సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్‌! | Brendon McCullum to CSK chatter grows after Stephen Flemings exit | Sakshi
Sakshi News home page

IPL 2027: సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్‌!

Aug 10 2026 7:31 PM | Updated on Aug 10 2026 7:49 PM

Brendon McCullum to CSK chatter grows after Stephen Flemings exit

ఐపీఎల్‌-2027 సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ సూప‌ర్ కింగ్స్ త‌మ కొత్త హెడ్‌కోచ్ కోసం వేట ప్రారంభించింది. హెమాంగ్ బదానీ, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ ఆటగాళ్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. సీఎస్‌కే మాత్రం విదేశీ హెడ్ కోచ్ కోసం వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది.

స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో మ‌రో న్యూజిలాండ్ లెజెండ్‌ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను తమ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయాలని సీఎస్‌కే భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మెక్‌కల్లమ్ ఇటీవల ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే.

అయితే అతడు ఇంగ్లీష్ జట్టు వైట్‌బాల్ కోచ్‌గా మాత్రం కొనసాగుతున్నాడు. త్వరలోనే ఈ పదవి నుంచి కూడా అతడు వైదొలిగే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇకపై అతడు ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టిసారించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.

కాగా మెక్‌కల్లమ్‌కు సీఎస్‌కేతో మంచి అనుబంధం ఉంది. అతడు ఫ్లెమింగ్ నాయకత్వంలో సీఎస్‌కే తరపున ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడిని తమ కోచ్‌గా నియమించాలని నియమించాలని భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కానీ దీనిపై సీఎస్‌కే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌, స్టార్‌ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకోవడానికి కేకేఆర్‌, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు సీఎస్‌కే కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఫ్రాంచైజీ పూర్తి దృష్టి హెడ్ కోచ్ ఎంపికపైనే ఉందంట. కోచ్ ఎంపిక ఖారారైన తర్వాతే పాండ్యాపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement