‘ఎంబాపె కాస్కో.. 2024 సెమీస్‌ను రిపీట్ చేస్తాం’ | lamine-yamal-france-warning-afraid-spain-fifa-world-cup-semi-final | Sakshi
Sakshi News home page

ఎంబాపె కాస్కో.. 2024 సెమీస్‌ను రిపీట్ చేస్తాం: స్పెయిన్‌ స్టార్‌ లామినే వార్నింగ్‌

Jul 11 2026 7:44 AM | Updated on Jul 11 2026 8:14 AM

lamine-yamal-france-warning-afraid-spain-fifa-world-cup-semi-final

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మాజీ చాంపియ‌న్ స్పెయిన్ సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. శ‌నివారం తెల్ల‌వారుజామున జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను చిత్తు చేసింది. మ్యాచ్‌లో స్పెయిర్ రెండు గోల్స్ చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు లామినే య‌మాల్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

18 ఏళ్ల లామినే య‌మాల్ ఈ ఫిపాలో పెద్ద‌గా గోల్స్ కొట్ట‌క‌పోయిన‌ప్ప‌టికీ కీల‌క స‌మ‌యాల్లో త‌న స‌హ‌చ‌రుల‌కు అసిస్ట్‌లు, పాస్‌లు అందిస్తూ స్పెయిన్ విజ‌యాల్లో ముఖ్య‌పాత్ర వ‌హిస్తున్నాడు. ఇక వ‌రుస‌గా మూడో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ సెమీస్ చేరి సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఫ్రాన్స్‌ను స్పెయిన్ ఎదుర్కోనుంది. 

ఈ నేప‌థ్యంలోనే లామినే య‌మాల్ ఫ్రాన్స్ జ‌ట్టుకు వార్నింగ్ ఇవ్వ‌డం ఆస‌క్తి క‌లిగించింది. బెల్జియంతో క్వార్ట‌ర్స్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత లామినే య‌మాల్ మాట్లాడాడు. ‘టోర్నీని చాలా ఉత్సాహంగా ప్రారంభించాం. మా ప్ర‌యాణంలో సెమీస్ ద‌శ‌లో అడుగుపెట్టాం. ఫ్రాన్స్ అంటే మాకు భ‌యం లేదు. నిజానికి మేము కాదు వాళ్లే మాకు భ‌య‌ప‌డ‌తారేమో. ఎందుకంటే 2024 యూరోక‌ప్ సెమీస్‌లో మా చేతిలోనే ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ త‌ర్వాత మేము క‌ప్‌ను కూడా ఎగ‌రేసుకుపోయాం. 

ఇప్పుడు మ‌ళ్లీ 2024 నాటి యూరోక‌ప్ సెమీస్‌నే రిపీట్ చేయ‌బోతున్నాం. ఒత్తిడి మాకంటే ఫ్రాన్స్‌పైనే ఎక్కువ ఉంటుంది. మేము గెలుస్తామా లేదా అన్న సంగ‌తి ప‌క్క‌న‌బెడితే మాత్రం ఈసారి మా మ‌ధ్య జ‌ర‌గ‌బోయే మ్యాచ్ మాత్రం ఫిఫా చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ మ్యాచ్‌ల్లో ఒక‌టిగా నిలిచిపోనుంది.’ అని చెప్పుకొచ్చాడు.

ఇక యూఈఎఫ్ఏ యూరో 2024 క‌ప్‌లో సెమీస్‌లో స్పెయిన్ 2-1తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అప్ప‌టికి 16 ఏళ్ల వ‌య‌సున్న లామినే య‌మాల్ లాంగ్ రేంజ్ స్ట్రైక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి త‌ర‌లించడం ఇప్ప‌టికీ రికార్డుగా నిలిచిపోయింది. ఇదే మ్యాచ్‌లో డాని ఓల్మో మ‌రో గోల్ సాధించాడు. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను 1-2తో చిత్తు చేసిన స్పెయిన్ యూరో చాంపియన్స్‌గా నిలిచింది. ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో జూలై 14న జ‌ర‌గ‌నున్న సెమీఫైన‌ల్లో ఫ్రాన్స్‌, స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

 

Read: స‌చిన్‌, కోహ్లి స‌ర‌స‌న గిల్‌.. టీమిండియా కెప్టెన్‌గా రికార్డు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement