క్వాలిఫయర్‌-2లో కరీంనగర్‌ ఓటమి.. ఫైనల్‌కు హైదరాబాద్‌ | Hyderabad Champions Storm Into Telangana T20 League Final After Crushing Karimnagar Diamonds | Sakshi
Sakshi News home page

TG20: క్వాలిఫయర్‌-2లో కరీంనగర్‌ ఓటమి.. ఫైనల్‌కు హైదరాబాద్‌

Jul 10 2026 10:19 PM | Updated on Jul 11 2026 11:56 AM

hyderabad e champions storms into finals in tg20 league

తెలంగాణ టీ20 లీగ్‌-2026లో క‌రీంన‌గ‌ర్ డైమండ్స్ పోరాటం ముగిసింది. శుక్ర‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా హైద‌రాబాద్ ఈ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో 8 వికెట్ల తేడాతో క‌రీంన‌గ‌ర్ ప‌రాజయం పాలైంది. 

దీంతో క‌రీంన‌గ‌ర్ టోర్నీ నుంచి ఇంటిముఖం ప‌ట్ట‌గా.. హైద‌రాబాద్ జ‌ట్టు ఆదివారం అన్విత ఖమ్మం ఏసెస్ జ‌ట్టుతో ఫైన‌ల్లో త‌ల‌ప‌డేందుకు అర్హ‌త సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్‌ డైమండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ సింహా(38) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శుభమ్‌ శర్మ(31), సాత్విక్‌ రెడ్డి(28) రాణించారు.కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ పది పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో అజయ్‌, షణ్ముఖ, ప్రణవ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని హైద‌రాబాద్ కేవలం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 15.3 ఓవర్లలో చేధించింది. కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి(45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి(45) రాణించాడు. కరీంనగర్‌ బౌలర్లలో ఆఖిల్‌, శుభమ్‌ తలా వికెట్‌ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement