సెమీఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా... | England face Norway and Argentina face Switzerland for two semi final berths | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా...

Jul 11 2026 1:00 AM | Updated on Jul 11 2026 1:00 AM

England face Norway and Argentina face Switzerland for two semi final berths

నార్వేతో ఇంగ్లండ్‌ పోరు

స్విట్జర్లాండ్‌తో అర్జెంటీనా ‘ఢీ’ 

మయామి: ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ తుది అంకానికి చేరువైంది. రెండు సెమీఫైనల్‌ బెర్త్‌ల కోసం నార్వే జట్టుతో ఇంగ్లండ్‌; స్విట్జర్లాండ్‌ జట్టుతో అర్జెంటీనా తలపడనున్నాయి. నార్వే, స్విట్జర్లాండ్‌ జట్లు ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా సెమీఫైనల్‌ చేరుకోలేకపోయాయి. మరోవైపు ఇంగ్లండ్‌ 1966లో... అర్జెంటీనా 1978లో, 1986లో, 2022లో ప్రపంచకప్‌ టైటిల్స్‌ సాధించాయి. ఈ టోర్నీలో నార్వే అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. ముఖ్యంగా నార్వే ఫార్వర్డ్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌ కళ్లు చెదిరే ఆటతీరుతో అలరిస్తున్నాడు. 

4 మ్యాచ్‌ల్లో ఎర్లింగ్‌ 7 గోల్స్‌ చేసి నార్వే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌ కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్‌ బెలింగ్‌హమ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. హ్యారీ కేన్‌ 6 గోల్స్, బెలింగ్‌హమ్‌ 4 గోల్స్‌ సాధించారు. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా, స్విట్జర్లాండ్‌ జట్లు అజేయంగా నిలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. అర్జెంటీనాపై స్విట్జర్లాండ్‌పై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచి మ్యాచ్‌ను పెనాల్టీ షూటౌట్‌ వరకు రప్పించ గలిగితే తుది ఫలితం ఎలాగైనా ఉండవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement