ప్రతి అంశంపైనా ప్రశ్నించాలి  | PM Narendra Modi message to Gen-Z at IIT Delhi Convocation ceremony | Sakshi
Sakshi News home page

ప్రతి అంశంపైనా ప్రశ్నించాలి 

Aug 9 2026 5:18 AM | Updated on Aug 9 2026 5:18 AM

PM Narendra Modi message to Gen-Z at IIT Delhi Convocation ceremony

అందరూ ఆమోదించారని అక్కడితో ఆగిపోవద్దు 

ప్రశ్నించడంతోపాటే సమస్యల్ని పరిష్కరించే సత్తాను పెంచుకోండి 

ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు ప్రధాని ఉపదేశం

న్యూఢిల్లీ: ఎలాంటి ఆలోచన లేకుండా అందరూ ఆమోదించే అంశాన్నయినా సరే మీరు ప్రశ్నించి తీరాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ అక్కడి వందలాది మంది విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

ఆ ధైర్యం ఉండాల్సిందే... 
‘‘ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ప్రశ్నించడంతోనే ఆగిపోవద్దు. అందుకు పరిష్కారాలు వెతికే శక్తిసామర్థ్యాలు, ధైర్యాన్ని పెంపొందించుకోండి. మీరు కొత్త విషయాలు తెల్సుకోవాలన్న జిజ్ఞాస ఎప్పుడూ ఉండాలి. ఆ ఉత్సుకతను మీలో శాశ్వతంగా సజీవంగా ఉంచుకోండి. అది మీరు ఎల్లప్పుడూ నేర్చుకోవాలనే ఆశను సదా రేకెత్తిస్తుంది. దేశంలో యువత ఎంతగా సాధికారత సాధిస్తే దేశం అంతగా సాధికారతను సంతరించుకుంటుంది. 

దేశం ఇప్పుడు ప్రతిరంగంలో స్వావలంభనను సాధించేందుకు వడివడిగా అడుగులేస్తోంది. ఆర్థికరంగంలో స్వయంసమృద్ధి, సాంకేతికపరంగా స్వావలంభన, పారిశ్రామికంగానూ అదే పంథా. ఇది వికసిత్‌ భారత్‌కు పటిష్టమైన పునాదిగా మారుతుంది. ఈ స్నాతకోత్సవంలో ఎంతో లోతైన భావోద్వేగం నిండి ఉంది. విద్యార్థుల కలలు,ఆశయాలతో ఈ కళాశాల ప్రాంగణం నిండిపోయింది.  

మీకందరికీ శుభాకాంక్షలు 
కోర్సులను విజయవంతంగా పూర్తిచేసి డిగ్రీ పట్టాలు అందుకుంటున్న విద్యార్థులందరికీ, వాళ్ల కుటుంబసభ్యులకు సైతం నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ డిగ్రీ పట్టాలు చదువులను మాత్రమే ప్రతిబింబించవు. బాధ్యతాయుతంగా మీరు దేశానికి చేయబోయే సేవలను గుర్తుచేస్తాయి. మెడళ్లు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు. ఐఐటీ ఢిల్లీలో కొత్తగా కృత్రిమ మేధ(ఏఐ) సంబంధింత కోర్సులు అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇక్కడ అందుకున్న డిగ్రీ పట్టాలతో దేశసేవ చేయాలన్న మీ కలను నిజం చేసుకోబోతున్నారు. 

కొత్తగా మీరు ఈ క్యాంపస్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఓరియంటేషన్‌ పూర్తిచేసుకుని ఉంటారు. తర్వాత ఇప్పుడు స్నాతకోత్సవానికి చేరుకున్నారు. ఈ ఆశయాలకు పునాదులు వేసుకుంటూ కొందరు ఉద్యోగంలో చేరి తొలి వేతనం అందుకోబోతున్నారు. మరికొందరు కాబోయే పారిశ్రామికవేత్తలుగా అంకుర సంస్థలను ప్రారంభించబోతున్నారు. మరికొందరు ఉన్నత చదువులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ మొత్తం విద్యాయాత్రలో మీరెన్నో మధురానుభూతులను చవిచూసి ఉంటారు. కొత్త జీవితం ఆరంభించబోతున్నామనే ఉత్సాహం మీలో కని్పస్తోంది. 

