వింబుల్డన్‌లో మారథాన్‌ గేమ్‌.. మెస్సీపై జకోవిచ్‌ జోకులు | Djokovic-Jokes-Nice-Play-90-Minutes-Like-Messi-Wimbledon-Marathon | Sakshi
Sakshi News home page

వింబుల్డన్‌లో మారథాన్‌ గేమ్‌.. మెస్సీపై జకోవిచ్‌ జోకులు

Jul 8 2026 8:50 PM | Updated on Jul 8 2026 9:54 PM

Djokovic-Jokes-Nice-Play-90-Minutes-Like-Messi-Wimbledon-Marathon

వింబుల్డ‌న్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జ‌కోవిచ్ సెమీఫైన‌ల్లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే సెమీస్ చేరేందుకు జ‌కోవిచ్ చెమ‌టోడ్చాల్సి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం రాత్రి పురుషుల సింగిల్స్‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఐదు గంట‌ల 15 నిమిషాల పాటు సాగిన మార‌థాన్ మ్యాచ్‌లో జ‌కోవిచ్ 7-6 (12/10), 3-6, 6-3, 6-7 (4/7), 7-6 (10/4)తో కెన‌డా స్టార్ ఫెలిక్స్ అలియ‌సిమెపై క‌ష్ట‌ప‌డి గెలిచాడు. 

ఇక సెమీస్‌లో ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ జానిక్ సిన‌ర్‌ను ఎదుర్కోనున్న జ‌కోవిచ్ క్వార్టర్స్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మెస్సీ విష‌య‌మై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న మ్యాచ్‌తో పాటే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో అర్జెంటీనా, ఈజిప్ట్ మ‌ధ్య క్వార్టర్ ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభమయింది. ఆ మ్యాచ్ 90 నిమిషాల్లో ముగియ‌గా, జ‌కోవిచ్ మాత్రం త‌న మ్యాచ్‌ను నెగ్గడానికి ఐదు గంట‌ల పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చింది. 

ఈ నేప‌థ్యంలోనే ఈజిప్ట్‌పై థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకున్న అర్జెంటీనా జ‌ట్టుపై, ముఖ్యంగా మెస్సీ ప్ర‌ద‌ర్శ‌న‌పై జ‌కోవిచ్ స్పందించాడు. 'మెస్సీ లాగే నాకు 90 నిమిషాల మ్యాచ్ ఆడ‌డం చాలా బాగుంటుంది. అవ‌కాశ‌మొస్తే మెస్సీతో స్వాప్ చేసుకుని అత‌డి 90 నిమిషాలు నేను.. నా ఐదు గంట‌ల 15 నిమిషాలు అత‌డు తీసుకుంటే బాగుండేదేమో' అని న‌వ్వుతూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

ఇక జ‌కోవిచ్ త‌న రికార్డును మ‌రింత మెరుగుప‌రుచుకుంటూ వింబుల్డ‌న్‌లో 15వ సారి సెమీస్‌లో అడుగుపెట్టి స్విస్ దిగ్గ‌జం రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌ను అధిగ‌మించి స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఓవ‌రాల్ నాలుగు మేజ‌ర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జ‌కోవిచ్ సెమీస్ చేర‌డం ఇది 55వ సారి కావ‌డం విశేషం. 1974లో కెన్ రోజ్‌వాల్ త‌ర్వాత ఓపెన్ శ‌కంలో 39 లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌సులో వింబుల్డ‌న్ సెమీస్ చేరిన రెండో ఆట‌గాడిగా జ‌కోవిచ్ నిలిచాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement