US Open 2024: సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీ | US Open 2024: Rohan Bopanna, Aldila Sutjiadi Pair Lose In Mixed Doubles Semi-Finals | Sakshi
Sakshi News home page

US Open 2024: సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీ

Sep 4 2024 5:13 PM | Updated on Sep 4 2024 5:20 PM

US Open 2024: Rohan Bopanna, Aldila Sutjiadi Pair Lose In Mixed Doubles Semi-Finals

యూఎస్‌ ఓపెన్‌ 2024లో భారత్‌ పోరాటం ముగిసింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో 8వ సీడ్‌ బోపన్న-అల్దిలా సుత్జియాది(ఇండోనేషియా) జోడీ 3-6, 4-6 తేడాతో అమెరికా జంట డొనాల్డ్‌ యంగ్‌-టేలర్‌ టౌన్‌సెండ్‌ చేతిలో ఓటమిపాలైంది. 

సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న- సుత్జియాది జోడీ  నాలుగో సీడ్‌ మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)-క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీపై 7-6(7-4), 2-6, 10-7 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది.

అంతకుముందు పురుషుల డ‌బుల్స్‌లోనూ బోప‌న్న- ఎబ్డెన్ జోడీ మూడో రౌండ్‌లో అనూహ్యంగా ఓట‌మి పాలైంది. రెండో సీడ్‌గా బ‌రిలోకి దిగిన బోప‌న్న – ఎబ్డెన్ జోడీ.. మాగ్జిమో గొంజాలెజ్, అండ్రెస్ మొల్తెనీ జోడీ చేతిలో  1-6, 5-7 తేడాతో ఖంగుతింది.

పురుషులు సింగిల్స్‌ విషయానికొస్తే.. వరల్డ్‌ నెంబర్‌వన్‌ జనెక్‌ సినర్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. సెమీస్‌ బెర్త్‌ కోసం సినర్‌ మాజీ ఛాంపియన్‌ డానిల్‌ మెద్వెదెవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement