తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరిన వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌

World Number One Iga Swiatek Enters Her First US Open Semifinal - Sakshi

మహిళల సింగిల్స్‌ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) తన కెరీర్‌లో తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ సెమీస్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో స్వియాటెక్‌.. అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 6-3, 7-6 (7/4) తేడాతో విజయం సాధించి, ఫైనల్‌ ఫోర్‌కు చేరింది. ఈ గేమ్‌ తొలి సెట్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్న స్వియాటెక్‌.. రెండో గేమ్‌లో మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది.

రెండో సెట్‌లో జెస్సికాను నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో స్వియాటెక్‌ పోరాడాల్సి వచ్చింది. చివరకు స్వియాటెక్‌.. జెస్సికాపై పైచేయి సాధించి గెలుపొందింది. సెమీస్‌లో స్వియాటెక్‌.. అరిన సబలెంకతో పోటీ పడనుంది. మరో సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిషియా).. ఫ్రాన్స్‌ టెన్నిస్‌ స్టార్‌,  ప్రపంచ 17వ ర్యాంకర్‌ కరోలినా గార్సియా తలపడనుంది.
 
ఇక పురుషుల సింగిల్స్‌ విషయానికొస్తే..  ప్రపంచ 31వ ర్యాంకర్‌ కరెన్‌ ఖచనోవ్‌ (రష్యా)- ప్రపంచ ఏడో ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)తో తొలి సెమీస్‌లో తలపడనున్నాడు. మరో సెమీస్‌ సమరంలో నంబర్‌ 3 ర్యాంకర్‌ కార్లోస్ అల్కరజ్.. ఫ్రాన్సిస్ టియోఫోతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. 
చదవండి: US Open 2022: గార్సియా గర్జన.. సూపర్‌ ఫామ్‌ కంటిన్యూ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top