వైభవ్‌కు క్లాస్‌పీకిన గౌతమ్ గంభీర్‌ | Vaibhav Sooryavanshi Schooled By Gautam Gambhir After 3rd Straight Failure In England | Sakshi
Sakshi News home page

ENG vs IND: వైభవ్‌కు క్లాస్‌పీకిన గౌతమ్ గంభీర్‌

Jul 10 2026 10:01 PM | Updated on Jul 10 2026 10:03 PM

Vaibhav Sooryavanshi Schooled By Gautam Gambhir After 3rd Straight Failure In England

భారీ అంచనాలతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ పర్యటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 

15 ఏళ్ల వైభవ్.. షార్ట్ పిచ్ బంతులను ఆడలేక ఇబ్బందిపడుతున్నాడు.  తన అరంగేట్ర మ్యాచ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగిన వైభవ్‌.. తర్వాతి రెండు మ్యాచ్‌లలోనూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో దొరికిపోయాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి సూర్యవంశీ కేవలం 42 పరుగులు చేశాడు. 

అయితే వరుస మ్యాచ్‌ల్లోనూ విఫలమైనందుకు గాను వైభవ్‌కు.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లాస్ తీసుకున్నట్లు 'రేస్పోర్ట్స్' తమ కథనంలో పేర్కొంది. కాగా నాలుగో టీ20 అనంతరం గంభీర్‌, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్‌లు కలిసి తొలుత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో ఏదో విషయం తీవ్రంగా చర్చించారు. ఆ తర్వాత శ్రేయస్ పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు వెళ్లడంతో, గంభీర్ సూర్యవంశీతో మాట్లాడు. 

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 శనివారం రోజ్‌బౌల్ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
చదవండి: ENG vs IND: 'అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement