
యూఎస్ ఓపెన్-2025లో జాత్యహంకార వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అమెరికా క్రీడాకారిణి టేలర్ టౌన్‌సెండ్, లాట్వియన్ టెన్నిస్ స్టార్ జెలెనా ఒస్టాపెంకో మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఆగస్టు 27(బుధవారం) టౌన్‌సెండ్, ఒస్టాపెంకో తలపడ్డారు. ఈ రెండో రౌండ్ మ్యాచ్‌లో 25వ సీడ్ ఒస్టాపెంకోను 7-5, 6-1 తేడాతో టౌన్‌సెండ్ ఓడించింది.
అయితే 2017 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ అయిన ఒస్టాపెంకో.. టౌన్‌సెండ్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. దీంతో మ్యాచ్ ముగిసినంతరం హ్యాండ్ షేక్ చేసే సమయంలో టౌన్‌సెండ్‌పై వేలు చూపిస్తూ ఒస్టాపెంకో జాత్యహంకర వ్యాఖ్యలు చేసింది. నీకు ఒక స్దాయి లేదు, సరైన చదువు లేదని తనను దూషించినట్లు టౌన్‌సెండ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
హద్దులు మీరిన జెలెనా..
"ఒక పోటీలో ఓడిపోయినప్పుడు సహజంగా ఎవరైనా నిరాశ చెందుతారు. కానీ ఆ సమయంలో కొంత మంది తమ హద్దలు మీరి ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఒస్టాపెంకో నాతో అలానే ప్రవర్తించింది. నాకు ఒక క్లాస్ లేదు, చదువు లేదని నన్ను విమర్శించింది.
యూఎస్ వెలుపుల ఏమి జరుగుతుందో వెళ్లి చూడమని నన్ను హెచ్చరించింది" అని మ్యాచ్ అనంతరం ఆన్-కోర్ట్ ఇంటర్వ్యూలో టౌన్‌సెండ్ పేర్కొంది. దీంతో జెలెనాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఒస్టాపెంకో కౌంటరిచ్చింది.
అందరిని గౌరవిస్తా..
"నా జీవితంలో నేను ఎప్పుడూ జాత్యహంకార వ్యాఖ్యలు చేయలేదు. అన్ని దేశాల ప్రజలను నేను గౌరవిస్తాను. నాకు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. పోటీలో గెలవడమే నా లక్ష్యం అని ఒస్టాపెంకో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చింది. అయితే ఒస్టాపెంకో కోపం వెనక ఓ కారణముందంట. టెన్నిస్ మ్యాచ్ నియమాలకు విరుద్దంగా టౌన్‌సెండ్ ప్రవర్తించినట్లు ఒస్టాపెంకో ఆరోపించింది.
"మ్యాచ్ ప్రారంభంలో అందరు ఆటగాళ్లు బేస్‌లైన్‌లోనే వార్మప్ ప్రారంభించాలి. కానీ టౌన్‌సెండ్ మాత్రం బెస్‌లైన్‌లో కాకుండా బయటకు వచ్చి వెంటనే వార్మప్ ప్రారంభించింది. టౌన్‌సెండ్ అలా చేయడం సరి కాదు. ఆమె టెన్నిస్ మ్యాచ్ నియమాలకు విరుద్ధంగా వెళ్లింది. కనీసం నెట్‌కార్డ్ విన్నర్‌కు సారీ కూడా చెప్పలేదని ఒస్టాపెంకో తన పోస్ట్‌లో పేర్కొంది.
😭👏 Townsend to Ostapenko:
“You can learn how to take a loss better” pic.twitter.com/L0m5GGAVC6— Olly Tennis 🎾🇬🇧 (@Olly_Tennis_) August 27, 2025
చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్