ఫిఫా ప్రపంచకప్ నుంచి బెల్జియం జట్టు నిష్క్రమించింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ జట్టు 2-1 తేడాతో బెల్జియంను ఓడించింది. అయితే బెల్జియం ఓటమికి పరోక్ష కారణం ఆ జట్టు గోల్ కీపర్ సెన్నే లామెన్స్ అయితే, ప్రత్యక్ష కారణం మాత్రం స్పెయిన్ సంచలనం మైకెల్ మెరినో.

మొన్న పోర్చుగల్‌తో జరిగిన క్వారర్ ఫైనల్ పోరులో స్టాపేజ్ టైం (90+ నిమిషాల్లో) గోల్ కొట్టి మ్యాచ్‌ను లాగేసుకున్న మెరినో.. తాజాగా బెల్జియంతో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ బరిలోకి దిగిన మెరినో మరోసారి మెరిసి స్పెయిన్‌కు గోల్ అందించాడు. తన లక్కీ హ్యాండ్‌తో స్పెయిన్‌కు విజయాన్ని కట్టబెట్టి 16 ఏళ్ల తర్వాత సెమీస్ చేర్చాడు.
గాయం నుంచి కోలుకొని
ఈసారి ఫిఫాలో స్పెయిన్‌కు లక్కీ హ్యాండ్‌గా మారిపోయిన మైకెల్ మెరినో తొలుత ప్రపంచకప్ ఆడతాడా లేదా అన్న అనుమానం ఉండేది. ఈ ఏడాది జనవరిలో అతడి పాదానికి గాయమైంది. స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో రెండు నెలల పాటు పాదాన్ని కింద ఆనించడంలోనూ ఇబ్బంది పడ్డాడు. తన రెగ్యులర్ ఫుట్‌బాల్ క్లబ్ ఆర్సెనల్ తరఫున కూడా బరిలోకి దిగకపోవడంతో ఫిఫా ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్పెయిన్ జట్టులో చోటు సంపాదించుకోవడమే గాక, ఆ జట్టు సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించిన మైకెల్ మెరినో స్పెయిన్ జట్టుకు గోల్డెన్ హ్యాండ్‌గా మారిపోయాడు.

ఆ తప్పు చేయకపోయి ఉంటే..
70వ నిమిషంలో బెల్జియం రెగ్యులర్ గోల్‌కీపర్ కోర్టోయిస్ గాయపడి గ్రౌండ్ ను వీడాడు. దీంతో ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని యువ గోల్కీపర్ సెన్నే లామెన్స్ అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల మధ్య బరిలో దిగాల్సి వచ్చింది. లామెన్స్ చేసిన ఓ చిన్న పొరపాటే చివరకు బెల్జియం పరాజయానికి దారితీసింది.

పావ్ కుబార్సి కొట్టిన లాంగ్ షాట్ను లామెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. అదే బంతిని మెరెనో గోల్పోస్ట్లోకి నెట్టాడు. దీంతో స్పెయిన్ జట్టు ఆనందానికి అవధుల్లేకపోయింది. ఆఖరి నిమిషాల్లో స్కోర్ సమం చేయడానికి బెల్జియం తీవ్రంగా ప్రయత్నించింది. జెరెమీ డోకు వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ స్పెయిన్ డిఫెన్స్ ను చేధించలేకపోయారు. అలెక్సిస్ సేల్మేకర్స్ అందించిన చక్కటి క్రాసు రొమేలు లుకాకు సరిగ్గా అందుకోలేకపోవడంతో బెల్జియం ఆశలు అడియాశలయ్యాయి.
🚨🚨Thibaut Courtois: "Senne Lammens is a fantastic goalkeeper with a bright future. This moment will make him STRONGER."pic.twitter.com/9wnru8QUml
— 🇵🇸 TP_KATSRK (@TP_Katsrk) July 10, 2026


