breaking news
Shapoor Zadran
-
కన్నీరుమున్నీరైన రషీద్ ఖాన్.. వీడియో వైరల్
అఫ్గానిస్తాన్ దిగ్గజ పేసర్ షాపూర్ జద్రాన్ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం కాబూల్‌లోని మరంజన్ హిల్ స్మశానవాటికలో జద్రాన్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మాజీ ఫాస్ట్ బౌలర్‌కు తమ చివరి నివాళులు అర్పించేందుకు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. జద్రాన్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తూ కన్నీరుమున్నీరయ్యాడు. అతడితో పాటు వికెట్ కీపర్-బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్, ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఎక్స్‌లో షేర్ చేసింది.Rashid Khan broke down in tears as he bid a final farewell to his teammate and Afghanistan cricket legend Shapoor Zadran following his passing.😢🥺 pic.twitter.com/vF2DtNCXGl— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) July 9, 2026కాగా 38 ఏళ్ల షాపూర్ జద్రాన్ హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ అనే అరుదైన వ్యాధితో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం(జూలై 7) కన్నుమూశారు. తన 39వ పుట్టినరోజుకు కేవలం ఒక్క రోజు ముందు షాపూర్ మరణించడం అఫ్గాన్ క్రికెట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.The funeral prayer for the late Shapoor Zadran was offered this morning at 10:00 AM at Eidgah Mosque in Kabul, attended by current and former Afghanistan national team players, officials of the Afghanistan Cricket Board, members of his family, respected elders, and thousands of… pic.twitter.com/TcQCaEwlSA— Afghanistan Cricket Board (@ACBofficials) July 9, 2026అఫ్గాన్ క్రికెట్లో జద్రాన్ తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు. 2009 నుంచి 2020 మధ్య కాలంలో అఫ్గాన్ తరపున 80 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 80 వికెట్లు పడగొట్టాడు. -
38 ఏళ్ల వయసులో అఫ్గాన్ క్రికెటర్ కన్నుమూత
అఫ్గానిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ కన్నుమూశాడు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని మంగళవారం ధ్రువీకరించింది. కాగా షాపూర్ జద్రాన్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం విదితమే. వ్యాధి కారణంగా అతడి శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది.ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో.. అఫ్గాన్ నుంచి భారత్‌కు తరలించి అత్యాధునికి చికిత్స అందిస్తున్నారు. గత కొన్నినెలలుగా న్యూ ఢిల్లీలోని ఆస్పత్రిలో ఉన్న షాపూర్ జద్రాన్ తాజాగా తుదిశ్వాస విడిచాడు. బుధవారమే అతడు 39వ వసంతంలో అడుగుపెట్టాల్సింది. అలాంటిది పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే అతడు మరణించడం కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది.ఆరడుగుల బౌలర్ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తుతో.. జులపాల జుట్టుతో.. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ చాలాకాలం అభిమానులను అలరించాడు షాపూర్ జద్రాన్. అఫ్గాన్ తరఫున 2009- 2020 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు ఈ ఫాస్ట్ బౌలర్.ఇంటర్నేషనల్ కెరీర్లో 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడిన షాపూర్.. వన్డేల్లో 43, టీ20లలో 37 వికెట్లు కూల్చాడు. మూడుసార్లు టీ20 ప్రపంచకప్ జట్లలో భాగమయ్యాడు. అఫ్గాన్ క్రికెట్ నివాళిషాపూర్ జద్రాన్ మరణం పట్ల అఫ్గాన్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గాన్ క్రికెట్ అభివృద్ధిలో అతడూ భాగమయ్యాడని.. చిన్న వయసులోనే అతడు కన్నుమూయడం కలచివేసిందని విచారం వ్యకతం చేసింది. షాపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. -
‘ఆర్థిక సాయం వద్దు.. ఆ ఒక్క పని చేయండి ప్లీజ్’
అఫ్గనిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అత్యవసర విభాగంలో ఉంచి అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిరంతరం పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం పెద్దగా మెరుగుపడటం లేదని తెలుస్తోంది.‘ఆర్థిక సాయం వద్దుఈ నేపథ్యంలో షాపూర్ తమ్ముడు ఘామీ జద్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమకు ఆర్థిక సాయం అక్కర్లేదని.. తన సోదరుడి ఆరోగ్యం బాగుపడేలా ప్రార్థిస్తే చాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ దేవుడి దయ వల్ల ఆర్థికంగా మా కుటుంబం పటిష్టంగానే ఉంది. మాకు ఎలాంటి ఆర్థిక సహాయం అక్కర్లేదు.