టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెదరర్‌కు (Roger Federer) అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కింది. 2026 సంవత్సరానికి గానూ ఫెడెక్స్ ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యాడు. ఆటగాళ్ల కేటగిరిలో ఫెడెక్స్ ఒక్కడికే చోటు దక్కినట్లు నిర్వహకులు ప్రకటించారు.
కాంట్రిబ్యూటర్ కేటగిరీలో స్పోర్ట్‌స్కాస్టర్, జర్నలిస్ట్ మేరీ కరిల్లో ఎంపికైంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో జరిగే ప్రత్యేక వేడుకలో ఫెడెక్స్‌కు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఐదేళ్ల తర్వాత ఆటగాళ్లను హాఫ్ ఆఫ్ ఫేమ్ పురస్కారానికి అర్హులుగా పరిగణిస్తారు.
హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపిక కావడంపై ఫెడెక్స్ స్పందిస్తూ.. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరడం గొప్ప గౌరవం. నా కెరీర్ మొత్తం టెన్నిస్ చరిత్రను, ముందున్న లెజెండ్స్‌ను గౌరవించాను. కొత్త తరం ఆటగాళ్ల మధ్య ఈ పురస్కారం అందుకోవడం ప్రత్యేక అనుభూతి. ఈ గుర్తింపు నాకు వినమ్రతను కలిగిస్తోంది. టెన్నిస్ కుటుంబంతో కలిసి ఈ క్షణాన్ని జరుపుకోవాలని ఎదురుచూస్తున్నానని అన్నాడు.
ఫెదరర్ హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపికైన వార్తను అతని ముందుతరం స్టార్లు, హాల్ ఆఫ్ ఫేమర్లైన స్టీఫెన్ ఎడ్బర్గ్, బోరిస్ బెక్కర్ తెలిపారు.
ఫెదరర్ కెరీర్ విశేషాలు..
- 103 టూర్ లెవల్ టైటిల్స్, జిమ్మీ కానర్స్ (109) తర్వాత రెండో స్థానం.
- 20 గ్రాండ్ స్లామ్‌లు.
- 28 ATP మాస్టర్స్ 1000 టైటిల్స్.
- 310 వారాల పాటు ప్రపంచ నంబర్ 1, అందులో 237 వారాలు వరుసగా (ఇది నేటికీ రికార్డే)
- 5 సార్లు ATP ఇయర్ ఎండ్ నంబర్ 1 గౌరవం.
- 13 సార్లు స్టీఫెన్ ఎడ్బర్గ్ స్పోర్ట్స్‌మన్‌షిప్ అవార్డు.
- 19 సంవత్సరాలు వరుసగా ATP ఫ్యాన్స్ ఫేవరెట్(2003–2021).
చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్


