శ్రేయస్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ ఎంతంటే? | Shreyas Iyer Slams 80 Not Out, India Post 158-7 | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ ఎంతంటే?

Jul 9 2026 11:41 PM | Updated on Jul 9 2026 11:41 PM

Shreyas Iyer Slams 80 Not Out, India Post 158-7

బ్రిస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. వైభవ్‌ సూర్యవంశీ(15), అభిషేక్‌ శర్మ(16), ఇషాన్‌ కిషన్‌(4) వంటి టాపార్డర్‌ బ్యాటర్లు విఫలమైన చోట.. ఇంగ్లండ్‌ బౌలర్లకు శ్రేయస్‌ చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన శ్రేయస్‌, క్రీజులో సెటిల్‌ అయ్యాక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. 

ఓ వైపు క్రమం తప్పకొండా వికెట్లు పడుతున్నప్పటికి, అయ్యర్‌ తన దూకుడును కొనసాగించాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్‌ దూబే(22) పర్వాలేదన్పించాడు. 

ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగుల స్కోర్‌ సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, జోష్‌ టంగ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్‌ జాక్స్‌, అదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement