ఇంగ్లండ్‌తో నాలుగో టీ20.. బ్యాటింగ్‌ భారత్‌దే | England vs India, 4th T20I Toss Update and Playing11 | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టీ20.. బ్యాటింగ్‌ భారత్‌దే

Jul 9 2026 9:35 PM | Updated on Jul 9 2026 9:44 PM

England vs India, 4th T20I Toss Update and Playing11

బ్రిస్టల్‌ వేదికగా నాలుగో టీ20లో ఇంగ్లండ్‌-భారత్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తొలుత బ్యాటింగ్‌ ఎం‍చుకున్నాడు. ఈ మ్యాచ్‌కు భారత ప్లేయర్లు హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో వాషింగ్టన్‌ సుందర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు. 

కాగా మరోసారి సంజూ శాంసన్‌కు నిరాశే ఎదురైంది. వైభవ్‌ సూర్యవంశీని తుది జట్టులో కొనసాగించారు. ఇక ఇంగ్లండ్‌ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. లియామ్‌ డాసన్‌ స్ధానంలో రెహాన్‌ అహ్మద్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చాడు.

తుది జట్లు
ఇంగ్లండ్‌: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement