
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత పురుషల, మహిళల జట్ల ప్లేయర్లు బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIను కలిశారు.

మంగళవారం లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌ను శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని మెన్స్ టీమ్, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఉమెన్స్ టీమ్, హెడ్ కోచ్‌లు గౌతం గంభీర్, ముజుందార్‌లు సందర్శించారు.

ఈ క్రమంలో హృదయపూర్వకంగా స్వాగతం పలికిన చార్లెస్ III.. కాసేపు వారితో ముచ్చటించారు.

ప్రతీ ఒక్కరితో కరచాలనం చేస్తూ నవ్వుతూ పలకరించారు. అందరితో కలిసి ఆయన గ్రూపు ఫోటో దిగారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
















