ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అయితే మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఈజిప్ట్ మాత్రం అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. ఒక దశలో 2-0తో ఆధిక్యంలో నిలిచిన ఈజిప్ట్ అర్జెంటీనాను ఓడించినంత పని చేసింది.
అయితే చివరి నిమిషాల్లో మూడు గోల్స్ కొట్టిన అర్జెంటీనా విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ జట్టు రిఫరీపై ఫిఫాకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు రిఫరీ అర్జెంటీనాకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారని, అతడిని వెంటనే తొలగించాలని ఫిఫాకు రాసిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది.
వీఏఆర్ సమీక్ష తర్వాత గోల్‌ను తిరస్కరించడమే గాక, అర్జెంటీనా విజయానికి దారి తీసిన చివరి గోల్ పెనాల్టీ అప్పీల్‌ను సమీక్షించకపోవడం సహా చాలా నిర్ణయాలు ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా రావడంపై ఆ జట్టు శిబిరం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హనీ అబో రిడా.. ఫ్రెంచ్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్, మిగిలిన బృందంపై ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
తప్పుడు నిర్ణయాలతో ఈజిప్ట్ విజయాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం కిందకు వస్తుందని తెలిపిన హనీ అబో, విచారణ చేపట్టాలని కోరారు. ఫ్రెంచ్ రిఫరీ బృందాన్ని మిగిలిన టోర్నీ మ్యాచ్‌ల్లో పాల్గొనకుండా తొలగించాలని హనీ అబో ఫిఫాను అభ్యర్థించారు. మ్యాచ్ విషయానికొస్తే.. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మట్టికరిపించింది.
అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోనల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖరి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు. మరోవైపు ఈజిప్ట్ తరఫున యాసర్ ఇబ్రహీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక క్వార్టర్ ఫైనల్లో మెస్సీ బృందం జూలై 12న ఉదయం 6.30 గంటలకు స్విట్జర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
#Missi asks Egypt's coach: «What's wrong with you?» pic.twitter.com/yQ6tml5Prw
— WardaNews (@warda_news1) July 7, 2026
#Missi asks Egypt's coach: «What's wrong with you?» pic.twitter.com/yQ6tml5Prw
— WardaNews (@warda_news1) July 7, 2026