దయచేసి అందరూ ప్రార్థించండిమా అన్నయ్య బతకాలని దయచేసి అందరూ ప్రార్థించండి. మీ ప్రార్థనల్లో తనకూ చోటు ఇవ్వండి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా షాపూర్ జద్రాన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది. అతడి రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో అఫ్గన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చి అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు.ఇక్కడి వైద్యులు అద్భుతంఈ విషయం గురించి ఘామి జద్రాన్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో ఉన్న మా డాక్టర్.. మా అన్నయ్యను భారత్‌కు తీసుకువెళ్తే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఢిల్లీకి తీసుకువచ్చాము. భారత్‌లో అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అందుకే మేము ఇక్కడికి వచ్చాము.ఇక్కడి వైద్యులు మా అన్నయ్యను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అతడిని హీరోగా అభివర్ణిస్తూ సానుకూల దృక్పథం నింపుతున్నారు. వాళ్లంతా అనుభవజ్ఞులైన వైద్యులు. ఇక్కడి ఆస్పత్రి గొప్పగా ఉంది. డాక్టర్లకు ధన్యవాదాలు’’ అని తెలిపాడు.వాళ్లంతా అండగా ఉన్నారుఇక అఫ్గనిస్తాన్ క్రికెట్ బృందం తమకు అండగా ఉందన్న ఘామీ జద్రాన్.. ‘‘రాయీస్ అహ్మద్జాయ్, నవ్రోజ్ మంగళ్, మొహ్మద్ నబీ అందరూ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అన్నయ్య గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రపంచకప్ సమయంలో రషీద్ ఖాన్, ఇతర జట్టు సభ్యులు ఆస్పత్రికి వచ్చి అన్నయ్యను చూసి వెళ్లారు.రషీద్ ఖాన్ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాడు. ఢిల్లీ, ముంబైలలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నపుడు అల్లా ఘజన్ఫర్ కూడా ఆస్పత్రికి వచ్చి వెళ్లాడు. అతడు ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. ఒకవేళ అవసరమైతే మా అన్నయ్యను అంబానీ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిద్దాం అని చెప్పాడు. అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు’’ అని తెలిపాడు.చదవండి: లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ అది నేర్చుకోకుంటే కష్టమే: ఆసీస్ దిగ్గజం -
పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్!
38 ఏళ్ల అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపుర్ జద్రన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య పడిపోవడంతో ప్రస్తుతం షాపుర్ జద్రన్ భారత్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో అతడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరో 18 గంటలు గడిస్తే కానీ షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని అతని కుటుంబసభ్యులతో పాటు అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోషల్‌మీడియాలో కూడా షాపుర్ జర్దన్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అయితే కొన్ని వారాల కిందటే తీవ్ర అనారోగ్యానికి గురైన షాపుర్ జద్రన్ చాలా రోజుల ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఇటీవలే డిశ్చార్జి అయిన అతడు మరోసారి ఆసుపత్రి పాలవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. జద్రన్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పాక్‌కు చెందిన మరో మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది కూడా షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి విషయం తెలుసుకొని బాధపడ్డాడు. అతని కుటుంబసభ్యులతో మాట్లాడిన షాహిద్ అఫ్రిది తన చిరకాల మిత్రుడు షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు. క్రికెట్లో అఫ్గానిస్తాన్ ఎదుగుదలలో షాపుర్ జద్రన్ కీలక పాత్ర పోషించాడు. దశాబ్దానికి పైగా ఆఫ్గన్‌కు ప్రాతినిధ్యం వహించిన షాపుర్ జద్రన్ నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచ మేటి బ్యాటర్లను వణికించాడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి బ్యాటర్లను తన స్వింగ్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టి పెవిలియన్ చేర్చాడు. 2009లో స్కాట్లాండ్తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాపుర్ జద్రన్ అప్గానిస్తాన్ తరఫున 43 వన్డేల్లో 43 వికెట్లు, 32 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్తాన్ తరఫున మూడు టీ20 ప్రపంచకప్పుల్లో పాల్గొన్న షాపుర్ జద్రన్ 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై విజయం సాధించి ఐసీసీ టోర్నీల్లో తొలి విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.Zardan brother is like a buddy to me. I am wishing him speedy recovery. Ameen🤲 pic.twitter.com/8oGPUVwHai— Umar Akmal (@Umar96Akmal) April 17, 2026చదవండి: స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది?


