‘నవ్వులాటగా ఉన్నా వారి చర్యలు హర్షనీయం’ | PV Sindhu-Encourages-Monkey Whisperers At World Championship | Sakshi
Sakshi News home page

PV Sindhu: ‘నవ్వులాటగా ఉన్నా వారి చర్యలు హర్షనీయం’

Aug 11 2026 8:18 AM | Updated on Aug 11 2026 8:54 AM

PV Sindhu-Encourages-Monkey Whisperers At World Championship

Photo Credit : Twitter

ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రతిష్టాత్మక వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌కు వేదిక కానుంది. అయితే ఈ మైదానానికి చుట్టు పక్కల కోతుల బెడ‌ద ఎక్కువ‌గా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇదే వేదిక‌లో జరిగిన ఇండియా ఓపెన్‌లోనూ కోతుల వీరంగంతో అభిమానులు, నిర్వాహకులు చాలా ఇబ్బంది పడ్డారు.

ప్రేక్షకుల గ్యాలరీల్లోకి కూడా కోతులు దూసుకురావడంతో పలు విమర్శలు వచ్చాయి. ఈసారి ప్ర‌తిష్టాత్మ‌క‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్ జ‌రుగుతుండ‌డంతో, మునుప‌టి ప‌రిస్థితులు ఎదురుకావొద్ద‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే  పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నంలో  నిర్వాహకులు కొత్తగా వింత పద్ధతిని అనుసరించబోతున్నారు.

కోతులను భయపెట్టి వాటిని తరిమేసేందుకు కొండముచ్చు శబ్దాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి అసలైనవి కాదు. కొండముచ్చు తరహాలో అరుస్తూ, ఈలలు వేస్తూ హడావిడి చేసేందుకు ముగ్గురు మనుషులను ప్రత్యేకంగా నియమించారు. తాము చేసే శబ్దాల వల్ల కోతులు పారిపోతాయని, గతంలోనూ ఢిల్లీలోని పలు కీలక ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాగే చేశామని వారు చెబుతున్నారు. దీంతో కోతుల‌ను బెద‌ర‌గొట్టేందుకు వీరిని ప్ర‌త్యేకంగా నియ‌మించిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. 

ఇక తాజా పరిణామంపై భారత స్టార్ ష‌ట్ల‌ర్‌ పీవీ సింధు స్పందించింది. "వీళ్లు చేస్తుంది చూస్తుంటే నవ్వు రావచ్చు. మన పరిష్కార మార్గాలు వింతగా అనిపించవచ్చు. కానీ టోర్నీని సమర్థంగా నిర్వహించేందుకు తెర వెనక కూడా ఇలాంటి ఎంతో మంది పని చేస్తున్నారు. వీరి శ్ర‌మ‌కు హ్యాట్సాఫ్‌" అని సింధు వ్యాఖ్యానించింది. కాగా ఢిల్లీ వేదికగా ఆగస్టు 17 నుంచి 23 వరకు వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ జరగనుంది. 

చదవండి: రషీద్ మెరుపులు.. వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్తాన్ అర్హత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement