రాణించిన మంధాన, హర్మన్‌.. 285 పరుగులకు భారత్‌ ఆలౌట్‌ | England finished strong and bowled India out for 285 In 1st Innings | Sakshi
Sakshi News home page

ENG vs IND: రాణించిన మంధాన, హర్మన్‌.. 285 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

Jul 10 2026 10:33 PM | Updated on Jul 10 2026 10:33 PM

England finished strong and bowled India out for 285 In 1st Innings

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న చారిత్రత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌.. తమ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి ‍మంధాన(108 బంతుల్లో 82) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌(58), దీప్తీ శర్మ(57)లు కూడా హాఫ్ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ సోఫీ ఎక్లెస్టోన్ మూడు వికెట్లు పడగొట్టగా.. లారన్‌ ఫైలర్‌, వాంగ్‌, మ్యాడీ విలియర్స్‌ తలా రెండు వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచ్‌తో కడప అమ్మాయి శ్రీచరణి భారత్‌ తరపున టెస్ట్‌ అరంగేట్రం చేసింది.

భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, సయాలీ సత్ఘరే, శ్రీ చరణీ, క్రాంతి గౌడ్

ఇంగ్లండ్‌: టామీ బ్యూమాంట్, మైయా బౌచియర్, హెదర్ నైట్, నాట్ సైవర్-బ్రంట్(కెప్టెన్), ఆలిస్ క్యాప్సీ, అమీ జోన్స్(వికెట్ కీపర్), మాడీ విలియర్స్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్, లారెన్ బెల్, లారెన్ ఫైలర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement