
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 552వ ర్యాంకర్ యూకీ 7–6 (7/4), 6–4తో తొమ్మిదో సీడ్, ప్రపంచ 107వ ర్యాంకర్ రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. అయితే భారత నంబర్‌వన్, ప్రపంచ 241వ ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ప్రపంచ 762వ ర్యాంకర్ బ్రూనో కుజుహారా (అమెరికా) 6–3, 7–5తో రామ్‌కుమార్‌ను ఓడించాడు.
చదవండి: BWF World Championships 2022: ప్రణయ్ సంచలనం