యూఎస్‌ ఓపెన్‌ విజేత అల్కరాజ్‌.. అరుదైన ఘనత | Carlos Alcaraz Wins 2025 US Open, Defeats Sinner to Claim Sixth Grand Slam | Sakshi
Sakshi News home page

యూఎస్‌ ఓపెన్‌ విజేత అల్కరాజ్‌.. అరుదైన ఘనత

Sep 8 2025 9:14 AM | Updated on Sep 8 2025 11:17 AM

Carlos Alcaraz Wins US Open 2025 Men's Singles Title

స్పానిష్‌ యువ సంచలనం​ కార్లోస్‌ ఆల్కరాజ్‌ 2025 యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను సాధించాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన జానిక్ సినర్‌ను 6–2, 3–6, 6–1, 6–4 తేడాతో ఓడించి, రెండో యూఎస్‌ ఓపెన్‌ను (2022, 2025), ఓవరాల్‌గా ఆరో గ్రాండ్‌స్లామ్‌ను (2022 యూఎస్‌ ఓపెన్‌, 2023 వింబుల్డన్‌, 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, 2025 ఫ్రెంచ్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌) సొంతం చేసుకున్నాడు.

ఈ గెలుపుతో అల్కరాజ్‌ నంబర్‌ వన్‌ స్థానాన్ని కూడా తిరిగి దక్కించకున్నాడు. అల్కరాజ్ 23 ఏళ్ల వయసులోనే మూడు వేర్వేరు సర్ఫేస్‌లపై (క్లే, గ్రాస్, హార్డ్‌కోర్ట్) బహుళ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. అల్కరాజ్‌, సినర్‌ ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో తలపడ్డాడు. ఇందులో సినర్‌ వింబుల్డన్‌ విజేతగా నిలువగా.. అల్కరాజ్‌ మిగతా రెండు (ఫ్రెంచ్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌) గెలిచాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆర్థర్ ఆష్ స్టేడియంలో జరిగిన  హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అల్కరాజ్ తన అద్భుతమైన ఫుట్‌వర్క్, శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్స్‌తో సినర్‌ను కట్టడి చేశాడు. ఆట ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన అల్కరాజ్‌ తొలి సెట్‌ గెలిచి, రెండో సెట్‌ కోల్పోయినప్పటికీ.. తిరిగి పుంజుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో అల్కరాజ్‌ ఫస్ట్-సర్వ్ అద్భుతంగా ఉండింది. ఇందులో అతను 83 శాతం విజయవంతమయ్యాడు. ఇదే అతని ఆటకు స్థిరతనిచ్చింది. మ్యాచ్‌ ఆధ్యాంతం అల్కరాజ్‌ ఫోర్‌హ్యాండ్ వేగం 100mph పైబడి ఉండింది. ఈ శక్తివంతమైన షాట్లే సినర్‌ను వెనక్కి నెట్టాయి. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్‌ అసమాన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు. కీలక పాయింట్లలో ఒత్తిడిని ఎదుర్కొని, క్లచ్‌ షాట్లతో మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు.

సినర్‌ విషయానికొస్తే.. తొలి సెట్‌ కోల్పోయినప్పటికీ, రెండో సెట్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సినర్‌ బేస్‌లైన్ కంట్రోల్ బాగా ఉండింది. ర్యాలీల్లో స్థిరత్వాన్ని ప్రదర్శించాడు. అన్‌ ఫోర్స్డ్‌ ఎర్రర్లు తక్కువగా ఉన్నాయి. ఫుట్‌వర్క్‌, బ్యాక్‌ హ్యాండ్‌ ఎగ్జిక్యూషన్‌ బాగానే ఉన్నాయి.

అయితే సర్వీస్‌లో లోపాలు అతని కొంపముంచాయి. సినర్‌ ఫస్ట్-సర్వ్ విజయశాతం కేవలం 48 శాతంగా ఉంది. అలాగే సినర్‌ అల్కరాజ్‌కు బ్రేక్ అవకాశాలు చాలా ఇచ్చాడు. అతని ఆటకు తగిన విధంగా స్పందించలేకపోయాడు. మూడో సెట్‌ కోల్పోవడం సినర్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఓవరాల్‌గా చూస్తే ఈ మ్యాచ్‌లో సినర్‌ అల్కరాజ్‌తో పోటీలో వెనుకపడ్డాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement