మూడు పతకాలతోనే... | India end World Athletics U20 Championships with 3 medals | Sakshi
Sakshi News home page

మూడు పతకాలతోనే...

Aug 11 2026 5:57 AM | Updated on Aug 11 2026 5:57 AM

India end World Athletics U20 Championships with 3 medals

ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 27వ స్థానం

యుజీన్‌ (అమెరికా): నాలుగు దశాబ్దాల చరిత్రగల ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసే అవకాశాన్ని భారత అథ్లెట్లు చేజార్చుకున్నారు. ఆఖరి రోజు భారత అథ్లెట్లు పతకం గెలవడంలో విఫలమయ్యారు. ఓవరాల్‌గా రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలతో ఈ మెగా ఈవెంట్‌ను భారత్‌ ముగించింది. పతకాల పట్టికలో భారత్‌ 27వ స్థానంలో నిలిచింది. 

2021, 2022 ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లలో భారత్‌ అత్యధికంగా మూడు పతకాల చొప్పున సాధించింది. చివరిరోజు సోమవారం మహిళల హైజంప్‌లో పూజా సింగ్‌ పతకం సాధిస్తుందని భావించినా ఆమె నిరాశ పరిచింది. 19 ఏళ్ల పూజ 1.84 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఏడో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆసియా అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో పూజ 1.93 మీటర్ల ఎత్తుకు ఎగిరి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేయడంతోపాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. అదే  ప్రదర్శనను పూజ ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పునరావృతం చేసి ఉంటే పసిడి పతకాన్ని సొంతం చేసుకునేది.

 ఇజోబెల్లి లూసన్‌ రో (ఆ్రస్టేలియా; 1.92 మీటర్లు) బంగారు పతకాన్ని అందుకోగా... లిలియానా బటోరి (హంగేరి; 1.90 మీటర్లు) రజతం, ఐతానా అలోన్సో (స్పెయిన్‌; 1.90 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నారు. మహిళల 4్ఠ400 మీటర్ల రిలే ఫైనల్లో భూమిక, తహురా, తను, థియాలతో కూడిన భారత బృందం 3 నిమిషాల 45.28 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా అమెరికా 12 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి 24 పతకాలతో టాప్‌               ర్యాంక్‌లో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement