్‌గా నిలిచాడు. మెద్వెదెవ్ అలవోక విజయం పురుషుల సింగిల్స్‌లో తొలిరోజు జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) కూడా అలవోక విజయంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. స్టెఫాన్ కొజ్లోవ్ (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–2, 6–4, 6–0తో గెలుపొందాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 10 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన అమెరికా ప్లేయర్ జేజే వుల్ఫ్ 6–4, 6–4, 6–4తో 16వ సీడ్ రొబెర్టో బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ఓడించాడు. శ్రమించి నెగ్గిన సాకరి మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ మరియా సాకరి (గ్రీస్) రెండో రౌండ్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది. తాత్యానా మరియా (జర్మనీ)తో జరిగిన తొలి రౌండ్లో సాకరి 6–4, 3–6, 6–0తో గెలిచింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–2, 6–4తో రఖిమోవా (రష్యా)పై, అలీసన్ రిస్కీ అమృత్‌రాజ్ (అమెరికా) 6–2, 6–4తో ఎలీనా యు (అమెరికా)పై విజయం సాధించారు. -
US Open 2022: సెరెనాపైనే దృష్టి
న్యూయార్క్: రిటైర్మెంట్కు కౌంట్‌డౌన్ మొదలైందని ఇటీవల ప్రకటించిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ప్రధాన ఆకర్షణగా నేడు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి తెర లేవనుంది. 40 ఏళ్ల సెరెనా ఇప్పటివరకు కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 21వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా ఆరుసార్లు విజేతగా, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. నాలుగుసార్లు సెమీఫైనల్, మూడుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. 2008 నుంచి యూఎస్ ఓపెన్‌లో సెరెనా కనీసం సెమీఫైనల్ దశ వరకు చేరుకుంటోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 80వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)తో ఆడుతుంది. ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్), రెండుసార్లు విజేత నయోమి ఒసాకా (జపాన్), డిఫెండింగ్ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్), సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా), రాఫెల్ నాదల్ (స్పెయిన్), సిట్సిపాస్ (గ్రీస్), నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా), అల్కారజ్ (స్పెయిన్) టైటిల్ రేసులో ఉన్నారు. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగం విజేతలకు 26 లక్షల డాలర్ల చొప్పున (రూ. 20 కోట్ల 79 లక్షలు) ప్రైజ్‌మనీ లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 8:30 నుంచి తొలి రౌండ్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మ్యాచ్‌లను సోనీ సిక్స్, సోనీ టెన్–2, సోనీ టెన్–3 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ
టెన్నిస్‌లో ఆ ఇద్దరిని దిగ్గజాలుగా అభివర్ణిస్తారు. ఒకరు పురుషుల టెన్నిస్‌లో ఆధిపత్యం చెలాయిస్తుంటే.. మరొకరు మహిళల టెన్నిస్‌లో మకుటం లేని మహారాణిగా వెలుగొందుతుంది. ఒకేసారి ఈ ఇద్దరు ఎదురుపడితే అది అద్భుత దృశ్యం కాకుండా ఉంటుందా. అందుకే యూఎస్ ఓపెన్ నిర్వాహకులు..''ఆర్థర్ ఆషే స్టేడియం GOAT Farmగా(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)గా మారిపోయింది.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఆ ఇద్దరే అమెరికన్ నల్లకలువ సెరెనా విలియమ్స్.. మరొకరు స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్. Photo Credit: US Open విషయంలోకి వెళితే.. సోమవారం(ఆగస్టు 29 నుంచి) యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. ప్రాక్టీస్ సమయంలో సెరెనా, నాదల్‌లు ఒకరినొకరు ఎదురుపడ్డారు. నాదల్ ప్రాక్టీస్ చేయడానికి కోర్టులోకి వస్తుంటే.. అదే సమయంలో సెరెనా ప్రాక్టీస్ ముగించుకొని వెళుతుంది. దీంతో ఇద్దరు ఒకరినొకరు పలకరించుకొని హగ్ చేసుకున్నారు. ఇద్దరు టెన్నిస్ లెజెండ్స్ కలిస్తే మాములుగా ఉంటుందా.. ప్రాక్టీస్ చూడానికి వచ్చిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసిన యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ట్విటర్లో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియలో వీడియో వైరల్‌గా మారింది. Photo Credit: US Open ఇక సెరెనా, నాదల్‌లు ఎవరికి వారే సాటి. మహిళల టెన్నిస్‌లో ఓపెన్ శకంలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో సెరెనా విలియమ్స్ కొత్త చరిత్ర సృష్టించింది. మరొక టైటిల్ సాధిస్తే.. మహిళల ఆల్‌టైం టెన్నిస్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్(24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) సరసన చోటు సంపాదిస్తుంది. ఇక స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ పురుషుల టెన్నిస్ విభాగంలో ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాదల్ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. ఇక యూఎస్ ఓపెన్ అనంతరం సెరెనా టెన్నిస్ నుంచి లాంగ్‌బ్రేక్ తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. యూఎస్ ఓపెన్‌లో సెరెనా తొలి రౌండ్లో మోంటెన్గ్రోకు చెందిన డన్కా కోవినిక్తో తలపడనుంది. ఇక 23 గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్ ఆస్ట్రేలియాకు చెందిన రింకీ హిజికతాతో తొలి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా వరల్డ్ నెంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఇక స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్‌లో మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. Arthur Ashe Stadium has become a GOAT farm 🐐@serenawilliams 😍 @RafaelNadal | #USOpen pic.twitter.com/77S3GFibHS — US Open Tennis (@usopen) August 24, 2022 చదవండి: పాక్‌తో మ్యాచ్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ డుమ్మా; కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే.. -
యూకీ బాంబ్రీ నిష్క్రమణ
న్యూయార్క్: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్ దశలోనే భారత్ పోరాటం ముగిసింది. రెండో క్వాలిఫయిగ్ రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ 3–6, 2–6 స్కోరుతో జిజో బెరŠగ్స్ (బెల్జియం) చేతిలో ఓటమిపాలయ్యాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 552వ స్థానంలో ఉన్న యూకీ 155వ ర్యాంక్‌లో ఉన్న ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. ఈ టోర్నీలో ఇంతకు ముందే క్వాలిఫయింగ్ దశలో భారత ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, సుమీత్ నగాల్ ఓడిపోయారు. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. న్యూయార్క్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 464వ ర్యాంకర్ సుమిత్ 6–7 (2/7), 4–6తో ప్రపంచ 132వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేశాడు. తొలి రౌండ్లో ఓడిన సుమిత్‌కు 21,100 డాలర్ల (రూ. 16 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ కూడా తొలి రౌండ్లో ఓడిపోగా, యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. -
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి జొకోవిచ్ దూరం
న్యూయార్క్: కోవిడ్ టీకా తీసుకోని కారణంతో... సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కూ దూరమయ్యాడు. కరోనా టీకా వేసుకోకపోవడంతో ఈ ఏడాది ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఆడనివ్వలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్నీ నుంచి మాత్రం ఈ సెర్బియా స్టార్ స్వయంగా తప్పుకున్నాడు. ‘డ్రా’ విడుదలకు కొన్ని గంటల ముందు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అతను వెల్లడించాడు. ‘యూఎస్ ఓపెన్ ఆడేందుకు నేను న్యూయార్క్‌కు వెళ్లట్లేదు. ఇది బాధాకరమే కాని తప్పలేదు. ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఆశావహ దృక్పథంతో వచ్చే సీజన్లో ఆడేందుకు కృషి చేస్తా’ అని ట్వీట్ చేశాడు. 35 ఏళ్ల సెర్బియన్ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (22 టైటిల్స్) కంటే ఒకటి తక్కువ. దీన్ని తాజా గ్రాండ్‌స్లామ్‌లో జొకో సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అతను 2011, 2015, 2018లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. మరో ఆరుసార్లు రన్నరప్‌గా తృప్తి పడ్డాడు. ఇంతటి ఘన రికార్డు ఉన్న అతనికి న్యూయార్క్‌లో మరో టైటిల్ గెలవడం, నాదల్ రికార్డును సమం చేయడం కష్టం కాదు. అయితే అమెరికా, కెనడా దేశాల్లో స్వదేశీయులు తప్ప టీకా తీసుకోని విదేశీయులను అనుమతించడం లేదు. అందువల్లే జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉంటున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన ఈ సెర్బియన్ క్వార్టర్స్‌లో నాదల్ చేతిలో ఓడాడు. కానీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. -
US Open Qualifiers: యూకీ శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 552వ ర్యాంకర్ యూకీ 7–6 (7/4), 6–4తో తొమ్మిదో సీడ్, ప్రపంచ 107వ ర్యాంకర్ రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. అయితే భారత నంబర్‌వన్, ప్రపంచ 241వ ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ప్రపంచ 762వ ర్యాంకర్ బ్రూనో కుజుహారా (అమెరికా) 6–3, 7–5తో రామ్‌కుమార్‌ను ఓడించాడు. చదవండి: BWF World Championships 2022: ప్రణయ్ సంచలనం -
'యూఎస్ ఓపెన్‌కు దూరం'.. రిటైర్మెంట్ ప్లాన్‌లో మార్పులు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ అనంతరం సానియా తన ప్రొఫెషనల్ ఆటకు గుడ్‌బై చెప్పాలనుకుంది. అయితే తాజాగా గాయంతో యూఎస్ ఓపెన్‌కు దూరం కావడంతో సానియా రిటైర్మెంట్లో పలు మార్పులు ఉండనున్నాయి. ఈ సందర్భంగా సానియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. 'హాయ్ గయ్స్. ఒక క్విక్ అప్డేట్. నా దగ్గర అంత గొప్ప వార్త ఏమీ లేదు. రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు మోచేతికి గాయమయింది. నిన్న స్కానింగ్ చేయించుకునేంత వరకు ఆ గాయం ఎంత తీవ్రమైనదో నాకు అర్థం కాలేదు. మోచేతి దగ్గర లిగ్మెంట్ కాస్త దెబ్బతింది. ఈ కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నాను. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నా. ఈ పరిణామాల నేపథ్యంలో నా రిటైర్మెంట్ ప్లాన్స్ లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటా' అని ఆమె పేర్కొంది. మహిళల డబుల్స్‌లో మాజీ నెంబర్ వన్ అయిన సానియా మీర్జా డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లు ఒక్కోసారి నెగ్గింది. అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను కూడా గెలిచింది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సానియా జంట తృటిలో పతకం చేజార్చుకుంది. చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు Victor Amalraj: పుస్తక రూపంలో భారత దిగ్గజ ఫుట్‌బాలర్ బయోగ్రఫీ.. -
Cincinnati Open 2022: తొలి రౌండ్లోనే సెరెనాకు చుక్కెదురు
సిన్సినాటి: తన టెన్నిస్ కెరీర్ చరమాంకంలో ఉందని అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ తన ఆటతీరుతో నిరూపించింది. ఇటీవల టొరంటో ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన 40 ఏళ్ల సెరెనా తాజాగా సిన్సినాటి ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెరెనా 4–6, 0–6తో బ్రిటన్ టీనేజర్, గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను చేతిలో పరాజయం పాలైంది. యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతానని ఇటీవల సెరెనా ఒక మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 1995లో ప్రొఫెషనల్‌గా మారిన సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. 19 ఏళ్ల రాడుకానుతో జరిగిన మ్యాచ్‌లో సెరెనా రెండో సెట్లో ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచిన పదో ప్లేయర్‌గా రాడుకాను ఘనత వహించింది. 2017లో జొహనా కొంటా (బ్రిటన్) చేతిలో చివరిసారి సెరెనా ఒక సెట్‌ను 0–6తో కోల్పోయింది. సిమోనా హలెప్ (రొమేనియా), అనాబెల్ మెదీనా గారిగెస్ (స్పెయిన్), వీనస్ విలియమ్స్ (అమెరికా), ప్యాటీ ష్నిదెర్ (స్విట్జర్లాండ్), జస్టిన్ హెనిన్ (బెల్జియం), జెలెనా జంకోవిచ్ (సెర్బియా), మేరీజో ఫెర్నాండెజ్ (అమెరికా), అలెక్సియా డెషామ్ బాలెరెట్ (ఫ్రాన్స్) కూడా సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచారు. -
US Open: 'జోకర్' ఆడడం కష్టమే.. ఆన్లైన్లో ఫ్యాన్స్ సంతకాల సేకరణ
సెర్బియా టెన్నిస్ స్టార్.. ముద్దుగా 'జోకర్' అని పిలుచుకునే నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ రూపంలో మరోషాక్ తగిలేలా ఉంది. ఇటీవలే ముగిసిన వింబూల్డన్ ట్రోఫీ నెగ్గడం ద్వారా 21 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన జొకోవిచ్.. యూఎస్ ఓపెన్‌లో ఆడి స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ రికార్డు (22)ను సమం చేయాలని భావిస్తున్నాడు. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న జొకోవిచ్‌కు మరో గండం పొంచి ఉంది. గురువారం విడుదలైన డ్రా లో జొకోవిచ్ పేరు ఉన్నప్పటికీ అతడు ఈ టోర్నీ ఆడేది అనుమానంగానే ఉంది. వ్యాక్సిన్ వేసుకోనివారిపై నిషేధం లేకున్నా అమెరికా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు మెలిపెట్టడంతో జొకోవిచ్ ఈ టోర్నీ ఆడటం కష్టమేనంటూ వార్తలు వస్తున్నాయి. యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో.. ‘ఈ టోర్నీలో వ్యాక్సిన్ వేసుకున్నవారినే అనుమతించాలన్న ఆదేశాలేం లేవు. కానీ మా ప్రభుత్వ విధానం ప్రకారం మేం నడుచుకుంటాం..’ అని తెలిపింది. అగ్రరాజ్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. యూఎస్ పౌరులు మినహాయించి వ్యాక్సిన్ వేసుకోని వారికి దేశంలో ప్రయాణం చేసే ఆస్కారం లేదు. దీంతో జొకోవిచ్‌కు ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ (కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదని ఈ టోర్నీ ఆడనివ్వలేదు)లో ఎదురైన అనుభవమే మళ్లీ ఎదుర్కోక తప్పదని వాదనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జొకోవిచ్ అభిమానులు ఆన్లైన్ పిటిషన్ క్యాంపైన్ స్టార్ట్ చేశారు. జొకోవిచ్‌ను యూఎస్ ఓపెన్‌లో ఆడించాలని కోరుతూ ఆన్లైన్లో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా దీనిలో సంతకాలు చేశారు. మరి జొకోవిచ్ విషయంలో అమెరికా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందోనని అతడి అభిమానులతో పాటు టెన్నిస్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆగస్టు 27 నుంచి యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. అయితే మొదటినుంచి కరోనా వ్యాక్సిన్ వేసుకొనంటూ మొండి పట్టు పట్టిన ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భంగపాటే ఎదురైంది. కోర్టు మెట్ల వరకు సాగిన వివాదంలో తీర్పు చివరకు జొకోవిచ్‌కు వ్యతిరేకంగానే వచ్చింది. వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించిన జోకోవిచ్‌పై ఆసీస్ ప్రభుత్వం మూడేళ్లపాటు నిషేధం విధించింది. ఒక రకంగా జొకో కెరీర్లో ఈ ఉదంతం మాయని మచ్చ అని చెప్పొచ్చు. Apparently 12000 people have signed an online petition to the US government and the USTA to allow @DjokerNole to play the US Open. These people need to understand it has nothing to do with the USTA, they have no control over the situation. It's a federal government mandate. — Craig Gabriel (@crosscourt1) July 20, 2022 చదవండి: World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది' -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘టెన్నిస్ స్టార్’.. ఫొటో వైరల్
Maria Sharapova Welcomes Son: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తల్లయ్యారు. పండంటి బాబుకు ఆమె జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా శుక్రవారం అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడి పేరు థియోడర్ అని షరపోవా వెల్లడించారు. కాగా 35 ఏళ్ల ఈ రష్యన్ బ్యూటీ షరపోవా.. బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు 2020లో తమకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ జంట జూలై 1న తమ తొలి సంతానానికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘మా కుటుంబానికి అత్యంత అందమైన.. ఎంతో గొప్పదైన బహుమతి లభించింది.. థియోడర్’’ అంటూ తమకు కుమారుడు జన్మించిన విషయాన్ని షరపోవా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో తమ చిన్నారి పాపాయితో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇక తన కెరీర్లో మారియా షరపోవా ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. పదిహేడేళ్ల వయసులో 2004లో తన తొలి వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆమె.. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. సుదీర్ఘ కెరీర్‌కు 2020లో ఆటకు వీడ్కోలు పలికిన షరపోవా ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని, మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Maria Sharapova (@mariasharapova) చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే, నెదర్లాండ్స్ -
Wimbledon 2022: వ్యాక్సిన్ విషయంలో తగ్గేదేలే: జకోవిచ్
Novak Djokovic : కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే విషయంలో ప్రముఖ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ పట్టు వీడడం లేదు. ప్రాణం పోయినా తాను వ్యాక్సిన్ వేసుకునే ప్రసక్తే లేదని మరోసారి తెగేసి చెప్పాడు. ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు వేదిక అయిన యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసిన నేపథ్యంలో జకో ఈ మేరకు స్పందించాడు. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగేందుకైనా సాహసిస్తాను కానీ వ్యాక్సిన్ మాత్రం వేసుకోనని ఖరాకండిగా తేల్చి చెప్పాడు. వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని, ఇష్టం లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడం సహేతుకం కాదని వివరించాడు. వ్యాక్సిన్ వేయించుకోవడం తన వ్యక్తిగత నిర్ణయమని, అలా అని తాను వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశాడు. ప్రస్తుతం వింబుల్డన్ బరిలో ఉన్న జకో.. ఇవాళ (జూన్ 27) తొలి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇదిలా ఉంటే, గతేడాది మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (వింబుల్డన్ సహా) నెగ్గిన జకోవిచ్ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా అతను ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం జకో ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. చదవండి: Wimbledon 2022: జొకోవిచ్‌పైనే దృష్టి -
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్‌లో కీలక మార్పు.. ఇకపై
టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌ల్లో ఇకపై ఆఖరి సెట్లో స్కోరు 6-6తో సమంగా ఉన్నప్పుడు 10 పాయింట్ టై బ్రేక్ ఆడేలా కొత్త రూల్ తీసుకొచ్చినట్లు బుధవారం గ్రాండ్‌స్లామ్ బోర్డు ఉమ్మడి అధికారిక ప్రకటన చేసింది. ఈ నిబంధన రానున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచే అమలు చేయనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ''ఆస్ట్రేలియన్ ఓపెన్, రోలాండ్-గారోస్(ఫ్రెంచ్ ఓపెన్), వింబుల్డన్, యుఎస్ ఓపెన్ లాంటి మేజర్ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో 10-పాయింట్ టై-బ్రేక్ ఆడాలనే ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆఖరి సెట్లో స్కోరు ఆరుకు చేరుకున్నప్పుడు ఈ 10 పాయింట్ టై బ్రేక్ ఆడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సుధీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. వాటివల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోతున్నారు.బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ఆట నియమాలలో మరింత స్థిరత్వాన్ని సృష్టించనుంది. తద్వారా ఆటగాళ్ల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇక డబ్ల్యూటీఏ, ఏటీపీ, ఐటీఎఫ్ లాంటి టోర్నీల్లోనూ త్వరలోనే దీనిని అమలు చేయనున్నాం. ఇందుకోసం సదరు కమ్యూనిటీ అధికారులతో విస్తృతమైన సంప్రదింపులు జరుపుతున్నాం. ముందుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో 10 పాయింట్ టై బ్రేక్‌ను ట్రయల్ నిర్వహించనున్నాం. ఆ తర్వాత మెల్లిగా అన్నింటికి వర్తించనున్నాం'' అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 10 పాయింట్ టై బ్రేక్ అనేది అన్ని గ్రాండ్‌స్లామ్‌ల్లో.. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో క్వాలిఫయింగ్ నుంచి ఫైనల్‌కు వరకు ఆఖరి సెట్లో ఇది వర్తించనుంది. సీనియర్‌తో పాటు జూనియర్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, వీల్‌చైర్ డబుల్స్‌లో కూడా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: Maria Sharapova-Michael Schumacher: షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్, క్రిమినల్ కేసులు PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
వరల్డ్ నెంబర్ వన్‌పై విజయం.. ఏటీపీ టోర్నీ ఫైనల్స్‌కు అర్హత
Nitto ATP Finals: వచ్చే నెలలో ఇటలీలో జరిగే టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌కు ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) వరుసగా మూడో ఏడాది అర్హత సాధించాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలవడంతో మెద్వెదెవ్కు ఏటీపీ ఫైనల్స్ టోర్నీ బెర్త్ ఖరారైంది. కాగా సోమవారం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్ వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. రెండు గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ... మెద్వెదెవ్ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఇదిలా ఉండగా.. గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. It was @DaniilMedwed's moment to shine at the #USOpen Highlights from the men's singles final 👇 pic.twitter.com/hfP58Ilnio — US Open Tennis (@usopen) September 12, 2021 చదవండి: VIDEO: యూఎస్ ఓపెన్ ఫైనల్లో మరోసారి బయటపడ్డ వెర్రితనం! రాకెట్ విరగొట్టి.. బాల్గర్ల్ను భయపెట్టి.. -
శోకోవిచ్... వరల్డ్ నంబర్‌వన్ కల చెదిరె
అవును... జొకోవిచ్ ఓడిపోయాడు! అరుదైన ఫామ్‌తో, ఆశలు, అంచనాలతో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శనతో ఆడుతూ వచ్చిన వరల్డ్ నంబర్‌వన్ ఆఖరి మెట్టుపై అయ్యో అనిపించాడు! మెల్బోర్న్, పారిస్, లండన్ సమరాలను దిగ్విజయంగా దాటిన సెర్బియా స్టార్‌కు న్యూయార్క్ మాత్రం అనూహ్యంగా నిరాశను మిగిల్చింది. 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన అత్యంత అరుదైన ఘనత సాధించే, ఇరవై ఒకటవ ‘మేజర్’ టైటిల్‌తో అందనంత ఎత్తులో నిలిచే అవకాశం ముంగిట బరిలోకి దిగిన జొకో చివరకు ఓటమితో కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించాడు. జొకోవిచ్‌తో తలపడటం, అదీ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అంటే ఓటమికి సిద్ధం కావడమే అనే స్థితి కనిపిస్తున్న దశలో రష్యన్ ఆటగాడు మెద్వెదెవ్ పెను సంచలనంతో సత్తా చాటాడు. మైదానం మొత్తం ప్రత్యర్థికి అనుకూలంగా హోరెత్తుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఆడిన అతను కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌తో చిరునవ్వులు చిందించాడు. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా... చివరి వరకు పోరాడుతానని మ్యాచ్‌కు ముందు వ్యాఖ్యానించిన మెద్వెదెవ్ అంతకు మించిన ఆటతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్కు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్ జొకోవిచ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. న్యూయార్క్: 2021లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరే వరకు 27–0 మ్యాచ్‌ల విజయాలతో జోరు ప్రదర్శించిన వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు భంగపాటు ఎదురైంది. యూఎస్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను 1969 తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేశాడు. 2 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్, ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మెద్వెదెవ్ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకున్నాడు. . మెద్వెదెవ్ జోరు... గతంలో జొకోవిచ్‌తో తలపడిన రెండు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలోనూ ఓడిన మెద్వెదెవ్ ఈసారి పూర్తి స్థాయి సన్నద్ధతతో వచ్చాడు. తొలి సెట్లో 8 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఇవ్వలేదు. రెండో సెట్లో జొకో పోటీనిచ్చే ప్రయత్నం చేసినా... తొలి రెండు గేమ్‌లలో 5 బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న రష్యన్, ప్రత్యర్థి సరీ్వస్‌ను బ్రేక్ చేసి ముందంజ వేయగలిగాడు. మూడో సెట్లోనూ ఇదే జోరు చూపించిన అతను డబుల్ బ్రేక్ పాయింట్లతో దూసుకుపోయాడు. జొకో కొత్త చరిత్రను చూసేందుకు తరలివచ్చిన దిగ్గజ ఆటగాళ్లు, హాలీవుడ్ స్టార్లూ మెద్వెదెవ్ ఆటతో ఆశ్చర్యపోయారు. మ్యాచ్ చివర్లో స్టేడియంలోని అభిమానులంతా మెద్వెదెవ్‌ను గేలి చేయడం మొదలు పెట్టారంటే వారి దృష్టిలో ఈ ఫలితం ఎంత అనూహ్యమైందో అర్థం చేసుకోవచ్చు. మూడో సెట్లో 5–2 వద్ద డబుల్ ఫాల్ట్ చేసినా... చివరకు పదో గేమ్‌లో సరీ్వస్ నిలబెట్టుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తమ పెళ్లి రోజున తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన క్షణాన మెద్వెదెవ్... ‘డెడ్ ఫిష్’ సంబరాన్ని ప్రదర్శించాడు. జొకో అసహనం... మ్యాచ్‌లో కొన్ని కీలక సమయాల్లో లభించిన అవకాశాలను జొకోవిచ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో సెట్లో రెండు సార్లు మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచి్చనా అది చేజారింది. ఒక దశలో 40–0తో ముందంజలో ఉన్నా చివరకు గేమ్ దక్కలేదు. దాంతో తీవ్ర అసహనంతో తన రాకెట్‌ను మూడు సార్లు నేలకేసి విరగ్గొట్టిన అతను అంపైర్ హెచ్చరికకు గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్లీ కోలుకోలేకపోయాడు. ఈ టోర్నీ మూడో రౌండ్ నుంచి సెమీస్ వరకు వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ జొకో తొలి సెట్ కోల్పోయాడు. ఫైనల్లోనూ అలాగే జరుగుతుందని అంతా ఆశించినా రష్యన్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి చేంజ్ ఓవర్ సమయంలో జొకో టవల్ మధ్యలో మొహం దాచుకొని ఏడ్చేశాడు! జొకో, అతని అభిమానులకు నా క్షమాపణలు. అతను గెలిస్తే ఏం జరిగేదో అందరికీ తెలుసు. నా కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ అయినా గెలవగలనా అనుకునేవాడిని. గెలవకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉండాలనుకున్నా. ఇప్పుడు తొలి ‘గ్రాండ్’ విజయంతో చాలా చాలా ఆనందంగా ఉంది. తర్వాత మరొకటి గెలిచినా ఇంతగా స్పందిస్తానో లేదు తెలీదు. జొకో ప్రతీ మ్యాచ్‌కు వ్యూహం మారుస్తాడు. అన్నింటికీ సన్నద్ధమై వచ్చా. పెళ్లి రోజు నా శ్రీమతికి ఈ టైటిల్‌ను బహుమతిగా ఇచ్చా. –మెద్వెదెవ్ ఈ రోజు గెలవకపోయినా మీ అభిమానం చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా గుండెను తడిమిన మీ ఆదరణ చూస్తుంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్న వ్యక్తిని నేనే అనిపిస్తోంది. అద్భుతంగా ఆడిన మెద్వెదెవ్కే గెలిచే అర్హత ఉంది. ఫలితం నిరాశ కలిగించినా... ఇన్ని రోజులుగా రికార్డు వేటలో నాపై ఉన్న తీవ్ర మానసిక ఒత్తిడి, అంచనాల భారం తొలగిపోయినందుకు ప్రశాంతంగా అనిపిస్తోంది. –జొకోవిచ్ ► రష్యా తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఆటగాడు మెద్వెదెవ్. గతంలో కఫెలి్నకోవ్ (1996 ఫ్రెంచ్ ఓపెన్, 1999 ఆ్రస్టేలియన్ ఓపెన్), మరాత్ సఫిన్ (2000 యూఎస్ ఓపెన్, 2005 ఆస్ట్రేలియన్ ఓపెన్) రెండేసి ట్రోఫీలు గెలిచారు. ► ఒకే గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో కొత్త చాంపియన్స్ అవతరించడం 2004 తర్వాత ఇదే తొలిసారి. 2004లో ఫ్రెంచ్ ఓపెన్‌లో గాస్టన్ గాడియో (అర్జెంటీనా), అనస్తాసియా మిస్కినా (రష్యా) తొలిసారి ‘గ్రాండ్’ విజేతలుగా నిలిచారు. ► ఒకే ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్) టైటిల్స్ గెలిచి చివరిదైన యూఎస్ ఓపెన్‌లో ఓడిపోయిన మూడో ప్లేయర్ జొకోవిచ్. గతంలో జాక్ క్రాఫోర్డ్ (1933లో), లె హోడ్ (1956లో)లకు ఇలాంటి ఫలితం ఎదురైంది. ► జొకోవిచ్ కెరీర్లో 11సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్ (11), ఇవాన్ లెండిల్ (11) సరసన జొకోవిచ్ కూడా చేరాడు. -
Novak Djokovic: జొకోవిచ్.. ఇదేం ఆటిట్యూడ్ గురూ!
ఆయనో టెన్నిస్ ఛాంపియన్. ఎన్నో విజయాలు.. ఖాతాలో ఎన్నో గ్రాండ్ స్లామ్ టోర్నీలు. పైగా ర్యాంకింగ్‌లోనూ నెంబర్ వన్. కోట్లలో అభిమానులు. కానీ, అదే స్థాయిలో ద్వేషించేవాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం.. ఆట ఆడడం కన్నా కోర్టులో ఆయన ప్రవర్తించే తీరు. యూఎస్ ఓపెన్ 2021 ఫైనల్ సాక్షిగా అది మరోసారి బయటపడింది. ‘ఇదేం ఆటిట్యూడ్ గురూ!’ అంటూ.. జొకోవిచ్‌ను సోషల్ మీడియా ఏకీపడేస్తోంది. ఆటలో నిజాయితీ, అవతలి ఆటగాడిపై గౌరవం, ఓడినా గెలిచినా స్పోర్టివ్‌గా తీసుకునే తత్వం.. ఇవేవీ 34 ఏళ్ల సెర్బియన్ టెన్నిస్ ఛాంపియన్‌లో లేవనే చాలామంది చెప్పేస్తుంటారు. జొకోవిచ్‌కు హేటర్స్ ఎక్కువే. కానీ, ఆ హేటర్స్ ఇగ్నోర్ చేసేంత రేంజ్లో లేకపోవడమే అసలు సమస్య. అది యూఎస్ ఓపెన్ ఫైనల్ మరోసారి వెల్లడైంది. రష్యన్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్(25) చేతిలో వరుస సెట్స్ ఓడిపోతూ ఉంటే.. ఆ కోపాన్ని తట్టుకోలేక రాకెట్‌ను నేలకేసి విరకొట్టాడు జొకోవిచ్. అందుకే మ్యాచ్‌ను వీక్షిస్తున్న క్రౌడ్ నుంచి కాసేపు ‘బూ’ నినాదాలు వినిపించాయి. ఇక ఓడిపోతున్నాననే ఫ్రస్టేషన్‌ను బాల్ గర్ల్‌పై చూపించబోయాడు. ఇలా రెండుసార్లు ఇలా జరిగింది. కాస్తుంటే ఆ రాకెట్‌ను అమ్మాయిపై విసిరిసేవాడేమో. సరే విసిరేయలేదు కదా అనుకున్నా.. అలాంటి ప్రవర్తన సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. Don’t try this at home. ⚠️ @DjokerNole | #USOpen pic.twitter.com/2lwjlyzUV0 — Live Tennis (@livetennis) September 12, 2021 జోకర్ బెస్టే కానీ.. అభిమానులు.. అభిమానించని వాళ్లూ జొకోవిచ్‌ను ‘జోకర్’(Djocker) అని ముద్దుగా పిలుస్తుంటారు. అందుకు కారణం.. కోర్టులో అతని ప్రవర్తన. బేసిక్‌గా సరదా మనిషి అయిన జొకోవిచ్.. కోర్టులో కోతి చేష్టలతో చూసేవాళ్ల పెదాలపై నవ్వులు పూయిస్తుంటాడు. ఒక్కోసారి క్రౌడ్ దగ్గరగా వెళ్లి ఇంటెరాక్షన్ కావడంతో పాటు సందర్భానికి తగ్గట్లు ఆట మధ్యలోనే సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శిస్తుంటాడు. సిల్లీ హ్యబిట్స్తో పాటు ఫన్నీ గెస్చర్స్‌తో నవ్విస్తుంటాడు. అందుకే జోకర్ అనే పేరు ముద్రపడింది. అయితే ఇతర ఆటగాళ్లను సైతం ఇమిటేట్ చేసే జొకోవిచ్.. ఒక్కోసారి హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు కూడా. రికార్డుల మీద, విజయాల ఉన్న ధ్యాస.. కోర్టులో ఎలా ప్రవర్తించడం అనేదాని మీద ఉండదనేది జొకోవిచ్ మీద ఉన్న ప్రధాన ఫిర్యాదు. ఇదే విషయాన్ని టెన్నిస్ దిగ్గజాలు సైతం చాలా ఇంటర్వ్యూలలో ఖుల్లాగా చెప్పేస్తుంటారు. ఆ లెక్కన ఈ ప్రపంచ ఛాంపియన్ అసలు ‘ఫెయిర్ ప్లేయర్’ కాదనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూడుస్తున్న మాట. He wanted to. 😡 @DjokerNole | #USOpen pic.twitter.com/ki0vz5Qw34 — Live Tennis (@livetennis) September 12, 2021 కొత్తేం కాదు.. మ్యాచ్ మధ్యలో జొకోవిచ్‌కు ఈ తరహాలో ప్రవర్తించడం కొత్తేం కాదు. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పోరు సందర్భంగా రాకెట్‌ను దూరంగా విసిరిపడేశాడు. అంతకు ముందు చాలాసార్లు చేశాడు. అయినా ఆటలో గెలుపోటములు సహజం. కానీ, ఒక ఛాంపియన్ హోదాలో ఇలా ప్రవర్తించడం మాత్రం సరికాదన్న అభిప్రాయం హేటర్స్ నుంచే కాదు.. సీనియర్స్ నుంచి, అతన్ని అభిమానించే వాళ్ల నుంచి సైతం వినిపిస్తోంది ఇప్పుడు. Djokovic just tossed his racquet into the stand. No warning. pic.twitter.com/TMCv29dCnQ — . (@Ashish__TV) July 31, 2021 చదవండి: US Open 2021- ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్! -
యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచి ఎమ్మా రెడుకాను సంచలనం సృష్టించింది. 44 ఏళ్ల తర్వాత యూఎస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుకున్న బ్రిటన్ మహిళగా ఎమ్మా రికార్డు క్రియేట్ చేసింది. అయితే గ్రాండ్‌స్లామ్ విజేతలకు ప్రైజ్‌మనీ ఎంత అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ విజేతలకు నిర్వాహకులు ఈ ఏడాది ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ 57 లక్షల డాలర్లు (సుమారు రూ.422 కోట్లు). గత ఏడాది కంటే 4 లక్షల డాలర్లు ఎక్కువగా పెంచారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ కావడం విశేషం. ప్రైజ్‌మనీ వివరాలు: యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిస్తే 25 లక్షల డాలర్లు (రూ.18 కోట్లు), రన్నరప్‌కు 12 లక్షల డాలర్లు (రూ.9 కోట్లు), సెమీఫైనలిస్ట్‌లకు 6 లక్షల డాలర్లు (రూ.4 కోట్లు), క్వార్టర్ ఫైనలిస్ట్‌లకు 4లక్షల డాలర్లు (రూ.3 కోట్లు), రౌండ్16 ఆటగాళ్లకు (రూ.2 కోట్లు), రౌండ్ 32 ఆటగాళ్లకు (సుమారు రూ.1 కోటి 30 లక్షలు), రౌండ్ 64 ఆటగాళ్లకు (రూ.84 లక్షలు) , రౌండ్ 128(రూ.55 లక్షలు)గా నిర్ణయించారు. యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ గెలిస్తే 6 లక్షల డాలర్లు (సూమారు రూ.5 కోట్లు), రన్నరప్‌కు 3 లక్షల డాలర్లు (సూమారు రూ.2 కోట్లు), సెమీఫైనలిస్ట్‌లకు 1 లక్ష 64 వేల డాలర్లు (రూ.1 కోటి 24 లక్షలు), క్వార్టర్ ఫైనలిస్ట్‌లకు (రూ.68 లక్షలు), రౌండ్16 ఆటగాళ్లకు (రూ.39 లక్షలు), రౌండ్ 32 ఆటగాళ్లకు( రూ.24 లక్షలు), రౌండ్ 64 ఆటగాళ్లకు (రూ.14 లక్షలు)గా నిర్ణయించారు. చదవండి: CPL 2021 Nicholas Pooran: సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా


