జైశ్వాల్‌ విధ్వంసం.. హైదరాబాద్‌ ముందు భారీ టార్గెట్‌ | TG20 Qualifier 1: Mickil Jaiswals blockbuster batting, the Anvita Khammam Aces make 200 score | Sakshi
Sakshi News home page

TG20: జైశ్వాల్‌ విధ్వంసం.. హైదరాబాద్‌ ముందు భారీ టార్గెట్‌

Jul 9 2026 9:08 PM | Updated on Jul 9 2026 9:14 PM

TG20 Qualifier 1: Mickil Jaiswals blockbuster batting, the Anvita Khammam Aces make 200 score

తెలంగాణ టీ20-2026లో భాగంగా ఉప్పల్‌ వేదికగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-1లో అన్విత ఖమ్మం ఏసెస్ బ్యాటర్లు సత్తాచాటారు. ముఖ్యంగా ఖమ్మం మిడిలార్డర్‌ బ్యాటర్‌ మికిల్ జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు.

తన ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన జైశ్వాల్‌.. క్రీజులో సెటిల్‌ అయ్యాక హైదరాబాద్‌ బౌలర్లను ఉతికారేశాడు. అజయ్‌ దేవ్‌ గౌడ్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో మికిల్‌ 20 పరుగులు పిండుకున్నాడు. జైశ్వాల్‌ కేవలం 34 బంతుల్లో 4 ఫోర్లు,7 సిక్స్‌లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

అతడితో పాటు జీఎస్‌కే రెడ్డి(40), పరాస్‌ రాజ్‌(32) రాణించారు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో ఆఖిల్‌ రాథోడ్‌ రెండు, షణ్ముఖ, ప్రణవ్‌, అజయ్‌, దేవ్‌ తలా వికెట్‌ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement