టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్ మరోసారి నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు. రెండో టీ20 మాదిరే షార్ట్ పిచ్ డెలివరీకి వైభవ్ దొరికిపోయాడు.
తొలి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఆచితూచి ఆడిన వైభవ్.. రెండో ఓవర్ వేసిన జోష్ టంగ్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాది తన రిథమ్‌ను అందుకున్నాడు. కానీ తర్వాత ఓవర్‌లో ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతికి భారీ షాట్ ఆడబోయి వైభవ్ ఔటయ్యాడు.
షార్ట్ లెంగ్త్ బంతిని 'పుల్' షాట్ ఆడేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మిడ్-ఆన్ వద్ద ఉన్న సామ్ కుర్రాన్ సునాయస క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 10 బంతుల్లో ఒక ఫోర్, సిక్స్‌తో కేవలం 15 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.
వైభవ్ గత రెండు మ్యాచ్‌లలో 14, 13 స్కోర్లను నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మొదటి మూడు మ్యాచ్‌లలో 42 పరుగులు చేశాడు. కాగా వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వడం కోసం స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను సైతం పక్కన పెట్టారు. కానీ వైభవ్ మాత్రం తన లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నాడు.
Similar type of dismissals ☠️
Weakness of Vaibhav Sooryavanshi which the bowlers have started exploiting....
Need to work on this in the coming days else it will be difficult...#ENGvsIND pic.twitter.com/uDkthonNnB— Wanderer (@vkyash18oz) July 9, 2026


