US Open 2022: రఫ్పాడించిన స్పెయిన్ బుల్; ఒసాకాకు బిగ్‌షాక్

స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను దిగ్విజయంగా అధిగమించాడు. మంగళవారం అర్థరాత్రి జరిగిన తొలి రౌండ్‌లో నాదల్.. ఆస్ట్రేలియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రింకీ హిజికాటాను 4-6, 6-2, 6-3, 6-3తో ఓడించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో నాదల్ తొలి సెట్‌ను 4-6తో హిజికాటాకు కోల్పోయాడు. అయితే ఇక్కడి నుంచి నాదల్ తన గేర్ మార్చాడు. రెండో గేమ్ నుంచి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన వరుసగా మూడు సెట్లను గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
Photo Credit: US Open Twitter
ఇక 22 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన నాదల్.. ఇటీవలే వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు ముందు గాయంతో దూరమయ్యాడు. అయితే ఈసారి మాత్రం నాదల్‌లో ఫిట్‌నెస్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడం.. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్ దూరం కాగా.. నాదల్ మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. ఇక రెండో రౌండ్‌లో నాదల్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినితో తలపడనున్నాడు. 2019లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన నాదల్ ఆ తర్వాత యూఎస్ ఓపెన్ ఆడడం ఇదే. ఇప్పటికవరకు నాదల్ ఖాతాలో నాలుగు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.
#USOpen night sessions carry.
Just ask @RafaelNadal pic.twitter.com/llcuqtIA7F
— US Open Tennis (@usopen) August 31, 2022
HOLY MATCH POINT RAFA pic.twitter.com/sHsyYmPBAK
— US Open Tennis (@usopen) August 31, 2022
తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన నవోమి ఒసాకా
Photo Credit: US Open Twitter
యూఎస్ ఓపెన్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఎమ్మా రాడుకాను తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టగా.. తాజాగా జపాన్ టెన్నిస్ స్టార్.. మాజీ చాంపియన్ 44వ సీడ్ నవోమి ఒసాకా అమెరికాకు చెందిన 19వ సీడ్ డేనియల్ కాలిన్స్ చేతిలో 7-6(7-5), 6-3 తేడాతో ఓడి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. గత కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న ఒసాకా 2018, 2020లో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Danielle Collins is into Round 2 of the #USOpen pic.twitter.com/rUZa0hWKHx
— US Open Tennis (@usopen) August 31, 2022
చదవండి: Emma Raducanu: యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్
Colin De Grandhome: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై
మరిన్ని వార్తలు