కన్నీరుమున్నీరైన రషీద్ ఖాన్.. వీడియో వైరల్‌ | Rashid Khan breaks down during emotional farewell to former Afghanistan pacer Shapoor Zadran | Sakshi
Sakshi News home page

కన్నీరుమున్నీరైన రషీద్ ఖాన్.. వీడియో వైరల్‌

Jul 9 2026 8:15 PM | Updated on Jul 9 2026 8:31 PM

Rashid Khan breaks down during emotional farewell to former Afghanistan pacer Shapoor Zadran

అఫ్గానిస్తాన్‌ దిగ్గజ పేసర్‌ షాపూర్ జద్రాన్ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం కాబూల్‌లోని మరంజన్ హిల్ స్మశానవాటికలో జద్రాన్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మాజీ ఫాస్ట్ బౌలర్‌కు తమ చివరి నివాళులు అర్పించేందుకు అఫ్గాన్‌ క్రికెటర్లతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

ఈ సందర్భంగా అఫ్గాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. జద్రాన్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తూ కన్నీరుమున్నీరయ్యాడు. అతడితో పాటు వికెట్ కీపర్-బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్, ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ఎక్స్‌లో షేర్‌ చేసింది.

కాగా 38 ఏళ్ల షాపూర్ జద్రాన్ హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ అనే అరుదైన వ్యాధితో ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మంగళవారం(జూలై 7) కన్నుమూశారు. తన 39వ పుట్టినరోజుకు కేవలం ఒక్క రోజు ముందు షాపూర్‌ మరణించడం అఫ్గాన్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.

అఫ్గాన్‌ క్రికెట్‌లో జద్రాన్‌ తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు. 2009 నుంచి 2020 మధ్య కాలంలో అఫ్గాన్‌ తరపున 80 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 80 వికెట్లు పడగొట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement