భారత టెన్నిస్ దిగ్గజం, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత రోహన్ బోపన్న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. 45 ఏళ్ల బోపన్న సోషల్ మీడియా మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "ఇది కేవలం వీడ్కోలు మాత్రమే.. ముగింపు కాదు.
నా జీవితానికి అర్థాన్ని ఇచ్చిన ఈ ఆటను నేను ఎలా వదులుకోగలను? నా 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన జ్ణాపకాలు ఉన్నాయి. అయితే నా రాకెట్‌ను పక్కటన పెట్టాల్సిన సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
బరువెక్కిన హృదయంతో ఈ నోట్ రాశాను. కర్ణాటకలోని కూర్గ్ అనే చిన్న పట్టణం నుంచి నా జర్నీని ప్రారంభించి.. ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడటం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.
నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులకు, కోచ్‌లకు, అభిమానులు ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్‌ను ధన్యవాదాలు" అని తన రిటైర్మెంట్ నోట్‌లో పేర్కొన్నాడు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000 టోర్నమెంట్‌లో కజకిస్తాన్‌కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి ఆడారు. అయితే ఈ జోడీ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో జాన్ పీర్స్- జేమ్స్ ట్రేసీ చేతిలో 5-7, 6-2, 10-8 తేడాతో ఓడిపోయింది.
రోహన్ తన కెరీర్‌లో ఎన్నో ఘనతలు అందుకున్నాడు. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 (Australian Open 2024) డబుల్స్‌లో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. రోహన్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. తద్వారా తిపెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా బోపన్న రికార్డులకెక్కాడు.
2017 ఫ్రెంచ్ ఓపెన్‌లో గాబ్రియల్ డబ్రోస్కీ (కెనడా)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ దక్కించుకున్నాడు. టూర్ స్థాయి డబుల్స్ టైటిళ్లు 26 నెగ్గాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిళ్లు ఆరు గెలిచాడు.
చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే


