చివరిదైనా గెలుస్తారా? | India Last T20 Vs England Today, Team India Faces Clean Sweep Threat As England Dominate T20 Series, Read Story Inside | Sakshi
Sakshi News home page

ENG Vs IND 5th T20I: చివరిదైనా గెలుస్తారా?

Jul 11 2026 1:02 AM | Updated on Jul 11 2026 12:06 PM

Indias last T20 against England today

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ చివరి టి20

సౌతాంప్టన్‌: ఐర్లాండ్, ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న భారత క్రికెట్‌ జట్టు నేడు ఇంగ్లండ్‌తో ఆఖరి టి20 మ్యాచ్‌ ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టి20 వర్షంతో రద్దు కాగా... ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని టీమిండియా పరాజయం పాలైంది. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు 3–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది. మరి శనివారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లోనైనా మనవాళ్లకు ఊరట విజయం దక్కుతుందా చూడాలి. 

ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు... ఇప్పుడు కనీస ప్రతిఘటన కనబర్చలేని స్థాయికి చేరింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మనవాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఐపీఎల్‌ ప్రదర్శనతో జట్టులోకి వస్తున్న ఆటగాళ్లెవరూ... అంతర్జాతీయ స్థాయిలో అదే దూకుడు కనబర్చలేకపోతున్నారు. ఫ్లాట్‌ పిచ్‌లు, చిన్న బౌండరీలు, బ్యాటింగ్‌కు అనుకూలమైన నిబంధనల మధ్య ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన ప్లేయర్లంతా... ఇప్పుడు అనామకులుగా దర్శనమిస్తున్నారు. .  

నిలకడగా... 
మరోవైపు ఇంగ్లండ్‌ అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. పేసర్లు ఆర్చర్, టంగ్, స్యామ్‌ కరన్‌... భారత బ్యాటర్ల బలహీనతలను పసిగట్టి వారిని సులువుగా బుట్టులో వేసుకుంటున్నారు. ఇక బ్యాటింగ్‌లో ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల సమర్థులు ఉండటం ఇంగ్లండ్‌  జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు ఒకటి కంటే ఎక్కువ టి20 మ్యాచ్‌ల సిరీస్‌ల్లో ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్‌ కోల్పోని టీమిండియా... ఇప్పుడు ‘క్లీన్‌ స్వీప్‌’ ప్రమాదం అంచున ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement