US Open 2024: తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సుమిత్‌ నగాల్‌ | US Open 2024: Sumit Nagal Bows Out In Round 1 Despite Spirited Fight Vs Griekspoor | Sakshi
Sakshi News home page

US Open 2024: తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సుమిత్‌ నగాల్‌

Aug 28 2024 11:50 AM | Updated on Aug 28 2024 11:56 AM

US Open 2024: Sumit Nagal Bows Out In Round 1 Despite Spirited Fight Vs Griekspoor

భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. ప్రపంచ 40వ ర్యాంకర్‌ టాలన్‌ గ్రీక్‌స్పూర్‌ (నెదర్లాండ్స్‌)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 73వ ర్యాంకర్‌ సుమిత్‌ 1-6, 3-6, 6-7 (6/8)తో ఓడిపోయాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ రెండు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన సుమిత్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. 

తొలి రౌండ్‌లో ఓడిన సుమిత్‌కు 1,00,000 డాలర్లు (రూ. 83 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. యూఎస్‌ ఓపెన్‌లో ఆడటం ద్వారా సుమిత్‌ తన కెరీర్‌లో తొలిసారి ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఆడాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో ఓడిపోయిన సుమిత్‌ ఫ్రెంచ్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లో నిష్క్రమించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement