ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0తో చిత్తు చేసి.. ఎనిమిదోసారి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. బోస్టన్ వేదికగా శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే అదరగొట్టాడు.
తొలుత 26వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను వృథా చేసినప్పటికీ.. 60వ నిమిషంలో ఎంబాపె గోల్ కొట్టడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. ఇక 66వ నిమిషంలో డెంబెలె మరో గోల్ గొట్టి మొరాకోకు షాకిచ్చాడు. ఆ తర్వాత మొరాకోను నిలువరించడంలో సఫలమైన ఫ్రాన్స్.. ఈసారి టాప్-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.
2022: France 🆚 Morocco#FIFAWorldCup pic.twitter.com/vlzRbKwzr2
— FIFA World Cup (@FIFAWorldCup) July 9, 2026
ఊహించని షాక్
ఇదిలా ఉంటే.. గోల్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కిలియన్ ఎంబాపె గాయపడటం కలకలం రేపింది. మ్యాచ్ రెండో అర్ధ భాగం 77వ నిమిషంలో ఎంబాపె మడిమ నొప్పితో విలవిల్లాడాడు.
దీంతో ఫ్రాన్స్ మేనేజర్ డిడెర్ డెచాంప్స్ ఫిలిప్ మటేటాను ఎంబాపే స్థానంలో మైదానంలోకి పంపగా.. ఎంబాపె బయటకు వచ్చాడు. ఈ క్రమంలో మటేటా మిగిలిన 13 నిమిషాలు మైదానంలో ఉండగా.. ఎంబాపె తిరిగి వెళ్లలేదు.
ఊపిరి పీల్చుకో!
దీంతో సెమీస్ చేరిన ఆనందంలో ఉన్న ఫ్రాన్స్‌కు ఊహించని షాక్ తగిలినట్లయింది. అయితే, తన గాయంపై ఎంబాపె స్పందిస్తూ.. అభిమానులకు ఊరట కలిగించే విషయం చెప్పాడు.
‘‘నేను బాగానే ఉన్నాను. నా చీలమండకు దెబ్బ తగిలింది. అయితే, ఇప్పుడు అంతా బాగానే ఉంది.నాకంటే కూడా మటేటా ఆఖరి 15 నిమిషాల మ్యాచ్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా, సన్నద్ధంగా ఉన్నాడు’’ అని ఎంబాపె చమత్కరించాడు.


