వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలనపై బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు.
గుడివాడ ఉప్పాల హారికపై దాడి ఘటన మొదలు..
రాష్ట్రంలో పోలీసు యంత్రాగం ఎంతగా దిగజారిపోయిందీ, వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎంతగా వేధిస్తోంది చెబుతూనే..
మరోవైపు చంద్రబాబు చేసిన మోసాలను, చివరకు.. సినిమా డైలాగులు కొట్టినా కేసులు పెడుతున్న పరిస్థితులను జగన్ ప్రస్తావించారు.
బాబుపై జనాలకు నమ్మకం పోయిందన్న ఆయన..
అందుకే వైఎస్సార్‌సీపీ వైపు ప్రజలు చూస్తున్నారని చెప్పారు.
రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమని, అప్పుడు వడ్డీతో సహా అంతా చెల్లిస్తామని చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు.