అన్నీ మారుతున్నాయి.. 
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అంశాలతోపాటు సాంకేతికత వేగంగా మారుతోంది. సాంకేతికతలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచ పరిణామాలకు కారణభూతమవుతున్నాయి. పెనుమార్పుల యుగంలో అనూహ్య సవాళ్లతోపాటు ఎన్నో అవకాశాలు అందివస్తున్నాయి. ఈ మార్పుల శకంలో నా మాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిరంతరం నేర్చుకు నే వ్యక్తే విజేతగా నిలుస్తాడు. ఐఐటీ డిగ్రీ అనేది కేవలం అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక గ్రేడ్‌ తెచ్చుకుని చక్కటి వేతనంతో ఉపాధి సాధించే అవకాశంగా కంటే వాస్తవిక ప్రపంచంలో సవాళ్లను వేగంగా పరిష్కరించే సత్తాను సంతరించుకోవడమే. అత్యంత క్లిష్టమైన సమస్యలను సైతం మీరు సాధించగలరు అని ఈ డిగ్రీ ప్రపంచానికి చాటిచెబుతుంది’’ అని మోదీ అన్నారు.

గత తరం అలా.. మీరు ఇలా.. 
‘‘భారత్‌లో గత తరం మొత్తం దేశ స్వాతంత్య్రసాధన అనే ఏకైక లక్ష్యం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎన్నో బాధలు, అవమానాలను భరించారు. లక్ష్యసాధన కోసం ఆ తరం చూపిన తెగువ, అకుంఠిత దీక్షను మీరూ వారసత్వంగా అందిపుచ్చుకోండి. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్‌ సాధించాల్సిన అభివృద్ధిలో భాగస్వాములుకండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భారతదేశ పురోగతికి ఏ విధంగా సానుకూలమో ఆలోచించి ముందడుగువేయండి. 

యువతరం సాధికారత అనేది అభివృద్ధిచెందిన భారత్‌కు బలమైన పునాది అవుతుంది. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్లు, భూ అయస్కాంతాలు, సముద్ర గర్భ శోధన, క్వాంటం కంప్యూటింగ్, ఇంధన భద్రత రంగాలదే హవా. ఈ రంగాలు మీ పదునైన ఐడియాల కోసం వేచిచూస్తున్నాయి. సత్తా చాటి నాయకత్వాన్ని కైవసం చేసుకోండి’’ అని మోదీ హితవు పలికారు.

సవాళ్లను ముక్కలుగా చేయండి 
‘‘జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఒక్క ఉదుటుగా పరిష్కరించాలనే విధానాన్ని కాస్తంత మార్చుకోండి. సమస్యలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఒక్కోటి పరిష్కరించుకుంటూ వెళ్లండి. ల్యా»ొరేటరీలో ప్రయోగం మొత్తాన్నీ ఒకేసారి చేయనట్లుగా మీ సమస్యల్ని సైతం దశలవారీగా పరిష్కరించి విజయం సాధించండి. సమస్యల్ని సమస్యల్లాగా చూడక ండి. వాటిలోని అవకాశాలను ఒడిసిపట్టండి. సమస్యల్ని పరిష్కరించినప్పుడు అందులో ఒక సువర్ణావకాశం దాగి ఉన్న విషయం బోధపడుతుంది. 

అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. వర్సిటీలో సిలబస్‌ ప్రకారం చదువుతాం. అందులోంచే ప్రశ్నలొస్తాయి. జీవితం అ లా కాదు. సిలబస్‌లో లేని కఠిన సమస్యలే ఎక్కువశాతం ఎదురవుతాయి. ముందే కూర్చి న ప్రశ్నలకు సమాధానం చెప్పగలగడంకంటే సమాజం విసిరిన సవాళ్లను ఎదుర్కోవడంలో నే అసలైన విజయం దాగి ఉంది. చిక్కు ప్రశ్నలుగా ఎప్పట్నుంచో అందరూ వదిలేసిన వాటి ని పరిష్కరించిన వాళ్లే నేడు విజేతలుగా కీర్తిపొందుతున్నారు’’అని మోదీ వివరించారు.  

విద్యలో అమ్మాయిల భాగస్వామ్యం పెరగాలి
‘‘ఈ స్నాతకోత్సవంలో అవార్డ్‌లు, మెడళ్లు తీసుకునే వాళ్లలో అమ్మాయిలు ఒకరిద్దరయినా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అది తప్పు. చాలా ఎక్కువ మంది ఆడబిడ్డలు ఈ జాబితాలో ఉండాల్సిందే. ఉన్నత విద్యలో మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో అమ్మాయిల భాగస్వామ్యం ఇంకా పెరగాలి’’అని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement