ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజానికి అరుదైన గౌరవం | Brett Lee inducted into Australian cricket Hall of Fame | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజానికి అరుదైన గౌరవం

Dec 28 2025 5:08 PM | Updated on Dec 28 2025 5:20 PM

Brett Lee inducted into Australian cricket Hall of Fame

ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం బ్రెట్‌ లీకి (Brett Lee) అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈ స్పీడ్‌గన్‌ స్వదేశీ (Australia) హాల్‌ ఆఫ్‌ ఫేమర్ల (Hall Of Fame) జాబితాలోకి ప్రవేశించాడు. అత్యంత అరుదైన ఈ జాబితాలో లీ 66వ ఆటగాడిగా చేరాడు. లీకి ముందు చాలామంది ఆసీస్‌ దిగ్గజాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

లీకి ముందు ఇదే ఏడాది (2025) మైఖేల్‌ క్లార్క్‌, మైఖేల్‌ బెవాన్‌, క్రిస్టినా మాథ్యూస్‌ ఆసీస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి ప్రవేశించారు. ఈ జాబితాలో డాన్‌ బ్రాడ్‌మన్‌, అలెన్‌ బోర్డర్‌, షేన్‌ వార్న్‌, రికీ పాంటింగ్‌ లాంటి దిగ్గజాలు ఉన్నారు.

49 ఏళ్ల లీ దశాబ్దానికిపైగా (1999-2012) తన ఫాస్ట్‌ బౌలింగ్‌లో ప్రపంచ బ్యాటర్లను గడగడలాడించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఆసీస్‌ ఆధిపత్యం కొనసాగించడంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్లు తీయడం కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన లీ.. కెరీర్‌లో ఎన్నో సార్లు స్పీడో మీటర్లు (బౌలింగ్‌ వేగాన్ని కోలిచే యంత్రం) బద్దలు కొట్టాడు.

అత్యుత్తమంగా లీ గంటకు 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన బంతిగా నేటికీ చలామణి అవుతుంది. లీ కంటే పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ కేవలం 0.2 వేగాన్ని అధికంగా సాధించాడు.

తనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం (ఆస్ట్రేలియా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌) దక్కడం పట్ల లీ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ అని చెప్పాడు. తొమ్మిదేళ్ల వయసు నుంచి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయాలని కలలు కన్నట్లు తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement