డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ | Gayatri and Teresa jolly pair in doubles quarter final | Sakshi
Sakshi News home page

డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ

Jun 29 2024 4:04 AM | Updated on Jun 29 2024 4:04 AM

Gayatri and Teresa jolly pair in doubles quarter final

టెక్సాస్‌: యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–11, 21–19తో సెయి పె షాన్‌–హంగ్‌ ఎన్‌ జు (చైనీస్‌ తైపీ) జంటను ఓడించింది. 

పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రియాన్షు 21–18, 21–16తో హువాంగ్‌ యు కాయ్‌ (చైనీస్‌ తైపీ)పై, మాళవిక 15–21, 21–19, 21–14తో తెరెజా స్వబికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement