కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. కాగా అథ్లెట్లతో భేటీ అయిన వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.
‘జో ఖేలేగా... వో ఖిలేగా’ (ఆటలు ఆడేవాళ్లు వికసిస్తారు) అంటూ అథ్లెట్లను అభినందించిన ప్రధానమంత్రి... దేశం కోసం ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కామన్వెల్త్ క్రీడల మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో పసిడి నెగ్గిన సాక్షి మాట్లాడుతూ... ‘పతకాలు సాధించిన ప్లేయర్లను ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ భేటీని మేమంతా ఎంతో ఆస్వాదించాం’ అని పేర్కొంది. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది.


