US Open: స్వర్ణ పతక విజేతను ఓడించి.. ఫైనల్‌లో జొకోవిచ్..

Novak Djokovic In US Open 2021 Finals: సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. సెమీ ఫైనల్‌లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్.. 4-6, 6-2, 6-4, 4-6, 6-2 తేడాతో నాలుగో సీడ్ జ్వెరెవ్‌పై చేయి సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆర్థుర్ ఆషే స్టేడియంలో ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో అతడు.. రష్యన్ ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్‌తో తలపడనున్నాడు.
ఈ మ్యాచ్‌లో గనుక జొకోవిచ్ విజయం సాధిస్తే... ఇప్పటికే ఆస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లను గెలిచిన అతడు.. క్యాలెండర్ స్లామ్ తన పేరిట లిఖించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆల్‌టైమ్ గ్రేటెస్టు దిగ్గజాలు ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్)లను అధిగమించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సెమీస్‌లో గెలిచిన అనంతరం జొకోవిచ్ మట్లాడుతూ.. ‘‘ఈ క్షణాలు ఎంతో మధురం. ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలింది. గెలిచేద్దాం. తుదిపోరులో విజయం సాధించేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’’ అని పేర్కొన్నాడు.
చదవండి: వారెవ్వా ఎమ్మా: యూఎస్ ఓపెన్‌లో సంచలనం
Is @DjokerNole the most mentally tough player in tennis history?
He takes us inside the 🧠 of a legend. pic.twitter.com/AiUfGDQYDT
— US Open Tennis (@usopen) September 11, 2021
మరిన్ని వార్తలు