US Open 2022: యూఎస్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. నాదల్‌ కథ ముగిసింది 

Frances Tiafoe Stuns Rafael Nadal Ends 22-Match Win Streak US Open 2022 - Sakshi

యూఎస్ ఓపెన్లో పెను సంచలనం నమోదైంది. టైటిల్‌ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్‌.. స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ కథ ముగిసింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన 22వ సీడ్‌ ఫ్రాన్సిస్ టియఫో చేతిలో నాదల్‌.. 6-4, 4-6, 6-4, 6-3తో దారుణ పరాజయం చవిచూశాడు. ఇక కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న నాదల్‌కు ఈ ఏడాది మేజర్ టోర్నీల్లో నాదల్‌కు ఎదురైన తొలి ఓటమి ఇదే. కిక్కిరిసిన ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో నాదల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 

ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిచి జోరు మీదున్న ప్రపంచ రెండో ర్యాంకర్ రఫెల్ నాదల్ కు షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్ గా భావించిన నాదల్ పోరాటం ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అమెరికా ఆటగాడు, 22వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో  6-4,4-6,6-4,6-3 స్కోరుతో నాదల్ ను ఓడించి సంచలనం సృష్టించాడు.పేలవ సర్వీసులు, రిటర్న్ లతో నిరాశ పరిచాడు. తొలి సెట్ నే కోల్పోయిన రఫెల్ రెండో సెట్‌ గెలిచి స్కోరు సమం చేశాడు. 

కానీ, తర్వాతి రెండు సెట్లలో తేలిపోయాడు. దాంతో, ఐదోసారి నాదల్ సర్వీస్ బ్రేక్ చేస్తూ విజయం సాధించిన టియఫో తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ డానిల్ మెద్వెదెవ్ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో క్వార్టర్స్ కు ముందే ఇద్దరు టాప్ సీడ్‌ ఆటగాళ్లు ఇంటిదారి పట్టినట్టయింది.

ఫ్రాన్సిస్ రికార్డ్
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్‌ను ఓడించిన అమెరికా క్రీడాకారుల్లో ఫ్రాన్సిస్ టోయాఫే మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. గతంలో ఆండీ రాడిక్‌, జేమ్స్ బ్లేక్‌లు మాత్రమే నాదల్ను ఓడించారు. ఇక ఈ విజయంతో రొడ్డిక్ తర్వాత యూఎస్ ఓపెన్ సెమీస్లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా ఫ్రాన్సీస్ (24) గుర్తింపు సాధించాడు. నాదల్ ను ఓడించడం సంతోషంగా ఉందని ఫ్రాన్సిస్ టోయాఫే తెలిపాడు. నాదల్ ను ఓడించానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. నాదల్ టెన్నిస్ లెజెండ్ అని..అతన్ని ఓడించానంటే నమ్మశక్యంగా లేదన్నాడు. 

చదవండి: FIH Nations Cup: నేషన్స్‌ కప్‌ బరిలో భారత హాకీ జట్టు 

US Open 2022: మెద్వెదెవ్‌కు చుక్కెదురు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top