
బెలారస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ అరినా సబలెంకా వరుసగా రెండో ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఆమె అమెరికాకు చెందిన అమండ అనిసిమోవాను వరుస సెట్లలో (6–3, 7–6(3)) ఓడించింది. 94 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సబలెంక 13 విన్నర్లు కొట్టి, 15 అన్‌ఫోర్స్డ్ ఎర్రర్లు మాత్రమే చేసింది. అనిసిమోవా 29 అన్‌ఫోర్స్డ్ ఎర్రర్లు, 7 డబుల్ ఫాల్ట్స్ చేసి తడబడింది.
ఈ మ్యాచ్‌లో సబలెంక తన శక్తివంతమైన సర్వ్‌లు, ఖచ్చితమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో అనిసిమోవాను కట్టడి చేసింది. రెండో సెట్ టైబ్రేక్‌కి వెళ్లినా, ఆమె మానసిక స్థైర్యాన్ని చూపించి విజయం సాధించింది.
సబలెంకకు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. అన్ని టైటిళ్లను ఆమె హార్డ్‌కోర్ట్‌లపైనే సాధించింది. దీంతో ఆమెకు హార్డ్‌కోర్డ్‌ల రాణిగా గుర్తింపు వచ్చింది. సబలెంక 2023, 2024లో వరుసగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు సాధించి.. 2024, 2025లో వరుసగా యూఎస్ ఓపెన్‌ను గెలిచింది.
వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు సాధించడంతో సబలెంక సెరీనా విలియమ్స్ సరసన చేరింది. సెరీనా కూడా గతంలో వరుసగా రెండు ఎడిషన్లలో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది.
టైటిల్ గెలిచిన అనంతరం సబలెంక మాట్లాడుతూ.. ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం. నా దేశానికి, అభిమానులకు ఈ విజయం అంకితమని తెలిపింది.
తాజా విజయంతో సబలెంక 100 గ్రాండ్ స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన రెండో మహిళగానూ గుర్తింపు పొందింది. సబలెంక ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరి కోకో గాఫ్ చేతిలో పరాజయంపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.