భారత జట్టులో కీలక మార్పులు!.. తిలక్‌కు నో ఛాన్స్‌? | No Tilak Varma? Indias Predicted Playing XI For 5th T20I Vs England 2026 | Sakshi
Sakshi News home page

IND vs ENG: భారత జట్టులో కీలక మార్పులు!.. తిలక్‌కు నో ఛాన్స్‌?

Jul 10 2026 9:06 PM | Updated on Jul 10 2026 9:11 PM

No Tilak Varma? Indias Predicted Playing XI For 5th T20I Vs England 2026

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా  ఓట‌ముల ప‌రంప‌ర కొనసాగుతోంది. గురువారం బ్రిస్ట‌ల్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20లో భార‌త జ‌ట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో శ్రేయ‌స్ సేన కోల్పోయింది. ఇది భార‌త్‌కు వ‌రుస‌గా రెండో సిరీస్ ఓట‌మి. 

అంత‌కుముందు ఐర్లాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ క్లీన్ స్వీప్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖ‌రి టీ20 సౌతాంప్టన్ వేదిక‌గా శ‌నివారం జ‌ర‌గ‌నుంది. కనీసం చివ‌రి మ్యాచ్‌లోనైనా గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సంజూ ఇన్.. వైభ‌వ్‌కు మ‌రో ఛాన్స్‌?
గ‌త మూడు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌ను తిరిగి తుది జ‌ట్టులోకి తీసుకోవాల‌ని మేనెజ్‌మెంట్ భావిస్తోంది. అయితే సంజూ స్ధానంలో ఎంట్రీ ఇచ్చిన యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీని కూడా ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో కొన‌సాగించాల‌ని గంభీర్ అండ్ కో భావిస్తుందంట.

వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి, వైభ‌వ్‌కు  మేనేజ్‌మెంట్ మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. అయితే సంజూ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశముంది. వరుసగా విఫలమవుతున్న వైస్ కెప్టెన్‌ తిలక్ వర్మను తుది జట్టు నుంచి తప్పించనున్నట్లు సమాచారం. 

అదేవిధంగా వాషింగ్టన్ సుందర్‌ను కూడా పక్కన పెట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. చివరి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ సూర్యన్ష్ షెడ్గేకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఐదో టీ20కు భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా)
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement