
కెరీర్‌లో తొలి వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గిన భారత యువ షట్లర్
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సొంతం
అయోవా (అమెరికా): నిరీక్షణ ముగిసింది. ఈ ఏడాది భారత ప్లేయర్ ఖాతాలో తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ చేరింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత ప్లేయర్ ఆయుశ్ శెట్టి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–18, 21–13తో ప్రపంచ 33వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు. ఈ ఏడాది యాంగ్‌పై ఆయుశ్‌కిది మూడో విజయం కావడం విశేషం. మలేసియా ఓపెన్, తైపీ ఓపెన్ టోర్నీల్లోనూ యాంగ్‌పై ఆయుశ్ నెగ్గాడు. చాంపియన్‌గా నిలిచిన ఆయుశ్‌కు 18 వేల డాలర్ల (రూ. 15 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
యాంగ్‌తో 47 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ఆయుశ్‌కు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. మూడుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 19–18 వద్ద ఆయుశ్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్ దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం ఆయుశ్ దూకుడు కనబరిచాడు. ఆరంభంలోనే 6–1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆయుశ్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని 11–6కు పెంచుకున్నాడు. యాంగ్ కోలుకునే ప్రయత్నం చేసినా జోరు మీదున్న ఆయుశ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
2023లో లక్ష్య సేన్ కెనడా ఓపెన్‌లో టైటిల్ సాధించిన తర్వాత ఆయుశ్ శెట్టి రూపంలో మరో భారత ప్లేయర్ అంతర్జాతీయ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. ‘సీనియర్ సర్క్యూట్‌లో నాకిదే తొలి టైటిల్. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. చాలా సంతోషంగా ఉన్నా. గత వారం రోజులుగా అద్భుతంగా ఆడాను. ఇదే జోరును కెనడా ఓపెన్‌లోనూ కొనసాగిస్తాను’ అని కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుశ్ వ్యాఖ్యానించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న ఆయుశ్ 2023లో ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్‌లో కాంస్య పతకాన్ని సాధించి వెలుగులోకి వచ్చాడు.
రన్నరప్ తన్వీ శర్మ
యూఎస్ ఓపెన్ టోరీ్నలో భారత్‌కు ‘డబుల్ ధమాకా’ సృష్టించే అవకాశం చేజారింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ తన్వీ శర్మ రన్నరప్‌గా నిలిచింది. టాప్ సీడ్, ప్రపంచ 21వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన ఫైనల్లో 16 ఏళ్ల తన్వీ శర్మ 11–21, 21–16, 10–21తో పోరాడి ఓడిపోయింది. కెరీర్‌లో తొలి వరల్డ్ టూర్ ఫైనల్ ఆడిన పంజాబ్‌కు చెందిన తన్వీ ప్రత్యరి్థకి గట్టిపోటీనిచి్చనా చివరకు అనుభవజు్ఞరాలైన బీవెన్ జాంగ్‌దే పైచేయి అయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 66వ స్థానంలో ఉన్న తన్వీ శర్మకు 9,120 డాలర్ల (రూ. 7 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.