హైదరాబాద్‌తో మ్యాచ్‌.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన కరీంనగర్‌ | Karimnagar Diamonds vs Hyderabad E Champions, Qualifier 2 Playing 11 Updates | Sakshi
Sakshi News home page

TG20 Qualifier 2: హైదరాబాద్‌తో మ్యాచ్‌.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన కరీంనగర్‌

Jul 10 2026 7:18 PM | Updated on Jul 10 2026 8:58 PM

Karimnagar Diamonds vs Hyderabad E Champions, Qualifier 2 Playing 11 Updates

Update: హైదరాబాద్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్‌ డైమండ్స్‌ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. కరీంనగర్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ సింహా(38) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శుభమ్‌ శర్మ(31), సాత్విక్‌ రెడ్డి(28) రాణించారు.కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ పది పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో అజయ్‌, షణ్ముఖ, ప్రణవ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

తొలుత బ్యాటింగ్‌ చేయనున్న  కరీంనగర్‌
తెలంగాణ టీ20 లీగ్‌-2026లో మ‌రో కీల‌క మ్యాచ్‌కు తెరలేచింది. క్వాలిఫ‌య‌ర్‌-2లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా కరీంనగర్ డైమండ్స్ , హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క‌రీంన‌గ‌ర్ డైమండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఎలిమినేట‌ర్‌లో రంగారెడ్డిని చిత్తు చేసిన క‌రీంన‌గ‌ర్ డైమండ్స్‌.. ఇప్పుడు క్వాలిఫ‌య‌ర్‌-2లో అదే జోరును కొన‌సాగించాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు క్వాలిఫ‌య‌ర్‌-1లో ఖ‌మ్మం చేతిలో ఖంగుతిన్న హైద‌రాబాద్ జ‌ట్టు తిరిగి పుంజుకోవాలని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

తుది జ‌ట్లు
కరీంనగర్ డైమండ్స్: తన్మయ్ అగర్వాల్ (సి), సాత్విక్ రెడ్డి, హెచ్‌కె సింహా, రాహుల్ రాదేశ్ (వికెట్‌ కీపర్‌), చందన్ సహాని, నారాయణ తేజ, శుభం శర్మ, అఖిల్ కుమార్ సంకోజు, రత్లావత్ దినేష్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీష్ కుమార్

హైదరాబాద్ ఈ ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి (కెప్టెన్‌), సాయి వికాస్ రెడ్డి, యశ్వీర్ గౌడ్, గడుగు గణేష్, వైష్ణవ్ రెడ్డి ఎ, ప్రణవ్ వర్మ, పి అరవింద్ (వికెట్ కీప‌ర్‌), అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement